17-5-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఏకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్”(లేదా...)“ఏకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే”
కందంలోకేశ్వరి తపియించియుసాకారముసేయ మరుడు సంతోషమునన్లోకైకదైవమొప్పఁగనేకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
ఉత్పలమాలలోకములేలు శంకరుని లోక శుభంకరి భక్తిగొల్చుచున్జేకుఱఁ జూడ మన్మథుని సేవలఁ బొంది వివాహమాడగన్శ్రీకరి కాదిదేవుడు విశేషమనన్ సగదేహమీయఁగానేకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ఏకముగాగనుపురుషుఁడుప్రాకటముగతానునొక్కపడతినికోరెన్చేకొనెబిడ్డనునొకనినిఏకమ్మేకమ్ముతోడనేకమ్మయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పీకల దాక పసాపడివాకిట మంచమ్మువాల్చి పవళించుచు నేనాకాశము గన తారకలేకమ్మేకమ్ము తోడనేకమ్మయ్యెన్.
నాకొక సంతు కొమరితయె ,నీకును సంతు సుతుడొకడె ,నెయ్యము నిలుపన్జోకకు పెండిలి సలుపగఏకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
చేకొనసృష్టియర్థమునుచెన్నుగమూలమునొక్కరేణువున్పాకముఁజేసెబ్రహ్మనహపార్థివదేహమనేకరూపులన్లోకములెన్నియోగలవులోపలదాగెపరాత్పరుండనన్ఏకముతోడనేకమేయనేకవిధములనేకమయ్యెనే
లోకమునందు మానవులలోగలమిక్కిలి కోర్కెయొక్కటేలోకులుమెచ్చ పెండిలి సులోచనతోడనుగూడి యాడియున్బ్రాకటమొప్ప బిడ్డలను భాగ్యముబొందియు సంతసించుగాఏకముతోడ నేకమె యనేక విధమ్ములనేకమయ్యనే
కందంఏక కణము తోడుగనె యనేక కణప్రాణులుగ జనించుచు పెరిగెన్వీకగ పెరిగిన జీవులుఏకమ్మేకమ్ము తోడ నేకమ్మయ్యెన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
చేకొని బాలుని దత్తకు సాకియు పెండిలికి వెదికె చక్కని చుక్కన్ మేకొని యిరువురు నొకటై యేక మ్మే కమ్ము తోడ నేక మ్మ య్యెన్
ఆకాశము మబ్బులతోభీకరమయి గాలి,వాన,పిడుగులు పడ నస్తోకంబగు వాహినులే*యేకమ్మేకమ్ముతోడనేకమ్మయ్యెన్.*భీకరమైన మబ్బులు గుభిల్లు గుభిల్లున పిడ్గుపాటు,లస్తోకపు గాలివానలకు తోయములెల్లెడఁబొంగి పొర్ల,పద్మాకరముల్,నదుల్ గలిసి దారిని తీసెను వార్ధిఁజేరగానేకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
చీకటి వీగినంతట పచేళిముడా గగనమ్ముజేరగా వాకిట మంచమొక్కటిని వాల్చి పితత్తుల క్షుత్తు నార్పగా నూకలు చల్లుచుండనట నూరుల కొద్ది యగౌకసమ్ములే ఏకముతోడ నేకమె యనేకవిధముల నేకమయ్యెనే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పుతత్తులు' ?
ఏకాకిలలన కచ్చటనేకాకియొకడు లభించె నేకాంతమునన్స్వీకారానంతరమునఏకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
వీకము జూపెను దురముననేకములుగనభిశపనములెన్నెదురైనన్సేకములాకర్ణునకుననేకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
లోకంబులెన్నియున్నను లోకేశ్వరుడొక్కనిం దెలుపు యత్నమునన్వైకల్పిక బోధనలున్నేకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
వీకముజూపియాలమున వేవురు జోదుల నేలగూల్చియస్తోకముగా చెలంగ పరితోషణ గూర్చుచు కౌరవేయులన్,శోకమునింపె కర్ణునకు శోధనజేయుచునన్ని శాపముల్ఏకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఏకమ్ము పురుష శుక్రంబేకము స్త్రీ యండము జత యేకము కాఁగా నేకము వుట్టును బిండం బేకమ్మేకమ్ము తోడ నేకమ్మయ్యెన్ ఏకము జీవు నాత్మ చను నీ మహి లోన ననేక రీతులం బ్రాకటమై చ రాచర విభాగముగాఁ బర మాత్మ యుండుఁ దానేక మనేక జీవుల వసించును ద్రష్టగ లోన నేకమై యేకము తోడ నేకమె యనేక విధమ్ముల నేక మయ్యెనే
భీకరమైన చెయ్దముల వేవురు పౌరుల కొల్లగొట్టుచున్చేకుఱ చేయ కష్టముల చిందరవందర చేసి మ్లేచ్ఛులేశ్రీకరముల్ ఘటిల్లగను చేరిరి వారల పారఁద్రోలగానేకము తోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే
ఆ కమలాక్షుడొక్కడె జగంబున నెల్లరి మానసంబులన్ ప్రాకటమై చెలంగు గద భాసుర చిన్మయ ప్రాణ దీపమైయేకతమాడ తెల్లమగునెన్నికగా పరమాత్మ తత్వమం దేకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే
కం:ఏకేశ్వర వాది యె యల్లాకే జేయుచు నమాజు నన్యు దలచ చీకాకొందు వధువు బొందెగఏక మ్మేకమ్ము తోడ నేక మ్మయ్యెన్.(అతడు బ్రహ్మసమాజ మతస్తుడు.ఏకేశ్వరోపాసకుడు.ఆమె మహమ్మదీయురాలు కనుక ఆమె ది కూడా ఏకేశ్వరవాదమే.ఈ ఏకం జ ఏకము ఏకమయ్యాయి.)
ఉ:ఏ కులమో యెరుంగ,మరి యీతని పేరట యేకలవ్య తానే కుల మన్న చెప్ప దిది యీమెకు పే రట యేకవీర వారేకమె సర్వ భావముల నిప్పుడు పెండ్లికి సిద్ధ మైరి గాఏకము తోడ నేకమె యనేకవిధమ్ముల నేక మయ్యెనే!(అమ్మాయి పేరు ఏకవీర.అబ్బాయి పేరు ఏకలవ్య.వాళ్లు )
ఈకాయమునందుగలవునేకంబుగనొక్కచోటె యిదినిక్కంబౌనేకమ్మవగానొకచో*"ఏకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్”*
కందం
రిప్లయితొలగించులోకేశ్వరి తపియించియు
సాకారముసేయ మరుడు సంతోషమునన్
లోకైకదైవమొప్పఁగ
నేకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
ఉత్పలమాల
తొలగించులోకములేలు శంకరుని లోక శుభంకరి భక్తిగొల్చుచున్
జేకుఱఁ జూడ మన్మథుని సేవలఁ బొంది వివాహమాడగన్
శ్రీకరి కాదిదేవుడు విశేషమనన్ సగదేహమీయఁగా
నేకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించు🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించుఏకముగాగనుపురుషుఁడు
రిప్లయితొలగించుప్రాకటముగతానునొక్కపడతినికోరెన్
చేకొనెబిడ్డనునొకనిని
ఏకమ్మేకమ్ముతోడనేకమ్మయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుపీకల దాక పసాపడి
వాకిట మంచమ్మువాల్చి పవళించుచు నే
నాకాశము గన తారక
లేకమ్మేకమ్ము తోడనేకమ్మయ్యెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునాకొక సంతు కొమరితయె ,
రిప్లయితొలగించునీకును సంతు సుతుడొకడె ,
నెయ్యము నిలుపన్
జోకకు పెండిలి సలుపగ
ఏకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచేకొనసృష్టియర్థమునుచెన్నుగమూలమునొక్కరేణువున్
రిప్లయితొలగించుపాకముఁజేసెబ్రహ్మనహపార్థివదేహమనేకరూపులన్
లోకములెన్నియోగలవులోపలదాగెపరాత్పరుండనన్
ఏకముతోడనేకమేయనేకవిధములనేకమయ్యెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించులోకమునందు మానవులలోగల
రిప్లయితొలగించుమిక్కిలి కోర్కెయొక్కటే
లోకులుమెచ్చ పెండిలి సులోచనతోడను
గూడి యాడియున్
బ్రాకటమొప్ప బిడ్డలను భాగ్యము
బొందియు సంతసించుగా
ఏకముతోడ నేకమె యనేక విధమ్ముల
నేకమయ్యనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకందం
రిప్లయితొలగించుఏక కణము తోడుగనె య
నేక కణప్రాణులుగ జనించుచు పెరిగెన్
వీకగ పెరిగిన జీవులు
ఏకమ్మేకమ్ము తోడ నేకమ్మయ్యెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచేకొని బాలుని దత్తకు
రిప్లయితొలగించుసాకియు పెండిలికి వెదికె చక్కని చుక్కన్
మేకొని యిరువురు నొకటై
యేక మ్మే కమ్ము తోడ నేక మ్మ య్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఆకాశము మబ్బులతో
రిప్లయితొలగించుభీకరమయి గాలి,వాన,పిడుగులు పడ న
స్తోకంబగు వాహినులే
*యేకమ్మేకమ్ముతోడనేకమ్మయ్యెన్.*
భీకరమైన మబ్బులు గుభిల్లు గుభిల్లున పిడ్గుపాటు,ల
స్తోకపు గాలివానలకు తోయములెల్లెడఁబొంగి పొర్ల,ప
ద్మాకరముల్,నదుల్ గలిసి దారిని తీసెను వార్ధిఁజేరగా
నేకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుచీకటి వీగినంతట పచేళిముడా గగనమ్ముజేరగా
వాకిట మంచమొక్కటిని వాల్చి పితత్తుల క్షుత్తు నార్పగా
నూకలు చల్లుచుండనట నూరుల కొద్ది యగౌకసమ్ములే
ఏకముతోడ నేకమె యనేకవిధముల నేకమయ్యెనే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'పుతత్తులు' ?
ఏకాకిలలన కచ్చట
రిప్లయితొలగించునేకాకియొకడు లభించె నేకాంతమునన్
స్వీకారానంతరమున
ఏకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువీకము జూపెను దురమున
రిప్లయితొలగించునేకములుగనభిశపనములెన్నెదురైనన్
సేకములాకర్ణునకున
నేకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించులోకంబులెన్నియున్నను
రిప్లయితొలగించులోకేశ్వరుడొక్కనిం దెలుపు యత్నమునన్
వైకల్పిక బోధనలు
న్నేకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువీకముజూపియాలమున వేవురు జోదుల నేలగూల్చియ
రిప్లయితొలగించుస్తోకముగా చెలంగ పరితోషణ గూర్చుచు కౌరవేయులన్,
శోకమునింపె కర్ణునకు శోధనజేయుచునన్ని శాపముల్
ఏకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఏకమ్ము పురుష శుక్రం
రిప్లయితొలగించుబేకము స్త్రీ యండము జత యేకము కాఁగా
నేకము వుట్టును బిండం
బేకమ్మేకమ్ము తోడ నేకమ్మయ్యెన్
ఏకము జీవు నాత్మ చను నీ మహి లోన ననేక రీతులం
బ్రాకటమై చ రాచర విభాగముగాఁ బర మాత్మ యుండుఁ దా
నేక మనేక జీవుల వసించును ద్రష్టగ లోన నేకమై
యేకము తోడ నేకమె యనేక విధమ్ముల నేక మయ్యెనే
భీకరమైన చెయ్దముల వేవురు పౌరుల కొల్లగొట్టుచున్
రిప్లయితొలగించుచేకుఱ చేయ కష్టముల చిందరవందర చేసి మ్లేచ్ఛులే
శ్రీకరముల్ ఘటిల్లగను చేరిరి వారల పారఁద్రోలగా
నేకము తోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే
ఆ కమలాక్షుడొక్కడె జగంబున నెల్లరి మానసంబులన్
రిప్లయితొలగించుప్రాకటమై చెలంగు గద భాసుర చిన్మయ ప్రాణ దీపమై
యేకతమాడ తెల్లమగునెన్నికగా పరమాత్మ తత్వమం
దేకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే
కం:ఏకేశ్వర వాది యె య
రిప్లయితొలగించుల్లాకే జేయుచు నమాజు నన్యు దలచ చీ
కాకొందు వధువు బొందెగ
ఏక మ్మేకమ్ము తోడ నేక మ్మయ్యెన్.
(అతడు బ్రహ్మసమాజ మతస్తుడు.ఏకేశ్వరోపాసకుడు.ఆమె మహమ్మదీయురాలు కనుక ఆమె ది కూడా ఏకేశ్వరవాదమే.ఈ ఏకం జ ఏకము ఏకమయ్యాయి.)
ఉ:ఏ కులమో యెరుంగ,మరి యీతని పేరట యేకలవ్య తా
రిప్లయితొలగించునే కుల మన్న చెప్ప దిది యీమెకు పే రట యేకవీర వా
రేకమె సర్వ భావముల నిప్పుడు పెండ్లికి సిద్ధ మైరి గా
ఏకము తోడ నేకమె యనేకవిధమ్ముల నేక మయ్యెనే!
(అమ్మాయి పేరు ఏకవీర.అబ్బాయి పేరు ఏకలవ్య.వాళ్లు )
ఈకాయమునందుగలవు
రిప్లయితొలగించునేకంబుగనొక్కచోటె యిదినిక్కంబౌ
నేకమ్మవగానొకచో
*"ఏకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్”*