27, డిసెంబర్ 2021, సోమవారం

సమస్య - 3944

28-12-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రాశ్నికుఁ డవధానినిఁ గని పక్కున నవ్వెన్”
(లేదా...)
“ప్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్”

49 కామెంట్‌లు:

  1. కాశ్నిగపందెముమీతో
    వేశ్నిగపాచికతడబడవేదనతీరన్
    చూశ్నిగఖేదముననుచును
    ప్రాశ్నికుడవధానినిగనిఫక్కుననవ్వెన్

    రిప్లయితొలగించండి

  2. ప్రశ్నింపగ తడబడెనా
    ప్రాశ్నికు డవధానిని గని, పక్కున నవ్వెన్
    ప్రాశ్నికుని ముఖము గనుచును
    ప్రాశ్నికవర్గంబు వెకిలి ప్రశ్నలటంచున్.

    రిప్లయితొలగించండి
  3. ప్రాశ్నికుఁల కొరత చేతను,
    ప్రాశ్నికుఁడుగ నతితులవకు పట్టము గట్టన్
    ప్రాశ్నికు "శ్ని" ప్రాసకు బెదర
    ప్రాశ్నికుఁడవధానినిఁ గని పక్కున నవ్వెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రాశ్నికుడుగ నొక తులువకు...' అనండి.

      తొలగించండి
  4. కందం
    ప్రశ్ననిడెను నప్రస్తుత
    ప్రాశ్నికుడు ,తడబడి చెప్పె భావము లేకన్
    ప్రశ్న కిడిన వివరణ గని
    ప్రాశ్నికుడవధానిని గని పక్కున నవ్వెన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి

  5. ప్రశ్నలు వేయవచ్చితివి పాటవ మెంతయొ కల్గినట్టి మీ
    ప్రశ్నల కిప్డు చెప్పెదను పద్యము మెండుగ హాస్యమొప్పగన్
    ప్రాశ్నిక యాలకింపుమని పండితుడైన వధాని చెప్పగన్
    ప్రాశ్నికుడా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చిరెల్లరున్.

    రిప్లయితొలగించండి
  6. ప్రశ్నను వేసిన నొకనికి
    ప్రశ్నకు దగినట్టి విధపు భావము రాకన్
    ప్రశ్న నొసంగిన వాడగు
    ప్రాశ్నికు డవ థానిని గని పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  7. ఉత్పలమాల:
    ప్రశ్నను 'వేయుచుంటి'నిదె బాగుగ యోచన చేయుడంచు నా
    ప్రాశ్నికు డెత్తగా కరము, పండితుడడ్డుగ 'డాలు' పెట్ట నా
    “ప్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్”
    ప్రశ్నలవెంత కత్తులయి వాడిగ నున్న సభా వినోదమే
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  8. ప్రశ్నలు సంధింప దలచి
    ప్రాశ్నికుడేతెంచె సభకు ప్రశ్నావళితో
    ప్రశ్నించగ వలనుపడక
    ప్రాశ్నికుఁ డవధానినిఁ గని పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  9. ప్రశ్నలు వేయగ వచ్చిన
    ప్రాశ్నికుఁ డవధానినిఁ గని పక్కున నవ్వెన్
    పృశ్నిగ నుండుట గాంచగ ,
    ప్రశ్నల తోడ భయపెట్ట వలదని వెడలెన్

    పృశ్ని = బక్కవాడు

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    ప్రశ్నగ నిచ్చిన ప్రశ్నను
    ప్రశ్నించుచు తగువిధముగ పద్యములో నా
    ప్రశ్నకు జవాబు చెప్పగ
    ప్రాశ్నికుడవధానినిగనిఫక్కుననవ్వెన్.

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    ప్రశ్నగ నిచ్చినట్టిదగు ప్రశ్నను పూర్తిగ చెప్పగోరి తా
    ప్రశ్నను వేసినాతనికి పద్యమునందున చక్కనౌ నటుల్
    ప్రశ్నకు దగ్గ నుత్తరము పంతుగ నిచ్చి ప్రకాశమొందగన్
    ప్రాశ్నికుడా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చిరెల్లరున్.

    రిప్లయితొలగించండి
  12. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    ప్రశ్నను చిక్కుగ నడగగ
    ప్రశ్నకు జాబు న్నొసగగ ప్రశ్నల తోడన్
    ప్రశ్నార్థకమై తోచగ
    ప్రాశ్నికుడవధానినిగనిఫక్కుననవ్వెన్.

    రిప్లయితొలగించండి
  13. ప్రశ్నలుకొల్లలుకొల్లలు
    ప్రశ్నార్ధకమాయె బ్రతుకు బరువుగ సాగెన్
    ప్రశ్నలవలలో చిక్కిన
    ప్రాశ్నికుఁ డవధానినిఁ గని పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. కందం
      ప్రశ్నగ సమస్య నిచ్చియుఁ
      బ్రశ్నను లేని ద్రుతసంధి ప్రత్యుక్తిఁ గనన్
      బ్రశ్నకుఁ జింతించు బదులు
      బ్రాశ్నికుఁ డవధానినిఁ గని పక్కున నవ్వెన్!

      ఉత్పలమాల
      ప్రశ్న యనన్ సమస్య నిడి పాటిగఁ బూరణ వ్రాసుకొంచుఁ దాఁ
      బ్రశ్నను సంధిగన్ ద్రుతము వల్కని లోపము సక్కఁ జేయుచున్
      ప్రశ్నను పాదపూరణగ రంజిలఁ జెప్పగ నాల్క నొక్కుచున్
      బ్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్!

      తొలగించండి
    2. మీ రెండు సమస్యలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. ప్రశ్నను వేయ పేరుఁ గల పండితు డాస్థ వధానమందునన్
    ప్రశ్నమునందునున్న పరిపాకము గాంచి వధాని యిచ్చతో
    ప్రాశ్నికు మెచ్చి హాస్యమునుఁ బన్నుగ నించుచు చేయ పూరణన్
    ప్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  16. ప్రశ్నలకాలవాలమది ప్రాజ్ఞలు గూడిన వాసమేయదిన్
    ఈ 'శ్న' తొగూడినట్టి ఘన మెయ్యదటంచును ప్రాసవేయగన్
    ప్రశ్నల వేసినంత సరి రాగము దీసెను వేగిరమ్ముగా
    ప్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్!

    రిప్లయితొలగించండి
  17. ప్రశ్నలలో నతి కష్టపుఁ
    బ్రశ్నం బప్రస్తుతమ్ము పన్నుగ నా ప్ర
    శ్నాశ్ని కిడ హాస్యపు బదులు
    ప్రాశ్నికుఁ డవధానినిఁ గని పక్కున నవ్వెన్

    [అశ్ని = తినువాఁడు]


    పృశ్ని నికాయ గర్భు ఘన కృత్య కదంబక వర్ణ నార్థమై
    ప్రశ్నము వేయ నల్లు మని పద్యము నొక్కటి వర్ష కాల కా
    లాశ్న గభీర శబ్దముల నప్పు డవాక్కుఁడు గాఁగఁ దన్మహా
    ప్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్

    [అశ్నము = మేఘము]

    రిప్లయితొలగించండి
  18. ప్రశ్నకు బదులుగ తికమక
    ప్రశ్నల నెన్నియొ వధాని వడివడి యడుగన్
    బ్రశ్నార్థక మగు ముఖమున
    ప్రాశ్నికు డవధానిని గని పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  19. ప్రశ్నకు జవాబు లేమిని
    ప్రాశ్నికుడవధానిని గని పక్కున నవ్వెన్
    ప్రశ్నలు గటువుగ నుండును
    ప్రాశ్నికు సంధించునట్టి ప్రశ్నపరంపల్

    రిప్లయితొలగించండి
  20. ప్రశ్నకు సూటిగా గలుగు భావము మంచిగ జెప్పలేమిచే
    ప్రాశ్నికుడవధాని గని పక్కున నవ్వెను మెచ్చిరెల్లరున్
    ప్రశ్నలు వేయువారలట పండితవర్గము జెందువారులై
    ప్రశ్నలు తిక్కగా నొనరు వట్టున నీయగ జింతజేతురే

    రిప్లయితొలగించండి
  21. ప్రశ్నలు వేయు పృచ్ఛకుల ప్రశ్నల
    కున్నవధాని నేర్పుతో
    ప్రశ్నలు వేయువారలు బ్రభావిత
    మొందగ నుత్తరంబు తా
    పశ్నల కిచ్చెహాస్యముగ ప్రాశ్నికు
    డడ్గిన హాస్య పృచ్ఛకున్
    ప్రాశ్నికు డాయవధాని గని పక్కున
    నవ్వెను మెచ్చిరందరున్

    రిప్లయితొలగించండి
  22. ప్రశ్నపరంపరల్ మదిని బాయక వేసట గూర్చుచుండ సం
    ప్రశ్నముగూడ నోచని యభాగ్యుడు తానవధాని, యైననున్
    ప్రాశ్నికు మొప్పుపొంద తన ప్రజ్ఞనుచూపి చెలంగునంతనా
    ప్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  23. ప్రశ్నలవెట్టివైన దన ప్రజ్ఞను జూపి వధాని మేలుగా
    ప్రాశ్నికులద్భుతంబనగ పద్యములల్లుచు సాగుచుండనో
    ప్రశ్నగ భార్య యెవ్వరన భాషకు జిక్కని భావమౌననన్
    ప్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి