ఆద్యుడు గాకవీశుల కు నాదర పాత్ర ము నై వి శేష నై వేద్యము గా రఘూత్త ము ని వీనుల విందగు కావ్య శిల్పి యై విద్యలు లేని మానవు డె వి జ్నుడు గా జన మాన్య త న్ గ నెన్ పా ద్యమొ న ర్చి మ్రొక్కెదరు పండి తు లా సు కవీ oద్ర మౌళి కిన్
డా. పిట్టా సత్యనారాయణ గద్యము పద్యమెందులకు కానగ జాలని లెక్క(గణితము,Arithmetics)లెందు కా విద్యయె రాజకీయమగు వింటివ మిత్రమ, మూడు నాళ్ళకే ఉద్యమమో యెలక్షనులొ యూరక కాలము బుచ్చ వీలగున్ విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జన మాన్యతన్ గనెన్
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2855 సమస్య :: విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్. *విద్య లేని మానవుడే విజ్ఞత కలవాడై జనులందఱిచేత గౌరవింపబడుతాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: మహాకవి భర్తృహరి తన సుభాషిత త్రిశతి అనే గ్రంథం లోని నీతిశతకంలో విద్వత్పద్ధతి అనే విభాగంలో విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని (16) రచించినారు. విద్యా నామ నరస్య రూప మధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః। విద్యా బన్ధుజనో విదేశగమనే విద్యా గురూణాం గురుః విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహీనః పశుః॥ శ్రీ ఏనుగు లక్ష్మణ కవి గారు పై శ్లోకాన్ని అనువదిస్తూ తన సుభాషిత రత్నావళి లో విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే? అని అన్నారు. కాబట్టి సకల సంపదలను ఇచ్చే ఉత్తమ విద్యలు ఉన్న వాడు, క్షుద్ర విద్యలు లేని వాడు అగు మానవుడు లోకమాన్యు డు ఔతాడు అని విశదీకరించే సందర్భం.
విద్యలు గూఢ గుప్త ఘన విత్తములౌ, వినయప్రదమ్ములౌ, విద్యలు దైవతమ్ములగు, విద్యలు భోగయశస్కరమ్ములౌ, విద్యలు రాజపూజ్యములు వీటిని గాంచినవాడె, క్షుద్రధీ విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (24-11-2018)
విద్య యనంగ నేమి ? చదువే యొక విద్యగనెంచ వచ్చునే ? "విద్య యనంగ నద్ది " యన విద్యయె యబ్బని రామకృష్ణుడే విద్యల నేర్చి జ్ఞానమును వేడిన వారికి సద్గురుండు గా ! విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనెన్. (సామాన్యార్థం లో విద్యావిహీనుడైన శ్రీరామ కృష్ణ పరమహంస విద్యలు నేర్చిన అనేకమంది సాధకుల నుద్ధరించిన సద్గురువు , అసలైన విద్య కలవాడు అనేది భావం)
సందర్భము: ఈనాటి విద్యలన్నీ పొట్టకూటి చదువులే!.. అన్నాడు శ్రీ రామకృష్ణ పరమహంస. పరబ్రహ్మమును తెలుపజాలవు. కాబట్టి వ్యర్థములే! ఇటువంటి విద్యలు లేకపోయినా పారమార్థికమైన జ్ఞానం కలవాని కే లోటూ లేదు. అతడే విజ్ఞు డన జెల్లును. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ విద్య లివి పొట్టకూటివి.. యాద్యంతంబులును లేని యా బ్రహ్మంబున్ జోద్యముగ చూపునే! ఈ విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
✒~డా.వెలుదండ సత్యనారాయణ 24.11.18 -----------------------------------------------------------
విద్య యనంగ నేడు ఘన వేద విధానపు రీతి గాదులే విద్య యనంగ నేడు నయొ! విజ్ఞత నిచ్చెడి సిద్థి గాదులే విద్య యనంగ నేడు నిక వీలగు మార్కుల కాగితమ్ము! హా!! *"విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్"*
అవునండి బిజీనే... నిన్న ఆకాశవాణి సమస్యాపూరణ రికార్డింగుకు అంజయ్య గౌడ్ గారితో వెళ్ళి సాయంత్రానికి అలసి నెలవు చేరాను. ఈరోజు ఎక్కడికీ వెళ్ళలేదు. కాని ఉదయం నుండి లేవకుండా 'అనంత గీత రామాయణం' కొరకు మిత్రులు వ్రాసిన పద్యాలను సమీక్షించడం (చాలా రోజులుగా పెండింగులో ఉన్న పని!), ఇద్దరు మిత్రులు ప్రచురిస్తున్న పుస్తకాలలో దోషాలు సవరించడం చేసాను.
నేటి సమస్య కంద పద్య పాదము నా పూరణము సీసములో విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
ప్రపంచ చరిత్రలో చదువు తక్కు వ ఉన్న వారైనను కొందరు అమిత మేధస్సుతో రాణించి ప్రజలకు మేలు చేకూర్చారు. ఘనత పొందారు. సంత్ కబీర్ దాసు తక్కువ చదువు చదివినా ప్రఖ్యాతి కాంచాడు. క్రికెట్ దిగ్గజము సచిన్ టెండుల్కర్ తక్కువ చదువు చదివినా ప్రఖ్యాతి గాంచాడు. రైట్ సోదరులు చాలా తక్కువ చదువు చదివినా విమానము కనిపెట్టారు . అట్టివారికి పదుగురు మెచ్చు లిఖిత పూర్వక పత్రాలు సర్టిఫికెట్స్ లేవు. కానీ ప్రస్తుతము డిగ్రీలు ఎన్ని ఉన్న వారికి స్వలాభము చేకూర్చును కానీ దేశ ప్రగతి కి పాటు పడుట లేదు అట్టి చదువులు నిరుపయోగము అని భావన
సంతు కబీరు దాసెంత ఘనుడు నేడు , యేమి చదివి పొందె గోము నతడు, సచిను టెండూల్కర్ చదివిన దెంతయో ?, క్రికెటులో ఘనమైన కీర్తి నొందె, రైటు సోదరులెంత సాటువ నొందెనో చదువు కో కున్నను, పదుగు రెరుగు లిఖితపు విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్ గద పుడమి లోన, తరచి చూడగా డిగ్రీలు వరుస నున్న యేమి లభ్ది కలుగుచుండె, కామితములు తీర వచ్చునేమో, కాని దేశ మునకు మేలు పొసగనట్టి చదువు లేల మనకు
విద్యలు వేనినిన్ గఱసి విజ్ఞుడు నయ్యెను రామకృష్ణుడున్?
రిప్లయితొలగించండివిద్యలు వేనినిన్ గఱసి విజ్ఞుడు నయ్యెను షిర్దిసాయియున్?
సద్యశ మొందడే తెలియ శాశ్వత సత్యము!;.. రాజకీయమౌ
విద్యలు లేని మానవుడు విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అద్యతనంబులైన మరియాదలు నాడె వచించె "బ్రహ్మమన్
రిప్లయితొలగించండివిద్యలవేత్త" కాలమును విస్ఫుటరీతి గుణించి యీగతిన్,
మద్యము త్రాగు భూజను, డమానుష వర్తన జూపు, భావి నే
విద్యలు లేని మానవుడు విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచోద్యము కాదె కవివరా!
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్?
పద్యపు పూరణ కై తగు
నద్యత్వపుకాలమునకు నప్పదు సుమ్మీ !
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అధ్యయ నంబునన్ గలుగు లాభమ దేటికి మూఢుడే యనన్
రిప్లయితొలగించండిమధ్యపు పానమం దునను మైకము లో నవివేకి యైనచో
తధ్యము సుంతయేని వర దాభయ భక్తిని పొందియు న్నచో
విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ద-ధ-థ' ప్రాసను ప్రయోగించారు. అందుకే నిన్న మీ పద్యాన్ని ఆకాశవాణిలో చదువలేదు.
'మద్యపు' టైపాటు!
నమస్కారములు
తొలగించండితెలియ జెప్పినందులకు ధన్య వాదములు
ఆద్యుడు గాకవీశుల కు నాదర పాత్ర ము నై వి శేష నై
రిప్లయితొలగించండివేద్యము గా రఘూత్త ము ని వీనుల విందగు కావ్య శిల్పి యై
విద్యలు లేని మానవు డె వి జ్నుడు గా జన మాన్య త న్ గ నెన్
పా ద్యమొ న ర్చి మ్రొక్కెదరు పండి తు లా సు కవీ oద్ర మౌళి కిన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిహృద్య కుమారసంభవము , నిద్ధరలో రఘువంశకావ్యమున్
సద్యశమందజేయ బుధసన్నుతుడయ్యెను కాళిదాసు , స
ద్విద్యను గోరి కాళిని నుతింపగ దక్కెను , భారతీకృపన్
విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ హృద్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహృద్య సమస్యను నిత్యము
తొలగించండిపద్యముగా పూర్తి చేయు ప్రతిభావంతున్ ,
విద్యలు గలవానిని గని
విద్యలు లేనట్టి నరుడె విజ్ఞుడనదగున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కం.
రిప్లయితొలగించండిఉద్యోగమునకనర్హుడు
విద్యలు లేనట్టి నరుఁడె ,విజ్ఞుఁ డనఁ దగున్
విద్యార్థికి నేర్పు గురువు
విద్యోన్నతుడే సమాజ విలువలు పెంచున్
మల్లేశ్వర్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచోద్యపు పల్కు లివ్వి సయి శోభిల దయ్య కవీశ్వరా!తగున్
పద్యపు కైపదమ్ములకు పాటిగ, నంతకు మించి సున్న యే!
అద్యతనీయమైన దని నాదటపోవగ వీలు కాదయా!
విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
చోద్యమువేద్యమయ్యెనొకచోధ్యుతిద్యోతటిసప్తవర్ణమౌ
తొలగించండిపద్యముగద్యరీతిగణబంధయతుల్రసప్రాససొమ్ములన్
సేద్యమునుద్యమించుగవిచేతనమేధ్యుమణిన్ గ్రసించు దు
ర్విద్యలులేనిమానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్గనున్
సవరణతో
రిప్లయితొలగించండిఆకాశవాణి కి పంపిన ది
వేద్యము గాదె నెల్లరికి వేదన చెందుచు దారి తప్పు నే
విద్యలు లేని మానవుడె, విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్
సేద్యము జేయుచున్ తనదు సేతగ నేర్వగ కొంచెమైన నా
సాద్యపు రీతి విద్దియల సన్నయ మందున మేలుగాంచగన్!
జనమాన్యత గనున్? గనెన్ ? ఏది సమస్యాపాదములో సరిగ్గా తెలియదు :)
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మాన్యతన్ గనున్' అనే ఉన్నది.
ఉ: విద్యలతల్లియే మదిని ప్రీతిగ చేరగ, బోయ జ్ఞానియై
రిప్లయితొలగించండిహృద్యముగా లిఖించెను దినేశ కులోత్తము రాముగాథ నే
చోద్యమె? శంభునాజ్ఞపయి శుంఠయు కాంచును జ్ఞానసంపదన్
విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హృద్యగవితారసామృత
రిప్లయితొలగించండివేద్యుం,డాదికవి,సాయి,వేమనపూజ్యుల్
వేద్యులుజగద్దిత వ్రతులు
*విద్యలులేనట్టినరుడెవిజ్ఞుడనదగున్*
శంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హృద్యకవితా...' టైపాటు!
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివిద్యయె రాని "కబీరు"ని
పద్యములన్ విశ్వకవియె ప్రవచించె న్నా
గద్యము నాంగ్లములో గన
విద్యయె లేనట్టి నరుడె విజ్ఞుడనదగున్
"Poems of Kabir" by Thote.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిగద్యము పద్యమెందులకు కానగ జాలని లెక్క(గణితము,Arithmetics)లెందు కా
విద్యయె రాజకీయమగు వింటివ మిత్రమ, మూడు నాళ్ళకే
ఉద్యమమో యెలక్షనులొ యూరక కాలము బుచ్చ వీలగున్
విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జన మాన్యతన్ గనెన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
( ప్రశాంతిమందిరసుందరుడు సత్యసాయీశ్వరుడు )
రిప్లయితొలగించండిహృద్యము నైన దృష్టియును ;
వృత్తపు కేశకిరీటకాంతియున్ ;
వేద్యము గాని లీలయును ;
వింతగు నెర్రని దీర్ఘవస్త్రమున్ ;
జోద్యము నైన భాషణము ;
జొప్పుగ నిండిన " సత్యసాయి " యన్
విద్యలు లేని మానవుడె
విజ్ఞుడుగా జనమాన్యతం గనెన్ .
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
డా. పిట్టా నుండి,ఆర్యా"Poems of Kabir"by Ravindranath Tagore గా చదువ గలరు నా మొదటి పూరణలో.
రిప్లయితొలగించండివిద్యయొ కింతతె లియదని
రిప్లయితొలగించండిసేద్యము జేసిన కాళి శీఘ్రమె కవియై
హృద్యము రంజిలు రీతిగ
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. '...జేసిననె కాళి' అనండి.
సేద్యమ్మును సలుప దృతి న
రిప్లయితొలగించండిసాధ్యము కలదె భువిపైన? చక్కని శైలిన్
పద్యములను వ్రాసెడి దు
ర్విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని పద్యాలను వ్రాసెడి దుర్విద్యలు అనడం...?
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివిద్యయె శ్రమగా నెరిగిన
ఆద్యుడు యంజన్న యేలె నాంధ్ర ప్రదేశే
వేద్యము"లేబర్రూము"గ
విద్యయె లేనట్టివాడె విజ్ఞుడన దగున్.
(ఆసుపత్రిలోని లేబర్ రూమును గని, ప్రతి ఆఫీసులోనొకటి స్థాపించమన్న ముఖ్య మంత్రిగా సుప్రసిద్ధుడు గౌ॥ అంజయ్య గారు)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆద్యుడు + అంజన్న' అన్నపుడు యడాగమం రాదు. "ఆద్యుం డంజన్న.." అనండి.
ప్రస్తుతానికి సరదాగా:
రిప్లయితొలగించండిపద్యములోఁ జెప్పమనిరి
విద్యల నేర్పెడి గురువులె విజ్ఞులె మీరున్
పద్యమిదియె శంకర! యే
(మద్యము త్రాగక చెప్పితి)
*"విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్"*
గమనిక:
బ్రాకెట్టులోనిది కాకుండా ముందున్నది మూడవపాదంగా తీసుకున్నచో సమస్యా పాదము చివర సమ్మతి తెలిపే *!* చిహ్నాన్ని తీసుకోవా *లా* లేక ప్రశ్నించే *?* చిహ్నాన్ని తీసుకోవా *లా* అనే *లా* పాయింటు చదువరుల ఇష్టమని మనవి
🙃🙏🏻
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేను ? చిహ్నాన్నే తీసుకున్నాను.
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2855
సమస్య :: విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్.
*విద్య లేని మానవుడే విజ్ఞత కలవాడై జనులందఱిచేత గౌరవింపబడుతాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: మహాకవి భర్తృహరి తన సుభాషిత త్రిశతి అనే గ్రంథం లోని నీతిశతకంలో విద్వత్పద్ధతి అనే విభాగంలో విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని (16) రచించినారు.
విద్యా నామ నరస్య రూప మధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః।
విద్యా బన్ధుజనో విదేశగమనే విద్యా గురూణాం గురుః
విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహీనః పశుః॥
శ్రీ ఏనుగు లక్ష్మణ కవి గారు పై శ్లోకాన్ని అనువదిస్తూ తన సుభాషిత రత్నావళి లో
విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే?
అని అన్నారు.
కాబట్టి సకల సంపదలను ఇచ్చే ఉత్తమ విద్యలు ఉన్న వాడు, క్షుద్ర విద్యలు లేని వాడు అగు మానవుడు లోకమాన్యు డు ఔతాడు అని విశదీకరించే సందర్భం.
విద్యలు గూఢ గుప్త ఘన విత్తములౌ, వినయప్రదమ్ములౌ,
విద్యలు దైవతమ్ములగు, విద్యలు భోగయశస్కరమ్ములౌ,
విద్యలు రాజపూజ్యములు వీటిని గాంచినవాడె, క్షుద్రధీ
విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనున్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (24-11-2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
విద్యలు నేర్చిన ఫలమిది
రిప్లయితొలగించండిపద్యము లెన్నియు చదివిన ఫలితమ్మిదియే
ఆద్యుడు నుడువగ వింటిని
విద్యలు లేనట్టి నరుడె విజ్ఞుడనదగున్!!"
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హృద్యము గొల్పుచున్ జగతి రీతులు దిద్ద నిరంతరాయమౌ
రిప్లయితొలగించండిసేద్యము సల్పుచుండి జన సేవయె నిత్యము జేయబూని నై
వేద్యముగా జనాళికి నివేదన జేయుచు నుండి దుష్టమౌ
"విద్యలు లేని మానవులె విజ్ఞులుగా జన మాన్యతన్ గనున్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విద్య యనంగ నేమి ? చదువే యొక విద్యగనెంచ వచ్చునే ?
రిప్లయితొలగించండి"విద్య యనంగ నద్ది " యన విద్యయె యబ్బని రామకృష్ణుడే
విద్యల నేర్చి జ్ఞానమును వేడిన వారికి సద్గురుండు గా !
విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనెన్.
(సామాన్యార్థం లో విద్యావిహీనుడైన శ్రీరామ కృష్ణ పరమహంస విద్యలు నేర్చిన అనేకమంది సాధకుల నుద్ధరించిన సద్గురువు , అసలైన విద్య కలవాడు అనేది భావం)
ధనికొండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివిద్యలవేల మనకనకు !
విద్యను నేర్వని మనుజులు వింతపశువులౌ!
మద్యము గైకొంటివకో ?
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్?
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మద్యము గైకొని యంటివొ" అనండి బాగుంటుంది.
తొలగించండిమద్యముగ్రోలుచున్నెపుడుమాంసమునంజుచుదిర్గుచుండునే
రిప్లయితొలగించండివిద్యలులేనిమానవుడె,విఙ్ఞుడుగాజనమాన్యతన్గనెన్
విద్యయెతల్లియున్గురువువిద్యయెదం డ్రినిగాదలంచియున్
విద్యకుసాటియౌనదిలవీక్షణజేయగ గానరాదుగా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సద్యశమున్ గడించడు విశారదు వోలె జగత్తు నందునన్
రిప్లయితొలగించండివిద్యలు లేని మానవుడె, విజ్ఞుడిగా జన మాన్యతన్ గనున్
విద్యల తల్లిశారదను వేడుచు నధ్యయనమ్ము జేయగన్
హృద్యము లైన భావములు నింపుగ నల్లుచు వ్రాయు కావ్యముల్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్యపు మత్తులోఁబడక,మైకము వీడి, గుణోజ్జ్వలుండునై ,
రిప్లయితొలగించండిసద్యశమున్ గడించి,సుమ సదృశ మానస వాగ్విలాసియై,
హృద్య వచోమృత ప్రకర మేర్పడ,నిత్యము వెల్గి,చెడ్డవౌ విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జన మాన్యతన్ గనున్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిపులిపాక సావిత్రి,నరసరావుపేట
రిప్లయితొలగించండిఖాద్యము మెక్కుచున్,పరుల కాంతల మేలములాడు వంకతో
చోద్యము గాగ డాసి,తన సుందరి కెగ్గునుఁగల్గఁజేసి, యే
ఉద్యమ శక్తి లేకయె,కుయుక్తులఁబల్కుచు,మోసకారులౌ
విద్యలు, లేని మానవుడె విజ్ఞుడుగా జన మాన్యతన్ గనున్.
సావిత్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
సందర్భము: ఈనాటి విద్యలన్నీ పొట్టకూటి చదువులే!.. అన్నాడు శ్రీ రామకృష్ణ పరమహంస. పరబ్రహ్మమును తెలుపజాలవు. కాబట్టి వ్యర్థములే!
ఇటువంటి విద్యలు లేకపోయినా పారమార్థికమైన జ్ఞానం కలవాని కే లోటూ లేదు. అతడే విజ్ఞు డన జెల్లును.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
విద్య లివి పొట్టకూటివి..
యాద్యంతంబులును లేని
యా బ్రహ్మంబున్
జోద్యముగ చూపునే! ఈ
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
24.11.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
ఆద్యులు పూజ్యులు రైతులు
రిప్లయితొలగించండిసేద్యముతో తలమునకలు చెందుచునైనన్
పద్యపునాటకమాడిరి
విద్యలు లేనట్టినరుడె విజ్ఞుడనదగున్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువు గారూ
తొలగించండివిద్యన?విజ్ఞానంబే!న
రిప్లయితొలగించండివిద్యే నజ్ఞామనుచు వివరణలెన్నో
అద్యయనంబునగన!దుర్
విద్యలులేనట్టి నరుడె విజ్ఞుడనదగున్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విజ్ఞానంబె య।విద్యయె యజ్ఞాన...' అనండి.
'విద్య + అన' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
తొలగించండివిద్య యనంగ నేడు ఘన వేద విధానపు రీతి గాదులే
రిప్లయితొలగించండివిద్య యనంగ నేడు నయొ! విజ్ఞత నిచ్చెడి సిద్థి గాదులే
విద్య యనంగ నేడు నిక వీలగు మార్కుల కాగితమ్ము! హా!!
*"విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉద్యమములునడిపించును
రిప్లయితొలగించండివిద్యలులేనట్టినరుడె,విఙ్ఞుడనదగున్
విద్యలునేర్వనివాడై
పద్యములనువ్రాయువిధమువచ్చుటవలనన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆద్యంతరహితుడు హరిని
రిప్లయితొలగించండివేద్యుడిని తెలియ చదువులు వేడ్కన నేర్వన్
విద్యాకరుఁడగు, యట్టికు
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విద్యాకరుఁ డగు నెట్టి కువిద్యలు...' అనండి.
మద్యము గ్రోలక జనుల న
రిప్లయితొలగించండివద్యము గా సత్య పర త పరహిత పరులై
హృద్యపు వర్తన గల్గిన
విద్య లు లేనట్టి నరుడె విజ్జ్ను డన దగు న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
గురుభ్యోనమః నిన్నటి పూరణ స్వీకరించ మనవి
{ వియోగ వహ్ని చేతనే చల్లని నీరు వెచ్చనై ఒడలు దహించివేసినది
ప్రియుడు కౌగిలించగా ఆ వియోగాగ్ని చల్లబడినది }
మల్లెలు ముల్ల పాను పయె | మంచి సుగంధ మసహ్య మాయెగా |
చల్లని మంద మారుతము - చక్కని చంద్రిక సోకి నంతనే ,
తల్లడ మందె మానసము | తానము జేయ దిగన్ స్రవంతిలో
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె , నదేమి చిత్రమో ||
మెల్లగ డాసి వల్లభుడు మేను కరుంగగ > కౌగిలించిన ,
న్నెల్ల వియోగ రోగ వమి యిట్టులె చల్లబడెన్ గదా వెసన్ ! !
( వమి = వహ్ని ; వియోగ రోగ వమి = వియోగ రోగాగ్ని )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
విద్యాధికులకు నడుమ న
రిప్లయితొలగించండినాద్య మ్ముండుఁ గద దుస్స హాసూయ గనన్
విద్యావంతులఁ దెగడెడు
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
మద్యము గీ డొనర్చు భువి మానవ జాతికి నక్ష దుష్కళా
విద్యయు నట్టి దయ్య యవివేకులు వాటికి లోఁబడన్ మహా
వద్య వికామ మోహ మద వైర రుషా భర లోభ మత్స రా
విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్
[కనెం బూర్వమని భావము; మహా+అవద్యము: మహా నికృష్టము; మత్సర+అవిద్య]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమద్యము ధనమును గొనక
రిప్లయితొలగించండిన్నుద్యమ స్ఫూర్తిన్నధిపతి నోటున నెంచన్
సేద్యము జేసెడు కృషికుడు
విద్యయె లేనట్టి వాడె విఙ్ఞుడన దగున్
విద్య వెలుంగు నిచ్చు నవివేకపు జీకటి పారద్రోలుచున్
తొలగించండిసేద్యము జేయగా వలయు శీలము బెంచెడు సంస్కృతిన్ సదా
మద్యము ద్రాగుచున్ మరచి మానము టక్కుటమార తాంత్రికా
విద్యలు లేని మానవుడె విఙ్ఞుడుగా జన మాన్యతంగనున్
తాంత్రిక+అవిద్యలు=తాంత్రికా విద్యలు
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!!
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
పద్యము వ్రాయజాలకయె పైత్యము మించుచు స్రుక్కుచుండగా
సద్యశ శంకరాభరణ సన్నిధి జేరగ శాస్త్రివర్యుడే
హృద్యపు రీతి శంకరులు హేలగ పందిని నందిజేయగా
విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విద్యలుకోటికోటిగలవిచ్చట జూడగ విశ్వమందునన్,
రిప్లయితొలగించండివైద్యపుశాస్త్రవిద్యలును వాదము నేర్పగ న్యాయవిద్యయున్,
విద్యలు ఎన్నియున్నమరి పెద్దల వృద్దుల వెన్నుజూపెడున్
విద్యలులేని మానవుడె విజ్ఞుడు గాజన మాన్యతన్ గనున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి
రాధాకృష్ణా రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారు బిజీనా? ఈ మధ్య ఉదయం యేడు గంటల తర్వాత పూరణలు సమీక్షించడం లేదు!??
రిప్లయితొలగించండిఅవునండి బిజీనే...
తొలగించండినిన్న ఆకాశవాణి సమస్యాపూరణ రికార్డింగుకు అంజయ్య గౌడ్ గారితో వెళ్ళి సాయంత్రానికి అలసి నెలవు చేరాను.
ఈరోజు ఎక్కడికీ వెళ్ళలేదు. కాని ఉదయం నుండి లేవకుండా 'అనంత గీత రామాయణం' కొరకు మిత్రులు వ్రాసిన పద్యాలను సమీక్షించడం (చాలా రోజులుగా పెండింగులో ఉన్న పని!), ఇద్దరు మిత్రులు ప్రచురిస్తున్న పుస్తకాలలో దోషాలు సవరించడం చేసాను.
మీ ఓర్పుకు ఉత్సాహానికి జోతలు!!
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిహృద్యమ్ము గాని బాడిని
నాద్యంతము పరులనెల్ల నడకించునవౌ
సద్యశమీయని జిత్తుల
విద్యలు లేనట్టి నరుడె విజ్ఞుడనదగున్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బాడిని'? అది "పాడిని'యా?
పాడిని - గురువు గారు
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిపద్యము వ్రాయని కుకవియు
విద్యలు లేనట్టి నరుడె ,విజ్ఞుడన దగున్
హృద్యము గాకవిత సొబగు
విద్యను పంచెడి హితోక్తి విజయాం బుధిగాన్.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేటి సమస్య కంద పద్య పాదము నా పూరణము సీసములో
రిప్లయితొలగించండివిద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్
ప్రపంచ చరిత్రలో చదువు తక్కు వ ఉన్న వారైనను కొందరు అమిత మేధస్సుతో రాణించి ప్రజలకు మేలు చేకూర్చారు. ఘనత పొందారు. సంత్ కబీర్ దాసు తక్కువ చదువు చదివినా ప్రఖ్యాతి కాంచాడు. క్రికెట్ దిగ్గజము సచిన్ టెండుల్కర్ తక్కువ చదువు చదివినా ప్రఖ్యాతి గాంచాడు. రైట్ సోదరులు చాలా తక్కువ చదువు చదివినా విమానము కనిపెట్టారు . అట్టివారికి పదుగురు మెచ్చు లిఖిత పూర్వక పత్రాలు సర్టిఫికెట్స్ లేవు. కానీ ప్రస్తుతము డిగ్రీలు ఎన్ని ఉన్న వారికి స్వలాభము చేకూర్చును కానీ దేశ ప్రగతి కి పాటు పడుట లేదు అట్టి చదువులు నిరుపయోగము అని భావన
సంతు కబీరు దాసెంత ఘనుడు నేడు , యేమి చదివి పొందె గోము నతడు,
సచిను టెండూల్కర్ చదివిన దెంతయో ?, క్రికెటులో ఘనమైన కీర్తి నొందె,
రైటు సోదరులెంత సాటువ నొందెనో చదువు కో కున్నను, పదుగు రెరుగు
లిఖితపు విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్ గద పుడమి లోన,
తరచి చూడగా డిగ్రీలు వరుస నున్న
యేమి లభ్ది కలుగుచుండె, కామితములు
తీర వచ్చునేమో, కాని దేశ మునకు
మేలు పొసగనట్టి చదువు లేల మనకు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకాశవాణి లో ఎన్ని గంటలకి ప్రసారమవుతాయి. ఏ ఆకాశవాణి లో ప్రసారమవుతాయి
రిప్లయితొలగించండిఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రతి శనివారం ఉదయం 7-30 కి ప్రసారమౌతాయి.పూరణలను గురువారం లోపల పంపాలి.
తొలగించండిpadyamairhyd@gmail.com
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితెలిపినందుకు ధన్యవాదములు.
తొలగించండిప్రసారమవుటకు ఏ పద్యములు పరిగణనలోకి తీసుకుంటారు
కుల మత ప్రసక్తి లేకుండా, రాజకీయాల జోలికి వెళ్ళకుండా, వ్యక్తి విమర్శ లేని పూరణలు...
తొలగించండివిద్యయె బహు చక్కగ నన
రిప్లయితొలగించండివద్యముగా నుండ మిగుల వసుధను వెలుగున్
హృద్యము కాని నిరర్థక
విద్యలు లేనట్టి నరుడె విజ్ఞుడన దగున్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉద్యమరీతిగ గైకొని
రిప్లయితొలగించండిసేద్యముతోధరణిమాత సేవలు జేయన్
పద్యాల సేద దీరిరి
విద్యలు లేనట్టినరుడె విజ్ఞుడనదగున్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చాలా సంతోషంగా ఉంది గురువు గారూ. మీ ప్రశంస నాకు రెట్టించిన ఉత్సాహం కలిగించింది.ఈ ఉత్సాహంతో మరింతగా కవితా సేద్యం చేయగలనని నమ్మకం కలిగింది
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిఖాద్యము పక్షిగా దలఁచి కానలఁ గూల్చిన బోయ మౌనియై
హృద్యమనంగ రామకథ నేర్పడఁ జెప్పఁగ నాదికావ్యమే!
చోద్యమె కాదు శోకమగు శ్లోకము రామ జపంపు పుణ్యమై
విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జన మాన్యతన్గనున్
వేద్యులు శాస్త్ర కోవిదులు విజ్ఞత గల్గిన మాన్యలైన వా
రిప్లయితొలగించండిరాద్యులు నాడె వింతపశువంచును చెప్పిరి గాదె ధాత్రిలో
విద్యలు లేని మానవుడె, విజ్ఞడు గాజన మాన్యతన్ గనున్
వైద్యుడు తర్క శాస్త్రములు వ్యాకరణమ్ము నెఱంగువాడిలన్
మద్యము గ్రోలి వాడిటుల మాటలు తూలిన నేమి దానినిన్
రిప్లయితొలగించండివిద్యలు భూరిగాగల వివేకులు మీరలు విశ్వసించుటే
చోద్యము గాదె, యడ్గెదను సూటిగ చెప్పుడి యెవ్విధమ్ముగా
విద్యలు లేని మానవుడు విజ్ఞుడుగా జన మాన్యతన్ గనున్?
మద్యము గ్రోలిన మత్తున
రిప్లయితొలగించండివిద్యలు నేర్చిన యఖండ విద్వాంసుండే
చోద్యముగా పలికె నిటుల
విద్యలు లేనట్టి నరుడె విజ్ఞుడనదగున్
ఆద్యత నొందుతా ధరణి యందున ద్రవ్యబలంబుచే సదా
రిప్లయితొలగించండివిద్యలు లేని మానవుఁడె ,విజ్ఞుఁడుగా జన మాన్యతన్ గనెన్"*
విద్యల నెల్లనేర్చుచును పేరును పొందుచు నుండునెప్పుడున్
విద్యల రాణి దీవెనల వేగమె పొందినశాస్త్రవేత్తయున్.
రిప్లయితొలగించండిమద్యము జోలికి వెళ్ళక
పద్యములను నేర్చి తాను వాసిగ నెపుడున్
గద్యమునదెల్పు,కుహనా
విద్యలు లేనట్టి నరుడె విజ్ఞుడనదగున్