26, మే 2022, గురువారం

దత్తపది - 183

27-5-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
'పంది - కిరి - కిటి - సూకరము'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
గోమాతను స్తుతిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

33 కామెంట్‌లు:

  1. వాకిటికందమునిచ్చును
    చాకిరిఁజేయుచుశుభమిడుచాలగమెచ్చన్
    పాకనుపందిరిగోవును
    తోకవసూకరముగనగధర్మముతానై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోకవసూకరము' ?

      తొలగించండి
    2. గోవుతోకచూచినచోసంపదలుసిద్ధంచును
      తోకయందులక్ష్మియుండునుగదా
      వసు అనగా ధనము అనునర్ధమున వ్రాసితిని

      తొలగించండి
  2. తోకవసూకరముగనగతొయ్యలిలక్ష్మై

    రిప్లయితొలగించండి
  3. కరుమపు సా(కిరి) కన్న‌ముందు నిదుర లేచి జనులకు‌పాలిడెడి జీవి,

    వా(కిటి) ముందర వనితలు గొబ్బెమలను తన‌ పేడతో ఘనత తోడ,


    పెట్టి పూజించగ ప్రేమను చూపెడి పుణ్య జీవిగ గోవు,పొట్ట లోన

    దేవత లుండిన దివ్యజీవి యెతాను, కలుగదు కో(పం,ది) గులు బడయక

    ముదముతో నుండు (సూకర, ము)సలి తనము

    వచ్చినను‌ యజ. మానికి‌ పాల‌నిచ్చి

    తనదు రుణము తీర్చుచు ఘనత కూడి

    నట్టి పశువు గోవుయె గదా పట్టి చూడ


    సూకర. ఆవు
    కరుమపు సాకిరి సూర్యుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సాప్ సమూహంలో నా వ్యాఖ్యను గమనించండి

      తొలగించండి

  4. పోకిరి వాడని యెంచక
    వాకిటి వాని పిలుపంది వచ్చెడి గోమా
    తా! కరములు మోడ్చెదనే
    సూ కరమే నీదు సేవ సురభివి నీవే.

    రిప్లయితొలగించండి
  5. సాధు జంతువై రూపంది జగతి వెలయ
    సాకిరి గద గో మాతను సంతు వోలె
    వాకిటి నిలువ పూ జింత్రు వనిత లెల్ల
    నిజము సూ కరము గ నండ్రు నేర్పు మీర

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    గడ్డి మే*పంది*ని యొసగు గాదె పాలు
    పలి*కిరి*ల నెందఱో సాధు వర్తన యని
    వా*కిటి*కి ముందు సురభియై వరలు గాదె
    యిదియె*సూ!,కరము*ఘనసంపదలొసంగు.

    రిప్లయితొలగించండి
  7. కసవు మెసవి చేయు కనలక చాకిరి
    రక్ష గోవుసూ కరములుమోడ్తు
    పాలనిచ్చిగాచువాకిటివేలుపు
    పాపలకది చలువ పందిరిగన

    రిప్లయితొలగించండి
  8. కందం
    వాకిట నిల్చి సిరులిడున్
    తాకగ సాకిరిగ నిల్చె తాత బులుపుకున్
    ఆకలి తాపం దీర్చును
    సూ, కరమున గల సుగుణపు సూచిక గోవున్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.
    సాకిరి-సాక్ష్యం,తాత-బ్రహ్మ, సూ-చూడగ.

    రిప్లయితొలగించండి
  9. గోవుల, వల *పంది* కోడెలపయిన *సూ!
    కరము* తృప్తి తోడ గ్రామములను
    సా *కిరి* పొలములను సాగ సేద్య మచట
    పు *క్కిటి* సతివాడు దిక్కునొసగ
    పుక్కిటిసతివాడు : బ్రహ్మ

    రిప్లయితొలగించండి
  10. కందం
    చేపంది క్షీరము సుధగఁ
    బాపును పోకిరితనమ్ము బాలలు ద్రావన్
    మీపుర వాకిటి వేల్పుల
    రూపమనఁగ సూ! కరమ్ము రోహిణి ప్రోచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రూప మనఁగఁ జూ - అనుట సాధువు. ఇక్కడ ద్రుత సంధి వర్తించునండి. గసడదవాదేశ సంధి రాదు.

      తొలగించండి
  11. వా(కిటి) కెదుట గోవుకు వాస మమర
    జేసి ధూ(పం ది)రుప , న చేతనముగ
    నిలువగ తల (సూ కరము) తో నిమురు చుండి
    మోదముగ చా( కిరి) సలిపి మొక్కు చుందు

    రిప్లయితొలగించండి
  12. తే. గీ. చలువ పందిరి నీడను కొలువు తీరు
    పోకిరి తన మెఱుగనట్టి పుణ్య మూర్తి
    నీవు! వాకిటి లోపల నిలిచి నంత
    సూ! కరమగు, నుతులు నీకు సురభి మాత!
    మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  13. సా*కిరి* గోవును సదనపు
    వా*కిటి* ముందుంచి చేసి వాసిగ పూజల్
    తోకను ముట్టగ *పంది*రి
    తాకగ *సూ కరము* లెత్తి దండమిడి రటన్

    రిప్లయితొలగించండి
  14. వాకిటి లోనికి రిక్కగ
    దూఁకినఁ బఱుపం దిని తమిఁ దోరంపుఁ ద్రుణం
    బాఁకలి తీరంగ సురభి
    సూ కరము కురియును బాలు శుద్దము లార్యా

    రిప్లయితొలగించండి
  15. (పంది)యమన జం(కిరి) విను
    సందియమే లేదు గోవు జగదీశ్వరియౌ
    ముందిడ పిడి(కిటి) బియ్యం
    బందించు ప్ర(సూ కరము)ల కగణిత వరముల్

    రిప్లయితొలగించండి

  16. వాకిటిలోన గట్టినను పాడగు లోగిలి, పాకవేసినన్

    చాకిరి జేయజాలనని సాకును చూపితి గాని గోవులే

    శ్రీకరమందజేయునని శ్రేష్ఠుల దౌ పిలుపంది వెంటనే

    సూ కరమైనకార్యమని చువ్వన దెచ్చితి భక్తితోడ నే

    సాకగ సౌరభేయమదె సాగరపుత్రి యటంచు నమ్ముచున్.

    రిప్లయితొలగించండి
  17. వాకిటి కెదురుగ నిలబడ
    సాకిరి నిను బ్రేమతోడ సంతువె యనుచున్
    మాకిక,పందిరి ఱాటకె
    సూ ,కరము న్గట్టనిన్ను సురభీ మాతా!

    రిప్లయితొలగించండి