30, మే 2022, సోమవారం

సమస్య - 4095

31-5-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్”
(లేదా...)
“కొమరాలందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్”

25 కామెంట్‌లు:


 1. పెరిమిని నెత్తుకువచ్చెను
  నరకాంతను ప్రభువటంచు నక్తంచరులా
  విరిబోడిని గని తలచిరి
  తరుణికి నందమ్ము నొసఁగు దలపైఁ గొమ్ముల్.

  రిప్లయితొలగించండి
 2. అరయగ వినయము జూపుటె
  తరుణికి నందమ్ము నొసఁగుఁ ; దలపైఁ గొమ్ముల్
  పెరిగి నటుల నడచుకొనిన
  మొరటుగ నుండన్ భరించ పొసగదు గదరా

  రిప్లయితొలగించండి
 3. నేటి సమస్య కందములో

  నా పూరణ. సీసములో


  తరుణికి నందమ్ము‌ నొసగు తలపై కొమ్ముల్


  దశరథ తనయండు థర్మ నిరతుడగు
  రాఘవున్ మనువాడ రమ్య గతిని

  సుందర రూపివై సోయగములు జూప
  మాయను తెలియని‌ మానవుడను

  నేకాను, మానుము నీ పనుల్, రావణ
  సోదరీ‌ తలలోన‌ సుమము లేల


  దనుజ ( *తరుణికి నందమ్మునొసగు తల. పై* *కొమ్ములె* )ప్పుడు భంగ పడక

  చూప వలయునీ విప్పుడు సుందరమగు

  రూపమును‌ మాని రక్కసి రూప మనుచు

  ముక్కు చెవులను‌ సౌమిత్రి గ్రక్కున దును

  మంగ శూర్పణఖ నెగిరె చెంగు మనుచు

  రిప్లయితొలగించండి
 4. అరెరే!ఘనధమ్మిల్లము
  *తరుణికి నందమ్ము నొసఁగుఁదలపై,కొమ్ముల్*
  పరువపు గిత్తకు నందము
  హరివిల్లే యందమొసఁగు నంబరమునకున్.

  రిప్లయితొలగించండి
 5. విరబూయు కేశసంపద
  తరుణికి నందమ్ము నొసగు, దలపైగొమ్ముల్
  బరగెడు భామల యెడలను
  బరుషముగా నుండునెడల బంధములు సెడున్

  రిప్లయితొలగించండి

 6. సుమముల్ రాశిగ పోసినట్లు కడు నాజూకైన శంపాంగినే

  మమకారమ్మున తెచ్చె సంయమనుడా మర్త్యాంగనన్, గాంచగన్

  దమితోనేగిరి రాక్షసాంగనలు సీతన్ గాంచి చింతించిరే

  కొమరాలందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్.

  రిప్లయితొలగించండి
 7. విరులను జడలో దాల్చిన
  తరుణికి నందమ్ము నొసగు :తలపై కొమ్ముల్
  నర కాంతకు నుండ వెపుడు
  విరివిగ నుండు నసు రులకు వింతగ సుకవీ !

  రిప్లయితొలగించండి
 8. కందం
  శిరమున మొలకెత్తించెన్
  తరుణికి, నందమ్మునొసగు దలపై గొమ్ముల్
  సురకాంతకు యని మహిషా
  సురుండు దండెత్తి గెలిచి జూపె సురలకున్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 9. వరుసననిరువైపులుగా
  ధరియించినచెవ్లయంత్రదర్పముఁజూడన్
  గురుతరబాధ్యతలమునుగు
  తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 10. కరుణయు వాత్సల్యంబులె
  తరుణికి నందమ్ము నొసఁగుఁ, దలపైఁ గొమ్ముల్
  విరసము విస్సాటంబులు
  సరియగు పథమున నడచిన సౌఖ్యముఁ బడయున్

  రిప్లయితొలగించండి
 11. సుమమాలల్ కయిసేసినట్టి జడతో శోభిల్లు సుశ్రోణి యౌ
  *కొమరాలందముఁజూడవచ్చు;తలపై కొమ్ముల్ దగన్ మొల్చినన్*
  సమదంబౌ వృషభంబుఁజూడఁదగు,మీసంబొప్పునెమ్మోముతో
  సుమబాణుందలపించునట్టి పురుషున్ జూడంగనానందమౌ.

  రిప్లయితొలగించండి
 12. కందం
  సిరిగల యింటను బుట్టియు
  నరుదగు నుద్యోగమున్న నహమగుపించన్
  బొరుగింట మెట్టి వచ్చినఁ
  దరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్

  మత్తేభవిక్రీడితము
  సుమసౌందర్యము వొంగగన్ మిగులఁ గాసుల్ గల్గువారింటిదై
  యమరన్ విద్యయు గొప్పజీతమునఁ దానార్జించు మేధావిగన్
  దిమురన్ మాపొరుగింటి కోడలిగ సాధింపంగ వాల్గంటి నా
  కొమరాలందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్!


  రిప్లయితొలగించండి
 13. అమలంబై దనరారు వర్తనముతో నాస్యంబుపై నవ్వుతో
  కమనీయంబగు పల్కరింపులును సంస్కారంబు నొప్పారు నా
  కొమరాలందముఁ జూడనొప్పుఁ, దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్
  సుమసౌందర్య విభాసమానయయినన్ శోభిల్లదే నాటికిన్

  రిప్లయితొలగించండి
 14. ధరణీ సుందరి బిరుదము
  హరిణేక్షణపొందె గర్వమతిశయమొందన్
  పెరిగిన యశస్సు తోడన్
  తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్

  రిప్లయితొలగించండి
 15. సమతా భావము గల్గియుండివెస దాసాహాహ్యమున్ జేయుచో
  కొమరాలందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్
  మమతల్ జేరువ జేయునే గదిల భామా!నేరికైనన్ భువిన్
  సుమముల్ దండగ గ్రుచ్చినట్లుగను హాశోభిల్లెగొమ్ముల్ సుమా

  రిప్లయితొలగించండి
 16. శ్రమనేనమ్ముచుసాగెనామగువవిక్రాంతంబుఁబెంపొందగన్
  సమతాభావముఁదోడునీడయనగాసాధించెనుద్యోగమున్
  క్రమమీరెండునుగర్వఁగారణములైగావించుసంగ్రామమున్
  కొమరాలందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్మొల్చినన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 17. తరముల తరబడి జూపగ
  కరముగ సరిపడుచు చిత్రకథల కనువుగన్
  విరివిగ రాక్షస ప్రవరపు
  తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరివిగ నుదుటి కిరు బరుల
   తిరుగుచు కురులును సొబగగు తీరుగ పెరుగన్
   అరుదగు శోభను గూర్చగ
   తరుణికి నందమ్ము నొసగు దలపై గొమ్ముల్

   - విజయ చావలి

   తొలగించండి
 18. సుమనస్సాయకుడేయు యస్త్రమటులన్ సొంపైన రూపమ్ముతో
  రమణీయాంగన భార్యయై గృహములో రాణించుచున్ బ్రేమఁ గో
  పముతో వర్తిల భూషణమ్ములను తా వాంఛించుచున్ భర్తపై
  కొమరాలందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్

  రిప్లయితొలగించండి
 19. మురియుచు ముద్దియలటులా
  చరవాణిని చేత దాల్చి సలిపెడి సెల్ఫీ
  లరయగ విన్యాసంబుల
  తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్

  రిప్లయితొలగించండి
 20. వరమై భాసిల్లంగం
  దరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గురులే
  వరమై భాసిల్లఁగ గో
  తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్

  తమకం బొప్పగ స్వీయ భావమును గాంతా రత్న మిబ్భంగినిన్
  మమకారమ్ము సెలంగఁ బూరుషునకున్ మర్యాద ప్రాయమ్మునం
  గమనీయమ్ముగ మూతి మీసములు వక్కాణించె, నా గిత్తకుం,
  గొమరా లందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. వ్యాకరణ విశేషము:
   కొమరా లందము: కొమరాలు + అందము. ఇక్కడ కొమరాలు కర్తృ పదమై యున్నదే కాని కొమరాలు – యొక్క - అందము – అన్న యర్థములో లేదని గమనింపఁ దగును.
   ఈ యర్థములో నుండ వలె ననిన *కొమరాలి యందము* సాధు వగును. ఔపవిభక్తిక మాదేశము కావలెను.
   అందు వలన యీ భావములోఁ బూరించినవి వ్యాకరణ దోష యుక్తము లగును. ఇది నా యభిప్రాయము.

   తొలగించండి
 22. విమలిందీవరనేత్రి జానకిని సాధ్వీ రత్నమున్ గాంచుచున్
  తమలో తాము దలంపసాగిరిటులన్ దైత్యాంగనల్ నిక్కుచున్
  గమనింపంగ విశిష్ట సౌష్టవమహా గానొక్కటే లోపమీ
  కొమరాలందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్

  రిప్లయితొలగించండి