గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2849 సమస్య :: రణములె పండితోత్తముల రమ్యపు క్రీడలు సాహితీసభన్. *పండితుల సాహితీక్రీడలు రణ రంగ క్రీడల వంటివి* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: పృచ్ఛకులు సమస్యాపూరణ దత్తపది న్యస్తాక్షరి నిషిద్ధాక్షరి మొదలైనటువంటి ప్రశ్నలు అనే బాణములను సంధిస్తూ ఉంటే అవధాన సభలో అవధానులు కవితాధార ధారణలతో శబ్దార్థ గత రమ్య చమత్కార పద్యతోరణములతో పృచ్ఛకులను ఎదుర్కొని సరస్వతీ కృపతో విజయలక్ష్మిని వరిస్తూ ఉంటారు. సాహితీ సభలలో అటువంటి పద్యపూరణములే పండితోత్తముల కవితా క్రీడలుగా విరాజిల్లుతూ ఉంటాయి అని విశదీకరించి చెప్పే సందర్భం.
రణమును జేయు పృచ్ఛకులు ప్రశ్నల బాణము లేయ, పద్యతో రణములతోడ, శబ్ద గత రమ్య చమత్కృతి తోడ, పూర్ణ ధా రణముల తోడ సభ్య జన రాశి మనమ్ముల గెల్వ, జేయు పూ రణములె పండితోత్తముల రమ్యపు క్రీడలు సాహితీసభన్. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (17-11-2018)
క్షణమున కొక్కటి చొప్పున
రిప్లయితొలగించండిగణుతిని భువిపయిని గాంచగ సమస్యలకున్
ఫణుతులుగని చేసెడి పూ
రణములెగద పండితులకు రమ్యక్రీడల్.
గణములు యతులును ప్రాసలు
గుణనిధులై నేర్చు శిష్యకోటికి విద్వ
చ్చణులై చేసెడి వగు సవ
రణములె గద పండితులకు రమ్యక్రీడల్.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పణములు కోరరు హృదినిన్
రిప్లయితొలగించండిగణములు ప్రాసలు యతులిడు గాఢమ్మగునా
ప్రణయము నొల్లెడి హ్లాదన
రణములె కద పండితులకు రమ్యక్రీడల్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
__/\__
తొలగించండి👌🏻👏🏻💐
తొలగించండిపణముగ బెట్టుచు కవనము
రిప్లయితొలగించండిగణుతింపగ సభను మెండు గరువము నొంద
న్నణగారిన తెనుగు వెలుగ
రణములె గద పండితులకు రమ్య క్రీడల్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
dhanya vaadamulu
తొలగించండిఅను వ గు రీతి సమస్యల
రిప్లయితొలగించండిను దినము నొ సగుమన శంక రాఖ్యు ని బ్లాగు న్
ఘన మగు కవి వరుల కు పూ
రణ ము లెకద పండి తు ల కు రమ్య క్రీడ ల్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హిరణ్య బాహువు కురులలో కూర్చుండి ధరణి లో నడయాడు సరస సురల,
రిప్లయితొలగించండిహిరణ్య గర్భుని చరణము లోనుంచి బుట్టిన ఘనమైన పొడుగు మడుగు ,
హిరణ్మయుని వర కర కమండలమున చేరిన పుణ్య భగీరధసుత,
మూడులోకములందు ముచ్చట గా తిరుగాడెడు తల్లి గగన నిమగ్న,
తొలుగు చుండు పాపములు జనులకు నట్టి
గంగలో మున్గఁ, బాపముల్ గలుగు పెక్కు,
నేడు కలుషిత మైనట్టి నీటి లోన
మునిగి జలకములాడగ మనసు బెట్టి
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీసం మొదటి, రెండవ, మూడవ పాదాలలో మొదటి గణం జగణమై గణదోషం.
avunu guruvu garu porabaatu jarigindi kshamimchamdi
తొలగించండి
రిప్లయితొలగించండిఅణుకులు కవీశులనఘా
చెణుకుల పదముల చమక్కు చేవలతిగ నా
గణముల ప్రాస యతులతో
రణములె కద పండితులకు రమ్యక్రీడల్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
Zilebi garu:
తొలగించండిPlease check your yahoo mail..
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఫణిఫణ తాండవలీలా
ఫణితిని అష్టాంశములను భాసుర గతి పూ...
రణమనెడి వధాన కళా
రణములె కద పండితులకు రమ్యక్రీడల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏💐 జయహో ! శంకరాభరణమా జయహో !! 💐🙏
తొలగించండిప్రణతులు శంకరాభరణ రమ్యసమూహకవీంద్రులార ! ప్రాం..
గణమిది పద్యతోయజవికాసవిభాసితమౌను , నిత్య పూ...
రణశుభతోరణాంచితము , రండు , సమస్యల గాంచి జేయు పూ....
రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకాశవాణివారి సమస్యతెలియజేయగలరు
తొలగించండికం.
రిప్లయితొలగించండితనువు బలహీన మైనను
ఘనమగు యక్షర శరముల కలమను బాణం
బునునెక్కు పెట్టు వీరులు
రణములె కద పండితులకు రమ్యక్రీడల్"
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఫణిరాజు ముందు మండుక(కప్పల)
గణము కదా కవులు వారి గర్వము జూడన్
వణకుచు బద్యము మానరె
రణములెకద పండితులకు రమ్యక్రీడల్
రిప్లయితొలగించండిఅణుకులు వారు నేర్పరులు నాంక్షల దుష్కర మైన ప్రాసలన్
చెణుకుల తో చమక్కులను చేర్చుచు మేధకు కక్కు వేయుచున్
గణముల తోడు సైయనుచు, కత్తులు లేక, దళించు పూరణా
రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్!
జిలేబి
👌🏻👏🏻🙏🏻💐
తొలగించండిడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిగణముల, సంస్కృతోద్భటత గానరటంచు సలక్షణమ్ముగన్
గుణగణ మెంచినందుననె గొప్పయె ఛంద విహీన కావ్యముల్
గణనము దేనికో యదియ గట్టిగ వ్రాయ గడంగరే కవుల్?
క్షణమున మాయైమైన దిల జప్పబడెన్ గదె పద్యకావ్యపుం
రణములె పండితోత్తముల రమ్యపు గ్రీడలు సాహితీ సభన్
గణములు చక్కగా కుదిరి కారక మైన విశేష ప్రాసలున్
రిప్లయితొలగించండిపణముగ నాచి తూచి యలవాటుగ పూరణ వ్రాసినంతనే
గుణకము చేయగా మిగుల కోమల మైన రసాను భావముల్
రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీ సభన్
👌🏻👏🏻🙏🏻💐
తొలగించండిడా.పిట్టానుండి,ఆర్యా,4వపాదమునటైపాటు సవరణ:మాయమైనదిల
రిప్లయితొలగించండిగణ యతి ప్రాసలు దప్పక
రిప్లయితొలగించండిగణనీయంబుగ పొదిగొను కైపదములతో
చెణుకుల తో శోభిలు పూ
రణములె గద పండితులకు రమ్యక్రీడల్!!!
రిప్లయితొలగించండిఝణఝణమను నూపురముల
కణకణమున రక్తినింపి ఘనులను నటనా
ఫణుల నొనర్చు నజుసతి చ
రణములె కద పండితులకు రమ్యక్రీడల్ .
గణనాథులకు సభా ప్రాం
రిప్లయితొలగించండిగణమే కద యుద్ధభూమి గణుతింపంగా
గణ, యతి, ప్రాసల శరముల
*"రణములె కద పండితులకు రమ్యక్రీడల్"*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"రణములుగా", శుభ గుణ కా
రిప్లయితొలగించండిరణములుగా ప్రాస యతులు రంజిల గణ తో
రణములుగ, "సమస్యా పూ
రణములె" కద పండితులకు రమ్యక్రీడల్
క్షణమాలోచించియు త
రిప్లయితొలగించండిక్షణమే భావంబునింపు కవితాశక్తిన్
గణముల సమస్యవినిపూ
రణములె కద పండితులకు రమ్యక్రీడల్.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2849
సమస్య :: రణములె పండితోత్తముల రమ్యపు క్రీడలు సాహితీసభన్.
*పండితుల సాహితీక్రీడలు రణ రంగ క్రీడల వంటివి* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: పృచ్ఛకులు సమస్యాపూరణ దత్తపది న్యస్తాక్షరి నిషిద్ధాక్షరి మొదలైనటువంటి ప్రశ్నలు అనే బాణములను సంధిస్తూ ఉంటే అవధాన సభలో అవధానులు కవితాధార ధారణలతో శబ్దార్థ గత రమ్య చమత్కార పద్యతోరణములతో పృచ్ఛకులను ఎదుర్కొని సరస్వతీ కృపతో విజయలక్ష్మిని వరిస్తూ ఉంటారు.
సాహితీ సభలలో అటువంటి పద్యపూరణములే పండితోత్తముల కవితా క్రీడలుగా విరాజిల్లుతూ ఉంటాయి అని విశదీకరించి చెప్పే సందర్భం.
రణమును జేయు పృచ్ఛకులు ప్రశ్నల బాణము లేయ, పద్యతో
రణములతోడ, శబ్ద గత రమ్య చమత్కృతి తోడ, పూర్ణ ధా
రణముల తోడ సభ్య జన రాశి మనమ్ముల గెల్వ, జేయు పూ
రణములె పండితోత్తముల రమ్యపు క్రీడలు సాహితీసభన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (17-11-2018)
రణమిది సమాజ హిత తో
రిప్లయితొలగించండిరణమిది సరసంపు భావ రాజిత పద పూ
రణమిది కడు యశమును గొను
రణములెకద పండితులకు రమ్య క్రీడల్
రణమిది సమాజ హిత తో
రిప్లయితొలగించండిరణమిది సరసంపు భావ రాజిత పద పూ
రణమిది కడు యశమును గొను
రణములెకద పండితులకు రమ్య క్రీడల్
క్షణభంగురమౌ బ్రతుకున
రిప్లయితొలగించండిగణనీయమ్మగు ముదమును గల్పింంపంగన్
గణుతింపగ కవితా తో
"రణములె కద పండితులకు రమ్యక్రీడల్"
గణ యతులను ప్రాసల బహు
రిప్లయితొలగించండిగణనీయము గాగ నెంచు కవితా ధారన్
రణమున సైనికులటు పూ
రణములె కద పండితులకు రమ్యక్రీడల్
అణువణువునుత్సహించగ
రిప్లయితొలగించండిగణములదాబేర్చుకతనగణనీయముగాన్
గణుతింపసమస్యాపూ
రణములెకదపండితులకురమ్యక్రీడల్
ఘన కీర్తుల్ గడియించగ
రిప్లయితొలగించండిగణనీయమ్ముగ కవనము కనబరుచగ నే
దినమైన సమస్యా పూ
రణములె గద పండితులకు రమ్య క్రీడల్ !
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్కారములు. నిన్న తమరితోనే ఉండుట వలన నిన్నటి పూరణ పంపలేక పోయినాను. ఇప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.
అఘములు విఘాత మగుచుండు నాత్మశుచిని
గంగలో మున్గ! బాపముల్ గలుగు పెక్కు
ననవసర తర్కములతో ననవరతమ్ము
నదుల పూతి నెంచు మూఢ నరులకెల్ల
కణకణమని రగిలెడు నూ
రిప్లయితొలగించండితన ధోరణులను కవితల దట్టించుచునే
కనికట్టు జేయు ఘన పూ
రణములె గద పండితులకు రమ్యక్రీడల్
రిప్లయితొలగించండిఆకాశవాణి కి పంపించినది
చదివినారా ? తెలియదు
అణగారని దీపమ్మది
పణముగ మది దోచుచుండు, పరికించంగన్
క్షణమైనను విడువని పూ
రణములెకద పండితులకు రమ్యక్రీడల్!
జిలేబి
కణకణ రాలెను పదములు
రిప్లయితొలగించండితొణకని బెణకని శతాబ్ది తొలినూత్న కవీ
మణులవి శ్రీశ్రీ పద్య చ
రణములె కద పండితులకు రమ్యక్రీడల్
గణములగూర్పుతోడనయగారములొప్పసమస్యలన్సుపూ
రిప్లయితొలగించండిరణములెపండితోత్తములరమ్యపుగ్రీడలుసాహితీసభ
న్గణములుబ్రాసలౌనులయకారునిబీజపుమంత్రరాజమే
ప్రణతులుసేయనొప్పగునుఫాలుని,శంకరు,ఫాలనేత్రునిన్
రణమే యతిప్రాసలతో
రిప్లయితొలగించండిగణములు ఛందో నియమపు కదనమ్మగుచున్
గణయుక్త దత్త పద, పూ
రణములె కదపండితునకు రమ్యపు క్రీడల్
రిప్లయితొలగించండిఆకాశ వాణి సమస్యా పూరణ కార్యక్రమం - 17 Nov 2018 లంకె :)
https://varudhini.blogspot.com/2018/11/17th-nov-2018.html
జిలేబి
రిప్లయితొలగించండిగణయతులుఁ బ్రాసఁ గూర్చుచు,
క్షణమున రసవత్కవనపు స్వారస్యములం
దొణకెడు పద్యోక్తుల పూ
రణమే గద! పండితులకు రమ్యక్రీడల్.
కంజర్ల రామాచార్య.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిన్యస్తాక్షరీ వారణ మొక ప్రక్క, నిషిధ్దాక్షరి గజ మొక ప్రక్క, సరస దత్త
రిప్లయితొలగించండిపది తురగమ్మొక ప్రక్క, నసందర్భ సంభాషణమ్ముల సాహినమ్ము
నొక ప్రక్క, నాశువు శకటమ్ము నొక ప్రక్క, వర్ణణా శోభిత వారువమ్ము
నొకప్రక్క మార్కొన. నొకప్రక్క ఘంటికా శమధుడు నిలువ, శాస్త్రధర స
మస్యా ధరా భుక్కు మట్టు బెట్ట దలచ, నష్ట దిక్కుల లోన నాటలాడు
చదరంగపు క్రీడ సరిపోలు నష్టావధానము, నెదురొడ్డి తనదు శక్తి
రంజిల్లు నధ్వాహ(రణములె కద పండితులకు రమ్యక్రీడ) లిలిక లోన,
నాట వెలదుల కూర్చుచు నాట లాడి,
వృత్తముల తోడ చేయుచు నృత్యము బహు
సుందరముగ, రసజ్ఞుల డెందములను
దోచు గా కేళిలో సువిత్తులు సతతము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగణ నాతీతమ్ముగ ఘన
రిప్లయితొలగించండిరణ విద్యా విక్రమముల రాజువరులు నై
పుణ ముత్తమముగఁ బొందిన,
రణములె కద, పండితులకు రమ్యక్రీడల్
గుణ ఘన నిస్వనమ్ముల నకుంఠిత విక్రమ వీర్య సంపదన్
రణ మొనరింప వీరు లుదరమ్మున వ్యాకర ణార్థ శబ్ద వా
గ్గుణ గణ తర్జ నాదులను ఘోర పరస్పర పాండితీ విచా
రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్
బాగున్నది !💐👍👌💐
తొలగించండిధన్యవాదములండి జనార్దన రావు గారు.
తొలగించండిజనని సరస్వతీ విపుల సత్కృప నందిన పండితోత్తముల్
రిప్లయితొలగించండిచెణకులు రువ్వుతున్ జనుల చిత్తము దోచెడు శైలితో యటన్
రణమును జేయు పండితులు ప్రాజ్ఞులు పృచ్ఛకులిచ్చు పద్యపూ
రణములె పండితోత్తముల రమ్యపు గ్రీడలు సాహితీ సభన్
క్షణమునవాణికిన్నతులు సారసరీతులశయ్యపాకస
రిప్లయితొలగించండిన్మణులనలంకరించి బుధమౌళికివాణికిశ్లేషభాషణ
న్నణువణువాణిముత్తెపుటొయారపుటక్షర భూషపద్యతో
"రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్
రణమా,పూరణమా,గుణ
రిప్లయితొలగించండిగణభూషణమా,మనీషగళనిగళమునో,
ప్రణవక్వణమో ,సుకళా
"రణములె కద పండితులకు రమ్యక్రీడల్"
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
ధణధణ మ్రోగునట్టివగు దంభపు సంస్కృత ఖడ్గజాలముల్
కణకణమందు పిక్కటిలు గాఢపు రీతుల శబ్దనాదముల్
క్షణమున భీకరమ్మునగు సంధి సమాసపు రక్తసిక్తమౌ
రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్
తొలగించండిరక్తసిక్త రసరమ్యక్రీడల్ :)
జిలేబి
అయ్యబాబోయ్ శాస్త్రిగారు ఖడ్గ తిక్కన అయిపోయారు!!!
తొలగించండి__/\__
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి అ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
గణములు , ప్రాసయున్ , యతులు గణ్యములై విలసిల్ల భావ ల
క్షణము సమర్థ వంతమయి చక్కగ సాగెడు హృద్య పద్య పూ
రణములె పండితోత్తముల రమ్యపు గ్రీడలు సాహితీ సభన్ |
|
ప్రణతులు వాణికిన్ పలుకురాణికి పుస్తక రమ్యపాణికిన్ |
ప్రణతులు శంకరాభరణ ప్రఙ్ఙులకున్ సుకవీశ్వరాళికిన్ |
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
తొలగించండిచాలా బాగున్నదండి గురుమూర్తిగారు
జిలేబి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగణములతో భంగపడక
చెణుకులతో నవరసములు జేర్చుచు మట్టు
న్నణకువతో చేసెడు పూ
రణములె కద పండితులకు రమ్యక్రీడల్
రిప్లయితొలగించండిగణగణ గంటలు కూడిక
క్షణక్షణమువేయు నడ్డుకట్ట నిషిద్ధం
బును మీరిచేయు పదముల
రణములె కద పండితులకు రమ్యక్రీడల్
జిలేబి
మణిమయ సన్నిభంబయి యమంద విశేష గుణాన్వితంబుగా
రిప్లయితొలగించండిచణకులు వేయుచున్ కవి రసజ్ఞులు, పృచ్చకులెల్ల మెచ్చఁగాన్
గణనియమంబు ప్రాస యతి గల్గిన కమ్ర కవిత్వ మైన పూ
రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్
కందం
రిప్లయితొలగించండిపణమున్ గాసిన వాని ని
పుణతన్ మించుచు గెలిచెడు పూనిక తోడన్
ఘనతన్ వెలయించెడు ధా
రణములె కద పండితులకు రమ్యక్రీడల్
వినుమా తెలిపిదె నిపుడే
రిప్లయితొలగించండిఘనులౌ ప్రతిభా ప్రకర్ష కలిగిన యెడలన్
అనయము పద్దియముల తో
రణములె కద పండితులకు రమ్యక్రీడల్*
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
రణములె కద పండితులకు రమ్యక్రీడల్
సందర్భము:
మరో కోణంలో పూరణము..
పండితాః సమదర్శినః.. అని కదా!..
బ్రహ్మము... అణోరణీయాన్ మహతో మహీయాన్... అని కదా!
అటువంటి పరబ్రహ్మమునందు జ్ఙానమును ప్రసరింప జేయడమే పండితులకు రమ్యమైన క్రీడలు.. అని..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
గుణములకు నతీతము, ఋషి
గణములను ప్రతీతము నయి ధరఁ
గ్రాలును బ్రహ్మం
బణు గురు పూర్ణతఁ జిత్ సా
రణములె కద పండితులకు రమ్య క్రీడల్!
✒~డా.వెలుదండ సత్యనారాయణ
17.11.18
-----------------------------------------------------------
శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో