28, మే 2022, శనివారం

సమస్య - 4093

29-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాంగేయుఁడు పెండ్లియాడి కనె సత్సుతులన్”
(లేదా...)
“గాంగేయుండు వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్”

25 కామెంట్‌లు:

  1. గంగా! యేమను చుంటివి?
    గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్
    గాంగేయు సుతుల జూచితె!
    భంగములౌ మాటలకట పలుకందగునే

    రిప్లయితొలగించండి

  2. అంగన యంబాలిక తన
    యుంగని విరిబోడి పృథయె యుక్తంబా శం
    పాంగిని చెపట్టుమనగ
    గాంగేయుడు, పెండ్లియాడి కనె సత్సుతులన్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    అంగనలు కుంతి మాద్రులుఁ
    గొంగుముడులఁ బాండురాజుఁ గొన, దీవింపన్
    పొంగిన వాత్సల్యమ్మున
    గాంగేయుఁడు, పెండ్లియాడి కనె సత్సుతులన్

    శార్దూలవిక్రీడితము
    సింగారంబుగ కుంతిమాద్రిఁగొనియున్ జేరంగ నవ్వేదిపై
    కొంగుల్ రెండును గట్టివైచ ముడులన్ కోలాహలంబందునన్
    బొంగన్రాగము బాండురాజు పయినన్ ముందుండి దీవింపఁగన్
    గాంగేయుండు, వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్

    రిప్లయితొలగించండి
  4. గాంగేయుండు వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్”
    గంగా! యేమిగ మాట లాడితివి హా గాంగేయు కున్ బుత్రు లా
    గంగా సూనుని పుత్రు లందరినికన్ గాంతున్ సు చూపించుమా
    భంగంబున్ గలిగించు మాటలకటా పల్కంగ భావ్యంబునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గంగా యేమిటు మాటలాడితివి' అనండి.

      తొలగించండి
  5. అంగమ్మందున కుంతి మాద్రులిలలో నగ్ర్యమ్ము చేపట్టగా

    నంగీకారము తెల్పుమంచు సుతుడభ్యర్థింపగా మోదమున్

    గంగారెందుకుసంతసమ్మదియె సత్కార్యమ్మటంచొప్పెనే

    గాంగేయుండు, వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్.

    రిప్లయితొలగించండి
  6. గాంగేయ నామధారికి
    బంగారపు బొమ్మ వంటి భామామణినే సింగారించియుఁజూపగ
    *గాంగేయుఁడు పెండ్లియాడి కనె సత్సుతులన్.*

    గాంగేయుండన భీష్ముఁడౌ నతఁడు దీక్షా దక్షుడౌ వర్ణియే
    గంగాశంతన సూనుఁడై వరలె నా గాంగేయు నామంబు మా
    రంగారావును పెట్టె పుత్రునకు నౌరా!రూపజిత్ కంతుఁడా
    *గాంగేయుండు వివాహమాడి కనె పెక్కండ్రైన సత్పుపుత్రులన్.*

    రిప్లయితొలగించండి
  7. సంగరమును జేసెనుగద
    గాంగేయుఁడు ; పెండ్లియాడి కనె సత్సుతులన్
    సంగతి వినినంతనె నా
    యంగన శంతనుని వివహమాడిన పిదపన్

    రిప్లయితొలగించండి
  8. గంగా! గంగా! వినువిను
    'గాంగేయుఁడు పెండ్లియాడి కనె సత్సుతులన్'
    రంగుల కలకంటిననుచు
    వెంగలివలె పల్కెనతడు వేసట పడుచున్

    రిప్లయితొలగించండి
  9. గంగకు సుతుడు జనింపగ
    గాంగేయుం డనుచు నామ కరణ ము సేయన్
    పొంగిన యౌ వన మందున
    గాంగే యుడు పెండ్లి యాడి కనె సత్సుతు లన్

    రిప్లయితొలగించండి
  10. గాంగేయుని భక్తుఁడతడు
    సంగతమేర్పడెను సుదతి శాంతామణితో
    నంగీకరింపఁ గలలో
    గాంగేయుఁడు, పెండ్లియాడి కనె సత్సుతులన్

    రిప్లయితొలగించండి
  11. అంగారమ్ములు భూనభోంతరములందాకంపనన్ దెచ్చినన్
    పొంగుల్వారిన నింకిపోయిననునంభో రాశులే పెట్టునన్
    భంగంబెన్నడు చేయబోడు ప్రతినన్, భావింతువీవెట్లు దా
    గాంగేయుండు వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్?

    రిప్లయితొలగించండి
  12. కందం
    గంగా శంతన పుత్రుడు
    గాంగేయుడు, పెండ్లి యాడి కనె సత్సుతులన్
    మంగళ రూపిణి కుంతి సు
    సంగతమున పాండురాజు సాన్నిధ్యమునన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  13. సంగాసక్తినివీడెభీష్ముడునుసంసద్వర్తరాముండునై
    భృంగానేకమనోవిలాసములుతాభృత్యుల్వలెన్జూడగా
    అంగాంగంబునశేషవాంఛలవిబ్రహ్మంబందుదీపింపగా
    గాంగేుండువివాహమాడికనెఁబెక్కంరైనసత్ప్త్రులన్

    రిప్లయితొలగించండి
  14. సంగర మందు నఙేయుఁ డ
    భంగ యశస్వి యగు పాండు పతి, సూడఁగ న
    య్యంగనలఁ గుంతి మాద్రిని
    గాంగేయుఁడు, పెండ్లియాడి కనె సత్సుతులన్


    గాంగేయుండు షడాననుండు మఱి గంగా పుత్రుఁడే కాక తా
    నంగారప్రభవుండు నాఱుగురు సత్యం బెంచఁగా నంబ లె
    బ్భంగిం గాంచిన నుత్తముం డమర సద్బంధుండు శాఖాదిగా
    గాంగేయుండు వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్

    రిప్లయితొలగించండి
  15. అంగీకారము దెల్పి దీక్షగ వివాహంబుత్సృజించెన్ గదా
    గాంగేయుండు, వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్
    భంగంబైనను పిండమున్ నిలుపగా భాండంబులన్ వ్యాసుడే
    పొంగారన్ ధృతరాష్ట్రుడా కురు కులంబున్ నిల్పె దా వంతుగా

    రిప్లయితొలగించండి