21, జులై 2019, ఆదివారం

సమస్య - 3082 (తప్పులఁ జూప....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్"
(లేదా...)
"తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్"
(ఈ సమస్యను పంపిన వజ్జల రంగాచార్యులు గారికి ధన్యవాదాలు)

120 కామెంట్‌లు:

  1. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    గు రు భ్యో న్న మః ( నిన్నటి పూరణ స్వీకరింప మ న వి )



    [ దైవార్చన మెంత జేసినను , మాతాపితలను సేవించని వారికి
    .......................................................................................

    పాతకములే చేకూరును • ]
    . ....................................




    అరిషడ్వర్గ మికన్ జయించు | ద్రవిణవ్యామోహమున్ వీడుమా ,

    స్థిరమే సంపద లెల్లయున్ ? బరజనశ్రేయమ్ము నాశించు చా

    పరమాత్మార్చన సేయు || మానవులకున్ బాపంబులే చేకురున్ ,

    బరిపోషించనిచో ప్రసూతిని - పితన్ నైర్మల్యమౌ " ప్రేముడిన్ "

    అరయన్ విశ్వము నందు వేదముల సారాంశం బిదే మిత్రమా !



    { ద్రవిణము = ధనము ; ప్రసూతి = మాత ;

    " ప్రే ము డి " = తల్లిదండ్రుల యెడల పిల్లల కుండు

    ప్రే మ }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేయుము' అనే విధ్యర్థకానికి 'చేయు' అని ప్రయోగించడం సాధువు కాదనుకుంటాను.

      తొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కంది వారి స్వగతం:👇

    గొప్పగు కార్యమున్ దలచి గుప్పుగ చుప్పుగ నాందిపల్కగా
    రొప్పుచు రోయుచున్ కవులు రూపులు దిద్దక పంప పద్యముల్
    తప్పక బాధ్యతన్ నడుప దంభము వీడుచు కమ్మకమ్మగా
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుప్పుగ చుప్పుగ'... 'గప్ చుప్ గా' అన్నదానికి రూపాంతరమా?

      తొలగించండి
    2. బెంగాలీ పదం సార్:

      "గుప్ చుప్"

      🙏

      తొలగించండి
  3. ఎప్పుడును మాట తప్పక
    నొప్పగు బాటను నడిచెద, నుర్విని జనులన్
    నెప్పటికప్పుడు వారికి
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    రిప్లయితొలగించండి
  4. చెప్పుడు మాటలు వినుచు
    ఒప్పేయని ఘీంక రించు నొజ్జల కెపుడున్
    చెప్పక తప్పదు మరిమరి
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెప్పుడు మాటల వినుచు
      ఒప్పేయని ఘీంక రించు నొజ్జల కెపుడున్
      చెప్పక తప్పదు మరిమరి
      తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్
      ధన్య వాదములు

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "చెప్పుడు మాటలను వినుచు । నొప్పేయని..." అనండి.

      తొలగించండి
    3. చెప్పుడు మాటలను వినుచు
      నొప్పేయని ఘీంక రించు నొజ్జల కెపుడున్
      చెప్పక తప్పదు మరిమరి
      తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

      ధన్య వాదములు

      తొలగించండి
  5. తప్పిదము జేయు వారది
    యొప్పని భావించుచుంద్రు యుర్విని జనులే
    తప్పొప్పుల గమనించుచు
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భావించుచుందు రుర్విని...' అనండి.

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. తప్పులు సాజమై చెలగు ధారుణి మానవకోటికెల్లడన్,
      తప్పుల నెత్తి జూపు నెడ తా సవరించగ నట్టి తప్పులే
      మెప్పుల రూపులై పరిణమించును, గావున దిద్దుబాటుకై
      తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్.

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. గుప్పెడుగ నుల్లిపాయలు
    జప్పున వెెదజల్లి పిండి జక్కగ వేయన్
    గొప్పగ వేయించిన - ఊ
    తప్పుల జూపంగ ముదమె దక్కును నాకున్.
    ఊతప్పు = ఊతప్పం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామన కుమార్ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    నిప్పును బూది గప్ప కడునేర్పుగనూదిన తేజరిల్లు , నేఁ
    దప్పులు సేయజాలనని
    ధైర్యముగా వచియింప జాల , నే...
    నెప్పుడు బాధచెందనొక యించుక బాలలు పెద్దలెవ్వరేన్
    తప్పులఁ జూప, నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. మధ్య తరగతి జీతమొచ్చే నన్ను యెవరెప్పుడు వచ్చి ధనసాయమడుగుతారో? నాకే చాలీ చాలక ఉందే! అందుకని కాస్త అప్పుంది రా నాకు అని ఈ కష్టం తప్పించుకుంటూ ఉంటాను.😀😉

    ఉ||
    తిప్పల తోడ మధ్యగతదీనపు వృత్తులనుండు నాకడ
    న్నొప్పది రాళ్ళనైన కటిదోపగ జూడ దలంపులుండు యే
    దెప్పుడు వచ్చునో యెవరు తెమ్మనునో ధన సాయమున్ రవం
    తప్పులు జూప నాకెపుడు దక్కుచునుండును సంతసంబిటన్

    ఆదిపూడి వెంకట రోహిత్
    Detroit

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రోహిత్ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. శంకరాభరణం 21/07/2019

    సమస్య

    "తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్"

    నా పూరణ. ఉ.మా.
    **** **** **
    తప్పుల లేని మానవుని ధారిణి నందున గాంచ డెవ్వడున్

    తప్పుల జెప్ప వారు తమ తఫ్ఫుల దిద్దుచు జీవితమ్మునన్

    తప్పక వృద్ధి జెందుదురు;దండిగ లాభమె కల్గు గాన, నే

    తప్పుల జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్


    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తప్పులు లేని... ధారుణి...' టైపాట్లు.

      తొలగించండి


  11. అప్పయ్య శాస్త్రి శిష్యుడ!
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్,
    గప్పున బట్టుచు నరరే
    తప్పొప్పులనెన్ని వాటి తరమును చూడన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. (సమాధానపత్రాలు దిద్దుతున్న ఆంధ్రాధ్యాపకుడు సహాధ్యాపకునితో)
    ఒప్పిన నొప్పకున్న మరి
    యున్న విశేషము నుగ్గడించెదన్;
    గప్పములన్న భావనను
    గల్గకు మెప్పుడు మిత్రవర్యుడా!
    యొప్పిదమౌ జవాబు ప్రతి
    యొక్కరు వ్రాయగ వారిమేలుకై
    తప్పుల జూప నాకెపుడు
    దక్కుచునుండును సంతసంబిటన్.

    రిప్లయితొలగించండి
  13. తప్పిదము లేని విధము
    మెప్పించెడి పద్దెములను మేలుగ బలుకన్
    చప్పున లొసుగులు దిద్దగ
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్వారకానాథ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "...లేని విధమున" అనండి.

      తొలగించండి
    2. తప్పిదము లేని విధమున
      మెప్పించెడి పద్దెములను మేలుగ బలుకన్
      చప్పున లొసుగులు దిద్దగ
      తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

      తొలగించండి

  14. తప్పుల తోడ పద్యముల దారుణ రీతిగ వ్రాయుచుండగా

    తప్పుల నెత్తిజూపుచును తప్పక దిద్దుచు శంకరార్యులే

    గొప్పగ మమ్ములన్ మలిచి కొల్లగ మేలు నొనర్చు గాన తాన్

    తప్పుల జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్


    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷


    రిప్లయితొలగించండి


  15. అప్పయ శాస్త్రి శిష్యుడ వధాన్యుడ పండితుడన్! మదమ్ముతో
    గొప్పల చెప్పుకొంచు పురికోసల ద్రిప్పుచు మాటలాడుచున్
    దెప్పుచు తప్పులెన్ని తమ దేభ్యపు కైపుల చూపు వారి పెన్
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. ఒకవేళ 'వధ + అన్యుడ' అనుకుంటే అర్థం?

      తొలగించండి
  16. తప్పులఁజేయు పద్మజుడె
    తప్పునె మానవజన్మలోన వా
    డెప్పుడుఁ దప్పుఁజేయడనఁ
    హెచ్చును గర్వముఁ, గూల్చు నెప్పుడో
    మెప్పున వెన్నుఁ దట్టుచునె
    మేల్కొని యావలఁ జేయకుండగా
    తప్పులఁ జూప నాకెపుడు
    దక్కుచునుండును సంతసం బిటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఎప్పుడుఁ దప్పుల నెత్తుచు
      దెప్పుటెనను తమనిరతపు ధ్యేయమ్మగుచో
      నెప్పటి కున్నతి? యెవ్విధిఁ
      దప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్?

      తొలగించండి
    3. రాకుమార గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. 🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
    ఆర్యులకు, మాతృస్వరూపులైన అమ్మలకు వందనములు.🙏🏼🙏🏼🙏🏼

    శంకరాభరణం. సమస్యాపూరణం.

    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్ !

    పూరణకై నా ప్రయత్నము.

    తప్పును చేయుటెప్పుడును తప్పక నిప్పును త్రొక్కుచుండుటే.
    తప్పును తప్పఁ జేయుటది దైవికమంచు మనంబునెంచి నే
    ముప్పును గొల్పు తప్పులని ముందుగఁ జూపుదు మంచివారికిన్.
    తప్పులఁ జూప, నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్ !

    సద్విధేయుఁడు
    చింతా రామకృష్ణారావు.

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఉప్పొంగి చెప్పు సూక్తిని
    చొప్పుగ ననకుండ నుండు శ్రోతల నెపుడు
    న్నొప్పుగ మార్చుచు వారను
    తప్పుల జూపంగ ముదమె దక్కును నాకున్.

    రిప్లయితొలగించండి
  19. అప్పగ సుతులెవరైనను
    నొప్పిని పుట్టించుభాష నుడివిన యెడలన్
    యప్పటి కప్పుడె వారికి
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎడలన్ + అప్పటికి' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.

      తొలగించండి
  20. మెప్పుగ పద్యము నొకపరి
    గొప్పగ వ్రాయుదు ననుచును గోరిక నల్లన్
    చప్పున శంకరులయ్యెడ
    తప్పులు జూపంగ ముదమె దక్కును నాకున్

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఒప్పుగ చెప్పు సూక్తులను శ్రోతలు చక్కగ పల్కకుండుచో
    చొప్పుగ నోర్మితో సతము శోధన జేయుచు వారి కేవిధిన్
    జెప్పిన చక్కగా కఱచి చెన్నుగ మారుచు నుందురో నటుల్
    తప్పులు జూప నాకెపుడు దక్కుచు నుండును సంతసం బిటన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది.

      తొలగించండి



  22. కందము
    తప్పుడు ద్రోవల నడచుచు
    ముప్పులు బెట్టుదురు పుణ్యపురుషుల కెపుడున్
    ఎప్పటికప్పుడు వారల
    తప్పులు జూపంగ ముదమె దక్కును నాకున్.
    ఱ ఆకుల శివరాజలింగం వనపర్తి



    రిప్లయితొలగించండి
  23. శ్రీ గురుభ్యోన్నమః🙏

    గొప్పలుఁ బలుకుట మానుము
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్!
    నొప్పింప కెప్పుఁ డితరుల
    దప్పయిననుఁ దొలగి పోవ ధన్యుడఁ వీవే!

    రిప్లయితొలగించండి
  24. ఎప్పటి కెయ్యది సుఖమో
    నప్పటికా బాటన నడయాడుచు నెపుడున్
    గొప్పగ జెప్పెడు మాటల
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుఖమో యప్పటికా...' అనండి.

      తొలగించండి
  25. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును
    సంతసం బిటన్

    సందర్భము: ఇది స్వానుభవం. నేను కవితలు వ్రాసే కొత్తలో ఎవరికైనా వినిపిస్తే
    అందరూ మెచ్చుకునేవారే! ఐతే అందులో విశేషం ఏమీ లేదు. వారినుండి నేను నేర్చుకునేదీ లేదు అని గ్రహించాను.
    అప్పటినుండి "మీరు మెచ్చుకోవలసిన పనిలేదు. దాచకుండా తప్పు లేవో చెప్పండి చాలు. నే నేమీ అనుకోను. ఆ తప్పులే నాకు పనికివస్తాయి. వాటిగురించి ఆలోచించి దిద్దుకుంటాను." అని కింది విధంగా చెప్పటం మొదలుపెట్టాను.
    ఎదుగుదలకు రహస్యం నాకు తెలిసిపోయింది. భ్రమలు తొలగిపోయాయి. ఎవరైనా గొప్పగా వుందంటే భుజా లెగురవేయటం మానుకున్నాను.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "తప్పుల నొప్పులం దెలియఁ
    దద్విషయజ్ఞులఁ జేరఁ..'గైతయే
    గొప్పగ నున్నదోయి!' యని
    కోరి పొగడ్తల ముంతు రెందరో!
    తప్పులు జెప్ప దిద్దుకొని
    ధన్యత నందెద.. నాదు కైతలో
    తప్పులఁ జూప నాకెపుడు
    దక్కుచునుండును సంతసం బిటన్" 1

    ఒప్పులు జెప్పువారి కడ
    నొక్కటి నేర్చుకొనంగ లేదులే!
    "తప్పులు జెప్ప వీని కడ
    దక్కదు గౌరవ" మంచు బెద్దలున్
    "గొప్పగ నున్న" దందు.. రిక
    కోరు పురోగతి యేది?.. కైతలో
    తప్పులఁ జూప నా కెపుడు
    దక్కుచునుండును సంతసం బిటన్ 2

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    21.7.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  26. అప్పులుఁజేయుచు సతతము
    మెప్పులు గుప్పంగ చెడ్డ మిత్రులతోడన్
    తప్పుడు మాటలు వలదని
    తప్పులుఁజూపంగ ముదమె దక్కును నాకున్.

    రిప్లయితొలగించండి
  27. చప్పని మన్నును తినుటన్
    దొప్పలతో వెన్న జున్ను దొంగిలి తినుటన్
    తెప్పలుగ చిన్ని కృష్ణుని
    తప్పుల జూపంగ ముదమె దక్కును నాకున్.

    రిప్లయితొలగించండి
  28. శ్రీగురుభ్యోన్నమః🙏
    ధృతరాష్ట్రుడు అర్థరాత్రి నిదుర రాక తన బాధలు, వేదన మరచుటకై విదురుడిని పిలిపించి హితవచనముల చెప్పుమనుట సందర్భం.

    చెప్పుము కోవిదా విదుర చిత్తమునన్ మునుఁ జెప్పలేనివౌ
    ముప్పులు గోచరింప మనమున్ వికలంబయె నేడు నాకికన్
    వప్పెడి రీతి నామనము, వాక్కులఁ జెప్పుము యోగ్యమౌట నాఁ
    దప్పుల జూప నాకెపుడు దక్కుచు నుండును సంతసంబిటన్!

    నా మొదటి వృత్తము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో 'ఒప్పెడి'ని వప్పెడి అన్నారు.

      తొలగించండి
    2. ధన్యవాదములు. ఎఱిగి తప్పు జేసితిని. సరి చేసికొందును.🙏

      తొలగించండి
    3. చెప్పుము కోవిదా విదుర చిత్తమునన్ మునుఁ జెప్పలేనివౌ
      ముప్పులు గోచరింప మనమున్ వికలంబయె నేడు నాకికన్
      వప్పుల మాన్ప నామనము, వాక్కులఁ జెప్పుము యోగ్యమౌట నాఁ
      దప్పుల జూప నాకెపుడు దక్కుచు నుండును సంతసంబిటన్!

      తొలగించండి
  29. ఒప్పుల కుప్ప నీవనుచు నూరక జెప్పుచు గొప్ప లెప్పుడున్
    యెప్పుడు నేమి జేసిన నదెంతయొ మేలని మెచ్చుకోలుగన్
    జెప్పుట గాక నీవు పరిశీలనగా పరికించి జూచుచున్
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎప్పటి కప్పుడు కవితలు
      మెప్పని గొప్పని పలుకుచు మెరమెచ్చులుగా
      ఒప్పులె గాక సరిగ నా
      తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఎప్పుడున్ + ఎప్పుడు... అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  30. కందం
    చెప్పెడు కవిత్వమందున
    గొప్పతనము బడయ బుధులు కూరిమితోఁ దా
    మొప్పిదపు సద్విమర్శలఁ
    దప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్


    ఎన్నికల వ్యూహాన్ని కార్యవర్గానికి వివరిస్తూ ప్రతిపక్షనేత...

    ఉత్పలమాల

    చెప్పిన వేమి చేయకనె చెల్లెను ముచ్చట నైదు వత్సరా
    లప్పుల కుప్ప యయ్యె మన యాంధ్ర ప్రదేశ మటంచు ధాటిగాఁ
    జెప్పిన దేది చెప్పకనె చెప్పుడు యోటరులెర్గ వారివౌ
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన రెండవ పూరణ:

      చెప్పిన వేమి చేయకయె చెల్లెను ముచ్చట నైదు వత్సరా
      లప్పుల కుప్ప యయ్యె మన యాంధ్ర ప్రదేశ మటంచు ధాటిగాఁ
      జెప్పిన దేది చెప్పకనె చెప్పుడు యోటరులెర్గ వారివౌ
      తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్

      తొలగించండి
  31. విప్పను గోపపు జాలియ
    నొప్పొనరించ నవకాశ మొప్పును నాకే
    యెప్పుడయిన నా మాటల
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    తప్పునె యెక్కఁగా నిచట దప్పపు టక్కఱ లేని పీఠమున్
    విప్పుచుఁ జిక్కు టర్థములు నిప్పుల కుప్పగ నుక్కఁ బెట్టగన్
    ముప్పులు వొంద మిక్కుటము బొప్పుల కుక్కక తప్పకుండగం
    దప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్

    రిప్లయితొలగించండి
  32. తప్పులు జేయు ఛాత్రులిల దారిని దప్పుచు మెల్గుచుండగా
    గొప్పగ జూడగా దలచి గుర్వుగ నీతులనెల్ల దెల్పుచున్
    జెప్పుచు మంచి మాటలను జీవన యానము బాగు పర్చగా
    దప్పులు జూప నాకెపుడు దక్కుచు నుండును సంతసం బిటన్!

    రిప్లయితొలగించండి
  33. అ ప్పడుగ బోరు బంధువు
    లెప్పుడు నగలనుచు నాలి యేడ్వదు పిల్లల్
    విప్పరు చిట్టా యని తల
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్.

    తలతు+అప్పుల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. మిస్సన్న గారు యీ మీ పద్యములోఁ “దలఁతు” క్రియకు కర్త నువ్వా లేక నేనా?

      తొలగించండి
    3. పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు. నేననే నా ఉద్దేశమండీ.

      తొలగించండి
    4. ఇక్కడ చిన్న వ్యాకరణ విశేష మున్నదండి.
      నేను తలతు అప్పులు: ఈ అర్థములో తలతు ద్రుతప్రకృతికము (ద్రుతాంతము).
      ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు
      కనుక “తలతు నప్పులు” సాధువు.
      నీవు తలతు అప్పులు: ఇక్కడ తలతువు వు లోపమున తలతు కళ.
      అప్పుడు “తల తప్పులు” సాధువే. నీవు తలతువని యర్థము.
      మీ పూరణమున కాటంకము లేదు మిత్రు నుద్దేశించి చెప్పిన.
      ఇది నా యభిప్రాయము. గురువు గారు వివరించ గలరు.

      తొలగించండి
    5. మంచి వ్యాకరణ కార్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదము లండీ.

      తొలగించండి
  34. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    జీపీయస్ స్వగతం:

    గొప్పగు ఖర్గపూరునకు కూటికి గుడ్డకు దిక్కులేకయే
    త్రిప్పలు పెట్టు రైలునను తిన్నగ
    బోవగ భీతి చెందుచున్
    బొప్పులు కట్టు నాంగ్లమున పుట్టలు పుట్టల బంగబంధులన్
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్

    రిప్లయితొలగించండి
  35. మెప్పునుబొందుటకొరకై
    తప్పనితెలిసియునుదాని తప్పనకున్న
    న్నొప్పదు నామనసెప్పుడు
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    రిప్లయితొలగించండి
  36. తప్పులుమానవాళికవి తప్పవుజేయగ నెప్పుడైన నా
    తప్పులనెత్తిజూపనిచొ తప్పక ముప్పొనగూడునేరికిన్
    తప్పును తప్పుగా తెలిసి తప్పును దిద్దుకొనంగ వీలుగా
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్.

    రిప్లయితొలగించండి
  37. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'వారలు + ఒప్పరు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

    రిప్లయితొలగించండి

  38. కం. తప్పుడు త్రోవలఁ బోవుచు
    తప్పొప్పులు తెలియక కలఁతపడెడి వారే
    తిప్పల బడని విధముగ
    తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విధమ్ముగ' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. నమస్కారం గురువుగారు,
      మీరు చెప్పినట్లుగా విధమ్ముగ అని వ్రాయవచ్చు. నేను మీ వ్యాఖ్య చదువక మునుపే, తిప్పల బడయని విధముగ అని వ్రాసాను.

      నమస్సులు, గిరి

      తొలగించండి
  39. తప్పులుజేయనివారలె
    యిప్పుడమిని గలరె?యెంచనెక్కడనైనన్
    దప్పులుదిద్దుకొ నినదఱి
    తప్పులుజూపంగముదమెదక్కును నాకున్

    రిప్లయితొలగించండి
  40. తప్పులు జేయు ఛాత్రులిల దారిని దప్పుచు మెల్గుచుండగా
    గొప్పగ జూడగా దలచి గుర్వుగ నీతులనెల్ల దెల్పుచున్
    జెప్పుచు మంచి మాటలను జీవన యానము బాగు పర్చగా
    దప్పులు జూప నాకెపుడు దక్కుచు నుండును సంతసం బిటన్!

    రిప్లయితొలగించండి
  41. తప్పులు జేయగా సదరుతప్పులు వారలుదిద్దుకున్నచో
    తప్పులుజూపనాకెపుడుదక్కుచునుండును సంతసంబిటన్
    దప్పులు జేసియుంజనులు దప్పనిజెప్పిన గ్రోధయుక్తులై
    యుప్పెనవోలె మింటికినినొయ్యనలేతురుగొందరిద్ధరన్

    రిప్లయితొలగించండి
  42. తప్పని సరసము లందున
    చెప్పని యానందమందు చిలిపిగనవ్వన్
    కొప్పునపువ్వులు రాలెడి
    తప్పులు జూపంగముదమె దక్కునునాకున్!

    రిప్లయితొలగించండి


  43. తప్పులు దిద్దుచు గురువులు
    నొప్పుగ సవరించుచుండ నోపిక తోడన్
    తప్పక కలుగును జ్ఞానము
    తప్పులు జూపంగ ముదము దక్కును నాకున్.

    మరొక పూరణ

    తప్పులు చూపితి ననుచును
    తిప్పలు పెట్టక సఖులట తీరుగ మెచ్చన్
    చప్పున వారలు చేసిన
    తప్పులు జూపంగ ముదము దక్కును నాకున్.

    రిప్లయితొలగించండి
  44. గొప్పలకోసమప్పులను కుప్పలు తెప్పలుగా జనాళి చే
    మెప్పును బొంద తాహతుకు మించుచు సేయగ గాంచినంత నే
    జెప్పితి, కూడదంచతడి క్షేమము గోరుచు, వాడొనర్చు నా
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్

    రిప్లయితొలగించండి
  45. చెప్పగ గొప్ప కైతలను చెల్లి కడుంగడు దిట్ట, యెన్నగా
    నొప్పులకుప్ప భావముల, నొద్దికగా వెలయించు, నొజ్జలన్
    మెప్పును బొందు కాని మరి మెల్లన వ్యాకృతిలోన దాన నే
    తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్.

    రిప్లయితొలగించండి
  46. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  47. పరమేశ్వర ఉవాచ :
    కందం
    కొప్పున తడి, శశిరేఖలు
    నిప్పునుదుట, కాట నిల్లు, నీలపు గళుడన్
    దెప్పుల భక్తులు నాలోఁ
    దప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

    రిప్లయితొలగించండి


  48. తప్పులు జేయు ఛాత్రులిల దారిని దప్పుచు మెల్గుచుండగా
    గొప్పగ జూడగా దలచి గుర్వుగ నీతులనెల్ల దెల్పుచున్
    జెప్పుచు మంచి మాటలను జీవన యానము బాగు పర్చగా
    దప్పులు జూప నాకెపుడు దక్కుచు నుండును సంతసం బిటన్!

    రిప్లయితొలగించండి