17, మే 2022, మంగళవారం

సమస్య - 4083

18-5-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి”
(లేదా...)
“సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణశశాంకబింబమున్”

35 కామెంట్‌లు:

 1. 1.తేటగీతి
  మిట్టమధ్యాహ్న వేళలో మెరయుచుండఁ
  గప్పె పలుచని మేఘమ్ము కదలివచ్చి
  తరచి చూడంగ లీలగ కిరణరహిత
  సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి

  2.దుర్యోధనుని దుశ్చర్యకు కృష్ణుని మోములో మారినరంగుల గాంచిన భీష్ముని అంతరంగం...

  తేటగీతి
  సంధిఁ జేసెడు మాటున చక్రి రగిలి
  పాండవుల శౌర్యమెంచంగ బందిగఁగొన
  జూడఁ కౌరవుల్ సైచు నజుని ముఖమను
  సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి

  ఉత్పలమాల
  శౌర్య పరాక్రముల్ దెలుప చక్రియె పాండవ పక్షపాతి మా
  త్సర్యము మూయకన్నులను ధాటిగ బందిగఁ జేయఁ జూడ దు
  శ్చర్యకు కౌరవాధముల సైచిన కృష్ణుని మోముఁదోచెడున్
  సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణశశాంకబింబమున్!

  రిప్లయితొలగించండి
 2. రాజరాజునుమెప్పింపరణమునందు
  అన్నదమ్ములవదలెనునాజియందు
  కర్ణుడీరీతికుంతిపైకరుణఁజూపి
  సూర్యబింబముమధ్యలోసోముగంటి

  రిప్లయితొలగించండి
 3. చౌర్యముఁజేసినాడుగదచక్కనిసౌ. మ్యతవైరిరాజునా
  హార్యమునాయెహిందువులహంగులుశత్రువుమందిరంబుగా
  ధార్యమునైనయోటమినిదాల్చకలింగమువెల్గుఁజూచెగా
  సూర్యునిమధ్యభాగమునఁజూచితిఁబూర్ణశశాంకబింబమున్

  రిప్లయితొలగించండి
 4. మిట్ట మధ్యాహ్న వేళలో మెరియు చుండె
  సూర్య బింబము : మధ్య లో సోము డుండె
  నభము నందున చంద్రిక నిభ ల తోడ
  చల్ల దనమును గల్గించు కల్ల కాదు

  రిప్లయితొలగించండి
 5. గ్రహణ కాలము నందున గగనమందు
  సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి
  రాహు కేతువులనబడు రాక్షసులను
  తలచు కొనెడివృత్తాంతము కలదుమనకు

  రిప్లయితొలగించండి

 6. సూర్య గ్రహణము సంభవించుటది యెటులొ
  తెలుపుచునొక చిత్రమ్మును దీర్ఘదర్శి
  గీయగ నిరుపార్ష్వములలో కేళిశుషియు
  సూర్యబింబము, మధ్యలో సోముఁ గంటి.


  ఆర్యులు నాడు చెప్పినది యాలమదే గ్రహణమ్ము గూర్చి చా

  తుర్యము తోడ గీచె విబుధుండొక చిత్రమటంచు భర్తయే

  భార్యకు తెల్పెనిట్లు నిరు పార్ష్వము లందున నున్న భూమియున్

  సూర్యుని, మధ్యభాగమున జూచితి పూర్ణశశాంక బింబమున్.

  రిప్లయితొలగించండి
 7. శౌర్య పరాక్రమోన్నతి ప్రశస్తిగ శత్రుల నాజియందు ని
  ర్వీర్యుల జేసి పార్థజుడు భీరుల తోడ శశాంక మూర్తియై
  సూర్యుడు పశ్చిమాద్రి చనుచుండగ పోరుననస్తమించగా
  సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణశశాంకబింబమున్

  రిప్లయితొలగించండి
 8. పత్ని కైసేయుచుండగ ఫాలముపయి
  తృప్తిగ నెరుపు తిలకము దిద్దు కొనిన
  పిదప, చంద్రబింబపు బొట్టుబిళ్ళనద్ద
  సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి

  రిప్లయితొలగించండి
 9. క్రౌర్యము జూపి రావణుడు భ్రాత విభీషణుఁ బాఱఁదోలగన్
  కార్యము దప్పు నాయకునిఁ గాదని లంకను వీడి, చేరి యౌ
  దార్యపరాక్రమక్రముని దాశరథిన్ రవివంశు నిట్లనెన్
  సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణశశాంకబింబమున్.

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. నిజము! పున్నమి కిటునటు నిర్మలాక
  సంబున క్రమమున దివిని జక్కగ నిర
  తము పగలు రేయి పగలు చందంబునందు
  సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిర్మలాకసము' దుష్ట సమాసం.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారు.

   నిజము! పున్నమి కిటునటు నిర్మల నభ
   సంబున క్రమమున వెలయ, జక్కగ నిర
   తము పగలు రేయి పగలు చందంబునందు
   సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి

   తొలగించండి
 12. చండమార్తాండుడైపోరు సలిపి తుదకు
  వీరమరణమునొందిన ధీరుగంటి
  మొక్కవోనట్టి శౌర్యఁపు మోమునందు
  సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి

  రిప్లయితొలగించండి
 13. శౌర్యమునుగ్గడించుచు నిశాచరమూకను చెండుచున్న నా
  ధైర్యగుణాఢ్యుగాంచితిని దందడియందున నింతలోనె నా
  శ్చర్యము! మేఘనాథుకర చాపము సొక్కగజేసె నక్కటా!
  సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణ శశాంక బింబమున్!

  రిప్లయితొలగించండి
 14. ఆటవెలది
  గగన మనెడు భూరి గ్రంథంబునందున
  కాంచినాను తారకాగ్రహముల
  డంబు మీఱె //సూర్యబింబంబు మధ్యలో
  సోముఁగంటి //పిదప సుందరముగ.

  ఆర్యజనంబు మెచ్చునటులాడెడు పాడెడు నాట్యగత్తె ,యా
  హార్యము చూడముచ్చటయె హారము,మేఖల,గాజులున్ మహా
  శ్చర్యముగొల్పె,శీర్షమున సన్నని పాపట స్వర్ణభూషగా
  *సూర్యుని;మధ్యభాగమునఁజూచితిఁబూర్ణ శశాంక బింబమున్.

  రిప్లయితొలగించండి
 15. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. తేటగీతి
  లగ్న కుండలి జూచుచు భగ్న దయితు
  నికి వినగజెప్పె పండిత నృపుడనృతము
  సూర్య బింబము మధ్యలో సోము గంటి
  రవి దశాంతర్దశ శశి కారణ మదియనె.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 17. పర్యవసానమెంచకటు వామనమూర్తికి దానమీయ నా
  శ్చర్యముగా వటుండెదిగి సర్వ జగంబుల మించి నిల్చెనా
  వీర్య మహత్స్వరూపమగుపించెనజాండము నిండి యూర్ధ్వమున్
  సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణశశాంకబింబమున్

  రిప్లయితొలగించండి
 18. 'ధైర్యము సాలకుండె మది దందడి
  జేయగ కృష్ణు' నాకు స
  త్కార్యము దెల్పు మంచడుగ దా బ్రక
  టంచెను విశ్వరూపమా
  సూర్యుని మధ్య భాగమున జూచితి
  బూర్ణ శశాంక బింబమున్
  శౌర్యముతోడ జేకొనియు శస్త్రము
  సేసితి యుద్ధమప్పుడున్.

  రిప్లయితొలగించండి
 19. చంద్రధరుని ఫాలాక్షుని సన్నుతింప
  ఫాల నేత్రము తల నుండ భాను భంగి
  వెలయ నెలవంక యా వంక లలితముగను
  సూర్య బింబము మధ్యలో సోముఁ గంటి


  ఆర్యుఁడు కోపగించినఁ దదాస్యము మండును సూర్య బింబమై
  యార్యుని సుప్రసన్నతఁ దదాస్యము వెల్గును చంద్ర బింబమై
  యార్యుని కోప శాంతముల నమ్ముఖ బింబము మారుచుండఁగా
  సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణ శశాంక బింబమున్

  రిప్లయితొలగించండి
 20. శౌర్యము తోడ యుక్తినిడి
  శక్తి సమర్ధత మేళవించుచున్
  కార్యనిమగ్నత న్దనర
  కర్మఠుడై వెసబూని లక్ష్యమున్
  ధైర్యము స్థైర్యమున్నియత
  ధర్మము శాంతము వెల్గు జ్ఞానిలో
  సూర్యుని మధ్య భాగమున
  జూచితి బూర్ణశశాంక బింబమున్!

  రిప్లయితొలగించండి