26-5-2022 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కరికి సింగము గలిగె నక్కజ మెటులగు”(లేదా...)“కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో”
కరికి సింగము గలిగె నక్కజ మెటులగు వీరబ్రహ్మము చెప్పెను వింతలెన్నొ యందు యిద్దియ చేరును సంది యంబు వలదు,జరుగునింకను జూడు వసుధ యందు
తంజ్రినాగమనాయనితలనువంచివిశ్వనాథుఁడుకొమరుడువీరుడయ్యెస్వామిభక్తినిచాటెనుసాధకుండుకరికిసింగముకలిగెనక్కజమెటులగు
తేటగీతిమరుని త్యాగాన శివునంద గిరిజమురిసిదేవతల కల ఫలియించి దివ్యమనఁగతారకాసుర దిగ్గజవైరిగ శుభకరికి సింగము గలిగె నక్కజ మెటులగు?చంపకమాలమర కుసుమాయుధమ్మది సమంచితరీతిని నాదిదేవునిన్గిరిజఁ గనంగ జేసి సుర గీతులఁ గైకొనఁజేసినంతటన్వరముగఁ దారకాసురుడె వారణమంచన వానిగూల్చ శ్రీకరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో?
హరిమన బద్ధ శత్రువని యాతని నామము మానకున్న నీమరణము తప్పదంచు పలు మారులు చెప్పిన రాక్కసుండె తామరణము పాలయెన్ సుతుని మాటలతో నట ద్రుంచి కంబమున్ కరికి జనించె సింహమనఁగా విసుమానము జెందు టేలనో.
పులికి పులిపుట్టె,కోతికి కలిగె కోతిగాడిదకు గాడిద,శునికి కలిగె శునియెయజమునకుఁబుట్టె మేషంబు,గజవినాశ*కరికి సింగము కలిగె ,నక్కజమెటులగు!*
పిరికి వాడగు తండ్రికి వీరు డగుచు సాహసమ్ములు చేయుచు శౌర్య యుతుడు పెక్కు నుతులను పొందుచు వెలయ నపుడు కరికి సింగము గలిగె నక్క జ మె టు లగు?
సూనుని హతమార్చ దలచి యసురుడతండుతనయుని పలుకు లాలించి తానె చచ్చె కరికి సింగము గలిగె, నక్కజమెటులగుదానవారాతి వదులునే దానవులను.
మారహరుడగు హరుని కుమారుడగు కుమారుడుదయించె తారకుఁ మట్టుబెట్టకార్తికేయుడు తొలగించు కష్టము శుభకరికి సింగము గలిగె నక్కజ మెటులగు
అరయఁగ సృష్టిధర్మమిదియౌఁగద జింకకు జింక పుట్టదేనరులకుఁబుట్టరే నరులు ,నాగములంగను నాగులెప్పుడున్కరులకుఁబుట్టవే కరులు కాంచగ భీకర కుంభినీబలాత్కరికి జనించె సింహమనగా విసుమానముఁజెందనేలనో!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సవరణము: మూడవ పాదములో "కుంభినీ వశంకరికి"
అరయగ వనమునగల సింహముల లోనితరుణ వయసుది గర్భము దాల్చెను గదవరుణుడు కురిపించిన గత వత్సర తొలకరికి ; సింగము గలిగె నక్కజ మెటులగు
కరికి జనించెసింహమనఁగావిసుమానముఁజెందుటేలనో” నరయగ దెల్సెనో భరణి!యచ్చెరువాయెనుగాలరీతికిన్ నరులకువాన రుల్మఱియునక్కకుపిల్లియుబుట్టజూడగన్ వరుడగు వీరబ్రహ్మమునివాక్కులుసత్యములౌట జూచితే
నిరతము ప్రాఙ్నగాగ్రమున నిక్కముగానుదయించు సూర్యుడేసరవినివీడి పశ్చిమ రసాధరమందుదయించుగాక భీకర రణమందు తారకుని కాలునిఁ జేర్చెద షణ్ముఖుండ శాంకరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో
నిరతము తారకాసురుడు నిర్జరులన్ నొగలించు చుండగాసరిగొన చేయ రక్కసుని శంకర పుత్రుడె దిక్కటంచు చక్కెర విలుకాని యండగొని కీల్కొన చేయ కరగ్రహమ్ము శాంకరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో
తేటగీతిసింహములు తిరుగు వనము చివర గుహనగర్భ వతి నాడు సింగమొకటి గనె చిరుసింగమును ప్రకృతి సహజ భంగిన తొలకరికి, సింగము గలిగె నక్కజ మెటులగు?ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
పులి కడుపు నందుఁ బుట్టునె పులికి నన్య మైన జంతువు విశ్వమ్ము నందు నా మహా వని మృగరాజునకు విద్రావిత ఘన కరికి సింగము గలిగె నక్కజ మెటు లగు నరులకె వైద్యు లుండుటలు నారులకున్ మగవారి కైననుం బురుడు మహాటవీ తటినిఁ బోసిరి యెవ్వరు దాని కక్కటా యరయుచు నుండ కేసరిణి కత్తఱి నింపు నొసంగ నా భయం కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందు టేలనో
చిరుతడితండటంచు నిరసించిన వారలు నీరసించ దాదురమున దూకి వ్యూహమును ద్రుంచి పలార్చెను వైరి తంత్రమున్నరవరసూనుఁడా రిపు గణంబులనెక్కటిగా నడల్చె నుక్కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో
కానలందున జనియించె కమ్మని కరికరికి,సింగము గలిగె నక్కజ మెటులగుసింగముకడుపునందున సింహమేగపుట్టునుసహజమియ్యది పుడమియందు
కరికి సింగము గలిగె నక్కజ మెటులగు
రిప్లయితొలగించండివీరబ్రహ్మము చెప్పెను వింతలెన్నొ
యందు యిద్దియ చేరును సంది యంబు
వలదు,జరుగునింకను జూడు వసుధ యందు
తంజ్రినాగమనాయనితలనువంచి
రిప్లయితొలగించండివిశ్వనాథుఁడుకొమరుడువీరుడయ్యె
స్వామిభక్తినిచాటెనుసాధకుండు
కరికిసింగముకలిగెనక్కజమెటులగు
తేటగీతి
రిప్లయితొలగించండిమరుని త్యాగాన శివునంద గిరిజమురిసి
దేవతల కల ఫలియించి దివ్యమనఁగ
తారకాసుర దిగ్గజవైరిగ శుభ
కరికి సింగము గలిగె నక్కజ మెటులగు?
చంపకమాల
మర కుసుమాయుధమ్మది సమంచితరీతిని నాదిదేవునిన్
గిరిజఁ గనంగ జేసి సుర గీతులఁ గైకొనఁజేసినంతటన్
వరముగఁ దారకాసురుడె వారణమంచన వానిగూల్చ శ్రీ
కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో?
రిప్లయితొలగించండిహరిమన బద్ధ శత్రువని యాతని నామము మానకున్న నీ
మరణము తప్పదంచు పలు మారులు చెప్పిన రాక్కసుండె తా
మరణము పాలయెన్ సుతుని మాటలతో నట ద్రుంచి కంబమున్
కరికి జనించె సింహమనఁగా విసుమానము జెందు టేలనో.
పులికి పులిపుట్టె,కోతికి కలిగె కోతి
రిప్లయితొలగించండిగాడిదకు గాడిద,శునికి కలిగె శునియె
యజమునకుఁబుట్టె మేషంబు,గజవినాశ
*కరికి సింగము కలిగె ,నక్కజమెటులగు!*
పిరికి వాడగు తండ్రికి వీరు డగుచు
రిప్లయితొలగించండిసాహసమ్ములు చేయుచు శౌర్య యుతుడు
పెక్కు నుతులను పొందుచు వెలయ నపుడు
కరికి సింగము గలిగె నక్క జ మె టు లగు?
రిప్లయితొలగించండిసూనుని హతమార్చ దలచి యసురుడతండు
తనయుని పలుకు లాలించి తానె చచ్చె
కరికి సింగము గలిగె, నక్కజమెటులగు
దానవారాతి వదులునే దానవులను.
మారహరుడగు హరుని కుమారుడగు కు
రిప్లయితొలగించండిమారుడుదయించె తారకుఁ మట్టుబెట్ట
కార్తికేయుడు తొలగించు కష్టము శుభ
కరికి సింగము గలిగె నక్కజ మెటులగు
అరయఁగ సృష్టిధర్మమిదియౌఁగద జింకకు జింక పుట్టదే
రిప్లయితొలగించండినరులకుఁబుట్టరే నరులు ,నాగములంగను నాగులెప్పుడున్
కరులకుఁబుట్టవే కరులు కాంచగ భీకర కుంభినీబలా
త్కరికి జనించె సింహమనగా విసుమానముఁజెందనేలనో!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసవరణము: మూడవ పాదములో "కుంభినీ వశంకరికి"
తొలగించండిఅరయగ వనమునగల సింహముల లోని
రిప్లయితొలగించండితరుణ వయసుది గర్భము దాల్చెను గద
వరుణుడు కురిపించిన గత వత్సర తొల
కరికి ; సింగము గలిగె నక్కజ మెటులగు
కరికి జనించెసింహమనఁగావిసుమానముఁజెందుటేలనో”
రిప్లయితొలగించండినరయగ దెల్సెనో భరణి!యచ్చెరువాయెనుగాలరీతికిన్
నరులకువాన రుల్మఱియునక్కకుపిల్లియుబుట్టజూడగన్
వరుడగు వీరబ్రహ్మమునివాక్కులుసత్యములౌట జూచితే
నిరతము ప్రాఙ్నగాగ్రమున నిక్కముగానుదయించు సూర్యుడే
రిప్లయితొలగించండిసరవినివీడి పశ్చిమ రసాధరమందుదయించుగాక భీ
కర రణమందు తారకుని కాలునిఁ జేర్చెద షణ్ముఖుండ శాం
కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో
నిరతము తారకాసురుడు నిర్జరులన్ నొగలించు చుండగా
రిప్లయితొలగించండిసరిగొన చేయ రక్కసుని శంకర పుత్రుడె దిక్కటంచు చ
క్కెర విలుకాని యండగొని కీల్కొన చేయ కరగ్రహమ్ము శాం
కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో
తేటగీతి
రిప్లయితొలగించండిసింహములు తిరుగు వనము చివర గుహన
గర్భ వతి నాడు సింగమొకటి గనె చిరు
సింగమును ప్రకృతి సహజ భంగిన తొల
కరికి, సింగము గలిగె నక్కజ మెటులగు?
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
పులి కడుపు నందుఁ బుట్టునె పులికి నన్య
రిప్లయితొలగించండిమైన జంతువు విశ్వమ్ము నందు నా మ
హా వని మృగరాజునకు విద్రావిత ఘన
కరికి సింగము గలిగె నక్కజ మెటు లగు
నరులకె వైద్యు లుండుటలు నారులకున్ మగవారి కైననుం
బురుడు మహాటవీ తటినిఁ బోసిరి యెవ్వరు దాని కక్కటా
యరయుచు నుండ కేసరిణి కత్తఱి నింపు నొసంగ నా భయం
కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందు టేలనో
చిరుతడితండటంచు నిరసించిన వారలు నీరసించ దా
రిప్లయితొలగించండిదురమున దూకి వ్యూహమును ద్రుంచి పలార్చెను వైరి తంత్రమున్
నరవరసూనుఁడా రిపు గణంబులనెక్కటిగా నడల్చె ను
క్కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో
కానలందున జనియించె కమ్మని కరి
రిప్లయితొలగించండికరికి,సింగము గలిగె నక్కజ మెటులగు
సింగముకడుపునందున సింహమేగ
పుట్టునుసహజమియ్యది పుడమియందు