6, జూన్ 2019, గురువారం

సమస్య - 3039 (నెరజాణల్ గనరారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్"
(లేదా...)
"నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో"

62 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వరమౌ నాంధ్రుల శంకరా భరణమున్ వాగ్దేవులై చేరకే
    సరసంబాడుట చేతగాక కవులన్ సాధించి బాధించుచున్
    పరమార్థమ్మునెరుంగకుండ మదినిన్ బంగారునే కోరెడిన్
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో!

    రిప్లయితొలగించండి
  2. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ మనవి


    వేంకటేశ్వర -- నిం దా స్తు తి
    """"""""""""""" """"""""'""""""""""


    త్వరగా దీర్చెద నిమ్మటంచు ధని నభ్యర్థించి కైకొంటి వీ

    వు ఋణమ్మున్ , మరి తీర్చినావె ? యల యంభోధ్యాత్మజన్ దాల్చి నీ

    యురమందు , న్నెగవేయజూడ దగునే || " యోవేంకటాధీశ ! స

    త్కరుణాసాగర ! దీనలోకపరిరక్షాదీక్ష ! గోవింద ! " యం

    చొరయన్ భక్తులు ‌‌ , దోచుకొందువు గదా | * యుత్తాల కల్కౌఘ సం

    హరుడే సంతత లోకవిత్తహరుడై యన్యాయముం జేసెడిన్ ,

    బరికింపంగ * నటంచు దుఃఖిలెను , సద్భక్తాళి నీ కొండపై ! !


    ( ధని = కుబేరుడు ; అంభోధ్యాత్మజ = లక్ష్మిదేవి ; ఒరయన్ =

    సమీపించగా ; ఉత్తాల = ఉగ్ర ; కల్కము = పాపము ;

    కల్కౌఘము = పాపచయము ; )


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి

  3. నారాయణా :)


    అరయ నర నిజారమ్మణు
    లరె గున గున కన్పడుదురు! లక్షణముగ న
    య్యొ! రసికత యున్న రమణులు
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. వరమీ యంగను కావ్యముల్ పలుక గావాంఛిం చినేకోరగన్
    పరిహా సమ్ముగ పల్కెనం టసిత తాప్రౌఢ త్వమున్ మీరగా
    నెరజాణల్ , గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో
    సిరినా ధుండవొ లేకశ్రీ పతివొ సాసించన్ నివేదిం పుమా

    రిప్లయితొలగించండి
  5. అరవిందా క్షుడు గాంచగ
    సరసీ రుహనేత్రి యంట చమత్క రించెన్
    పరిహా సముగాదు సిరినాధ
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  6. అరరే !లేరా యిచ్చట

    నెరజాణలు,గానరారు నెల్లూరు పురిన్,

    సరస కవితా సుమములను

    శిరముల దాల్చక నడుగిడు శిఖరిణి లిచటన్

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    స్థిరచిత్తమ్మున శంకరాభరణదృష్టిన్ గాంచగా రాజశే...
    ఖరులున్ , సూరమ శ్రీనివాసులును , వేడ్కన్ సీతయున్ శ్రీ ప్రభా..
    కరులున్ నేనును గోచరించెదము మీ కంటన్ బడన్ శంకరా !
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిగ్గా చెప్పారు! గురువుగారు అందరినీ కలిసి చీరాల వెళ్ళారు!మీరు,అన్నయ్య నెల్లూరులో లేరుగా!

      తొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    ఎరుకయె బీరను నేతిని(నేయిని)
    పరికించిన గానబడునె పరిపరి వెతికే
    గురి మాన వలెను సుమ్మీ
    నెరజాణలు గానరారు నెల్లూరి పురిన్

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    సరెలే!యేరును జవ్వనీ యనుట నీ సామ్యమ్ము నెంతున్ భళీ!
    ఎరవై పోదువు గల్వబూన నట నీ యిచ్ఛన్ గనన్ వేడుకౌ
    సరసంబా యతి గూడినంతనె హరీ! సాధ్యంబె నీ పొందుకై
    నెరజాణల్ గనరారు పో వెదకినన్ నెల్లూరు లో నయ్యయో!!

    రిప్లయితొలగించండి
  10. పరుషపు మాటల నాడుచు
    పురుషులతో హద్దుమీరి పోరాటమ్ముల్
    జరుపు కపట దుర్మతులౌ
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి


  11. పరిశీలింపగ నాడు నెల్లి పురమై భాసించె! తాబందులన్
    గరితల్ గట్టిరి చూడముచ్చటగ! జాగామారెనేడయ్యయో
    అరె! నారాయణ! మార్చినావు పురమున్ హైటెక్కుగానేడయో
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. (నేటి నెల్లూరులో కలెక్టర్ గారి ఆజ్ఞతో సద్గుణలే కాని నెరజాణలు లేరు)
    వరమో శాపమొ చెప్పలేమది;కవి
    బ్రహ్మల్ రసావిష్కృతిన్
    పరమామ్నాయము వ్రాసినట్టి ఘనమౌ
    బంగారుపట్నంబులో
    పరిపాలోన్నతు నాజ్ఞచే సుగుణసం
    పన్నల్ వినా నెవ్వరున్
    నెరజాణల్ గనరారుపో వెదకినన్
    నెల్లూరులో నయ్యయో!
    (పరిపాలోన్నతుడు-కలెక్టర్;పరమామ్నాయము-మహాభారతము;వినా-తప్ప)

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. మరులను జిలికెడి తరణుల
    దరహాసమ్మున జగములె దాసోహమనన్
    తరలిరి చాటగ నునికిని
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  15. సరిరారెవ్వరు సారసాక్షులకు శశ్వచ్ఛాంతినందింపగా
    సరిరారెవ్వరు పాత్రపోషణను విశ్వాసంబుగల్పింపగా
    సరిరారెవ్వరు ప్రేమపంచితన సత్సంపత్తునందింతు రే
    *"నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో"?*

    రిప్లయితొలగించండి
  16. వరమోజ్వరమోపురిలో
    నరనారులుబారినారు నడిరేతిరి సు
    స్వరమేవినిపించదు బో
    *"నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్"*

    రిప్లయితొలగించండి
  17. పరి కింప మా రె కాలము
    నెర జాణ లు గాన రారు నెల్లూరు పురి న్
    తి ర ము గ జ్ఞాన ము బొంది యు
    మెరియ రె న న్ని ట ను వారు మేటి గ ని పు డు న్

    రిప్లయితొలగించండి
  18. అరవ విలాతి పొరుగగుట
    నరవము నందున తెలివిడి యవఘళ మయ్యెన్
    అరయంగ తెలుగు భాషన
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్
    నెరజాణ=నేర్పరి

    రిప్లయితొలగించండి
  19. సరిగమ సంగీతమ్మును,
    విరులమ్ముచు సరసమాడు వెలదులు లేరే?
    సిరినాథా❗ కాలమహిమ
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  20. కందం
    దరి నుండెడు పతిదేవుల
    కరమందున భారమనుచు కాసుల సంచిన్
    ధరియించి డాబు జూపెడు
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  21. మత్తేభవిక్రీడితము
    వరమాలల్ ధరియించి వంచి తల నుద్వాహమ్మునన్ భార్యలై
    సరసాలందునె కాక సర్వమవుచున్ షట్కర్మ యుక్తమ్ముగన్
    బరిపాలింతురు, పెత్తనమ్ము తమదై బాధించగా జూచెడున్
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో!

    రిప్లయితొలగించండి


  22. అరరే జిలేబులరరే
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్,
    పరిణితి చెందిన నీటూ
    మరియు యియాము సెటు ర్యాంకు మడతుకలె పో :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. కరివేపాకును కూరలో కతకి పాకమ్ముల్ రుచుల్ చూతుమే
    జరదా వేసిన కిల్లిలో తమల బీజమ్ముల్ సమీక్షింతుమా
    పురిచారిత్రన యుక్తమౌ ఘనులు వాబోవంగ వేలుండగా
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో!

    రిప్లయితొలగించండి
  24. అరరే కన్నులఁ దెరువక
    బిరబిర పని తప్ప వేఱు ప్రేరణ లేకన్
    వరలిన నావలె, మీకున్
    "నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్"

    రిప్లయితొలగించండి
  25. దొరకును కమ్మని భోజన
    మరయగ కోమల విలాస మందున గానిన్
    పరికింపగ కోమలులను
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్ 🙂
    (నెల్లూరి వారి నెవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుడను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్థిరమై తల్పగిరీశుడే శుభముగా దీవింపగా నెల్లరన్
      వరమై తిక్కన పాండితీ ప్రతిభతో వర్ధిల్లె దా నిక్కడే
      మరుగై పోయెను నాటి వైభవమికేమందున్ సఖా జూడుమా
      నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో

      తొలగించండి


  26. అరె నారాయణ ! జిల్లా
    పరిణితి చెందెను చదువుల వ్యాపారముతో
    పరుగుల జీవనమందున
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!


    హిడింబి :)

    రిప్లయితొలగించండి


  27. చురచుర చుక్కాయమ్మలు
    చిరుబురుల జిలేబులరరె చెంపల్ వాయిం
    చు రమణులె గాని వెతికిన
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. స్థిరమగు విద్యలునేర్చియు
    పరువాలనుబెంచునట్టి పరిసరములలో
    విరివిగ సంపదగలిగిన?
    నెరజాణలు గానరారు నెల్లూరుపురిన్!

    రిప్లయితొలగించండి


  29. నెరసిన తలల ముదితలే
    సరసమ్ములతో మదిని కసబిసయనంగన్
    గురిపెట్టు వారలేరీ?
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!


    ఇంతకు మించి "కందిస్తే" వాయగొట్టెదరు కాబట్టి యిప్పటికి స్వస్తి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  30. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    సరసము పట్టని యతనికి..

    పరమాత్ముని చింత యొకటె పవలున్ రేలున్

    దిరముగఁ బట్టిన యతనికి..

    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.6.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  31. పరికింపన్ లలనామణుల్ తెలివిలో పాండిత్య ప్రఖ్యాతిలో
    విరులంబోలెడి మార్దవంబు సొదలో వీరత్వమందున్ మహా
    స్థిరులై కీర్తిగడించినారటగదా చిత్రంబె శోధించినన్
    నెరజాణల్ గనరారుపో వెదికినన్ నెల్లూరులోనయ్యయో
    అరాశ

    రిప్లయితొలగించండి
  32. స్థిరమతులీ పురజాయలు
    సరిపోదీ విత్తమన్న సాధింపులతోన్
    మరి తేతెమ్మని పలికెడు
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  33. వరదాయిని కామాక్షిని
    మరి వెంకయ్యను కనంగ మార్పు కలుగు నె
    వ్వరికైన బుద్ధియు నికను
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  34. సరసపు పల్కుల చేష్టల
    సురుచిర లావణ్యమొప్పు సొగసులతోడన్
    మురిపించుచు మదిదోచని
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  35. అరయగవే రేచోటను
    నెరజాణలుగానరారు, నెల్లూరుపురిన్
    అరవిరిసినకుముదమ్ములు
    సురలోకము నుండి దిగిన సుందరనారుల్.

    రిప్లయితొలగించండి
  36. విరివిం జెల్లాచెద రె
    ల్లరు మల్లులఁ గాంచ నచట లాలిత సల్లా
    పరతులు కల్లోలవతులు
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్


    నిరతుల్ విద్యల యందుఁ గార్య రతులే నీపాసు గాలా యిటం
    దురు దక్కన్ మఱి నేర రన్యములు వేనోళ్ళం బ్రగీర్తింపగా
    సరి రారెవ్వరు ధర్మతత్పరులు వాచాలత్వ సంక్రీడలన్
    నెరజాణల్ గనరారు పో వెదకినన్ నెల్లూరులో నయ్యయో

    [నెరజాణలు = గొప్ప నేర్పరులు]

    రిప్లయితొలగించండి
  37. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    శిరముల్ దాల్చక భర్త లానలనయో చీల్చించి చెండాడుచున్
    ఖరమౌ మాటల నత్తమామలనహా కవ్వించి పోరాడుచున్
    గురువుల్ బుర్రల పాలు పోయకను భల్ కోపమ్ముతో మొట్టెడిన్
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో

    రిప్లయితొలగించండి
  38. పురమో నియ్యది చూడ సింహపురియౌ పూబోడులీ నేలలో
    వరమై పుట్టిన వారలే కనకపున్ పద్మంపు సౌరభ్యముల్
    పరకాంతన్ చెరపట్టు క్రూరులకు నీప్రాంతమ్మునన్ రాత్రులన్
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చరితన రణతిక్కన సవి
      వరగాథ తెలిసినవారుఁ బల్కరు, పల్కన్
      గరతురు నాల్క,ననృతమౌ
      'నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్'

      తొలగించండి
  39. పురి నామమందు సింహము
    నరయుచు పారిరొ భయమున హరిణాక్షులిటన్
    మరిమరి వెదికిన లేరిక
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  40. నెఱజాణల్ గనరానిచోటుగలదే? నేడెల్లెడన్ వారలే!
    సరసాలాపములాడుచున్, సఖులతోసల్లాపముల్ సల్పుచున్
    సరదాగా తనరారుచుండనిలలో సందేహమా, సత్యమా,
    నెఱజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో?

    రిప్లయితొలగించండి
  41. సరసపు చేతల తమ చిరు
    దరహాసము గలిపి వాడి యైన పలుకలన్
    పురుషుల మది గాయపరచు
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  42. కరమును కడి యన్నముకై
    పరువమునే యమ్ముకొనగ పాల్పడిరకటా!
    తరుణులు గతమున :నేడా
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  43. క: కరమగు భక్తిని పెద్దల
    నరయక స్వార్థమయమైన యాలోచనలే
    నిరతము, గత విభవము గల
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  44. ఆ.వె:గురుతులను తెలిపి పంపిరి
    గురువులు వెదుకగ పురమున కూరిమి తోడన్
    చొరబడి వీధుల వెతికిన
    నెరజాణలుగాన రారు నెల్లూరు పురిన్.

    మరోపూరణ

    గురి చూచుచు పట్టుదురట
    నెరజాణలు, గాన రారు నెల్లూరు పురిన్
    పరవశమున వారి నిచట
    దరిశించెద మన్న వారు దాపున నెచటన్

    రిప్లయితొలగించండి
  45. సమస్య:

    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్"

    పూరణ:

    విరవిగ నుండిరి నమ్ముడు
    మరువము వారిని దలువగ మనసున నెపుడున్
    విరివిగ వలసలువెళ్ళిర
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!!

    రిప్లయితొలగించండి
  46. పరిపరి విధముల తిరుగుచు
    పురుషుల నాకట్టు కొనుచు పురమున నెపుడున్
    మరి మరి రసికత చూపెడు
    నెరజాణలు, గాన రారు నెల్లూరు పురిన్

    రిప్లయితొలగించండి
  47. అరయగ నిపుణులు గారే
    నెరజాణలు!గానరారు నెల్లూరుపురిన్
    నెరజాణలు గానిసతులు
    తరగని విఙ్ఞానమందు,దాతృత్వమునన్


    రిప్లయితొలగించండి
  48. :
    కరివేపాకునకరియును
    గరీబురధమునగరీబు కానగరారే
    వరియుండదుజనవరిలో
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్.

    రిప్లయితొలగించండి
  49. నెరవేర్చన్ తమ కోర్కెలన్నిసత మన్వేషించిమార్గమ్ములన్
    తరుణుల్ సాగుచు నుందు రాపథములన్ దర్పమ్ముచూపించుచున్
    వరునిన్ ప్రేమగఁ జూచుచుందురెపుడున్ భావింప గయ్యాళులౌ
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో

    రిప్లయితొలగించండి