1, జులై 2019, సోమవారం

దత్తపది - 158

హరి - మాధవ - కేశవ - అచ్యుత
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ శివుని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

49 కామెంట్‌లు:

  1. పుర'హరి'వి నీ వు'మాధవ'! పూజ్యపాద!
    సర్వలో'కేశ! వ'రద! యో చంద్రచూడ!
    'అచ్యుత' ప్రభావుఁడవని యనవరతము
    నిన్నుఁ గొలిచెద శంకరా! సన్నుతింతు.

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    కామహ ! రిపుగర్వాపహ !
    వామార్ధతనూ ! ఉమాధవా ! శివ ! భద్రా !
    వ్యోమామలకేశ ! వదా
    న్యా ! మము రక్షించుమయ్య ! అచ్యుతకరుణా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
  3. హే యుమాధవా! పురహరివీవె గాదె
    యచ్యుతడవని తలతునో యగ్గికంటి
    హేమకేశవా శితికంఠ యిందుమౌళి
    శరణు శరణంటి వృషపతి శమనరిపుడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హేమకేశవా, శమనరిపుడ'?

      తొలగించండి
  4. హరిశయ నంబున పూజలు
    పరిపరి విధముల జేసి పరవశ మొందన్
    వరదుడ మాధవ కేశవ
    నిరతము నినుకొలుతు నంచు నిక్కమ చ్యుతా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      'హరిశయనంబు'? ఇది శివస్తుతిలా లేదు. 'నిక్క మచ్యుతా' అన్నచోట గణదోషం.

      తొలగించండి
  5. (నీలగ్రీవుని స్తుతిస్తున్న దశగ్రీవుడు)
    ఈశ!హరిణాంకమౌళి!మహేశ!గిరిశ!
    శ్రీయుమాధవ!శంకర!చిన్మయాంగ!
    వ్యోమకేశ!వరద!హర!కామవైరి!
    గగనసీమాచ్యుతామరగాంగధారి!

    రిప్లయితొలగించండి


  6. ప్రహరించినట్టి దోహరి
    వి! హరుడ! లోకేశ! వామ! విజయేశుడ! యీ
    శ! హిరణ్యకవచ! మా ధవ!
    అహర్నిశలుకొలుతుమయ్య యచ్యుతయనుచున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. మిత్రులందఱకు నమస్సులు!

    వామదేవ! పరీణా[హ! రి]పువినాశ!
    పురహ! రో[మాధవ]! గిరీశ! భూతనాథ!
    వ్యోమ[కేశ! వ]ర్ధన! శంభు! కామహంత!
    లేలిహా! [సాచ్యుత]శరీర! ఫాలనయన!

    రిప్లయితొలగించండి
  8. 'హరి'మిత్ర! యో యు'మాధవ'!
    పరమేశా! వ్యోమ'కేశ! వ'ర్ధన! రుద్రా!
    వరదా! 'యచ్యుత'రూపా!
    సురపూజిత! ఫాలనేత్ర! శూలధర! హరా!

    రిప్లయితొలగించండి
  9. కొలిచెద పురహరి నినునే
    పిలుతు నుమాధవ యనుచును పేదనుగనుమా
    తెలియము లోకేశ వరద
    బలు నచ్యుతమగు మహిమలు పన్నగధారీ

    యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

    రిప్లయితొలగించండి
  10. నీలకంఠ యుమాధవ ఫాలనేత్ర
    నాగభూషణ పురహరి నవ్యతేజ
    సర్వలోకేశ వరదాయి సన్నుతాంగ
    అచ్యుతుడవౌచు మమ్మేలు మార్ద్రహృదయ

    రిప్లయితొలగించండి
  11. దో(హరి) పొడతో వరాహము కొరకు పోరాడి కరుణతోడ నాడు పాశు
    పతమునొసగినట్టి పరమేశ , ఊరి(కే ,శవ)రుడ నీపైన జలము పోసి
    హరహర యనినంత పరుగున యేతెంచికాపాడు నీ మది ఘనము కాదె,
    (మాధవ) మడుగిడ మదనుడు నీపైన శరములు గుప్పించ కరుణ లేక
    కాల్చితివి గదా మూడవ కన్నుతోడ,
    (నచ్యుత) మగు దీక్షకలిగి యన్ని వేళ
    లందు పూజలు చేతును యిందు మౌళి,
    కాచు మయ్య సదాశివా కరుణ తోడ

    మాధవము = వసంత ఋతువు , దోహరి = నీచ జాతివాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఊరకే... పరుగున నేతెంచి... చేసెద నిందుమౌళి' అనండి.

      తొలగించండి
  12. శ్రీ గురుభ్యోన్నమః🙏
    హరి - మాధవ - కేశవ - అచ్యుత
    దత్తపది - శివస్తుతి

    అహం,మొహం,సాహసం,అల్లరి మని నందిపై దిరిగే, గంగను మానవాళికి వదిలిన శివుని ఎప్పుడూ స్తుతించుము.-అని ఊహ ఈ పూరణము.

    ఓహరి^ రానీకు దరికి,
    మోహము విడుమా ధవళము* మోపున శూలిన్
    సాహస, కేశవ° మువదలి
    పాహీ గంగాచ్యుత+ యనిఁ బాడుము నిరతమ్!

    ^అహంపూరితం; *ఆబోతు,నంది;
    °వేళాకోళము; +గంగను వదలినవాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిరతమ్' అని హలంతంగా వ్రాయరాదు. "...బాడుము సతమున్" అనండి.

      తొలగించండి
  13. హరియించును పాతకముల
    పురాంతకు డుమాధవుండు భువనేశ్వరుడా
    హర వ్యోమకేశ వర స
    ద్గురు డచ్యుత జ్ఞానమూర్తి ధ్రువముగ నెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జ్ఞానమూర్తి'కు ముందున్న 'త' గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. హరియించును పాతకముల
      పురాంతకు డుమాధవుండు భువనేశ్వరుడా
      హర వ్యోమకేశ వర స
      ద్గురు డచ్యుత భవకరుండు ధ్రువముగ నెపుడున్ 🙏

      తొలగించండి
  14. హరియింతువు పాపములను
    మరువకు నను పాపుడను సుమా ధవళాంగా
    హరిపదకేశ వదల నీ
    చరణము లచ్యుతములైన సద్గతు లిమ్మా.

    రిప్లయితొలగించండి


  15. ఏదయ్యా శివ యచ్యుతా! అచలుడా! యేదయ్య నీరూపమౌ?
    వేదాధ్యాయియె జూచి దోహరిగ నన్వేషించె నద్వైతమున్
    కాదా శంకరుడేను మా ధవ! కృపన్ ఖట్వాంగి లోకేశ! వా
    మా! దాంతమ్మును చేర్చుమయ్య విధుడా! మల్లారి!భృంగీశుడా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. హరి భూషణ చంద్రకళా
    విరాజి తోమాధవ! పరివేష్టిత వసుధా
    ధర తన యాసిత కేశ వ
    ర రమణ్యచ్యుత నిరంతర నుతా ప్రణతుల్

    రిప్లయితొలగించండి
  17. పురహరివియోయుమాధవ!
    వరమగులోకేశ!వరద!పావనచరితా!
    నిరతమునచ్యుతదేహుడ!
    పరమునునాకిమ్ముదయనుబశుపతినాధా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిరతాచ్యుతదేహా! స। త్పరమును...' అనండి బాగుంటుంది.

      తొలగించండి
  18. హరుని నామ మహిమ హరియించు పాపా లుఁ
    మాధవుండ నిశము మనకు రక్ష
    వ్యోమకేశ !వరద! కామనఁ దీర్పరా!
    ఆర్తితోడఁగొల్తు నచ్యుతుండ!

    రిప్లయితొలగించండి
  19. హరియించుమయ్య నిలమా
    దురితముల నుమాధవనవి దోసంబనకన్
    కరుణించు మచ్యుతమవని
    హరి కేశవులదయ మాకు హర్షము తోడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హరియించుమయ్య యిల...' అనండి.

      తొలగించండి
  20. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂దత్తపది 🤷‍♀....................
    *హరి - మాధవ - కేశవ - అచ్యుత*
    పై పదాలతో అన్యార్థంలో శివ స్తుతి
    నచ్చిన ఛందంలో పద్యం

    సందర్భము: ఒక భక్తుని శివ ప్రార్థన.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వెత లెల్లన్ హరియింపగా.. ననఘమౌ
    విజ్ఞాన మందింపగా
    సతమున్ బ్రీతి నుమాధవ స్మరణమే
    సర్వోత్తమం బౌట.. "నా
    శ్రితపోషా! హర! వ్యోమకేశ! వరదా!
    జీవేశ! దేవేశ! అ
    చ్యుత తత్వైక ప్రకాశ!" యంచుఁ నిను నే
    స్తోత్రంబుఁ గావించెదన్..

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    1.7.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  21. హరిపదకేశ వారిజభవార్చితపాద యుమాధవా చ్యుత
    స్ఫురణ మహేశ్వరా స్మరనిషూదన పర్వతరాజ పుత్రికా
    వర కరుణాకరా దివిజవందిత తారకవైరితాత శ్రీ
    కర పరమేశ్వరా గరళకంఠ సదాశివ శంభు శంకరా.

    రిప్లయితొలగించండి
  22. హరిభూష!ఉమాధవ!శివ!
    కరిచర్మాంబరధర!సూరగంగాజూటా!
    పరమపురుషా!త్రిలోకేశ!
    వరదాచ్యుత!వామదేవ! పాలింపగదే!

    రిప్లయితొలగించండి
  23. కొద్ది సవరణతో ..............

    ఓ యుమాధవా! పురహరి యూర్ధ్వశాయి
    యచ్యుతుడవని తలతునో యగ్గికంటి
    హేమకేశ వాజసనుడ యిందుమౌళి
    శరణు శరణంటి వృషపతి కరుణ జూపు.

    రిప్లయితొలగించండి
  24. మదనుని సంహరించిన యుమాధవు డేగద యచ్యుతుండిలన్
    వ్యధలను దీర్చుచున్ బుడమి బాలన సేసెడి వాడతండె, తా
    హృదయమునందు కేశవుడ నింపుగ నిల్పిన శక్తి శాలినిన్
    యెద గుడి చేసి నిల్పితిని యీశ్వరు నేనుగు తోలు తాల్పునిన్.

    రిప్లయితొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    హరితా హారము ,మంచు పర్వతము నా హ్లాదంపు గంగమ్మతో
    దరి జేరం గదె మా ధవుండవు కదా! దాక్షిణ్యతన్ మాకిదే
    సరి నీ పాదము నంటకే శవముకౌ సాక్షాత్తు నీ బోధలన్
    బరి తృప్తిం బొనరించ వచ్యుత గతిన్ బాటించ నీవే శివా!!

    రిప్లయితొలగించండి
  26. హరిహర రూపా శూలీ
    వరములనొసగే యుమాధవా గిరిజేశా
    వరకేశవా సతత మీ
    సిరినచ్యుతమవకజూడు శ్రితజనపాలా.

    రిప్లయితొలగించండి