30, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3148 (చైత్రములోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చైత్రమునఁ గడుపై కనె శ్రావణమున"
(లేదా...)
"చైత్రములోనఁ దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్"
(గంగుల ధర్మరాజు గారికి ధన్యవాదాలతో...)

48 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పత్రిని కోరుచున్ వెడలి ప్రక్కగ నున్నది కాననమ్మునన్
    మిత్రుల తోడుతన్ చనుచు మిక్కిలి ప్రీతిని తెచ్చి పెంచగా
    చిత్రము నొందుచున్ కనగ చిట్టిది పొట్టిది జాగిలమ్మహో
    చైత్రములోనఁ దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్

    రిప్లయితొలగించండి


  2. వచ్చె పుట్టినింటికి తను వరల తల్లి
    చెంత తన కైదవనెలని చేరువగుచు
    చైత్రమునఁ గడుపై, కనె శ్రావణమున
    ముద్దు బిడ్డను తనివార ముదితయేను!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    శత్రువు చెల్లికిన్గలుగు సంతతి చంపెదనంచు నెంతయో
    నాత్రముతో గణించుకొనునప్పుడు కంసుడు మాసపంక్తిలో
    చైత్రములోనఁ దప్పె నెల., జన్మ మొసంగెను శ్రావణంబునన్
    పుత్రునకున్ సహోదరి., యపూర్వనకున్ సుగుణాల రాశికిన్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. బారసాలకు పిలిచితిన్ బంధువులను
    మా గృహమున మా కోడలే మాఘమందు
    చైత్రమునఁ గడుపై కనె, శ్రావణమున
    చేసినాము సీమంతమ్ము వాసిగాను

    రిప్లయితొలగించండి
  5. పేద రైతు అప్పుకై మిత్రుని దగ్గర వేడికోలు...

    ఉత్పలమాల

    చిత్రము మార్గశీర్షమునఁ జిక్కెడు పంటను వాన మ్రింగినే
    మిత్రమ! యేమి జేతు సుత మీదట నింటికి రాగ కాన్పుకై
    చైత్రములోనఁ, దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్
    బత్రము వ్రాసియిత్తు నను బాయఁగఁ గష్టము నప్పు నీయుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాన మ్రింగె' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి


  6. చిత్రము దేవ దేవుని విచిత్రము లన్నియు నాదు కూతురా
    మిత్రుని ప్రేమ లోన పడి మేవడి తోడుగ పెండ్లి యాడి తా
    చైత్రములోనఁ దప్పె నెల, జన్మ మొసంగెను, శ్రావణంబునన్
    సత్రము లోన పుంసవన సంభవ మాడుచు, మార్గశీర్షమున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మిత్రుల తోడనున్ చనుచు మిక్కిలి చక్కని చిత్రశాలలన్
    పుత్రిక పత్రి వారిదిరొ! ముద్దుల గుమ్మ పరీక్షలందునన్
    చైత్రములోనఁ దప్పె నెల;.. జన్మ మొసంగెను శ్రావణంబునన్
    పుత్రునకున్ విలాసమున పుట్టిన యింటికి శోభ గూర్చుచున్

    ఎల = యౌవనముగలది
    పత్రి వారు = నా భార్య పుట్టింటి బంధువులు

    రిప్లయితొలగించండి
  8. (భార్య మిత్రజ - భర్త పద్మనాభం )
    ఛత్రమువోలె నేమరక
    చక్కగ జూచిన ప్రాణవల్లభున్
    పాత్రుని పద్మనాభు నెడ
    బాయుచు నారవ మాసమందునన్
    మిత్రజ పుట్టినింటికిని
    మేలగు కాన్పున కేగుదెంచగా
    చైత్రములోన ; దప్పె నెల ;
    జన్మ మొసంగెను శ్రావణంబునన్ .
    (చైత్రమాసంలో ఆరునెలల గర్భవతి మిత్రజ అమ్మయింటికి
    వచ్చి శ్రావణమాసంలో అమ్మాయికి అమ్మ అయింది )

    రిప్లయితొలగించండి
  9. ముద్దుగుమ్మ మా నల్లావు మొదటిసారి
    చైత్రమున కడుపై గనె శ్రావణమున
    చక్కని శిశువు, తింటిమి చాల జున్ను
    లేగ దూడతో నాడితి రేయి బవలు

    రిప్లయితొలగించండి
  10. కోతి పిల్లలు జతనునే కోరి తెచ్చి

    పెంచి నాడను ,క్రమముగ పెరిగి పెద్ద

    వాయె రెండును కూడెను వాంఛ పెరుగ,

    చైత్రమున కడుపై కనెన్ శ్రావణమున



    కోతి 164 రోజులకు పిల్లలను కంటుంది

    రిప్లయితొలగించండి
  11. సంస్క్రుతమున జెప్పిరి గాదె చక్కగాను
    వరుస నంకెల జదువుము వామగతిని
    శ్రావణముతోడ దొమ్మిది చైత్ర మవదె?
    చైత్రమునఁ గడుపై కనె శ్రావణమున!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      పూరణ పద్యం బాగుంది. అభినందనలు.
      కాని పద్యంలో చెప్పిన లెక్క అర్థం కాలేదు. 'సంస్కృతమున' టైపాటు.

      తొలగించండి
  12. ఆత్రముగా పరీక్షలకు నాకలి దప్పుల నెంచకన్ అహో
    రాత్రు లొనర్చి కష్టమును, వ్రాసిన పేపరు దుర్విపాకమున్
    చైత్రములోనఁ దప్పె, నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్
    పత్రము సప్లిమెంటరిగ భద్రతతో నిక సంతసించగన్౹౹

    రిప్లయితొలగించండి
  13. "అంకానాం వామతో గతిః" అన్నారు కదా గురువర్యా🙏

    రిప్లయితొలగించండి
  14. సంస్కృతమున జెప్పిరి గాదె చక్కగాను
    వరుస నంకెల జదువుము వామగతిని
    శ్రావణముతోడ దొమ్మిది చైత్ర మవదె?
    చైత్రమునఁ గడుపై కనె శ్రావణమున!

    రిప్లయితొలగించండి
  15. శ్రావణనుండి చైత్రము తొమ్మిది. మొండి సమస్యకు తొండి సమాధానం చెప్పాను.
    క్షమారహుణ్ణి.

    రిప్లయితొలగించండి
  16. అమ్మ, నాన్నలనంపి వృధ్ధాశ్రమమ్ము
    తెచ్చుకొంటిగద నొక జాతి శునకమును
    కూర్మి తోడ పెంచిన యట్టి కుక్కరమ్ము
    చైత్రమున కడుపై కనె శ్రావణమున.

    రిప్లయితొలగించండి
  17. పుట్టి నింటి కి చేరెను పొలఁతి తనకు
    చైత్ర ము న కడుపై :కనె శ్రావణ ము న
    జరుగ సీ మం త మామెకు చక్క గాను
    వివిధ వనిత ల మ ధ్యను వేడుకల ర

    రిప్లయితొలగించండి
  18. సహజలిరువురు పుట్టిల్లు చనగ నప్ప
    చైత్రమునఁ గడుపై కనె ; శ్రావణమున
    గడుపయి చెలియలుకనెను, కడుమురిసిరి
    తాత మామ్మలు మనుమల తడవు చుండి

    రిప్లయితొలగించండి
  19. (సరదాగా...)
    మిత్రుడు దెచ్చి యిచ్చెనని మేలుగ పెంచగ పిల్లి నొక్కటిన్
    మూత్ర పురీష గంధముల ముంచెను యింటిని కేమి చెప్పుదున్
    చైత్రములోనఁ దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్
    సత్రము జేసె నా గృహము సంతును నింపెను మూలమూలలన్

    రిప్లయితొలగించండి
  20. మాఘమాసాన కుదిరిన మనువు జరిగె
    చైత్రమున,కడుపై కనె శ్రావణ మున
    మూడు వత్సరాల పిదప ముచ్చట గను
    సంబర మది వెల్లివిరిసె సదన నందు

    రిప్లయితొలగించండి
  21. పుత్రికకు పెండ్లి జేయగ ముదముతోడ
    చైత్రమునఁ, గడుపై కనె శ్రావణమున
    గడచ చక్కగ రెండేండ్ల కాపురమ్ము
    తల్లిదండ్రులు కనుగొని తనివి పొంద

    రిప్లయితొలగించండి
  22. ఆశ్వయుజ పంచమది మంచిదౌత జేత
    పెళ్ళి యొనరించి బనిచిరి పిల్ల నపుడు
    తల్లి వారింటి కేగగ దౌహృదమున
    చైత్రమునఁ గడుపై, కనె శ్రావణమున!

    దౌహృదము-వేవిళ్లు

    రిప్లయితొలగించండి
  23. గ్రీష్మము వసంతములను గుక్షి నిడి నీరు
    నెలఁత వర్షర్తువున మఱి నిండ నెలలు
    నభము తల్లి భూతలమున విభవ మొప్పఁ
    జైత్రమునఁ గడుపై కనె శ్రావణమున


    సూత్రము కట్టి యయ్యెఁ గద చూచుచు నుండఁగ నేండ్లు నాఱు తా
    నాత్రము సెందు చుండ మది నంబను గొల్చుచు భక్తి మీఱఁగా
    గాత్రము నెండఁ గట్టుచును, గార్తిక మాసము నందు మ్రొక్కఁగాఁ
    జైత్రములోనఁ, దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్

    [చైత్రము = గుడి]

    రిప్లయితొలగించండి
  24. పుత్రిక పెండ్లి వేడుకగ భూసుర నిశ్చిత లగ్నమందునన్
    మిత్రుల బంధులన్ బిలిచి మేలగు రీతి నొనర్ప వారలా
    చైత్రములోనఁ; దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్
    పౌత్రుని పొందిరంత మరు వత్సరమందున పొంగి పోవుచున్

    రిప్లయితొలగించండి
  25. ఆధునికతగా భావించి యాలుమగలు
    పుట్టు పసిబిడ్డ ఎవరని పుట్టు కెరిగి
    శ్రావణమ్ముల చేసెడి శస్త్ర మరసి
    చైత్రమున గడు పై కనె శ్రావణమున
    కొరుప్రోలు రాధాకృష్ణారావు



    రిప్లయితొలగించండి
  26. పెండ్లిజరిగెనుమంగకు పెంపుమీర
    గర్భవతియామెసోదరిగంగయపుడు
    క్రమముగామంగ గంగల కలలుపండ
    చైత్రమునఁ గడుపై, కనె శ్రావణమున

    రిప్లయితొలగించండి
  27. తే.గీ.
    వయసు వృద్ధిన యిసుమంత వాడి లేని
    బుధ్ధి మాంద్యము తోడైన బుడుత డుండ
    చైత్రమున గడుపై కనె శ్రావణమున
    యనెడి లోకోక్తి లోకాన వ్యాపి చెందె

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. చిత్రము దైవనిర్ణయము చిక్కులుగూర్చును చింతదీర్చు నే
    యాత్రములేక తండ్రి తన యాత్మజ లిర్వురి పెండ్లిజేయగన్
    చైత్రములెన్నియోగడచె చానల కిర్వురికిన్ క్రమంబుగా
    చైత్రములోనఁ దప్పె నెల, జన్మ మొసంగెను శ్రావణంబునన్

    రిప్లయితొలగించండి
  29. తేటగీతి
    కృష్ణ జననమ్ము కంసున కెఱుక పఱచు
    మాయ యెంచ యశోదను మాతఁజేయ
    ఆరుమాసముల్ దాటెడు తీరునటుల
    చైత్రమునఁ, కడుపై, కనె శ్రావణమున

    రిప్లయితొలగించండి
  30. ఉత్పలమాల
    మిన్నగ మెచ్చిరేని ప్రజ మేదిని వానిని గర్వకారణం
    బెన్నుచుఁ బ్రాంతమున్ గులము నేర్పడఁ జెప్పరె సొంతవాడనన్
    మున్నును పోతనన్ గనిరె పోరుచు బమ్మెర నొంటిమిట్టలన్
    నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్

    రిప్లయితొలగించండి