21, మే 2022, శనివారం

సమస్య - 4087

22-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏణాంకుఁడు చెడి కళంకహీనుండయ్యెన్”
(లేదా...)
“విధుఁడు గళంకహీనుఁడుగఁ బేరుఁ గనెన్ గురుపత్నిఁ గూడుటన్”

27 కామెంట్‌లు:

  1. కందం
    వైణికుడన తనువీణకుఁ
    బూనుచు తారయె గురుసతి బుధుని గనంగన్
    క్షోణిని జారులొకరికే
    నేణాంకుఁడు చెడి కళంకహీనుండయ్యెన్

    చంపకమాల
    అధరమునంది వీణ తనువందున మీటెడు గ్రంధసాంగుడై
    బుధుని గనంగ తారకట బుల్కల రేపెడు మన్మథుండుగన్
    గథలుగ జారులున్ మురిసి కావ్యములందు పఠించు వారికే
    విధుఁడు గళంకహీనుఁడుగఁ బేరుఁ గనెన్ గురుపత్నిఁ గూడుటన్!

    రిప్లయితొలగించండి
  2. రాణంపంగనులేకను
    కోణములంబమునిలబడికోపముతోడన్
    తానికవెలుగగసూర్యుఁడు
    ఏణాంకుడుచెడికళంకహీనుమడయ్యెన్

    రిప్లయితొలగించండి
  3. సుధలనుజిల్కుమోముననుసుందరగాత్రముసోయగమ్ముతో
    మధురముగాగక్రీడలునుమంజులనాట్యవిలాససంపదన్
    పదములబాడుతారగనిపారకదోషములేనివాఁడునై
    విధుఁడుకళంకహీనుఁడుగఁబేరుగనెన్గురుపత్నిఁగూడుటన్

    రిప్లయితొలగించండి
  4. రాణులు కొలనును దగ్గరి
    రాణగ నందున జలకము లాడెడి వేళన్
    జాణగ నమాస దినమని
    యేణాంకుఁడు చెడి కళంకహీనుండయ్యెన్”

    రిప్లయితొలగించండి

  5. క్షీణింపమంచు శాపం
    బేణీతిలకునకు వాగ్మి యిచ్చిన తరి గౌ
    రీనాథుడు కరుణింపగ
    నేణాంకుడు చెడి కళంక హీనుండయ్యెన్.


    ముదుసలి వేల్పుటొజ్జ సతి పూషణి తారను సుందరాంగుడౌ

    ఖిదిరుడు పొందెనంచువిని గీఃపతి శాపము నివ్వనేమిరా

    మదనరిపుండు జంగముడుమాపతి నిబ్బరికమ్ముతోడ నా

    విధుడు గళంకహీనుడగు బేరుఁ గనెన్ గురుపత్ని గూడుటన్.

    రిప్లయితొలగించండి
  6. జాణగ గురు కడ సేరియు
    మీనాక్షి గురు సతిని గాంచి మించిన బ్రేమన్
    త్రాణము గోల్పోయిన దరి
    యే ణా o కుడు చెడి కళ o క హీనుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  7. వాణీకటాక్ష!భోజా!
    రాణించగ నీదు కీర్తిరమ ధవళంబై
    క్షీణించె నలుపు దిశలన్
    *ఏణీనాథుండు చెడి కళంక హీనుండయ్యెన్.*

    రిప్లయితొలగించండి
  8. బుధనుతుఁడై దివంబున ప్రమోదముఁగూర్చుచు తారకాళికిన్
    *విధుఁడు కళంకహీనుడుఁగ పేరుగనెన్; గురుపత్నిఁగూడుటన్*
    కథయది యయ్యయో! నిజముగా జరుగన్ హరుఁడెట్లు దాల్చెడున్
    సుధలు స్రవించుచుండనట శూన్యము మచ్చగఁదోచు నంతియే!

    రిప్లయితొలగించండి
  9. పాణిగృహీతిలలో నొక
    రాణికి వశమగుటవలన ప్రాప్తించెగదా
    రాణుల తండ్రి శపించగ
    నేణాంకుఁడు చెడి కళంకహీనుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  10. ాణించు గళల చంద్రుడు
    క్షోణిందాగాంతినీక కుములుట దెలిసెన్
    దానుగ దినకరుపొడమగ
    నేణాంకుడు చెడికళంక హీనుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  11. కందం
    ప్రాణసమాన పతి గురుని
    జాణగ తార విడనాడి చంద్రుని గూడెన్
    కాని పని ఫలితమయ్యెన్
    ఏణాంకుడు చెడి కళంక హీనుండయ్యెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి
  12. త్రాణ పరాయణుఁ డా గీ
    ర్వాణవరుఁ డనుగ్రహింపఁ బద్మాక్ష మహా
    బాణుఁడు, శపింప దక్షుఁడు
    ఏణాంకుఁడు చెడి, కళంక హీనుం డయ్యెన్


    విధునకుఁ బౌత్రుఁడై తనరు విప్ర వరేణ్యుఁడు యజ్ఞ కర్తయున్
    బుధ జనకుండు నత్రి ముని పుత్రుఁడు చంద్రుఁ డొకండు నుండ వా
    ర్నిధి నుదయుండు చందురుఁ డనింద్యుఁడు నేరని కారణమ్మునన్
    విధుఁడు కళంక హీనుఁడుగఁ బేరు గనెన్ గురు పత్నిఁ గూడుటన్

    రిప్లయితొలగించండి
  13. క్షీణతకల్గునటంచును
    కూణముతోశాపమిడగగురువలనాడే
    క్షీణతనొందుచునింగిన
    ఏణాంకుడు చెడికళంకహీనుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  14. సుధలొలికించు నెమ్మొగము జూచి మరుల్గొని చెంత జేరగా
    మధుర సమాగమంబనుచు మత్తిలి తారను గూడె మీదటన్
    ప్రధనమొనర్చెనే యతఁడవజ్ఞతతోననరాదికిట్టులన్
    "విధుఁడు గళంకహీనుఁడుగఁ బేరుఁ గనెన్ గురుపత్నిఁ గూడుటన్"

    రిప్లయితొలగించండి