13, మే 2022, శుక్రవారం

సమస్య - 4079

14-5-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మండుటెండలోన మంచు గురిసె”
(లేదా...)
“చిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండుటెండలో”

35 కామెంట్‌లు:


  1. శత్రువు మేఘనాథుడని శౌర్యము జూపుచు రెచ్చిపోవ సౌ

    మిత్రియె యత్తమిల్లుతరి మిక్కిలి వేగిరమందు నంజనీ

    పుత్రుడు తెచ్చి యౌషధము మోదము గూర్చెను రామచంద్రుకున్

    చిత్రము గాదె, మంచు గురిసెన్ మరుభూముల మండుటెండలో

    రిప్లయితొలగించండి
  2. కాలమహిమ యిదియ , కాకపోయిన నేల
    మండుటెండలోన మంచు గురిసె
    ముందు ముందు దీని మొదలుగ నికపైన
    జాల తడవ లిటుల జరుగు చుండు

    రిప్లయితొలగించండి
  3. సూర్య తాప మనుచు స్రుక్కిరి జనులెల్ల
    మండు టెండ లోన :మంచు గురిసె
    ననిరి యుత్త రమున నద్రి సానువు లందు
    మిగుల శీత లంబు మించు ననగ

    రిప్లయితొలగించండి

  4. కురులు బట్టి యీడ్చి కోమలి కృష్ణకున్
    వలువలూడ్చు వేళ వనిత యడలి
    పిలువ యాదవుండు వలువలిచ్చుటగాంచ
    మండుటెండలోన మంచు గురిసె.

    రిప్లయితొలగించండి
  5. ఆటవెలది
    రాఘవేంద్రరావు రమణీయ దృశ్యాలు
    ప్రేమికులకవి కనువిందుజేయు
    రమణి పొంది మగఁడు రంజిల్ల జిత్రింప
    మండుటెండలోన మంచు గురిసె!

    ఉత్పలమాల
    మిత్రుని వద్ద వైద్యమున మేలొనగూడక చావుతప్పదన్
    బుత్రుని జేర్చగన్ జివరి పూరుష యత్నము సేయగా నహో
    రాత్రము నాటువైద్యుని కలన్ బసరుల్ ఫలియించి మేల్కొనన్
    జిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండుటెండలో!

    రిప్లయితొలగించండి
  6. యాజ్ఞసేనినచటనాదరింపగలేక
    సభనువీరులంతషండులైరి
    నీతిదెలిసియొకడునిజమునుపలికెగా
    మండుటెండలోనమంచుగురిసె

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది
    వేడి లోన మాడి విసిగిన జనులంత
    ఉపశమిల్ల వచ్చె నుల్ల సిల్ల
    కురిసె వాన జల్లు కొద్దిగ ,దలచగ
    మండు టెండ లోన మంచు గురిసె

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    ఎండె దిగుడు బావులు* మండు టెండలోన,
    మంచు కురిసె* నుమిగుల హేమంతమందు
    జీర్ణపర్ణముల్ రాలెను శిశిరమందు
    జగతి శోభిల్లె నూత్న వసంతమందు.

    రిప్లయితొలగించండి
  9. గుండెమంటబెట్టి కోపించి దూరమై
    బాధపెట్టినట్టిభామనేడు
    కరుణజూపినన్ను కౌగిటన్ బంధించె
    మండుటెండలోన మంచు గురిసె

    రిప్లయితొలగించండి
  10. మిత్రమ!వానకాలమున మిక్కిలి పొంగెను వాగు వంకలున్
    గాత్రములున్ వణంకగ జగంబులు భీతిలె శీతకాలమున్
    *చిత్రముగాదె మంచు గురిసెన్ మరుభూముల, మండుటెండలో*
    నాత్రముఁజెందినారకట!యంబువులందనివారగ్రోలగన్.

    రిప్లయితొలగించండి
  11. తీగ తెగిన వీణ తెఱఁగున జవరాలు
    పతిని కోలుపోయి వెతలనొందె
    మనువుచేసుకొనగ మనసున్న మహరాజు
    మండుటెండలోన మంచు గురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహరాజు' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  12. శత్రువుగా విమాత తనశైశవమంతయు బుగ్గి చేయగా
    ఛత్రమువోలె భర్త తన సన్నిధి నామెను రక్ష జేసె, నే
    యాత్రమునొందకుండ కడుహాయిగ సాగెను జీవనమ్మహో
    చిత్రము గాదె మంచు గురిసెన్మరుభూముల మండుటెండలో

    (విమాత= సవతితల్లి)

    రిప్లయితొలగించండి
  13. గోత్రములందు బాధలకు కుందక ధైర్యము తోడ సైన్యముల్
    శత్రుల నడ్డగింపగను చక్కని మొగ్గరముల్ రచించుచున్
    మైత్రియె దిక్కటంచు మది మాత్సరమున్ విడనాడ వైరులే
    చిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండుటెండలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మత్సరమున్' టైపాటు.

      తొలగించండి
    2. గోత్రములందు బాధలకు కుందక ధైర్యము తోడ సైన్యముల్
      శత్రుల నడ్డగింపగను చక్కని మొగ్గరముల్ రచించుచున్
      మైత్రియె దిక్కటంచు మది మత్సరమున్ విడనాడ వైరులే
      చిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండుటెండలో

      రిప్లయితొలగించు

      తొలగించండి
  14. ఆ.వె:"మండు టెండ లోన మంచు కురిసె నేమి?"
    యనుచు చిన్న బిడ్డ డడుగు చుండ
    వచ్చు వేసవిననె వడగళ్ల వర్షమ్ము
    లనుచు డండ్రి తీర్చె నతని శంక

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. భూమి చల్లపడఁగ హేమంత ఋతువున
    మీఱి మీఱి తెల్లవాఱు వేళ,
    నుదధి లోన నున్న యుదక మావిరి కాఁగ
    మండు టెండ లోన, మంచు గురిసె


    నేత్రములన్ స్వయమ్ము యమునిం గనె సాధ్వి లభించె మామకున్
    నేత్ర యుగమ్ము రాజ్యము గనెన్ జనకుండు కుమార పంక్తి సా
    విత్రి మృతాత్మ నాథుని భువిం బడసెన్ వర లబ్ధ జీవునిం
    జిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండు టెండలో

    రిప్లయితొలగించండి
  17. క్షాత్రము తేజరిల్లనట గాండివమున్ ధరియించి పార్థుడా
    శాత్రవవర్గమోహటిల శస్త్ర మహాస్త్ర శరంబులేయగా
    చిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండుటెండలో
    ధాత్రి ప్రకంపనంబెగసె దద్దరిలంగనరాతి సేనలున్

    రిప్లయితొలగించండి

  18. చుక్క నీరు లేక సొమ్మసిల్లిరి ప్రజ
    మండు టెండలోన,మంచుకురిసె
    మార్గశిరమునందు మహిలోన సర్వత్ర
    వణికి పోయిరెల్ల పలుకు రాక


    రామ కుశల వార్త రమణి సీతకు దెల్పి
    వచ్చునతడటంచుపలుక హనుమ
    భయం వీడి మదిని పతినితలంచి నంత.
    మండుటెండలోన మంచు గురిసె”

    రాము కుశల వార్త రమణి సీతకు దెల్పి
    వచ్చునతడటంచుపలుక హనుమ
    భయమువీడి మదిని పతినితలచి నంత.
    మండుటెండలోన మంచు గురిసె”

    రిప్లయితొలగించండి