15, మే 2022, ఆదివారం

సమస్య - 4081

16-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాగరమున శంకరుండు చలిమలఁ గాంచెన్”
(లేదా...)
“సాగరమందుఁ గన్గొనెను శంకరుఁ డున్నత శీతశైలమున్”

43 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      ఆ గరళము గ్రోలుదునన
      రాగమయిగ భర్తనొప్ప ప్రజకది హితమన్
      ద్యాగమున శైలసుత హృ
      త్సాగరమున శంకరుండు చలిమలఁ గాంచెన్

      ఉత్పలమాల
      ఆ గరళమ్ము హానికరమందెదనంచును గోరినంతటన్
      రాగవశమ్మునన్ ప్రజకు లాభమటంచును గ్రోలనొప్పఁగన్
      ద్యాగ గుణమ్మునన్ మెరయ తత్క్షణమా గిరిరాజపుత్రి హృ
      త్సాగరమందుఁ గన్గొనెను శంకరుఁ డున్నత శీతశైలమున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. దాగెను మైనాకుండెట?
    శ్రీ గౌరికి భర్తయెవఁడు? లేపనమహిమం
    దాఁగాంచెఁబ్రవరుఁడెయ్యది?
    సాగరమున,శంకరుడు,చలిమలఁగాంచెన్.

    రిప్లయితొలగించండి
  4. తాఁగనెహిమగిరితాపము
    వేగమెదేహమునిలుపగభీరువుతానై
    ఆగకనంబుధిఁదాగెను
    సాగరమునశంకరుండుచలిమలగాంచెన్

    రిప్లయితొలగించండి

  5. నాగశయనుడుండు నెచట?
    భాగీరథినెవడు దాల్చె? ప్రవరుడు తానే
    నాగము గాంచె? తెలుపుమన
    సాగరమున, శంకరుండు, చలమల గాంచెన్.

    రిప్లయితొలగించండి
  6. నాగముపయి పడుకొనె హరి
    సాగరమున ; శంకరుండు చలిమలఁ గాంచెన్ ,
    బాగుగ పరికించి తలచె
    యోగము సలుపుట కొరకయి యొద్దిక యనుచున్

    రిప్లయితొలగించండి
  7. వాగమృతాంబుధారలపాండితిఁజూపుగడింభకుండునున్
    ఆగనిభావజాలముననయ్యెడసభ్యులుమెచ్చగామదిన్
    తూగినపద్యమందమునతొయలిశైలజచిందులాడగా
    సాగరమందుఁగన్గొనెనుశంకరుఁడున్నతశీతశైలమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "ధారలను" అనండి.

      తొలగించండి
  8. వేగమె పోవుచున్ హనుమ భీకర సింహిక నేడ కన్గొనెన్?
    ఆ గరళంబుఁగుత్తుకనె యౌర!ధరించిన వేలుపెవ్వఁడా?
    హా!గృహమేథియైన ప్రవరాఖ్యుఁడు దేనిని గాంచె వేడ్కతో?
    *సాగరమందుఁగన్గొనెను,శంకరుఁడు,న్నత శీతశైలమున్.*

    రిప్లయితొలగించండి

  9. సాగరమందు పుట్టిన విషమ్మదియే ప్రళయాంత కమ్ము నీ

    వా గరళమ్ము గ్రోలవలె నాపద గాయుమటంచు వేడగన్

    త్యాగము లోక రక్షకయి తప్పదు నీకని పల్కు గౌరి హృ

    త్సాగరమందు కన్గొనెను శంకరుడున్నత శీతశైలమున్.

    రిప్లయితొలగించండి
  10. తా గరళము గ్రోలు దు నన
    గా గిరిజ యు మోద మంది కాని మ్మ నియెన్
    బాగని మెచ్చు చును మనో
    సాగరమున శంకరుండు చలి మల గనియెన్

    రిప్లయితొలగించండి
  11. భాగయశాస్త్రులు బలికెను
    సాగరమున శంకరుండు చలిమల గాంచెన్
    నాగని నుద్రేకంబున
    వేగముగానట్లుపలికె వివశిత మనమున్

    రిప్లయితొలగించండి
  12. ఆగనియాత్రల దాపున
    నాగమవిజ్ఞాన బోధ నవనిని సల్పెన్
    సాగిన పయనమున సరి
    త్సాగరమున శంకరుండు చలిమలఁ గాంచెన్

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    శ్వశుర గృహవాసమేయగు స్వర్గసీమ
    రమణి!హరి నివాసము//సాగరమున,శంక
    రుండు చలిమలఁగాంచెన్//తనుండుటకును
    సకలభోగాలు నిత్యంబు జరుగుననుచు.

    రిప్లయితొలగించండి
  14. నల్లి బాధను పడలేక తల్లడిల్లి
    రమణి!హరి నివాసము*సాగరమున,శంక
    రుండు చలిమలఁగాంచెన్*తనుండగాన
    టంచు తలపోయుచుందు నన్యంబుగాదు.

    రిప్లయితొలగించండి
  15. త్రాగెను తాగరళమ్మును
    వేగమె శంకరుడు వేఁడ వేలుపులెల్లన్
    త్రాగుమను హిమజ మానస
    సాగరమున శంకరుండు చలిమలఁ గాంచెన్

    రిప్లయితొలగించండి
  16. కందం
    వేగమరుదెంచె పార్వతి
    కై గాముల దొర తపంబు క్రమ్ముకొనంగన్
    యోగేశ్వరిని గని హృదయ
    సాగరమున శంకరుండు చలిమల గాంచెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  17. భోగి విభూషణుఁడు నుత మ
    హాగరళ గ్రీవుఁడా మహాదేవ మహా
    భాగుఁడు కైలాసము నా
    సాగరమున శంకరుండు చలిమలఁ గాంచెన్


    ఏ గతి నైన జానకిని నెచ్చట నున్నను గాంచ నెంచుచుం
    దాఁ గపి సేన వీడి వడిఁ దద్దయు భక్తిని శంకరాంశుఁడే
    యాఁగక వే సుఖమ్ము లిడ నార్తుఁడు రాముని కేఁగు దెంచుచున్
    సాగర మందుఁ గన్గొనెను శంకరుఁ డున్నత శీత శైలమున్

    [శంకరుఁడు = సుఖము లొసఁగు వాఁడు; శీత శైలము = చల్లని కొండ, మైనాకుఁడు]

    రిప్లయితొలగించండి
  18. బాగని పద్మసంభవుడు పద్మము మీదనె తిష్ఠ వేసి తా
    వేగమె సృష్టికార్యమును వేడుకగా నొనరింప, శార్ఙ్గియే
    సాగెను శేషతల్పమున చయ్యన శ్రాంతము నొందుచున్ సుధా
    సాగరమందుఁ, గన్గొనెను శంకరుఁ డున్నత శీతశైలమున్

    రిప్లయితొలగించండి
  19. ఆ గరుడధ్వజుండు నివసంబున కొద్దిక నాదిశేషునిన్
    సాగరమందుఁ గన్గొనెను, శంకరుఁ డున్నత శీతశైలమున్
    యోగ సమాధి సాధనకు యుక్తముగా గనె నెంచి చూడగా
    భోగ విరక్తులై జనుటె మోక్ష పథంబు విధాయకంబునౌ

    రిప్లయితొలగించండి
  20. నాగశయనుడు వసించును
    "*సాగరమున శంకరుండు చలిమలఁ గాంచెన్”*
    రాగము పంచగవచ్చిన
    యాగట్రాచూలినచటననురాగముతో


    ఆగమ వినుతుండుండును
    సాగరమున,శంకరుండు చలిమలగాంచెన్
    తాగరళము గ్రోలెడు తరి
    శ్రీగౌరీహృదయమందు క్షేమంకరుడై

    రిప్లయితొలగించండి