6-5-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తామరలలోనఁ గననగుఁ దారకలను”(లేదా...)“తామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో”
మేటి తారలుగ వెలుగ మించు గంటులంత మారిరి కదర నేడజ్జుకలుగ వేషములనిచ్చెదమనెడు విటులతోడ తామరలలోన గననగుఁ దారకలను (తాము+ అరలలో= తామరలలో {అర = గది} )
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతిఅందమైనట్టి తారలు సిందులొలుకనొప్పె చిత్రసీమను విజయోత్సవ సభముద్దులొల్కెడు కన్నులన్ మొగములనెడుతామరలలోనఁ గననగుఁ దారకలను, ఉత్పలమాలఏమని జేతు వర్ణనల నింపగు వేడుకఁ జిత్రసీమలోఁగోమలులెందరో వగల గుప్పుచు నాడఁగ నేత్ర దీప్తులన్వ్యోమతలమ్ము జార విజయోత్సవ వేదిని భామమోములన్దామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
భానుకిరణమ్ముసోకినభాగ్యమనుచువిచ్చియాడెడిపద్మమ్మువెలసికుందెఉష్ణరేఖలమాడినయువిదవలెనుతామరలలోనఁగననగుఁదారకలను
చక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదములండి
ఏమఱినిద్రబోవుటయనెందునుగానముగ్రీష్మమందునన్ఆమనియందుస్రుక్కుచునుయాయమమునందునవిచ్చుకన్నువింజామరతోడుగానటనచాలనిగేహగవాక్షమూలలన్తామరలందుగాననగుగాననగుఁదారకలింపుగరాత్రివేళలో
సోముడు పూర్ణరూపుడయి సోమము నందున వెల్గనేమి యాకౌముదియే నిదాఘమను కామిని చెంతకు ప్రేమతోడ నాసామియె చేరువేళ కలశస్తిని విస్తృత మైన కన్నులా తామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పొలతుకలు దమ యరలలో బొందు పరచెతళతళ మెరిసే యట్టల తారకలనుఱేయి ని నెగడ , నమ్మిక లేనియెడలదామరలలోనఁ గననగుఁ దారకలనుతాము + అర = తామర
వైవిధ్యమైన పూరణ. అభినందనలు.
చినుకు పడి బిందు రూపమ్ము చెంద గాను తామర ల లోన గననగు : తారకలను రాత్రి వేళను నభమున రమ్య మలర గాంచ వచ్చు నెల్లరు గద కన్నులార
ఆటవెలదివనవిహారమందు వనితనుగాంచియుప్రేమమీఱ నిట్లు ప్రియుడు పలికెలలన!మధువు*తామరలలోనఁగననగుఁదారకలను*మొగులదారిఁగనుమ.
తేటగీతి సమస్యకు ఆటవెలది పూరణ. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తహతహపడుచు నాతడు తనివిదీరగాంచె తారలనెఱి తనకన్నులార!స్వర్గ మనిపించు నా చిత్రశాలకేగతా మరలలోనఁ గననగుఁ దారకలను
🙏
కోమలి!యీకొలంకులనుఁగ్రుమ్మర, తీయనిదౌ మరందమున్తామరలందు గాననగు;దారకలింపుగ రాత్రివేళలోవ్యోమమునందళుక్కను, మహోజ్వల కాంతులనీను చంద్రుడున్కాముడు పూలబాణముల కాఱియబెట్టును పాంథకోటులన్.
మనోహరమైన పూరణ. అభినందనలు.
అంబుజాప్తుడు కలిగించు హర్షమెపుడుతామరలలోనఁ, గననగుఁ దారకలనురమ్యదీప్తుల పున్నమి రాత్రులందు,కనులవిందగు నాప్తులగనినవేళ
అనవరతము కరమున వాట్సప్పని పనిపాటుల నెగవిడచి కడు పాటవమునబొమ్మ సందేశములరయ బుల్లి తెరనితామరలలోనఁ గననగుఁ దారకలను( whatsApp సమాచారములలో పరిభ్రమించు పేర్చి కూర్చినకృత్రిమ చిత్రముల స్ఫూర్తితో)
నిన్నటి పూరణ:చక్కగ సంరక్షణమనిదక్కగ నొక్కిరి విరాళ ధనము ననువునన్ టక్కరి వారలు; అకటా! కుక్కలు గడ్డిఁ దినెఁ; గొనెను గోవు లమిషమున్
తేటగీతిసుందరీమణు లందరు సోయ గాలుప్రతిభ ,సమముగ జూపగ రసిక వీక్షకులు దలచిరి వారల జూచి ,గుమ్మల ముఖతామరల లోన గనదగు తారకలనుప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
భవుని విల్లువిరువరామ భద్రుడచట దవ్వుననిలిచి గాంచెడి తరుణి సీతకేలునందుహారమునొప్ప కెంపు కన్నుతామరలలోను గననగుదారకలను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీమతి కోరగా నరకు చేరితి మిచ్ఛగ రైలు బండిలోకోమలమైనదౌ ప్రకృతి కూర్చగ మోదము, చెంగలింపగాభామినిమానసమ్ము, వడి వాతెఱతో స్పృశియించ కండ్ల కెందామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ఆమణి కాలమందునను హాయిగ గ్రోలి మ రంద మాధురుల్యామిని వేళలో నిదుర యాయలి జాతులుపోవు, ప్రొద్దునన్దామరలందు గానదగు, దారక లింపుగ రాత్రి వేళలోకోమలికంబుగా గగన గోళములో గనిపించుచూడగన్.
గ్రహ నికాయము తారకా గణము లడరుచుండ నిత్యమ్ము తిరుగుచు నండ మందు వెలుఁగు చుండు నఖిలములు విశ్వ మందుఁ దా మరల లోనఁ గన నగుఁ దారకలను [తాము + అరల = తా మరల; తాము = తారకలు; అరలు = వ్యాపించు; లోన: ఇక్కడ విశ్వమందు ]ఈ మహి నున్న వింతల నెఱింగి వచింప నశక్యమే పరంధామున కైన శంకర విధాతల కైనను గాంచఁ బున్నమిన్ నీ మది సంతసింపఁగ ననేకము లుండఁగ నీటి గోళముల్ తామర లందుఁ గాన నగుఁ దారక లింపుగ రాత్రి వేళలో
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
ఉ:కోమలి వెన్నెలందు పలు కోర్కెలతో శయనించి చంద్రునిన్బ్రేమగ జూచుచుండ విను వీధిన నిండిన తార లెల్ల శోభామయ రూపముల్ గలిగి భామకు గన్ పడె నట్టి భామ కన్దామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. "వీధిని" అనండి.
తే.గీ:స్వచ్చమౌ నీరు కల యట్టి సరము నందుపద్మపత్రాల పై నీరు పడుచు నుండనా శరద్రాత్రి తారలు నంద మొలుకదామరల లోన గన నగు తారకలను
ఆమని యేగుదెంచె గనుమా వన సీమ రసాలసాలముల్కోమల పల్లవాంశుకము గుర్వుగ దాల్చె, సరంబదేను కెందామరలందుఁ గాననగుఁ, దారక లింపుగ రాత్రివేళలోసోముని గూడి వెల్వఱచు సొంపగు వెన్నెల చెల్వుమీరగా
రిప్లయితొలగించండిమేటి తారలుగ వెలుగ మించు గంటు
లంత మారిరి కదర నేడజ్జుకలుగ
వేషములనిచ్చెదమనెడు విటులతోడ
తామరలలోన గననగుఁ దారకలను
(తాము+ అరలలో= తామరలలో {అర = గది} )
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఅందమైనట్టి తారలు సిందులొలుక
నొప్పె చిత్రసీమను విజయోత్సవ సభ
ముద్దులొల్కెడు కన్నులన్ మొగములనెడు
తామరలలోనఁ గననగుఁ దారకలను,
ఉత్పలమాల
ఏమని జేతు వర్ణనల నింపగు వేడుకఁ జిత్రసీమలోఁ
గోమలులెందరో వగల గుప్పుచు నాడఁగ నేత్ర దీప్తులన్
వ్యోమతలమ్ము జార విజయోత్సవ వేదిని భామమోములన్
దామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిభానుకిరణమ్ముసోకినభాగ్యమనుచు
రిప్లయితొలగించండివిచ్చియాడెడిపద్మమ్మువెలసికుందె
ఉష్ణరేఖలమాడినయువిదవలెను
తామరలలోనఁగననగుఁదారకలను
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండి
తొలగించండిఏమఱినిద్రబోవుటయనెందునుగానముగ్రీష్మమందునన్
రిప్లయితొలగించండిఆమనియందుస్రుక్కుచునుయాయమమునందునవిచ్చుకన్నువిం
జామరతోడుగానటనచాలనిగేహగవాక్షమూలలన్
తామరలందుగాననగుగాననగుఁదారకలింపుగరాత్రివేళలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసోముడు పూర్ణరూపుడయి సోమము నందున వెల్గనేమి యా
కౌముదియే నిదాఘమను కామిని చెంతకు ప్రేమతోడ నా
సామియె చేరువేళ కలశస్తిని విస్తృత మైన కన్నులా
తామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపొలతుకలు దమ యరలలో బొందు పరచె
రిప్లయితొలగించండితళతళ మెరిసే యట్టల తారకలను
ఱేయి ని నెగడ , నమ్మిక లేనియెడల
దామరలలోనఁ గననగుఁ దారకలను
తాము + అర = తామర
వైవిధ్యమైన పూరణ. అభినందనలు.
తొలగించండిచినుకు పడి బిందు రూపమ్ము చెంద గాను
రిప్లయితొలగించండితామర ల లోన గననగు : తారకలను
రాత్రి వేళను నభమున రమ్య మలర
గాంచ వచ్చు నెల్లరు గద కన్నులార
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండివనవిహారమందు వనితనుగాంచియు
ప్రేమమీఱ నిట్లు ప్రియుడు పలికె
లలన!మధువు*తామరలలోనఁగననగుఁ
దారకలను*మొగులదారిఁగనుమ.
తేటగీతి సమస్యకు ఆటవెలది పూరణ. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితహతహపడుచు నాతడు తనివిదీర
రిప్లయితొలగించండిగాంచె తారలనెఱి తనకన్నులార!
స్వర్గ మనిపించు నా చిత్రశాలకేగ
తా మరలలోనఁ గననగుఁ దారకలను
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికోమలి!యీకొలంకులనుఁగ్రు
రిప్లయితొలగించండిమ్మర, తీయనిదౌ మరందమున్
తామరలందు గాననగు;దారకలింపుగ రాత్రివేళలో
వ్యోమమునందళుక్కను, మహోజ్వల కాంతులనీను చంద్రుడున్
కాముడు పూలబాణముల కాఱియబెట్టును పాంథకోటులన్.
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఅంబుజాప్తుడు కలిగించు హర్షమెపుడు
రిప్లయితొలగించండితామరలలోనఁ, గననగుఁ దారకలను
రమ్యదీప్తుల పున్నమి రాత్రులందు,
కనులవిందగు నాప్తులగనినవేళ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనవరతము కరమున వాట్సప్పని పని
రిప్లయితొలగించండిపాటుల నెగవిడచి కడు పాటవమున
బొమ్మ సందేశములరయ బుల్లి తెరని
తామరలలోనఁ గననగుఁ దారకలను
( whatsApp సమాచారములలో పరిభ్రమించు పేర్చి కూర్చిన
కృత్రిమ చిత్రముల స్ఫూర్తితో)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిన్నటి పూరణ:
రిప్లయితొలగించండిచక్కగ సంరక్షణమని
దక్కగ నొక్కిరి విరాళ ధనము ననువునన్
టక్కరి వారలు; అకటా!
కుక్కలు గడ్డిఁ దినెఁ; గొనెను గోవు లమిషమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిసుందరీమణు లందరు సోయ గాలు
ప్రతిభ ,సమముగ జూపగ రసిక వీక్ష
కులు దలచిరి వారల జూచి ,గుమ్మల ముఖ
తామరల లోన గనదగు తారకలను
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభవుని విల్లువిరువరామ భద్రుడచట
రిప్లయితొలగించండిదవ్వుననిలిచి గాంచెడి తరుణి సీత
కేలునందుహారమునొప్ప కెంపు కన్ను
తామరలలోను గననగుదారకలను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీమతి కోరగా నరకు చేరితి మిచ్ఛగ రైలు బండిలో
రిప్లయితొలగించండికోమలమైనదౌ ప్రకృతి కూర్చగ మోదము, చెంగలింపగా
భామినిమానసమ్ము, వడి వాతెఱతో స్పృశియించ కండ్ల కెం
దామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆమణి కాలమందునను హాయిగ గ్రోలి మ
రిప్లయితొలగించండిరంద మాధురుల్
యామిని వేళలో నిదుర యాయలి జాతులు
పోవు, ప్రొద్దునన్
దామరలందు గానదగు, దారక లింపుగ
రాత్రి వేళలో
కోమలికంబుగా గగన గోళములో గనిపించు
చూడగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగ్రహ నికాయము తారకా గణము లడరు
రిప్లయితొలగించండిచుండ నిత్యమ్ము తిరుగుచు నండ మందు
వెలుఁగు చుండు నఖిలములు విశ్వ మందుఁ
దా మరల లోనఁ గన నగుఁ దారకలను
[తాము + అరల = తా మరల; తాము = తారకలు; అరలు = వ్యాపించు; లోన: ఇక్కడ విశ్వమందు ]
ఈ మహి నున్న వింతల నెఱింగి వచింప నశక్యమే పరం
ధామున కైన శంకర విధాతల కైనను గాంచఁ బున్నమిన్
నీ మది సంతసింపఁగ ననేకము లుండఁగ నీటి గోళముల్
తామర లందుఁ గాన నగుఁ దారక లింపుగ రాత్రి వేళలో
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఉ:కోమలి వెన్నెలందు పలు కోర్కెలతో శయనించి చంద్రునిన్
రిప్లయితొలగించండిబ్రేమగ జూచుచుండ విను వీధిన నిండిన తార లెల్ల శో
భామయ రూపముల్ గలిగి భామకు గన్ పడె నట్టి భామ కన్
దామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"వీధిని" అనండి.
తే.గీ:స్వచ్చమౌ నీరు కల యట్టి సరము నందు
రిప్లయితొలగించండిపద్మపత్రాల పై నీరు పడుచు నుండ
నా శరద్రాత్రి తారలు నంద మొలుక
దామరల లోన గన నగు తారకలను
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఆమని యేగుదెంచె గనుమా వన సీమ రసాలసాలముల్
రిప్లయితొలగించండికోమల పల్లవాంశుకము గుర్వుగ దాల్చె, సరంబదేను కెం
దామరలందుఁ గాననగుఁ, దారక లింపుగ రాత్రివేళలో
సోముని గూడి వెల్వఱచు సొంపగు వెన్నెల చెల్వుమీరగా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి