29, మే 2022, ఆదివారం

సమస్య - 4094

30-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును”
(లేదా...)
“చెలఁగుచు భూణహత్యలను జేసినఁ బుణ్యము దక్కు నిద్ధరన్”

22 కామెంట్‌లు:

 1. మిగుల పాపము గదరమ!జగము నందు
  భ్రూణహత్యల జేయుట,పుణ్యమగును
  సొంత ప్రాణము నొడ్డైన గుంత నుండి
  రక్ష జేయంగ వలయును నాశ్రితులను

  రిప్లయితొలగించండి
 2. ైధరణిభారముదగ్గింపదలచిజనులు
  వింతలెన్నియొజూపిరివిస్తుబోవ
  మొగ్గదొడిగినపసికందుమొరటునయ్యె
  భ్రూణహత్యలుజేయుటపుణ్యమగును

  రిప్లయితొలగించండి
 3. పట్టి నేదలేకున్నను , పాపమెగద
  భ్రూణహత్యలఁ జేయుట ; పుణ్య మగును
  సంతు లేని వారిని గూడి సాక మనుచు
  దత్తత నొసగ, నిద్దియె తగిన రీతి

  రిప్లయితొలగించండి

 4. కలికిని గౌరవింపరిల గర్భమునన్ శిశు వాడదైనచో

  ఖలులిల చంపబూనెదరు కర్కశులౌచును వేడుచుంటినే

  నిలపరిపాలకుండ్రయిన యేలిక లార నిరోధ చట్టమున్

  చెలఁగుచు భ్రూణహత్యలను చేసినఁ బుణ్యము దక్కునిద్ధరన్.

  రిప్లయితొలగించండి
 5. అలవినిగానిబద్ధకమునందుచునాగరికంబునేర్చుచున్
  కులసతిగౌరవాఖ్యలనుకోమలికాదనిసౌరుజూపుచున్
  పలువిధవింతపోకడలబాఱుచుతెల్వినిశాస్త్రసంగతిన్
  చెలగుచుభ్రూణహత్యలనుజేసినబుణ్యముదక్కునిద్ధరన్

  రిప్లయితొలగించండి
 6. ఆటవెలది
  అఘము కాదె//భ్రూణ హత్యలుఁజేయుట;
  పుణ్యమగును//శిశువు పుట్టగానె
  సంతు లేని వారి చెంతకుఁజేర్చిన
  సంతసింత్రు వారలెంతగానొ!

  రిప్లయితొలగించండి

 7. గర్భమందున నాడది కలదటంచు
  తెలిసినను చంపెదరుగాదె ఖలురు నేడు
  సచివుఁ గోరెద నిలుపుచు చట్టమొకటి
  భ్రూణహత్యల, జేయుట పుణ్యమగును.

  రిప్లయితొలగించండి
 8. జీవి ధర పైకి రాకుండ చిదుము ట నగ
  పాప మని యందు రార్యులు వసుధ యందు
  భ్రూ ణ హత్యల జేయుట :పుణ్య మగును
  దాన ధర్మము జేయుట దాత లగుచు

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. అశ్వత్థామతో అర్జునుడు:

   తేటగీతి
   చెలఁగి రారాజు మెప్పించు చేష్టలనగ
   నవిహితమ్ము నశ్వత్థామనావహించె
   గురు సుతులనంగ హీనమ్ము, క్రూరమైన
   భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును!

   చంపకమాల
   మెలకువలేని వారలని మృత్యుముఖమ్మున ద్రోసివేయుచున్
   గెలుచుట లక్ష్యమై మది నికృష్టమునెంచితె రాజరాజుకై
   కులగురు పుత్రులై కృపను కోల్పడి మారణహోమమెంచుచున్
   జెలఁగుచు భూణహత్యలను జేసినఁ బుణ్యము దక్కు నిద్ధరన్!

   తొలగించండి
 10. అన్నెమును పున్నెమెరుగని యాడుబిడ్డ
  నవనిపై బడనీయక నడ్డుకొనెడు
  పాపమునుజేయ బూనక నాపుడయ్య
  భ్రూణహత్యలఁ జేయుట, పుణ్య మగును

  రిప్లయితొలగించండి
 11. కలుషిత భావనల్ దగవు, కైతపదమ్ముల నిట్లు బల్కుటన్,
  'చెలఁగుచు భ్రూణహత్యలను జేసినఁ బుణ్యము దక్కు నిద్ధరన్,'
  తలకొని యట్లొనర్ప నిక దక్కునె భారతరత్న భీమరా
  వలఘు డనంత ధీయుతుడు నాశలు మెచ్చిన కీర్తిమంతుడున్.

  రిప్లయితొలగించండి
 12. తలపులయందు బాలికల దక్కువజేయుచు వారి పుట్టుకన్
  మొలకలలోనె తుంచుటన మూర్ఖత కాదొకొ? పాపమబ్బదే
  చెలఁగుచు భ్రూణహత్యలను జేసినఁ ?బుణ్యము దక్కు నిద్ధరన్
  మెలకువబూని పాపలకు మేలొనగూర్చిన దొడ్డబుద్ధితో

  రిప్లయితొలగించండి
 13. కలుగును బాపమున్విమలకచ్చితమౌ నువిధంబుగాదగన్
  చెలఁగుచు భూణహత్యలను జేసినఁ, బుణ్యము దక్కు నిద్ధరన్”
  ఫలమునుగోర కెన్నడును భవ్యతతోడను సాయ మీయ,యీ
  కలియుగమందెకాక ను యుగాంతమువర్కును నిశ్చయంబుగా

  రిప్లయితొలగించండి
 14. తేటగీతి
  పాప మదిగాదె చిన్ని పాపల దలచక
  భ్రూణ హత్యలు జేయుట ,పుణ్య మగును
  శిశువులను దత్తు బొందుచు జేర దీయ
  భావి భారత పౌరుల భవిత జూచి.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 15. నెలవగు గర్భకోశమున నిద్దురనుండగ పాపమేకదా
  *చెలగుచు భ్రూణహత్యలను జేసిన;పుణ్యము దక్కు నిద్ధరన్
  తులువలకెట్లు?శాసనముతో నరికట్టవలెన్ ప్రభుత్వమున్
  కలిగియు జ్ఞానమున్ మసల గావలె నెల్లరు ధర్మమార్గమున్.

  రిప్లయితొలగించండి
 16. చంప నెద్దాని నింక సాధింపఁ గలము
  వింత కాదిది సత్యమ్ము సంత తాను
  కంప తనరంగ వే నివారింప నవని
  భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును


  సలలిత భక్తి సంయుతము చక్రినిఁ బద్మ దళాక్షు నింపుగాఁ
  గొలుచుచు సంతతమ్మును నకుంఠిత దీక్షను జారుహాసినీ!
  చలమునఁ జెడ్డ కోరికల సంశయ మందక యించుకేనియుం
  జెలఁగుచు భ్రూణ! హత్యలను జేసినఁ బుణ్యము దక్కు నిద్ధరన్
  [భ్రూణ = గర్భిణి]

  రిప్లయితొలగించండి

 17. నిలుపను నీదు కార్యమని నేనట బాసను జేయనేమి హే

  చెలియరొ చంటిపాపలను జాలిని వీడుచు నిత్తరిన్ నదీ

  జలముల పాలు జేయుటది శంకువు క్షుద్రము విచ్చికమ్మదే

  చెలఁగుచు భూణహత్యలను జేసినఁ బుణ్యము దక్కు నిద్ధరన్?

  రిప్లయితొలగించండి
 18. విలువగు జీవితమ్మునను పిల్లలకై తపియించుచుండగా
  కలిగెను పద్మనాభుదయ గర్భము, ప్రీతి ద్వయమ్ము మున్గ గా
  కలలను, జన్యులోపముల కాంచిన వైద్యుడు, తల్లిఁ గావగా
  చెలఁగుచు భ్రూణహత్యలను జేసినఁ బుణ్యము దక్కు నిద్ధరన్

  రిప్లయితొలగించండి
 19. ప్రాణ రక్షణ సంపత్తి వైద్య వృత్తి
  ప్రాణి సంకటమ్మునబడి వగచుచుండ
  ప్రాణ సంరక్షణార్థము ప్రాణదుండు
  భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును

  రిప్లయితొలగించండి
 20. వలదు మహాపరాధమది పాపపు కూపమె దక్కు నీకికన్
  చెలఁగుచు భ్రూణహత్యలను జేసినఁ; బుణ్యము దక్కు నిద్ధరన్
  కలఁగక నాడ బిడ్డ యని గాంచి పరాంబికయే వరంబుగా
  కలిగెనటంచెరింగి మమకారముతో సమదృష్టి గాంచుటన్

  రిప్లయితొలగించండి
 21. పాపకార్యమేదియనంగ వసుధ యందు
  *భ్రూణహత్యలు జేయుట, పుణ్యమగును*
  బిచ్చ మెత్తుచు జీవించు పేదవారి
  నాదరించుచు ప్రేమతో నన్నమిడుటె.

  రిప్లయితొలగించండి