12, మే 2022, గురువారం

సమస్య - 4078

13-5-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సవతినిం దెచ్చె నా భర్త సంతసిలితి”
(లేదా...)
“సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్”

47 కామెంట్‌లు:

  1. ప్రవిమల భక్తితోమెదలి రామచరిత్రను వ్రాసినాడనన్
    దివసము నందురేబవలు దీధితులందర జేఱదీయుచున్
    వివరణ జేయుచున్మిగుల ప్రేమము జూపుచుఁ గావ్యసుందరౌ
    సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రవిమల భక్తితోమెదలి రామచరిత్రను వ్రాసినాడనన్
      దివిజుని సాక్షిరేబవలు దీధితులందర జేఱదీయుచున్
      వివరణ జేయుచున్మిగుల ప్రేమము జూపుచుఁ గావ్యసుందరౌ
      సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్
      కొరుప్రోలు రాధాకృష్ణ రావు

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమూహంలో నా వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి

  2. యదుకుల తిలకు డతడు నాకాత్మబంధు
    చెల్లెలు సుభద్ర సద్గుణ శీలియైన
    వామనయనను బెండ్లాడి బహుమతిగను
    సవతినిం దెచ్చె నాభర్త సంతసిలితి.

    రిప్లయితొలగించండి
  3. నీతినెంచిననాపతినేర్పుతోడ
    రావణాసురుజంపెగరంజితముగ
    ధర్మమెంచినరామునిధరణివలచె
    సవతినందెచ్చెనాపతిసంతసిలితి

    రిప్లయితొలగించండి
  4. ఆధునిక మైన గృహములో నలరి నట్టి
    సకల సౌకర్యములు గాంచి సంబరమున
    పత్ని తనవారితో నిట్లు పలుకు చనె ర
    సవతి నిం దెచ్చె నాభర్త సంత సీలితి

    రిప్లయితొలగించండి

  5. కవనము జెప్పు పుత్రునకు కావలె ప్రేరణ నిచ్చు కాంతయే

    జవముననేగి కాంచుమొక చక్కని చుక్కను వాని భార్య నా

    కు వధువుగా నటంచపుడు కోరగ నంబురు హాక్షి యౌ విలా

    సవతిని దెచ్చె నామగడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్.

    రిప్లయితొలగించండి
  6. వివరములెంచకేమదినివైనముతోడనుకావ్యమల్లుచున్
    కువలయమందుతానుగనుగుంభనభావములందుమున్గుచున్
    అవిరళహోమమందునటయామినితోడుతపంతమాడగా
    సవతినిదెచ్చెనామగఁడుసంతసమమదుచుమెచ్చితిన్మదిన్

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది
    బట్టలుతుకు నింటిపనులన్నిజేయును
    కాపురమున నేమి కలఁతలేదు
    జంత్ర రూపునున్న*సవతినిందెచ్చె నా
    భర్త ,సంతసిలితి* నార్తి లేక.

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    పేదరికమున రాజ్యమ్ము వెతలఁజిక్కె
    రాజ్యమన్నది నేనైన రాజు భర్త
    దండయాత్రలవిజయాన ధనమనియెడు
    సవతినిం దెచ్చె నా భర్త సంతసిలితి

    చంపకమాల
    అవనిని నేను రాజు పతి యార్థిక దుస్థితినంగలార్చుచున్
    బవలును రేయి చింతిలుచు బాధలజిక్కగ రాజ్యవాసులున్
    జవమున దండయాత్రలను సద్విజయమ్మునఁ గూడ సంపదన్
    సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్

    రిప్లయితొలగించండి
  9. సవినయ సద్గుణాన్వితను శ్యామల
    గాత్రుని కృష్ణు సోదరి
    న్నవిరల ధైర్యసాహసములందున
    మేటి సుభద్ర భామినిన్
    జవమున బాణ మేయగల చాతురి
    యర్జునుడాడి పెండ్లి తా
    సవి తిని దెచ్చె నా మగడు సంతస
    మందుచు మెచ్చితిన్ మదిన్

    రిప్లయితొలగించండి
  10. ఎంత చేసిన తరగక నింటిపనులు
    శక్తి చాలక పడుచుండ సతమతమ్ము
    కష్టములదీర్చగానెంచి కడకు సరభ
    సవతినిం దెచ్చె నా భర్త సంతసిలితి

    (సహ+రభస- సరభస = వేగముగల> సరభసవతి= వేగముగలది)

    రిప్లయితొలగించండి
  11. ప్రవిమల బుద్ధితోసుతుఁడు వర్ధిల విద్యలనెల్ల, వెంటనే
    వివిధములౌ పదోన్నతులవే వరియించగఁబెండ్లి సేయగా
    నవనవలాడు ప్రాయము వినమ్రత కల్గిన కోమలిన్ విలా
    *సవతినిఁదెచ్చె,నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్.*

    రిప్లయితొలగించండి
  12. సామి వేరొక చోటికి సాగుచుండ
    పురమునందు నత్యాచార ములు పెరుగుట
    పరిగణించుచు నన్ను గాపాడ సాహ
    సవతినిం దెచ్చె నా భర్త సంతసిలితి

    రిప్లయితొలగించండి
  13. వింతగొల్పెడు ఘటనను విశదపరచి
    వన్నెలాడిని కరుణింప నన్ను వేడ
    తానె స్వయముగ నాసన్నిధానమునకు
    సవతినిం దెచ్చె నా భర్త సంతసిలితి

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    కనగ తానశ్వమేధ యాగమ్ము కొరకు
    మురిపెము గొలిపెడి నొక బంగరు ప్రతిమపు
    సవతినిందెచ్చె నాభర్త, సంతసిలితి
    ననెను వాల్మీకితో సీత ఘనముగాను.

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    అవఘళమైన సంశ్రవము నందగజేసెడి యశ్వమేధమున్
    పవిదిగజేయు ధ్యేయమున పత్నిగ పక్కనజేరి యుంటకై
    సవురగు పైడి జానకిని జాయగు సీతను నాకు ప్రేమతో
    సవతిని దెచ్చె నా మగడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్.

    రిప్లయితొలగించండి
  16. కవికుల శేఖరుండు పలు కావ్యములన్ రచియించె లెస్సగా,
    కవుల సమాదరించు రసికాగ్రణి నాపతి కంకితమ్ముగా
    కవివరుడీయ కావ్యమను కన్యను మోదము నొంది రెల్లరున్
    సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్

    రిప్లయితొలగించండి
  17. ప్రవిమల మైన చిత్తమున వ్రాయుచు పద్యము లెన్నొయబ్జబాం
    ధవుడల రాకమున్నుగనె తద్దయు ప్రీతిని మించు చుండెడిన్
    భువిపయి శంకరాభరణమున్ గ్రహియించి ద్వితీయయైన నా
    సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్

    రిప్లయితొలగించండి
  18. చిక్కుబడు జటలన్ చక్కగా‌ విడదీసి ప్రతిరోజు దువ్వంగ పనియె లేదు‌,

    విరివిగా పుట్టెడి పేలను చంప నవసరము యేలేదు వరుస‌ బెట్టి,

    తైలమున్ పట్టించి తలకు స్నా నమ్మును చేయించ పనిలేదు చెలిమి తోడ,

    పాయలు‌గా నల్లి బారెడు బారెడు జడలను వేయగ శ్రమయె లేదు


    తరచి చూడ మేలు కలిగె ధవుని వలన,

    గంగ శిరముపై కూర్చుండ కలసి వచ్చె,

    సవతి నిందెచ్చె నాభర్త సంతసిలితి

    ననుచు పలికె నద్రి తనయ పరవశించి

    రిప్లయితొలగించండి
  19. తేటగీతి
    విజయుడు పరిణయంబాడె వేణు ధరుని
    సోదరి సుభద్రను వలచి ,చోద్య మయ్యె
    ద్రౌపదికి ,వివరించగ, తాను దలచె
    సవతినిందెచ్చె నాభర్త సంతసిలితి.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  20. చంపకమాల
    వివరము లేదు మీకు కడువేదన కట్టెలపొయ్యివంట లన్
    భవనము నాల్గపొయ్యిలును వాయువు తోడను మండనింపనన్
    జవమున మేలు మేలనుచుఁ జక్కగఁ, దీర్ప రకారపూర్వమౌ
    సవతినిఁ, దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్

    రిప్లయితొలగించండి
  21. వన్నెచిన్నెలవయ్యారి వగలమారి
    వంచు మెచ్చుకోల్మాటలు పంచుకొనుచు
    ముద్దుమోమును జూడంగనద్దమనెడు
    సవతినిం దెచ్చె నా భర్తసంతసిలితి

    రిప్లయితొలగించండి
  22. భవమగు నాకిదే యనుచు పద్యము లల్లగ పట్టు పట్టుచున్
    బ్రవిమల శంకరాభరణ బ్లాగున పద్యము నేర్చి నంతటన్
    కవితను ప్రేమగా గొనుచు కాంతను వోలెనె, పద్యమన్న యా
    సవతిని దెచ్చె నామగడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్.
    మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  23. వినయవతి రూపవతిని వివేకవతిని
    శీలవతిని విద్యావతి నీల వేణి
    నవని వెదకి కోడలిని హాస్య కరుణా ర
    స వతినిం దెచ్చె నా భర్త సంతసిలితి


    కువలయ మందు నా యదితి కోసల కన్యయు నంబి కాఖ్యయున్
    సువదన రుక్మిణీ సతియు సుందరి ద్రౌపది నాఁ జెలంగు నా
    యువిదలు స్వీయ చిత్తముల నుండఁగ శక్యలె యెంచ కివ్విధిన్
    సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతస మందుచు మెచ్చితిన్ మదిన్

    రిప్లయితొలగించండి
  24. ధృవముగ దెచ్చుచుంటి సవతిన్ గన బంగరు బొమ్మ చిక్కె వా

    స్తవమదికోట్లరూప్యములసంపదతోడుగనంచుబల్కెవి

    ష్ణువుసతిజ్యేష్ఠదేవిసరిసోదరిచొక్కపుపైడిబొమ్మ యౌ

    సవతినిఁతెచ్చెనామగడుసంతసమందుచుమెచ్చితిన్ మదిన్

    గాదిరాజు మధుసూదన రాజు

    (సందర్భ వివరణ)తనకు లభించిన బంగారంతో చేసిన లక్ష్మిదేవి ( జ్యేష్ఠదేవి సవతి )బొమ్మను తెస్తున్నాను.బహుబరువైనది కావున కోట్లవిలువ గలది అని భర్తచెప్పిన మాటలను విని.. మొదట పొరబడి తడబడి నప్పటికి,అసలు జరిగినదేమిటో చూచి..తన భర్తచేసిన మాటలచమత్కారమునకు మనసులో ముచ్చటపడి సంతసించింది భార్య .

    రిప్లయితొలగించండి
  25. (రుక్మిణి మనోగతము)
    అవసడి నోర్వకన్ జని వనంబున నారసి పాదముద్రలన్
    గవిని గమించి రత్నమట గాంచి దమించెను జాంబవంతునిన్
    ధ్రువముగ దెచ్చెనంచు మణి తోషముతోనిడ రాజు దోయలిన్
    సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్

    రిప్లయితొలగించండి
  26. ఆవకాయ పెట్టదలచి నంతవడిగ
    సంతకేగితా సంచిలో చక్కనైన
    పచ్చికాయల కొనివచ్చి వాసిగా ర
    సవతినిందెచ్చె నాభర్త సంతసిలితి

    మరొక పూరణ
    ద్రౌపది తనమనసులో


    జవమున సాగి చేరుచును శౌరిదరిన్ తను దీవెనందుచున్
    ధవళపు కాంతితో వెలుగు తన్విని పెండ్లినియాడి క్రీడియున్
    నవకపుకాంతితోడనటనవ్వుచురాగ సుభద్రతోడుగా
    సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్”*

    రిప్లయితొలగించండి