25, నవంబర్ 2018, ఆదివారం

సమస్య - 2856 (కనిపించిరి కోతుల వలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్"
(లేదా...)
"కనఁబడి రప్డు వానరులుగాఁ గవివర్యులు తత్సభాస్థలిన్" 

89 కామెంట్‌లు:


  1. :)

    అనిరే బ్లాగ్లోకమ్మున
    జనాళి మాకందములవి చవులూరగతా
    మనిరే చూడగ విరివిగ
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్!


    :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అనగనగా నొక యూరిన
    ధనికులు కవివరులకిడురు ధనముల ననుచున్
    వినిపించగ తృటి లోనను
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇడుదురు' అన్నది సాధురూపం. మీరు 'ఇడురు' అన్నారు.
      '...యూరను। ధనికు డొకడు కవుల కిడును ధనముల...' అనండి.

      తొలగించండి
  3. వినిపించగ పద్య చెలువము
    మనమున పొంగుచును హాయి మంత్రించి నటుల్
    వనమందు నవిహరిం చగస్మృతి
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో గణదోషం. "వినిపించ పద్య... వనమున విహరించగ స్మృతి" అనండి.

      తొలగించండి
    2. వినిపించ పద్య చెలువము
      మనమున పొంగుచు నుహాయి మంత్రించి నటుల్
      వనమున విహరించగ స్మృతి
      కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్

      తొలగించండి
  4. కం.
    మునుబాల్యమందు నొకచో
    ట నిలువక పరుగులతో నటనిటకు వెడలన్
    చనుదెంచి చూడ తల్లికి
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      బాలకవులతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ఘనతరముగ పద్యంబుల
    కనుదిన మిట విందటంచు నాహ్వానింపన్
    విను డాప్రాంతము జని యట
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్.

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    ప్రాశ్నికులకు తగిన అవధాని 😊

    కవివర్యులు... వానరులు... బహువచనము గౌరవవాచకము🙏

    ఘనతరధారణాపటిమ కైతలనల్లు వధానమెంచ , ని...
    చ్చిన పలు ప్రశ్నలన్ గనుచు చిర్రున లేచె వధాని తోక గా...
    ల్చిన కపివోలె ., నోపిక నశింపగ , నష్టవధానమన్న లం...
    కనఁ బడిరప్డు వానరులుగాఁ గవివర్యులు తత్సభాస్థలిన్"


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


    2. అదురహో ! అవధాన లంకలో సీతమ్మను యెక్కడ దాచేరండి మైలవరపు వారు :) రావణుడెవ్వరు ? :)


      జిలేబి

      తొలగించండి
    3. జనుడొకడు మద్యమును గొని
      తిన చేదును తీపి యయ్యె , తిట్టును మెప్ప...
      య్యెను , భ్రాంతచిత్తుడగుటన్
      కనిపించెను కోతులవలె కవివరులెల్లన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


  7. వన మది కైపదమ్ములకు వాటిక! రాముడె రావణుండనన్
    పనస తొనల్వలెన్వొలిచి పాదములన్ సయి చేర్చి మాధురిన్
    తనరెడు రీతి చేయగ సుతారము గా తమ దైన శైలిలోన్,
    కనఁబడి రప్డు వానరులుగాఁ గవివర్యులు తత్సభాస్థలిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    గణతంత్ర దినోత్సవమున
    గణుతింప విశిష్ట కవి నికషలో గెలువన్
    తమ బిరుదుల పట్టికగొని
    కనిపించిరి కోతుల వలె గవి వరులెల్లన్

    రిప్లయితొలగించండి
  9. మనసును దోచెడి విధమున
    వినిపించిరితమకవితల వీనులవిందై
    చనయగ సన్మానమ్మున
    కనిపించిరి కోతుల వలె గవివరులెల్లన్!!

    రిప్లయితొలగించండి
  10. వినయము వీడి చరించెడు
    జనులను గాంచుచు తలచిరి స్వగతము నందున్
    కనుడీ మనుజుల గాంచిన
    గనిపించిరి కోఁతుల వలెఁ, గవివరు లెల్లన్.

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    పెను సభన కవులు పెక్కురు
    గను సభికులు కరువు గాగ గమకము విడకే
    పెనగొను యుత్సాహముతో
    కనిపించిరి కోతుల వలె గవివరు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సభను... పెనగొను నుత్సాహముతో...' అనండి.

      తొలగించండి
  12. వనిలో ఫలములుమెక్కుచు,
    ననిలతనయు వ్రతమొనర్చననువగువసనా
    ల్గొని,భజనలతర్కించుచు
    *కనిపించిరి కోతులవలె గవివరులెల్లన్*

    రిప్లయితొలగించండి
  13. ( బహుముఖప్రతిభాభాస్వంతుడు , యుగకర్త అయిన శ్రీనాథుని సభకు ఆహ్వానించి అవహేళన చేయబూనిన
    ఈర్ష్యాళువులైన కుకవులు ఆయనకు ఇలా కనిపించారు.)
    మన కవిసార్వభౌముడగు
    మారయపుత్రుని ; నైషధాదులౌ
    ఘనతరకావ్యసంపదల
    గమ్రకరమ్ముల నాంధ్రజాతికిన్
    మన మలరంగ నిచ్చిన స
    మర్థుని రమ్మని గేలిసేయగా
    గనపడి రప్డు వానరులు
    గా గవివర్యులు దత్సభాస్థలిన్ .

    రిప్లయితొలగించండి
  14. మనసున హనుమను నిలుపుచు
    కనిపించిన వానినెల్లఁగాంచుచు కపిగా
    చనె సభ కాతఁడు ప్రీతిన్
    కనిఫించిరి కోతుఁల వలెఁగవివరులెల్లన్..

    రిప్లయితొలగించండి
  15. ఘనరసమాధురీభరితకమ్రవిలాసకవిత్వపృచ్ఛకుల్
    దనరెడు సాహితీవనవధానసభాస్థలి వాలశూన్యులై

    యొనరిన పాద్యుగాప్తసమయోచితయుక్తుల లంఘనమ్ములన్

    గనబడి రప్డు వానరులుగా కవివర్యులు తత్సభాస్థలిన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.


    రిప్లయితొలగించండి
  16. డా. పిట్టా సత్యనారాయణ
    పనిగొని బిల్చి పండ్ల నిడి బారుల శాల్వల గప్ప వేదికన్
    తనకిడు కాల నిర్ణయము దప్పియు కైతల వల్లె వేయగా
    కనకనలాడు యాకలిని కాలము మీరగ సేబులన్ దినన్
    కనబడి రప్డు వానరులుగా గవి వర్యులు తత్సభాస్థలిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కనకనలాడు నాకలిని' అనండి.

      తొలగించండి
  17. ఘన య వధానియె రాముడు
    వినయ పు పృఛ్ఛకుల గాంచి వేడుక లల రన్
    మనము న భావన సేయగ
    కని పించి రి కోతుల వలె కవి వరులెల్ల న్

    రిప్లయితొలగించండి
  18. ఇనకులసార్వభౌముని గపీశుడు రావణుమందిరంబునన్
    ఘనముగ స్తోత్రపాఠములగానముజేయనిశాచరుల్భళా
    వనచరురామనామమధువంచునుతించగ లంకరాట్టుకున్
    *"గనఁబడి రప్డు వానరులుగాఁ గవివర్యులు తత్సభాస్థలిన్"*

    రిప్లయితొలగించండి
  19. ఘనమే కద మన బాల్యము!
    వనభోజన వేళ లందు వగపుల నెల్లన్
    దునుమాడుచుఁ బిల్లలగుచుఁ
    *"గనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనబడినా వృద్ధునివలె
      మనమున నే బాలుడైతి మాన్యుల్లారా
      కనుచుండగ నా పథమునఁ
      *"గనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్"*

      (తెల్ల వెంట్రుకలు వచ్చేశాయి మరి 😃)

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "కనబడితిన్ వృద్ధునివలె" అనండి.

      తొలగించండి
  20. కం.
    ఘనతెలుగుమహాసభలో
    వినిపించుటకు తమతమ కవిత్వమునెంతన్
    చని తోపులాట చూచిన
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్"

    రిప్లయితొలగించండి
  21. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2856
    సమస్య :: కనఁబడి రప్డు వానరులుగాఁ కవివర్యులు తత్సభాస్థలిన్.
    *కవులందఱూ కపులుగా (కోతులుగా) కనిపించారు ఆ సభలో* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: రామాయణ గాథను రామలీల పేరుతో నాటకంగా ప్రదర్శించడం మన భారతదేశంలో ఉన్న గొప్ప సంప్రదాయం. ఒక మహాత్ముడు ప్రత్యేకంగా కవివర్యులను పిలిచి వారిచే రామలీల నాటకాన్ని వేయించాడు. ఆ నాటకంలో సీతాన్వేషణ ఘట్టంలో అంగదుడు తన అనుచరులతో ఒక సభ ఏర్పాటు చేసి తన నిర్ణయాలను ప్రకటించాడు. ఆ సభలో అతనికి ఎదురుగా ఉన్న కవివర్యులందరూ వానరులుగా కనిపించినారు అని *రామలీల* నాటక సన్నివేశాన్ని గుఱించి విశదీకరించే సందర్భం.

    వనమున రామలీల కవివర్యులచే నటియింపజేయగా,
    ఘన కపు లెల్ల జానకిని గాంచుటకై సభ దీర్చ, నంగదుం
    డొనరిచె నిర్ణయమ్ముల నహో కపివర్యుల జూచి, వింతగా
    కనఁబడి రప్డు వానరులుగాఁ కవివర్యులు తత్సభాస్థలిన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.(25-11-2018)

    రిప్లయితొలగించండి

  22. కల్పవృక్షము రామాయణము


    మునిగిరి రాముని నామ
    మ్మున తనరుచు కల్పవృక్షమున నా సీత
    మ్మను మదిని గొలుచుచు భళా
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  23. పజ్జాల కర్థము తెలియక బిక్కమొగాలతో జన సందోహమ్ము :)


    అనఘా! జనాళి సభలో
    కనిపించిరి కోఁతుల వలెఁ, గవివరు లెల్లన్,
    ధనధనమని పద్యమ్ముల
    తనరుచు పాడగ, తెలియక తాత్పర్యములన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. ఘనముగ శ్రీరమనవమి
    వినయముగా జరుపుకొనుచు విబుధుల తోడన్
    దినమంతయు రాముఁ పొగడి
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రామనవమి' టైపాటు!

      తొలగించండి
  25. చంద్రశేఖరుడు గురువులకు వందనము చేసినప్పుడు తెలుగు మహాసభలలో




    అణకువగ చంద్రశేఖరు,
    తన గురువుకు వందనమిడ, తాదాత్మ్యతతో
    గణగణమని పొగుడుచు భళి
    కనిపించిరి కోఁ!, తుల వలెఁ, గవివరు లెల్లన్!

    కో!- హుర్రే

    తుల వలె- తులారాశివలె


    ముఖ్యగమనిక-
    ఈ విరుపు లేకుండా మీరు చదివి వేరే లా అర్థం చేసుకుంటే జిలేబి పూచీలేదు


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణలోని చమత్కారం బాగున్నది. కాని విరుపులో 'అరసున్న'ను ఏం చేద్దాం?

      తొలగించండి


    2. కందివారు


      అరసున్న హుష్ కాకి :(



      జిలేబి

      తొలగించండి
  26. ఘన రామాయణ ఫలమున్
    దనివార భుజించి తేలి తాదాత్మ్యమునన్
    వనమాలిని కీర్తించగ
    కనిపించిరి కోతులవలె గవివరులెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనబడి వార్షికోత్సవము మాన్యుల గూరిచి నిర్వహించగా
      వెనుకను జేరి ఛాత్రులట వీరుల వోలెను గోలజేయుచున్
      కనబడి రప్డు వానరులుగా;కవివర్యులు తత్సభాస్ధలి
      న్ననునయ వాక్కులన్ బలికి హాయిని గూర్చిరి శిష్యకాళికిన్


      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!

      తొలగించండి
  27. వినిపింపగ ప్రకటించిన
    ఘనమౌ తమ బహుమతులను గంతులు వేయన్
    జనులందఱకున్ సభలో
    "కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్"

    రిప్లయితొలగించండి
  28. అనుమానంబేలకొ?యిట
    కనిపించిరికోతులవలెగవివరులెల్లన్
    గనులకుబైరులుగ్రమ్మగ
    గనిపించునువేరుగానుగవివర!వినుమా!

    రిప్లయితొలగించండి
  29. పట్టాభిషేకపు వేడుకలలో భాగముగా అయోధ్య నగరము లో సాహిత్య కవన వేదిక నేర్పరచగా కవి వరులు రకరకముల వృత్తములు జాతులతో పద్య పురాణములు చేయచుండగా ఆ సాహిత్య వేదికలో ఆసీనులైన కపి శ్రేణులకు ఆవి అర్ధము కాక వారలకు కవి వరులెల్లరు కిష్కింద లో ఉన్న కోతుల వలే కనిపించారు. ఆ దృశ్యము చూచిన లక్షణ భరతుల ముఖము చిరు నగవుతో నాట్యమాడ రఘురాముడు సీతతో సంబరముల లో నొక భాగము రమ్య గతిని చూచెనను భావనము


    ఉత్పల మాలల నుత్తమాంగము తోడ దూకు చుండె నొకడు, దువ్వి రవపు
    కంఠము తోడను గాండ్రించె నొక్కడు, వనమయూర నడుమున్ ఘనత తోడ
    త్రిప్పుచు నాట్యము దిడ్డె నొకడు, కంద వదన మిసిమి తోడ వాలు చుండె
    నొక్కడు, సీసపు చెక్కిలి మెరయగ నొక్కడు భూజము నూపు చుండె,
    కవన కిష్కింధలో, నవధాన వనమున, సాహితీ వెలుగులో, సభికుల కను
    ల కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్పరి కించ నీలకపు పరిజ
    నమునకు, ముఖమున నగవు నాట్యమ్మాడి లక్ష్మణ భరతు నుల్లములు ఝల్లు

    మనగ, లంకేశు నోడించి ఘనత తోన
    యోధ్య పురమును జేరిన యోధుడు రఘు
    రాముడు సతితో కాంచెను రమ్య గతిని
    సంబర విభాగ మొక్కటి సంతసముగ




    రిప్లయితొలగించండి
  30. గురువు గారికి నమస్సులు
    వినయము లేనిత నసుతులు
    కనిపించిరి కోతులవలె ,కవివరులెల్లన్
    జనహిత పథాన మనవలె
    ఘనంబౌ నవసమాజ కర్షక వరమౌ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదం ప్రారంభంలో గణదోషం. "ఘనమై తగు నవసమాజ..." అందామా?

      తొలగించండి
    2. మీ అమూల్యమైన సూచనకు నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. హనుమను గానము చేయగ
    తెనుగున; జనులాలకించి దేశకవితలన్
    అనయంబును మెచ్చిరి, యిక
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దేశకవితలే। యనయంబును...' అనండి.

      తొలగించండి
  32. కనులవిబైర్లుగప్పగనుగాంచగవేదికనొక్కసారిగా
    వినయముతోడవంగగనువేదికమీదనునుండువారలున్
    గనబడిరప్డువానరులుగాగవివర్యులుతత్సభాస్ధలిన్
    ననయముజేతువందనములాకవిశ్రేష్ఠులకెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  33. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఘనముగ జేసిరే కవులు కైపద మీయగ పూరణమ్ములన్:
    "కనఁబడి రప్డు వానరులుగాఁ గవివర్యులు తత్సభాస్థలిన్"
    కొనుము జిలేబి నీవిదియె కొద్దిగ మార్చిననీ సమస్యనున్:
    "కనఁబడి రప్డుహా నరులుగాఁ గపివర్యులు తత్సభాస్థలిన్"

    రిప్లయితొలగించండి
  34. వినకనకుజూడకనుచును
    *కనిపించిరి కోతులవలె: గవివరులెల్లన్*
    గనిగాంధీమతమభిమత
    మనిభావనజేసి కైతలల్లిరిధిషణన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్జీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వినకు కనకు పలుకకు మని' అనండి.

      తొలగించండి
  35. వినుపించని మైకులతో
    కనుపించని కాంతులందు గమనించంగా?
    "ధనమును నిడినా?సభలో
    కనుపించిరి కోతులవలె గవివరులెల్లన్

    రిప్లయితొలగించండి

  36. మనమున తలచిన వెంటనె
    కనిపించిరి కోతులవలె కవివరులెల్లన్
    అనిలసుతులనుచు కోరితి
    వినయము తో దీవెనలిడ వేగమె నాకున్.

    రిప్లయితొలగించండి
  37. ఘనులగు మేటి పండితులు కైతల గోష్టులు జర్పుచుండగా
    వినికిడి లేనివారలట వేదిక చెంతన వింతచేష్టతో
    కనబడి రప్డు వానరులుగా, గవి వర్యులు తత్సభా స్థలిన్
    చెనుకులు రువ్వుచున్ జనుల చిత్తము దోచిరి ప్రాజ్ఞులై యటన్

    రిప్లయితొలగించండి
  38. వినుమా చెప్పెద నీకిటఁ
    బని గట్టు కొని పిలిచి తమి వారెల్లరిచే
    తను మఱి నిన్నున్ దుందుడు
    కనిపించిరి, కోఁతుల వలెఁ, గవివరు లెల్లన్

    (దుందుడుకు + అనిపించిరి)


    జననుత పండితప్రవర సంచయ కూటమి సాగుచుండగన్
    ఘనముగ నర్థ శబ్దములు కైతల లోఁ దిలకించి పాడిగన్
    మననము సేసి భావము విమర్శన సంభృత వాద కోటినిం
    గనఁబడి రప్డు, వానరులు గాఁ గవి వర్యులు తత్సభా స్థలిన్


    (వాను+అరులు =వానరులు; వాను =నోటిచేత; వా=నోరు; చేతల గాక మాటల శత్రువులని భావము, అలుక్సమాసము.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  39. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి