10, మే 2022, మంగళవారం

సమస్య - 4076

11-5-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాముకులై కంట బడిరి గద మౌనివరుల్”
(లేదా...)
“కామకళావిశారదులుగాఁ గనుపించిరి మౌనులెల్లరున్”

21 కామెంట్‌లు:

 1. కందం
  కామకళల శాస్త్రములన్
  సామాన్యులకందు నటుల సాహసమనుచున్
  ప్రేమగ రచించి జూపగ
  కాముకులై కంట బడిరి గద మౌనివరుల్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 2. కందం
  హోమాలాదిగఁ జేయుచు
  భామామణుల గన వీర్య పతనంబగుచున్
  సామాన్యులవలె లొంగెడు
  కాముకులై కంట బడిరి గద మౌనివరుల్!

  ఉత్పలమాల
  హోమములాదిగన్ దపము నొప్పెడు రీతిగఁ జేయువాడనన్
  వ్యోమతలమ్ము వీడి తన యుచ్చున మేనక కౌశికున్ గొనన్
  భామకులొంగి భూమిఁ బది వత్సరముల్ రసకేళిఁ దేలఁగన్
  కామకళావిశారదులుగాఁ గనుపించిరి మౌనులెల్లరున్!

  రిప్లయితొలగించండి
 3. నీమముతప్పని తపమును
  ధీమతులై యాచరించి తీరా వలరా
  జే మదిగెలుపొందిన తరి
  కాముకులై కంట బడిరి గద మౌనివరుల్

  రిప్లయితొలగించండి
 4. ధామము వీడి శ్రద్ధమెయి ధ్యానమొ
  నర్చుచు గాననంబునన్
  నీమముతోడ నిశ్చలన నిర్మల చిత్తము
  తో దపస్సులన్
  గామిత కార్యసిద్ధికయి కన్నులు మూసియు
  చేయుచున్న ని
  ష్కామకళా విశారదులుగా గనిపించిరి
  మౌనులెల్లరున్

  రిప్లయితొలగించండి

 5. కామక్రోధముల విడిచి
  నేమముతో ననవరతము నిష్ఠగ తామా
  రాముని కొలుచు సదాగతి
  కాముకులై కంటబడిరి గద మౌనివరుల్.

  రిప్లయితొలగించండి
 6. కామాదులవర్జించుచు
  నేమముతోడనుసతతమునీలాపతియౌ
  కామపితనుకొలుచుచు ని
  ష్కాముకులై కంటబడిరి గద మౌనివరుల్.

  రిప్లయితొలగించండి
 7. నీమము న తపము సేయుచు
  కామమునకు దూర మగుచు గనపడు వారిన్
  పామరులై పలుక నెచట
  కాముకులై కంట బడిరి గద మౌని వరుల్?

  రిప్లయితొలగించండి

 8. ఏమని చెప్పమందువు మహీతలమందున స్వార్థజీవులే

  వామము పొందు మార్గముగ భ్రష్టులు ముక్తి పథమ్ము జూపుచున్

  క్షేమమొసంగువారమని చెప్పుచు భామల గూడు చుండెడిన్

  గామకళా విశారదులుగాఁ గనుపించిరి మౌనులెల్లరున్.

  రిప్లయితొలగించండి
 9. రాముఁడు దండక వనికిన్
  సౌమిత్రిని సీతఁగూడి చనగానచటన్
  భామిని!రాక్షస నాశన
  కాముకులై కంటఁబడిరిగద మౌనివరుల్.

  రిప్లయితొలగించండి
 10. స్వాములు వారెన్నడు ని
  ష్కాములు భవబంధనములు కాంక్షింపకనే
  భామల గననట్టి యభవ
  కాముకులై కంట బడిరి గద మౌనివరుల్

  రిప్లయితొలగించండి
 11. నీమముతోడ కారడవి నిశ్చలురై తపమాచరించునా
  స్వాముల దీక్ష భగ్నపరుపన్ దిగివచ్చిన యప్సరల్ సురల్
  కామకళావిశారదులుగాఁ గనుపించిరి, మౌనులెల్లరున్
  కామవికార బద్ధులుగ గాంచగనైతిరి పన్నిదమ్ముగన్

  రిప్లయితొలగించండి
 12. శ్రీమహనీయమౌ చలన చిత్రమునందునఁగాంచినాను,సు
  త్రాముఁడు కొల్వుదీఱగను రంభ,ఘృతాచి వరాప్సరాంగనల్
  *కామకళావిశారదులుగా గనుపించిరి;మౌనులెల్లరున్*
  నీమముతో హరిస్మరణ నిత్యమొనర్చుచు నుండిరచ్చటన్.

  రిప్లయితొలగించండి
 13. పామరులు సలుపు చుండిన
  గామిడి తనమును నిరతము గాంచగ బుట్టన్ ,
  బామము నుండి విమోచన
  కాముకులై కంట బడిరి గద మౌనివరుల్

  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  నీమముతో పరమాత్మను
  ప్రేమయు భక్తియు కలిగిన వేలల తోడన్
  గోముగ నెంచుచు మోక్షా
  కాముకులై కంటబడిరి గద మౌనివరుల్!

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  కామవికారమున్ కడపి గణ్యమునైన పరంపదమ్ముకై
  నీమము వీడకున్ హరిని నిశ్చల భక్తిని సంస్తుతించుచున్
  తాముగ భీకరాటవిని ధ్యానము జేయుచు చూచునంత ని
  ష్కామకళా విశారదులుగా గనిపించిరి మౌనులెల్లరున్.

  రిప్లయితొలగించండి
 16. క్షేమము గూర్చ జీవులకు చేయుచు నుందురు కాననమ్ములన్
  హోమములన్ మునీద్రులు మహోన్నతమైన సదాశయమ్ముతో
  నీమముతోడ నిత్యమును నిర్మల చిత్తముతోడ, నెంచ ని
  ష్కామకళా విశారదులుగాఁ గనుపించిరి మౌనులెల్లరున్

  రిప్లయితొలగించండి
 17. కం:ప్రేమన్ మేనక యిట్లనె
  కామమ్మున జిక్కినట్టి కౌశికు గనుచున్
  నా మది దోచిన రసికుల్
  కాముకు లై కంట బడిరి కద మౌని వరుల్

  రిప్లయితొలగించండి
 18. ఉ:ఓ మహనీయతాపసజనోత్తములార యిదేమి చోద్యమో
  కామకళా విశారదులు గా గనిపించిరి మౌను లెల్లరున్
  రాముడ నేను,పూరుషుడ రాగము నాయెడ జూప భావ్యమే
  భామిను లై జనించెదరు ద్వాపర మందున నన్ క్షమించుడీ!
  (పుంసాం మోహన రూపుడైన రాముని పట్ల మహర్షులు మోహం పొందగా ద్వాపరం లో వారి ముచ్చట తీరుతుందని రాము డన్నాడు.వారే గోపిక లై జన్మించినట్లు కథ ఉన్నది.)

  రిప్లయితొలగించండి
 19. నీమంబనియెడిమత్తున
  ఆమనిమోక్షంబనుచునుయానముతోడన్
  ధామముజేరెడిమనసున
  కాముకులైకంటబడిరిగదమౌనివరుల్

  రిప్లయితొలగించండి
 20. నామములఁ దనరు హంసలు
  ధీమంతులు నీతు లందు దిట్టలు గిర లం
  దీ మహిఁ గలి కాలమ్మునఁ
  గాముకులై కంటఁ బడిరి గద మౌనివరుల్


  శ్యామల వర్ణ దేహ చర ణాంబురుహ ద్వయ చింతనా రతుల్
  ధామ సతీ కుమార ధన ధాన్య విహీనులు ముక్తి నామక
  శ్రీ మయ హర్ష దుఃఖ సమ చిత్తులు వర్తన మెంచి చూడ ని
  ష్కామ కళా విశారదులుగాఁ గనిపించిరి మౌను లెల్లరున్

  రిప్లయితొలగించండి
 21. ఆ మునివాటికన్ దన నిజాంఘ్రియుగంబును మోప నెమ్మినిన్
  శ్యామల కోమలాంగునఖిలాత్ముని రాముని భవ్య రూపమున్
  వేమరు గాంచి మైమరచి విష్ణుపదామృత మగ్నులౌచు ని
  ష్కామకళావిశారదులుగాఁ గనుపించిరి మౌనులెల్లరున్

  రిప్లయితొలగించండి