18, మే 2022, బుధవారం

సమస్య - 4084

19-5-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె”
(లేదా...)
“భరతుని యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్”

18 కామెంట్‌లు:

  1. వరముల కోరి కైక వనవాసము పంపగనెంచ రామునిన్
    ధరణిని కూలభూవిభుడు తారక రాముని వీడలేక తాన్
    స్థిరమగు మానసమ్మునను, తెల్పగ పిన్నియె పాలనంపు సం
    భరతుని యాజ్ఞనంది, వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

    రిప్లయితొలగించండి
  2. కైకబిడ్డడుగాగనుఘనతతోడ
    తప్పుఁజేసెగతనదైనతల్లివలన
    మదినితెలిసినభావంబుమాటునుండి
    భరతుడంపగరాముఁడువనికినేగె

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    తల్లి కైకమ్మ వరములఁ దండ్రినడిగి
    పట్టమందెడు రామునిఁ బ్రక్కనుంచి
    కన్న కొడుకన్న ప్రేమతో గద్దెనెక్క
    భరతుఁ, డంపఁగ రాముడు వనికినేగె!

    చంపకమాల
    మురిపెము మీర పెంచియు ప్రమోదము రామునికందఁ గైక,మ
    త్సర ముసిగొల్ప మంధర వితర్కములాడి వరమ్ములెంచియున్
    బెరపెరలాడి తండ్రితలపించెనటంచనఁ గాంచ రాజుగన్
    భరతుని, యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

    రిప్లయితొలగించండి
  4. ( రాముడు, భరతుడు అన్నదమ్ములు )

    అన్నదమ్ములాడిన జూదమందు భరతు
    జేత నోడిన రాముడు సిగ్గు పడుచు
    నందరు జనుల వీడి వెడలె , నా విధముగ
    భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె

    రిప్లయితొలగించండి
  5. నిరతమురామునాజ్ఞగొని నిర్మలవృత్తినిమానసంబుతో
    విరసములాడతావెఱచువిజ్ఞుడునాయెగకైకపుత్రుడై
    కరమునుదోషభావమునగాసిలిశీర్షముపాదుకుంచునా
    భరతునియాజ్ఞనందివనవాసమొనర్చెనురాముడింతితో

    రిప్లయితొలగించండి
  6. మరలి రమ్మని కోరెను మరులు తోడ
    పాదుకల నిచ్చి పాలింప పంపె నతడు
    భరతు డం పగ రాముడు వనికి నేగె
    ధర్మ రక్షణ జేసియు ధాత్రి గావ

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండు వరములుఁగోరగా రేనినంత
      కైకయీదేవి మాటలు కాదనక,వి
      వశుఁడయి భువినిఁగూలిన దశరథుఁడశు
      భ,రతుఁడంపగ రాముఁడు వనికి నేగె.

      తొలగించండి

  8. గురువులను గౌరవింపని కూళు డొకడు
    చదువులన్నను పట్టని చవట గాన
    వ్రాసెను పరీక్ష యందు జవాబు నిటుల
    భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె


    పరవడి తోడ చెప్పిరట పావన మైన చరిత్రలెన్నియో

    గురువులు, లాభమేమి యొక కుఱ్ఱడు చెప్పిన పాఠమెల్ల తా

    మరిచి పరీక్షయందిటుల మందుడు వ్రాసెను గాంచు మయ్యదిన్

    భరతుని యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    కఠిన మనముతో కోరెను కైక రెండు
    వరములను రామునికి వనవాసము పదు
    నాలుగేండ్లని ,రాజ్యపు పాలన యది
    భరతు ,డంపగ రాముడు వనికి నేగె.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  10. వరములు రెండు కోరినది భామిని కైకయె;రామచంద్రుఁడున్
    పురమును వీడి కానలకు పోవలె,పట్టముఁగట్టగావలెన్
    భరతుని కంచు, మ్రాన్పడిన పార్థివునిం,దన తండ్రినిన్ ,స్వలా
    భ,రతుని యాజ్ఞ నంది వనవాసమొనర్చెను రాముడింతితోన్.

    రిప్లయితొలగించండి
  11. కైక పంపెను రాముని కాఱడవికి
    భరత పట్టాభిషిక్తపు వాంఛతోడ!
    'భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె'
    ననుచు నుడువు పురాణమవనినిగలదె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కైకకోరిన వరములు కాకవెట్ట
      పరితపించెను మూర్ఛిల్లె పంక్తిరథుడు
      యుక్తమెరుగక జిక్కితానుచ్చున సర
      భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె

      (సరభము= వ్యగ్రత)

      తొలగించండి
    2. వరుసన రెండుకోరికలు వంతుగ దీర్చు మ టంచుఁగోరగా
      నిరుపమ ధైర్యశాలిఁయగునీ‌రజ బాంధవ వంశతేజు డ
      స్థిరుడయి నిల్చియుండగను శీలము నిల్పగ నెంచి వేదనా
      భరతుని యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్
      కొరుప్రోలు రాధాకృష్ణ రావు

      తొలగించండి
  12. తే.గీ:తనకు రాజ్యామ్ము వలదని,తల్లి కైక
    కోర్కె దా దీర్చ నను వార్త కూర్మి తోడ
    భరతు డంపగ, రాముడు వనికి నేగె
    నామె కోర్కె యాచరణీయ మనుచు బలికి.

    రిప్లయితొలగించండి
  13. వరమునుగోరె కైక యెడబాయగనోపను రామభద్రునిన్
    కరుణనుమాలి కోరినది కానలకంపగనంచు కుందుచున్
    పరిపరి రీతులన్బొగిలె పంక్తిరథుండు, నితాంత శోక సం
    భరతుని యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

    రిప్లయితొలగించండి
  14. మాతలను గూడి పౌరుల మంత్రి వరులఁ
    గూడి మరలి వెడలు చుండి కుమిలి కుమిలి
    రామ పాదుకా యుగ్మ శిరస్కుఁ డంత
    భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేఁగె


    గురువును సత్య సంధునిగఁ గూర్పఁగ నిత్యము నిశ్చయించి తా
    నురవడి లక్ష్మణుం డనుజుఁ డుండఁగఁ దోడుగ డెంద మందు నా
    తురత వహింపకే, భరతు తోడుత రాఘవ సైన్య మేఁగఁగా
    భరతుని యాజ్ఞ నంది, వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

    రిప్లయితొలగించండి
  15. వరముల గోరి కైక పరిపాలకు సేయ దలంచె నేరినో
    సరగున జేరె కైక నిజ సౌధము రాముడదెందుచేతనో
    వెరవక దండ్రి యానతిని బేర్మి దలంచి చరించెనెట్టులో
    భరతుని; యాజ్ఞనంది; వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

    రిప్లయితొలగించండి