18, మార్చి 2020, బుధవారం

సమస్య - 3313 (కవితాకన్యక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"
(లేదా...)
"కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

95 కామెంట్‌లు:

Akula shanthi bhushan చెప్పారు...

వివరింప నిటులడిగితివ
"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"
కవిపుంగవులకెపుడు నీ
కవితా కన్యక యనుజయె!కాదనుటేలన్??

Akula shanthi bhushan చెప్పారు...

ఇదీ ఒక పూరణేనా....????☺️☺️☺️😊😊😊😊😢😢😢😢

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


నడిరేయి సరదా పూరణ:
(కంది శంకరయ్య గారికి అంకితం)

కవనంబందున నారితేఱి బలుపౌ కావ్యమ్ములన్ వ్రాయకే
భువనంబందున నొక్కడై కవులనున్ పుట్టించి పాలించుచున్
భవనమ్ముల్ విడి శంకరాభరణమే వాసమ్ముగా నొప్పగా
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

స్వగతం:

చవిలేనట్టిది బంగభూమిజనుచున్ సంపూర్తిగా వీడుచున్
ప్రవరాఖ్యుండు వరూథినిన్ కథలనున్ బంగారు భాషందునన్...
కవివర్యుండగు శంకరున్ కరుణతో కాట్లాడి పోట్లాడెడిన్
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(ఒక అభిమాని శృంగారశాకుంతలం,జైమినిభారతం రచించిన పినవీరభద్రమహాకవిని
"కవితాకన్యక మీచెల్లెలా?"అని ప్రశ్నించాడు.పినవీరన తల అడ్డంగా తిప్పాడు."అయితే మీయిల్లాలా?
అన్నాడు అభిమాని.మహాకవి సరససమాధానం చెప్పాడు.)
"కవితాకన్యక నీకు నాడపడుచా?
కాకున్న నిల్లాలొకో?"
నవతల్ జిందెడి ప్రశ్న వేయ నొక వి
న్నాణంపు విద్వాంసుడే;
కవనార్థం బుదయించినట్టి ఘనుడౌ
గాంభీర్యు వీరన్ననిన్;
కవివర్యుండనె వాణియే తనకు సం
క్రాంతంపు వాగ్రాజ్ఞిగా.

Akula shanthi bhushan చెప్పారు...

శంకరాభరణం......18/03/2020
బుధవారం

సమస్య. : 
**** ****

"కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

నా పూరణ :: మత్తేభవిక్రీడితం
**** ***** ***** ***** ***** ****

భువినన్ దార మదిన్ గ్రహించి మెలగన్ బోరామి యెట్లవ్వునో

కవితల్ రాయగ నాకు నెప్పుడు గడున్ గష్టమ్మె యట్లవ్వుగా

వివరింతున్ గద! కావ్యకన్య సతిగన్ బేర్కొందు నువ్విట్లనన్....

"కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"


(పోరామి అనగా సంకటము)

🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷

Zilebi చెప్పారు...



కవిరాట్ కందివరార్యా
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో
తవణించెడు రీతి భళి వి
డువకనరె యనుదిన మడుగడుగు దండాలే !


జిలేబి

Zilebi చెప్పారు...



చవులూరించెడు రీతి కైపదములే జవ్వాదులద్దుళ్ళతో
డవిరామమ్ముగ శంకరాభరణ మందాడంబరంబాయెనే
కవిరాట్ కందివరార్య! తీఱుగడయే కాన్పట్టదే సేవలో
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?



శుభాకాంక్షలతో
జాల్రా
జిలేబి

Sitharamayya Solasa చెప్పారు...

కవియై యుండియు గూడను
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?
వివరమడుగ నెందులకో !
కవితను కన్యయన పెండ్లి గాలేదనిగా!

purushothamarao ravela చెప్పారు...

నవరసములు జిందించుచు
కవనములో కమ్మనైన కారణమవగా
భువనమనోహరితానే
కవితాకన్యకయనుజయొకాకగృహిణియో

+++++++++++++++++
రావెలపురుషోత్తమరావు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

భువనము నందున జూడగ
*కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*
నవబో దెప్పుడు వినుమా
కవులకు కావ్యంబు నిజము కమ్మని సుతయే

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

నవవాసంతవనాంతరస్థిత లతాంతశ్రీల సౌందర్యమా...
ర్దవశోభాకలితమ్ము సత్కవనమార్యా! ధీరతన్ ధీ మహా...
ర్ణవమంథానమునన్ జనించు సుధ! పిల్వన్ నిశ్శ్రమన్ జేరునే?
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కాదన గలమా?" అంటే బాగుంటుందేమో?

కంది శంకరయ్య చెప్పారు...

నాకైతే ఆడపడుచే. 'వాణి నా రాణి' అనే అధికారం, సాహసం నాకు లేవు మిత్రమా!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
'భాష+అందు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "బంగారపుం భాషలో" అందాం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'వీరన్ననున్/వీరన్ననే' అంటే బాగుంటుందేమో?

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

నా పూరణ ప్రయత్నం 🙏🙏

*"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*

*కం||*
అవలీలగ పద్యమ్ములు
అవలీలగ కవితలనిన యనుజయె యగునే
కవివర్యులు కష్ట పడగ
*"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అవ్వు' అనడం సాధువు కాదు. "...యెట్లైన నా కవితల్... యట్లైనచో...నీవిట్లనన్" అనండి.

విరించి చెప్పారు...

కవిభావాంబుధి లోను
ద్భవించి నందంతిగా బుధానుని కయ్యెన్
గవనమె, గ్రహీతకున్ గన
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది (అని అనకుండా చస్తానా?). అభినందనలు. __/\__

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంతకు ముందే చెప్పాను ప్రభాకర శాస్త్రి గారితో... "కవితాకన్యక నాకు ఆడపడుచు" అని.

కంది శంకరయ్య చెప్పారు...

మంచి పట్టే పట్టారు. ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

😊🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

BULUSU V S MURTY చెప్పారు...

భువిలో కవులకు యెపుడున్
అవిరళముగ కవితలల్లు నాశయె కానీ
యెవరును యోచింప రెపుడు
కవితా కన్యక యనుజయొ కాక గృహిెెణియో

Zilebi చెప్పారు...



బ్లాగ్లోకంలో పేరడీ కింగ్ బండి వారి సొబగు గానములు


జవరాలా బండి వరుల
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో
చవులూరు పేరడి వరుస
జవగట్టుచు వచ్చు వారి శర్కరి లోనన్


జిలేబి

శ్రీహర్ష చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీహర్ష చెప్పారు...

అవతారంబని కొల్తువామెనొకచో నందించుచున్ కీర్తులన్
వ్యవధానమ్మది సుంత లేక కవి! నీవందింతువా నిందలన్
వివరింపన్ దగు నీదు తత్వమును వైవిధ్యమ్ముగన్ దోచెడిన్
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*...కవులను నెప్పుడు । నవిరళముగ..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంతకూ ఈ బండివా రెవరు?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కవనము నారాధించె డు
కవి కేనాడును కలుగవు గజిబిజి తలపు ల్
వివరింపుడు మీర లిపుడు
కవితా కన్యక యనుజ యొ కాక గృహిణి యో?

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

శతాధిక వందనములు శంకరార్యా 🙏🙇🙏

కవితా ప్రసాద్ చెప్పారు...

కవితాప్రసాదు నడుగం
గవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?
సవినయము నుడివెద వినుడ
య!వెలది మాకాడుపడుచె యగు నిశ్శంకన్!

కంజర్ల రామాచార్య. చెప్పారు...

నవలావణ్యరసప్రసారమధువిన్న్యాసార్థశబ్దస్ఫుర
ద్వివిధోక్తిశ్రుతిమాధురీభరితయై వేనోళ్ళఁ గీర్తిం గనన్
గవితాకోమలి నీ యనుంగు సుతయౌ, కాదట్టులం దల్చ నా
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.

కవితా ప్రసాద్ చెప్పారు...

కవితాకన్య యొకింటి యాడుపడుచా? కాకున్న నిల్లాల? లే
క వశంబందున నుండు వారవధువా? కాదెట్టులన్! పూర్వ సం
భవమందుంగల పుణ్యలేశమున సంప్రాప్తించునే కాని మా
నవు డెన్నేవిధముల్ దపించినను జెంతం జేరదొక్కింతయున్!

- కీ.శే. మద్దులపల్లి కవి.

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మరో పూరణ 🌹🌹

*కం||*

అవలీలగనడిగితిరే
కవివర్యా మీరిచటను ఖంగు తినగనే
నెవరైనా తెలుపగలర
*"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏🌸🙏

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మరో పూరణ 🌹🌹🌹

*కం||*

కవులకు కొంపను ముంచగ
వివరము తెలిసియు నడిగిరి విపరీతమిదే
నెవరు తెలుపగలరునిలను
*"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*

🙏😊🙏😊🙏

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
"కవితాకన్యక నీకు నాడపడుచా?
కాకున్న నిల్లాలొకో?"

సందర్భము: ఓ కవీ! (వాల్మీకి మహర్షీ!) నీవు రామాయణం రామున కంకితం చేసినపుడే కవిత నీ కూతు రని తెలిసిపోయింది. అదే మంచి భావన అనిపిస్తున్నది. మళ్ళీ ఇలా ప్రశ్నించడం దేనికో! (ఇలాంటి ప్రశ్న ఎలా తలెత్తుతూ వున్నదో!) "కవితా కన్యక ఆడపడుచా! ఇల్లాలా!.." అనేది..
~~~~~~~~~~~~~~~~~~~~~~~

*రాముడే వరుడు*

రవి వంశాగ్రణి రామచంద్రునకు నీ
రామాయణం బిచ్చినా..
వవు, నప్డే తెలిసెన్ గవీ! కవిత నీ
కౌ పుత్రికా రత్న మం
చు.. వరిష్ఠం బగు నీ తలంపె యని తో
చున్.. బ్రశ్న యి ట్లేలనో!...
"కవితా కన్యక నీకు నాడపడుచా?
కాకున్న నిల్లా లొకో?"

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
18.03.20
-----------------------------------------------------------

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
శ్రవణీయమ్ముగ జదువన్
కవనమ్మును రంగరించి కవి కన సుతయౌ!
యవివేకమా! యెటులనౌ
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?

మత్తేభవిక్రీడితము
దివిలో శారద దీవెనల్ బనుపఁ జిందించంగ భావాబ్ధిలో
కవితావేశము రూపమై మెరయు సత్కావ్యమ్ము నందంతియౌ
శ్రవణీయమ్మది కాదుకాదొకొ! వినన్ చాలించు ప్రశ్నించుటల్
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

[ఒక సుకవి, యతని నాదరించిన రాజు మాటలాడుకొనుచున్న సందర్భము]

"నవనీతాంచితవాక్కులన్ బిలిచితే నన్ "దండ్రి" యం చిట్లు? నా
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"
"భవదీయాదరతాప్తిచేఁ బిలిచితిన్! భావ్యంబు కాదా కవీ?

నవలావణ్యకవిత్వకన్యనొసఁగన్ నా కద్ది "యిల్లా" లగున్!"

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్దులపల్లి వారి పద్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

కుసుమ ఉప్పలపాటి చెప్పారు...

కవనము మేధో జనితము
కవులకు మానస సుతయెగ కాదన గలమే ?
భువిలో పోలదు నన్యము
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"తెలుపగల రిలలో" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?
వివరంబీయ మనస్సు భావభరి తావేశంబు పద్యంబుగా
కవికిన్ బుట్టును గాన పుత్రికయె, బాగా యెంచి చూడంగ నా
కవనంబంకిత మొందు పుంగవుడు నాకల్లుండు కాదే యిలన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బాగా' అనడం వ్యావహారికం. "పుత్రికయె కాదా యెంచి చూడంగ..." అందామా?

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

గురువుగారూ, కాదా అంటే యతి సరిపోదు కాదండి. కాగా అంటాను పోనీ. ఏమంటారు?

vsnmhari చెప్పారు...

జవముం బూనుచు పృచ్ఛకాళి యెదుటన్ శక్తిన్ బ్రదర్శించుచున్
కవనక్రీడను జేయువాని సుమహత్కౌశల్యమున్ మెచ్చి యా
యవధానిన్ గని యొక్క డిట్టులనియెన్ హర్షాతి రేకమ్మునన్
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!

chandrashekhar yelisetty చెప్పారు...

కం.

అవిరామముగా వచ్చెడి
కవితా ధోరణి యనుజయె గదరా నెపుడున్
యువతులు నివ్విధి వచ్చునె?
కవితా కన్యక యనుజయొ కాక గృహిణియో

వై. చంద్రశేఖర్

chandrashekhar yelisetty చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
chandrashekhar yelisetty చెప్పారు...

కం.

అవగతమగు సరళముగను
కవితా కన్యక యనుజయొ కాక గృహిణియో
నవిరామముగా వచ్చెడి
కవితా ధోరిణి యనుజయె గదరా నెపుడున్

వై. చంద్రశేఖర్

subbarao చెప్పారు...

కవివర!పాడియెయిటులన
కవితాకన్యకయనుజయొకాకగృహిణియో
వివరణయిత్తునువినుమా
కవితాకన్యకయనుజయెకవులకునెపుడున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పవలున్ రేయియుఁ బలుమా
ర్లు వచ్చు ముచ్చటలకై సరోజదళాక్షా
వివరం బిమ్మిఁక నీ కీ,
కవితా! కన్యక యనుజయొ? కాక గృహిణియో?

[గృహిణియో = చూడ వచ్చిన యొక గృహిణియో]


అవనీ క్షేత్రము నందు వింతలకు వింతా యేమి వీక్షించఁగన్
సవతుల్ రారె తలంచ సీతకును నాశ్చర్యంబు నీ కేల మీ
కు వయోభేదము గాంచ సందియము నాకుం గల్గెఁ జిత్తమ్మునం
గవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో

[కవితాకన్యక = కవిత యను కన్య; ఆడపడుచు = కూతురు]

కంది శంకరయ్య చెప్పారు...

"పుత్రికయె యౌగా.." అంటే సరి!

కంది శంకరయ్య చెప్పారు...

అద్భుతమైన పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...గదరా యెపుడున్... నివ్విధి వత్తురె" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గృహిణియో యవిరామముగా..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

తాతా రవి కిరణ్ శర్మ చెప్పారు...

భవతాపార్తి హరా శివా నిఖిల గోపాలా మదిన్ నీదు ప్రా
భవముల్ మూర్తి విశేషముల్ సొబగులున్ భావించి పారమ్యమౌ
కవనంబున్ రచియించితిన్ సుకరమున్ గావింప సందిగ్ధమే
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో

chandrashekhar yelisetty చెప్పారు...

ధన్యవాదాలు

విరించి చెప్పారు...

కవిభావాంబుధి లోనపుట్టు గదరా కావ్యంబు తత్పుత్రికై
కవనమ్మున్ బఠియించు వారికది వాగ్దాయిస్వరూపమ్మెయౌ
నవనీశా! కవివర్యుడంకితము నీకందింపగా, తెల్పుమా
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

అస్తు!

subbarao చెప్పారు...

కవిరోచెప్పుమ,యిప్పుడేయిడునునాకత్యంతమోదంబునున్
కవితాకన్యకనీకునాడపడుచా!కాకున్ననిల్లాలొకో
కవితాకన్యకనీకునాడపడుచే,కాదన్నయాప్రశ్నయే
యవనింబుట్టదునేర్వుమాయికనునాహాయండ్రుగాదేప్రజల్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కవితాననుకొనదగునా
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"
ధవళాంగితానె స్వయముగ
కవి కవన వనమునఁ గురియు కవితాఝరియే!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

A.Satyanarayana Reddy చెప్పారు...

చవి గొంచున్ చదువన్ లభించు మతి, భాషాలక్ష్మియూతమ్ముతో
కవితల్ వ్రాయు సుశక్తి కూడుకొను నిక్కమ్మౌగతిన్ మిత్రమా!
వ్యవసాయమ్మును చేయకుండ కలుగన్ పాండిత్యమీ ధాత్రిపై
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో ?

seethadevi gurram చెప్పారు...

కవితో మిత్రుడు

నవనీతంబగు రీతినిన్ కవితలన్ నాణ్యంబుగా నల్లుచున్
అవిరామంబుగ సల్పుచుందువుగదా యష్టావధానంబులన్
తనివిన్ బొందక నింతగా పొదవగా తాత్పర్యమేమౌనహో!
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

Sistla Sharma చెప్పారు...

నవ హేలా రస రంజిత ప్రకటవి
న్యాసంబులం దూగుచున్
రవళించున్గద కావ్య రాగ సుధ వి
భ్రాజ ప్రభాలోకమున్
తవ భావోక్త ప్రయుక్త రాగ ఝరితో ద్భావంబులన్నోకవీ!
కవితా కన్యక నీకు నాడ పడుచా?!
కాకున్న నిల్లాలొకో!

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కవివా?కావ్యములెన్ని వ్రాసితివి?యే గ్రంధంబులన్ జూచితో?
భువనంబందుననెందునేగితివొ?యేభూనాధుఁ డేమిచ్చెనో?
కవినేనంచును విర్రవీగెదవుపాఖండా! తగన్జెప్పుమా
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

seethadevi gurram చెప్పారు...

కవిచే సృజియింపబడిన
కవితాకన్యక,యనుజయో కాక గృహిణియో?
వివరమ్మారయ కవికిన్
నవజాత శిశువు సతియగు గృతిపతికిన్

seethadevi gurram చెప్పారు...

సతియగు నాకృతిపతికిన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కాదన్న నాప్రశ్నయే" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినంలనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
"కవితాకన్యక నీకు నాడపడుచా?
కాకున్న నిల్లాలొకో?"

సందర్భము:
సర్వాలంకారయుక్తాం సరళ పదయుతాం
సాధువృత్తాం సువర్ణాం
సద్భిస్సంస్తూయమానాం సరసగుణయుతాం
లక్షితాం లక్షణాఢ్యామ్
ఉద్యద్భూషా విశేషా ముపగత వినయాం
ద్యోతమా నార్థ రేఖాం
కళ్యాణీం దేవ! గౌరీప్రియ! మమ కవితా
కన్యకాం త్వం గృహాణ
(ఆది శంకరుల శివానందలహరి)
ఓ ఆదిశంకరా! నీ కవితను శివునకు సమర్పించుకున్నావు. (గౌరీప్రియ! మమ కవితా కన్యకాం త్వం గృహాణ..అంటూ..)
ఆనాడే కవిత నీ కూతు రయింది. ఇవాళ కంది శంకరులు ప్రశ్నిస్తున్నారు. "కవితా కన్యక నీకు ఆడపడుచా! ఇల్లాలా!.." అని
(ఏం జవాబు చెబుతావో! చెప్పుకో!.. నీ యిష్టం..)
మొత్తానికి కవితను కూతురుగా భావించడ మనేది ఆది శంకరుల కాలంనుంచి వస్తున్నట్టు తెలుస్తున్నది. పై శ్లోకంలో కవితా పరంగానూ కన్య పరంగానూ రెండర్థా లున్నవి. ఉదా.. సర్వ అలంకార యుక్తాం=అన్ని అలంకారాలతో కూడినదానిని (కవితా పరంగా సాహిత్యంలోని ఉపమాది అలంకారాలు.. కన్యపరంగా అన్ని రకాలుగా లేపనాదులతో అలంకరించుకొన్న దానిని) అట్లే తక్కినవీ..
ప్రామాణికమైన వివరణలకై శ్రీ సూరం శ్రీనివాసులు గారి శివానందలహరీ.. (జ్యోతిష్మతీనామ వ్యాకరణాంశోల్లిఖిత వివృతి మహితా) పుస్తకాన్ని చూడవచ్చు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~

*ఆది కంది శంకరులు*

శివునిన్ బెండ్లి కుమారుఁ జేసి కవితన్
శ్రేయంబుగా నిచ్చినా..
వవు.. నవ్వేళనె యాదిశంకర కవీ!
ఆ కైత నీ కూతు ర
య్యె.. వరిష్ఠం బదె! కంది శంకరులు ని
న్నివ్వేళఁ బ్రశ్నించెడిన్..
"కవితా కన్యక నీకు నాడపడుచా?
కాకున్న నిల్లా లొకో?"

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
18.03.20
-----------------------------------------------------------

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

విరించి చెప్పారు...

యువకుడుపాధ్యాయుండగు
రవితో సతతము తిరుగెడి రమణి యెవతియో
వివరించి శంక తీర్చుమ
కవితా! కన్యక యనుజయొ? కాక గృహిణియో?