2, మే 2022, సోమవారం

సమస్య - 4068

3-5-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హర్షమ్మే కలుగును మన కాపద గలుగన్”
(లేదా...)
“హర్షము గల్గుచుండు మన కాపద గల్గిన వేళ నెప్పుడున్”
(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)

21 కామెంట్‌లు:

 1. కర్షకులకు వాన కురియ
  హర్షమ్మే కలుగును ; మన కాపద గలుగన్
  వర్షములో దడిసి నడువ ,
  ఘర్షణ పడకుండగ మెలగ నదియె మేలౌ

  రిప్లయితొలగించండి

 2. ఘర్షణ తప్పదు ప్రత్యవ
  మర్షము తోడ చరియించు మన్నన బొందన్
  హర్షా! కన శత్రువులకు
  హర్షమ్మే కలుగును మన కాపద గలుగన్.

  రిప్లయితొలగించండి
 3. కర్షముకలిగినమనసున
  వర్షపుజల్లులతడియుచుభారముదింపన్
  శీర్షమువంటినచాలును
  హర్షమ్మేకలుగునుమనకాపదగలుగన్

  రిప్లయితొలగించండి
 4. వర్షము మెండుగ గురియఁగ
  హర్షమ్మే కలుగును : మన కాపద గలుగన్
  ఘర్షణ తో చీకాకులు
  శీర్ష ము నకు నొప్పి పుట్టు చింతలు మెండై

  రిప్లయితొలగించండి
 5. ఘర్షణమూలమున్గనుచుకాయుచుధర్మమునంతరాత్మనా
  కర్షణలొంగకన్మనసుకాంచుచుసామ్యమువైరియందును
  త్కర్షముగానిరీతిశమముధైర్యముతోడుతనుండునత్తఱిన్
  హర్షముకల్గుచుండుమనకాపదగల్గినవేళనెప్పుడున్

  రిప్లయితొలగించండి

 6. మర్షము నాలకించుమిది మాన్యులు చెప్పిన మాటనే సుమా

  ఘర్షణ వీడు జీవితముఁ గష్టసుఖమ్ములవెన్ని వచ్చినన్

  శీర్షము నెత్తి నిల్వవలె జేతగ నాశము గోరు వారికిన్

  హర్షము గల్గుచుండు మనకాపద గల్గిన వేళనెప్పుడున్.

  రిప్లయితొలగించండి
 7. తర్షము నెరవేరినపుడు
  హర్షమ్మే కలుగును, మనకాపద గలుగన్
  మర్షము జేకొని తగును
  త్కర్షపు సాధనముజూచి దనరగ మేలౌ.

  తర్షము=ఇచ్ఛ; మర్షము=ఓర్పు; ఉత్కర్షపు= శ్రేష్టమైన

  రిప్లయితొలగించండి
 8. ఘర్షణ వీడనిచో సం
  ఘర్షణ పెంపొంది కడకు కక్షలు మెండై
  ధర్షము పెరుగును వైరికి
  హర్షమ్మే కలుగును మన కాపద గలుగన్


  రిప్లయితొలగించండి
 9. ఘర్షణ వీడియొక్కటిగ కామితసిద్ధికి నుద్యమింపగా
  హర్షము గల్గుచుండు, మనకాపద గల్గిన వేళ నెప్పుడున్
  మర్షణమున్ వహించి మనమందర మొక్కటియై శ్రమించను
  త్కర్ష ఫలంబు నొందనగు కష్టములన్నియుదీరు నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 10. కందం
  మర్షముగ కృపనొలికి నా
  కర్షమ్ముననాలినోడ కాంతకు వలువల్
  వర్షించిన వహి హరిపొడ
  హర్షమ్మే కలుగును మన కాపద గలుగన్

  ఉత్పలమాల
  వర్షముగన్ గృపారసము భక్తులపై గురిపించు దైవ మా
  కర్షమునన్ యుధిష్టరుడు గాంతను బాయగ వల్వలూడ్చగన్
  దర్షము దీర్చెఁ జీరలిడి ద్రౌపదిఁ గాచుచు, చక్రి రాకతో
  హర్షము గల్గుచుండు మన కాపద గల్గిన వేళ నెప్పుడున్!

  రిప్లయితొలగించండి
 11. ధర్షకుఁడై సత్క్రియలప
  కర్షంబునఁజేయుచుండి కనలుచు కడు స్వో
  త్కర్షనుఁజాటెడు వైరికి
  హర్షమ్మే కలుగును మనకాపద కలుగన్.

  ఘర్షముఁగోరి నిత్యముఁజికాకును కల్గగ సంచరించి,ని
  ష్కర్షగ మాటలాడక ప్రశాంతిని కోరక డంబు మీఱ స్వో
  త్కర్షను చాటి కయ్యమునకై మరి కాలును దువ్వు వైరికిన్
  హర్షము కల్గుచుండు మనకాపద కల్గిననెల్లవేళలన్.

  రిప్లయితొలగించండి
 12. రెండవ పద్యము మొదటి పాదంలో
  "ఘర్షణ"గా సవరణము.

  రిప్లయితొలగించండి
 13. కందం
  వర్షపు జినుకులు కురియగ
  హర్షమ్మే గలుగును ,మన కాపద గలుగున్
  తర్షము దీర తడియుగన్
  శీర్షము భారముగ మారి చికమక గలుగన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 14. ఘర్షణలను విడనాడిన
  హర్షమ్మే కలుగును; మన కాపద గలుగన్
  ధర్షణ దూషణములతో,
  మర్షమె గద మేలు దలప మనుజులకెపుడున్

  రిప్లయితొలగించండి
 15. ఉత్పలమాల
  వర్షపు జల్లు తుట్రిలగ పంటలు పండి మహీతలంబు పై
  హర్షము గల్గు చుండు ,మన కాపద గల్గిన వేళ నెప్పుడున్
  మర్షణ బొందు జేయకనె మానవ తప్పిదమే యగున్ జనో
  త్కర్షణ జేసెడా ప్రకృతి కాంతకు ఛిద్రము జేసినప్పుడున్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 16. ఘర్షణ జర్గుచుండుగద కయ్యముకై
  నిలుచుండువానితో
  మర్షము లేని దేశమది మానదు వైరము
  భారతోర్వితో
  తర్షము పాకుకెల్లపుడు దందడి చేయుటె
  దాని తత్వమున్
  హర్షము కల్గుచుండు మన కాపద గల్గిన
  వేళ నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 17. ఆర్ష గుణము వాటింపుమ
  మర్షం బూనుమ కడింది మది నీకు మనో౽
  మర్షం బేల యెవరి కట
  హర్షమ్మే కలుగును మనకా పద గలుగన్


  శీర్ష తలవ్యథా కలిత చేతన సంక్షయ కాల సుప్రభా
  కర్షిత భాగ్య హీన పరికల్పిత దుర్ఘట నైక దుర్భరా
  మర్ష సవేదనా చకిత మానస విస్తృత భీతి యుక్త ని
  ర్హర్షము గల్గుచుండు మన కాపద గల్గిన వేళ నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 18. వర్షము నీరమున్ నిలుప వంతెనలన్ వెలయించి చేనులన్
  హర్షముతోడ వాడుకొని యద్భుతమైన ఫలమ్మునందుచున్
  తర్షము తీర్చుకొంచుమన, ధ్వంసము చేయుచు నున్న వైరికిన్
  హర్షము గల్గుచుండు మన కాపద గల్గిన వేళ నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 19. హర్షా! మంచిగ నుండిన
  హర్షమ్మే కలుగును ,మనకాపద కలుగన్
  వర్షములు మెండుగ గురియును
  కర్షక లోకమ్ము మిగుల గాసిలి జెందున్

  రిప్లయితొలగించండి
 20. ఘర్షణలను వీడి బ్రతుక
  హర్షమ్మే కలుగును:మన కాపద గలుగన్
  తూర్షము తోడను సతతము
  మర్షము విడిపోరు సలుప మహిలో నెపుడున్

  రిప్లయితొలగించండి