14, మే 2022, శనివారం

సమస్య - 4080

15-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జలముఁ గ్రోలి రోసిరి దేవత లమృతమును”
(లేదా...)
“జలపాన మ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్”

41 కామెంట్‌లు:

 1. రవియుజగతినిఁదిరుగాడెరాజసమున
  కోట్లదైవాలునీటినేకోరికొనిరి
  కుండనిండుగతీపియుకూడిరాగ
  జలముఁగ్రోలిరోసిరిదేవతలమృతమును

  రిప్లయితొలగించండి
 2. ఇలలోభానుఁడునిందునందనకతావీఁకన్విలాసంబుతో
  కులికెన్ఛాయయువెంటరాగఘనతన్గూర్చంగతాపంబులన్
  కలువల్గన్నులువాడిపోనకటతాఘర్మంబుదాహంబునన్
  జలపానంబొనరించిరోసిరిసురల్స్వర్గమ్ములోనన్సుధల్

  రిప్లయితొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మండుటెండను... దేవత లమృతమును...'

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువు గారు

   తేటగీతి
   మండుటెండను కలుషితమైన నిల్వ
   జలము గ్రోలి రోసిరి ,దేవతలమృతమును
   మోజు పడిన జనావళి మూల నున్న
   మద్యపాన శాలకు బోయి మదిర గ్రోలె.

   ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
   ఉండవల్లి సెంటర్.

   తొలగించండి
 4. రిప్లయిలు
  1. తేటగీతి
   ఆలుచిప్పవలె మిగులనందమొలక
   పొదువగ నుడికిన బఠాణి ముత్యములన
   దివ్యమనగ పానీపూరి తింత్రిణీ స
   జలముఁ గ్రోలి రోసిరి దేవత లమృతమును

   మత్తేభవిక్రీడితము
   కులుకున్ మిన్నగ నాలుచిప్పలవలెన్ గూర్చంగనే రవ్వతోఁ
   జెలువంబొప్ప బఠాణిముత్యములనన్ జేర్చంగ వండించియున్
   నెలవున్ వీడుచు ధారుణిన్ దిగుచు పానీపూరిలో తింత్రిణీ
   జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. మర్త్య లోకపు వింతలు మర్మ ములను
  తెలిసి కొన గోరి యు వచ్చి తిరుగు చుండ
  దాహమును దీర తేనీరు దక్క రుచిర
  జలము గ్రోలి రోసిరి దేవ తల మృత మును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. 'తెలిసికొనగ గోరి/తెలిసికొన గోరియును వచ్చి...' అనండి.

   తొలగించండి
 6. మురికి వాడలో నిజనులు మురికి కలుగు
  జలము గ్రోలి రోసిరి,దేవతలమృతమును
  ద్రాగి యుండుట వల్లన దరికి రాదు
  మృత్యు వెప్పుడు వారికి మేక పాటి!

  రిప్లయితొలగించండి
 7. కలికాలంబున వచ్చినారు సురలున్
  గాక్షించ భూలోకమున్
  పలుమారుల్ ఘన తాప తీవ్రతవలన్
  వారల్ కడున్ దృష్ణచే
  జలపానమ్మొనరించి రోసిరి , సురల్
  స్వర్గమ్ములోనన్ సుధల్
  కలకాలంబును ద్రాగువారికిచటన్
  గర్వాయెనే గాంచగన్

  రిప్లయితొలగించండి
 8. పాలసంద్ర మథనమందు వాసుకి తల
  వైపునున్న రక్కసు లది వదలెడు విష
  జలముఁ గ్రోలి రోసిరి ; దేవత లమృతమును
  జవిగొనిరి కేశవుడు వచ్చి సాయపడగ

  రిప్లయితొలగించండి

 9. సంద్రమందున చేసిన స్నానమదియె
  పుణ్యమంచునేగినవారు మొసలి పట్టు
  జలము గ్రోలి రోసిరి, దేవతలమృతమును
  త్రావిరందుకే యనుచును తలచిరంత.  చలువజ్యోతిడు శాతపత్రకమె సత్సాహిత్యమున్ గాంచి సి
  గ్గిలు నద్దాని యశో ప్రశస్తములనే కీర్తింపగా పండితుల్
  విలసత్ శారద సత్కృపారసములే వేవేలు నా సాహితీ
  జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ము లోనన్ సుధన్.

  రిప్లయితొలగించండి
 10. నీటిబొట్టైన రాలక నింగినుండి
  కరువు పాలైన రైతులు కష్టములను
  జలముఁ గ్రోలి రోసిరి, దేవత లమృతమును
  ద్రావి మత్తున మునిగిన రక్షయెవరు?

  రిప్లయితొలగించండి
 11. ఆటవెలది
  లలనరో!లవణ*జలముఁ గ్రోలి రోసిరి,
  దేవతలమృతమును*త్రావఁగోరి
  క్షీరజలధిఁజిలికి నారు దైత్యులఁగూడి
  కష్టపడిన సుఖము కలుగుగాదె.

  ఇలలోఁజేసెడు యజ్ఞయాగములు వీక్షించంగ విచ్చేసి,యెం
  డల వేడిన్ భరియించలేక యకటా!డయ్యంగనే మేను,భీ
  తిలి,దాహంబును హెచ్చ'లిమ్క,స్ప్రయిటుల్' తీర్థంబుగానెంచి ,త
  జ్జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్.

  రిప్లయితొలగించండి
 12. జలపానమ్మొనరించి రోసిరిసురల్ స్వర్గమ్ములోనన్సుధల్
  లలనా! వింటివె చిత్రమీ యదియ యేలాసాధ్యమౌనున్ గనన్
  జలముల్ వారల దృష్టిలో నగును మోక్షంబిచ్చుదానింగనై
  జెలువంబొప్పుచు నుండగా మిగుల దా సేమంబు నీడేరుగా

  రిప్లయితొలగించండి
 13. అమర బృందమొకటి భూమికరుగుదెంచి
  చూడ మొదలిడెనిచ్చోటి సొగసు!సూర్య
  రశ్మి తీవ్రమై కోకకోలా యనబడు
  జలముఁ గ్రోలి రోసిరి దేవత లమృతమును

  రిప్లయితొలగించండి
 14. కలుషంబయ్యెనుఁబంచభూతములుశోకంబయ్యెసంసారముల్
  వలయం బేర్పడె నిమ్మహీ తలమునన్ వర్షంబు నామ్లంబునై,
  కలికా లమ్మున జేయుసేవలభిషేకంబుల్గొన న్వారునా
  జలపాన మ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 15. చెలువమ్మొప్పగ రాణివాసములతో క్షేత్రమ్ముపై చేరుచున్
  పలుతీర్థమ్ముల మజ్జనమ్ములను సద్భావమ్ముతో మంచుకొం
  డలపైనన్ తిరుగాడుచున్ గడు నిరాటంకమ్ముగా, జాహ్నవీ
  జలపాన మ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్

  రిప్లయితొలగించండి
 16. ఫలమాశించి కృషీవలుల్ పొలములన్పండించగా సస్యముల్
  కలలే కల్లలుకాగ వారలకటా క్షామంపు కన్నీటితో
  జలపానమ్మొనరించి రోసిరి, సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్
  తలకో గ్రుక్కెడు గ్రోలి మైకమొదవన్ తైతక్కలన్ దేలిరే

  రిప్లయితొలగించండి
 17. మ:తెలివిన్ జూపుము భూసురా!ప్రవరుడా !దేవాంగనన్ వీడి యే
  ఫలమున్ బొందెద రోయి?స్వర్గసుఖ సంప్రాప్తిన్ విసర్జించి యీ
  జలపాన మ్మొనరించి రోసిరి, సురల్
  స్వర్గమ్ము లోనన్ సుథన్
  పలు మారుల్ గొనుచుంద్రు, బ్రాహ్మణుల కే పథ్యమ్ములే అర్ఘ్యముల్.
  ("భూసురుడైన ఓ ప్రవరా!దేవాంగనని వదులుకుంటావా?స్వర్గం లో దేవతలు హాయిగా సుథ త్రాగుతుంటే భూమిపై దేవత లైన మీ బ్రాహ్మణులు అర్ఘ్యజలం త్రాగుతూ సుధని అసహ్యించుకుంటారే?ఇదేమైనా మీకు పథ్యమా"అని వరూథిని ప్రవరుడి నైష్టికతని ఆక్షేపించింది.)

  రిప్లయితొలగించండి
 18. తే.గీ:బ్రాహ్మణుల గూర్చి చతురుడు పలికె నిట్లు
  భూమి పై దేవతలు వీ రి దేమి యెపుడు
  సుథను ద్రావరు ?సంధ్య వార్చుచు తదీయ
  జలము గ్రోలి రోసిరి దేవత లమృతమును

  రిప్లయితొలగించండి
 19. దేవ రాక్షస సంఘంబు దివిరి కలసి
  మందరాద్రి కవ్వముగాఁగ సుందరముగ
  క్షీర వారాశి నెల్లరు సిల్కఁ బొంద,
  జలముఁ గ్రోలి రోసిరి, దేవత లమృతమును


  నలి నాక్షాంఘ్రి సరోజ సంజనితమై నాక ప్రదేశ ప్రజా
  వలి దాహమ్మును దీర్చు నా సురనదీ పాథస్సు సంభావ్యమై
  లలి తాభంగ తరంగ సంకలిత నీర ధ్వాన మందాకినీ
  జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ము లోనన్ సుధన్

  రిప్లయితొలగించండి
 20. నెలవౌనా హిమ శైలమే హరుని సాన్నిధ్యంబునందెన్నగా
  కొలువౌ భూత గణంబులున్ సురలు యక్షుల్ మౌనులున్ వేడగా
  చెలువౌ మానస దివ్య తీర్థమదియే చేకూర్చు సేమంబునా
  జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్

  రిప్లయితొలగించండి
 21. అమరవరు లరుదెంచుచు నవని యందు
  గాంచి విస్మయమందిరి కడుపు నిండె
  ననుచు జనులు పల్కగవిని నారికేళ
  జలముఁ గ్రోలి రోసిరి దేవత లమృతమును

  రిప్లయితొలగించండి