4, మే 2022, బుధవారం

సమస్య - 4070

5-5-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్”
(లేదా...)
“కుక్కలు పచ్చిగడ్డిఁ దినె గోవులు మ్రింగెను పిల్లి మాంసమున్”

36 కామెంట్‌లు:

 1. ఉత్పలమాల
  టక్కరి రాజకీయముల టక్కుటమార విచిత్ర బుద్ధులన్
  మిక్కిలి జూపుచున్ జనుల మెత్తగ మోసము జేసి సంపదల్
  చక్కగ దోచు వారలు ,నిజాయతి పాలన లేని వేళనన్
  కుక్కలు పచ్చిగడ్డి దినె ,గోవులు మ్రింగెను పిల్లి మాంసమున్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 2. నిక్కముఁజెప్పినజనునకు
  దిక్కేలేదుగజగతినితెల్లమునయ్యెన్
  చిక్గనాకఁటిచిచ్చున
  కుక్కలుగడ్డిఁదినెఁగొనెనుగోవులమిషమున్

  రిప్లయితొలగించండి
 3. గ్రక్కున దూకి సింహము మృగమ్మునుజంపియు నేగగాఁదినెన్
  *కుక్కలు,పచ్చిగడ్డిఁదినె గోవులు,మ్రింగెను పిల్లి మాంసమున్*
  నక్కలు,ముక్కునంగఱచి నాగుల నెత్తుకు పోయె గ్రద్దలున్
  అక్కట!అమ్మహాటవిని యద్భుతదృశ్యములెన్నియోగదా.

  రిప్లయితొలగించండి
 4. కందం
  మెక్కుచు మాంసాహారులు
  సక్కగ శాకములఁ, దినఁగ శాకాహారుల్
  బుక్కము, ప్రహసించిరిటులఁ
  "గుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్"

  ఉత్పలమాల
  మెక్కుచు శాకముల్ మిగుల మేలని నేర్చి గతంపు శాష్కులున్,
  బుక్కము నార్తిగా దినఁగ పూర్వము శాకములారగించు ఋ
  త్విక్కులు, గేలి సేయుచు నుపేక్షను జేయక నాడిరిట్టులన్
  గుక్కలు పచ్చిగడ్డిఁ దినె గోవులు మ్రింగెను పిల్లి మాంసమున్

  రిప్లయితొలగించండి
 5. చక్కని జంతుశాల యది యక్కడ
  వాటికి దొర్కు దిండియున్
  పెక్కగు జంతు జాలములు పెట్టిన
  యన్నము నారగించెడిన్
  నిక్కము లేదు తక్కువట, నిత్యము
  బోనము తృప్తిగాతినెన్
  కుక్కలు, పచ్చి గడ్డి దినె గోవులు, మ్రింగెను పిల్లి మాంసమున్

  రిప్లయితొలగించండి
 6. వెక్కసమాయెగాబ్రతుకువేదననందిరిధర్మజాదులున్
  ప్రక్కనునున్నకౌరవులుభాసురకీర్తినివెల్గిరేగదా
  నిక్కముఁజెప్పగాకలియునేర్పునజీవికనడ్డగించుగా
  కుక్కలుపచ్చిగడ్డిదినెగోవులుమ్రింగెనుపిల్లిమాంసమున్

  రిప్లయితొలగించండి
 7. మిక్కిలి కక్కలు తినియెన్
  *కుక్కలు,గడ్డిఁదినెఁ,?గొనెను గోవులమిషమున్
  నక్కలు,పిల్లులు నెలుకల
  గ్రక్కున మ్రింగెను,పశువులు గడ్డిని మేసెన్.

  రిప్లయితొలగించండి
 8. చక్కని మీ సమస్య భళి చక్కిలిగింతలు పాలుజేసెనే,
  పెక్కురు ధీమతీంద్రులిటు పిక్కబలంబును జూపనెంతురే?
  ఒక్కొక శబ్దఁ మారయ నయోమయమే విడు, మూల్గుబొక్కలన్
  గుక్కలు, పచ్చిగడ్డిఁ దినె గోవులు, మ్రింగెను పిల్లి మాంసమున్.

  రిప్లయితొలగించండి

 9. మక్కువతో గొని తెచ్చితి
  చక్కని యాండ్రైడు ఫోను చవకని యందున్
  మిక్కిలి చిత్రమె కాంచగ
  కుక్కలు గడ్డిఁ దినె గొనెను గోవులమిషమున్.


  అక్కజమయ్యె బాలకునకచ్చట జీవుల మేత గాంచగన్

  నక్కయె కుక్కుటమ్మునశనమ్ముగ సాపడు జేయ త్రెక్కొనెన్

  మక్కువతోడ కొక్కెరయె మడ్గున చేపల చీకె శల్యమున్

  కుక్కలు, పచ్చిగడ్డి దినె గోవులు, మ్రింగెనుపిల్లి మాంసమున్.

  రిప్లయితొలగించండి
 10. నిక్కము కాని కథ నొకటి
  వక్కా ణించమని తిక్కవానిని కోరన్
  గ్రక్కున నతడిటుల బలికె
  “కుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్”

  రిప్లయితొలగించండి
 11. చక్కని రాజ్య పాలనము సల్పగ రాముడు ధర్మ మూర్తి యై
  నెక్కొనె సంపదల్ సిరులు నివ్వటిలెన్ గన జీవనంబులున్
  మిక్కిలి సంతసం బలర మేవడి తోడుత బాలు ద్రావగన్
  *గుక్కలు, పచ్చిగడ్డిఁ దినె గోవులు, మ్రింగెను పిల్లి మాంసమున్*

  రిప్లయితొలగించండి
 12. అక్కట మునిశాపముతో
  గ్రక్కున మృగరూపునొంది కాలాంతకులే
  మిక్కుటముగతినసాగిరి
  కుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  అక్కజముగ కరువేర్పడ
  నెక్కడ నశనము లభించని గతి యమరగన్
  బిక్కై నుసుఱును నిల్పగ
  కుక్కలు గడ్డితినె గొనెను గోవు లమిషమున్.

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కగ సంరక్షణమని
   దక్కగ నొక్కిరి విరాళ ధనము ననువునన్
   టక్కరి వారలు; అకటా!
   కుక్కలు గడ్డిఁ దినెఁ; గొనెను గోవు లమిషమున్

   తొలగించండి
 16. మెక్కుట నేర్చిన నేతలు
  దక్కిన నే కొంచ మైన ధైర్యము గాగన్ జక్కగ లంచము పేరున
  గుక్కలు గడ్డి దినె గొనెను గోవు లమిషమున్ !?

  రిప్లయితొలగించండి
 17. మక్కువతోడ చేకొనుచు మన్నన చేసి గృహమ్ములందునన్
  చక్కని ప్రేమతో జనులు జంతువులన్ భరియించు చుందురే
  చిక్కు ప్రశాంతి యంచు, నిలు చెంగున దూకుచు మెక్క నన్నమున్
  కుక్కలు, పచ్చిగడ్డిఁ దినె గోవులు, మ్రింగెను పిల్లి మాంసమున్

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  ఇక్కను బెల్లమున్ వెరజి యిమ్ముగ మెక్కెను దొడ్డియందునన్
  కుక్కలు, పచ్చిగడ్డి దినె గోవులు, మ్రింగెను పిల్లి మాంసమున్
  రెక్కల నల్లలాడుచు ధరిత్రిని జేరిన గ్రద్ద తృప్తిగా
  మిక్కిలి యాకలిన్ పులులు మెక్కెను కాననమందు జింకలన్.

  రిప్లయితొలగించండి
 19. క్రమాలంకార పు అన్వయపు పూరణము

  నక్కినతని గని మొరిగెను,
  ప్రక్కన గలజలమునెటుల పసువులు త్రాగెన్ ,
  నక్కలు తినుచుండు నెపుడు
  కుక్కలు ,గడ్డి దినె గొనెను గోవుల,మిషమున్

  రిప్లయితొలగించండి
 20. ఒక్క ప్రయత్నమున్ దివియ నోట్లు గడింపగ నోట్లు పంచి చే
  జిక్కగ రాజ పీఠమిక జెల్లుగ బొక్కసమెల్ల దోచుచున్
  నక్కల వంటి నాయకులు నాశమొనర్పగ దేశమందునన్
  కుక్కలు పచ్చిగడ్డిఁ దినె గోవులు మ్రింగెను పిల్లి మాంసమున్

  రిప్లయితొలగించండి
 21. కుక్కలు పచ్చిగడ్డిఁ దినె గోవులు మ్రింగెను పిల్లి మాంసమున్
  రక్కస పాలనంబకట రావణు రాజ్యము వాని వైలమే
  యుక్కడఁగించె రాముడు మహోన్నత ధర్మ సమాశ్రయంబుగా
  నెక్కొనె రామ రాజ్యమిల నీమమునన్ జనులుల్లసిల్లగా

  రిప్లయితొలగించండి
 22. చిక్కఁగఁ గాల వశమ్మున
  దక్కును బ్రాణమ్ము లంచుఁ దమ కెండినచో
  డొక్క లగుఁ దారుమారుగఁ
  గుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్


  నిక్కము మారు నర్థములు నిల్పఁ బదమ్ముల నన్య రీతులం
  జక్కని పద్యపాదముల సత్యము కానము చింత సేయ నిం
  దక్కజ మించుకేఁ జదువ నాగి విరామము లన్వయించుచుం
  గుక్కలు, పచ్చిగడ్డిఁ దినె గోవులు, మ్రింగెను బిల్లి మాంసమున్

  రిప్లయితొలగించండి
 23. చక్కగ పూరణజేయుము
  మక్కువగా జదువగలరు మదిలోనవ్వే
  పక్కనవారికి జేరును
  కుక్కలుగడ్డిదినె గొనెనుగోవు లమిషమున్

  రిప్లయితొలగించండి
 24. మెక్కెను విచ్చలవిడిగా
  కుక్కలు,గడ్డితినె కొనెను గోవు,లమిషమున్
  మిక్కిలి గానాశించుచు
  చిక్కుకొ నివిలవిలలాడె చిరుత యువలలో

  రిప్లయితొలగించండి