10-5-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్”(లేదా...)“సత్సాంగత్యము పాపకారణమగున్ సందేహమింకేలనో”
తత్సంబంధమ్మెరుగక వత్సా! తప్పుడు పలుకులు పలుకుట తగునే మత్సరమనరే యెవ్విధిసత్సాంగత్యమ్ము గూర్చు సర్వాలఘమున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మత్సరమును విడ జేయునుసత్సాంగత్యమ్ము ; గూర్చు సర్వాఘములన్నుత్సాహము జూపించుచుకుత్సించెడు వారితోడ గూడిక జేయన్
వత్సా! శ్రద్ధగ నాలకింపుము యశోవంతుండనే జేయు నిన్ సత్సాహిత్యము, సజ్జనాశ్రయములున్, సద్బోధలున్ జేసెడిన్ సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహమింకేలనే కుత్సారోపణ జేయుచున్ సుజనులన్ కొంచెమ్ముగా జూపుటే.
వత్సా!వెలుగును నింపునుసత్సాంగత్యమ్ము, గూర్చుసర్వాఘములన్కుత్సితముననుండుగపెన్మత్సగజీవికెపుడుతగునాజూడుమదిన్
సంధి విఫలమై వచ్చిన తర్వాత శ్రీకృష్ణపరమాత్మ పాండునందనులతో దుర్యోధన దుష్టచతుష్టయము గూర్చి:కందంఉత్సాది చతుష్టయమైదాత్సారము సేయకయె కదన వ్యూహమ్ముల్మత్సరముననల్ల నగునెసత్సాంగత్యమ్ము? గూర్చు సర్వాఘములన్! (ఉత్సాది : నాశనము చేయునది) శార్దూలవిక్రీడితముఉత్సాహంబున సంధివీగెనని మాయోపాయముల్ బన్నుచున్దాత్సారంబును జేయఁబోక యనిలో తామెంచ వ్యూహమ్ములన్మాత్సర్యమ్మున నా చతుష్టయము సంభాషించు నవ్వారి దేసత్సాంగత్యము? పాపకారణమగున్ సందేహమింకేలనో?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మత్సర గుణమును బాపును సత్సాంగత్యమ్ము : గూర్చు సర్వాఘములన్ కుత్సిత పరులై మెలగుచు మత్సరమున నుండు నట్టి మనుజుల కిలలో న్
వత్సా!వినుమీ సత్యమునుత్సాహమువలన జ్ఞాన ముద్దీపించున్కుత్సిత బుద్ధులకైననుసత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్కూర్చు = సరిచేయు
కందం:వత్సా సత్ఫలితములన్సత్సాంగత్యమ్ము గూర్చు, సర్వాఘములన్కుత్సితములు సలుపుటలోనుత్సుకతను చూపునట్టి యుక్కివుడొందున్ శార్దూలవిక్రీడితము:ఉత్సాహంబును ప్రోదిగాగొని నరుండుద్యుక్తుడై సాగగన్సత్సాంగత్యము సాధుజీవన విశేషంబొందు, సత్కర్మలన్తాత్సారంబు విలంబనంబులు నితాంతంబైన ముమ్మాటికిన్సత్సాంగత్యము పాపకారణమగున్ సందేహ మింకేలనో
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: ఉత్సాహము కూడినదని కుత్సితు డవ్వాని తోడ కూరిమి గొనుటన్ వత్సా! జెప్పు మదెట్లగుసత్సాంగత్యమ్ము? గూర్చు సర్వాఘములన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: ఉత్సాహమ్ము జనించె నాకనుచు మాకున్ జెప్పి నత్యంతమౌ మాత్సర్యంబున నార్భటించు కపటిన్ మండాడి నవ్వానితో వత్సా! స్నేహము చేయ నెంచితివి జెప్పంగా యదిన్ గాదుగా సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహ మింకేలనో?
భీష్ముడు రాజరాజుతో మాత్సర్యమ్మును వీడిసోదరుల సమ్మానమ్ముతో చూడు, జీవత్సారమ్మునెరింగి వారి పితదౌ పాలిమ్ము, నాపల్కు నీవుత్సాహమ్మున స్వీకరించు, విడుమా యుక్కీల మైత్రిన్, వినాసత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహమింకేలనోఉక్కీలు: మూర్ఖులు
కందంమత్సర హృదయపు నలుగురుకుత్సిస మదితో జనులను కూడగ జేయన్గుత్సకము లిడిన యగునాసత్సాంగత్యమ్ము ?గూర్చు సర్వాఘములన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.గుత్సకము-పూగుత్తి.
వాత్సా! వీడుము దుర్జనాళి చెలిమిన్ బాడౌను సద్భావముల్వాత్సల్యంబు నశించు దూరమరుగున్బాంధవ్య భావంబు నీమాత్సర్యంబును బెంచుచుండు జెరచున్మర్యాద , పుత్రా! వినా సత్సాంగత్యము పాపకారణమగున్సందేహమింకేలకో !
సత్సాహిత్యము నస్ఖలితోత్సాహము సాధు వృత్తు లుపయుక్తమ్ముల్ వత్సా! విను దూరీకృత సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్ వాత్సల్యమ్మున ధర్మ చింతనము సంప్రాప్తించు నాశించినన్ సత్సాంగత్యము శుద్ధ చిత్తమున నిస్సందేహమే దుర్జనప్రోత్సాహ స్ఫుర ణాంతరంగమున దుర్బుద్ధిన్ భువిన్ సంత తాసత్సాంగత్యము పాప కారణ మగున్ సందేహ మింకేలనో [సంతత + అసత్సాంగత్యము = సంత తాసత్సాంగత్యము]
ఉత్సాహంబునమిత్రసంగతినినీవూరేగుసద్బుద్ధితోవత్సాపొందుముభావనిర్మలతనీవాగ్రుచ్చుయానంబుగాసత్ సాంగత్యము, పాపకారణమగున్సందేహమింకేలనోదుత్సాంగత్యము, వీడుమీనడతలోతోరంపుదీక్షన్వడిన్
సత్సంబంధముపెంచునుసత్సాంగత్యమ్ము,గూర్చుసర్వాఘములన్మాత్సర్యమ్మెద నిండగనుత్సుకతయుతగ్గితుదకు నొగులది హెచ్చున్.సత్సాహిత్యము నెల్లవేళలపఠించంగాను కల్గున్గదా*"సత్సాంగత్యము పాపకారణమగున్ సందేహమింకేలనో”*మాత్సర్యమ్మునుపూనిచున్ననటుపై మాయంబగున్మంచి యున్సత్సందేశములాలకించుచుచనన్ సన్మానముల్ దక్కుగా
వత్సా సద్విధి మానవాళికిల సౌభ్రాత్రంబు భావింపగాహృత్సౌందర్యవికాసకారకము సౌహృద్వర్ధకంబౌ సదాసత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహమింకేలనోతత్సత్యంబునెరుంగకన్ మరగి దుస్సాంగత్యమున్ దేలుటే
రిప్లయితొలగించండితత్సంబంధమ్మెరుగక
వత్సా! తప్పుడు పలుకులు పలుకుట తగునే
మత్సరమనరే యెవ్విధి
సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాలఘమున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్సరమును విడ జేయును
రిప్లయితొలగించండిసత్సాంగత్యమ్ము ; గూర్చు సర్వాఘములన్
నుత్సాహము జూపించుచు
కుత్సించెడు వారితోడ గూడిక జేయన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివత్సా! శ్రద్ధగ నాలకింపుము యశోవంతుండనే జేయు నిన్
సత్సాహిత్యము, సజ్జనాశ్రయములున్, సద్బోధలున్ జేసెడిన్
సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహమింకేలనే
కుత్సారోపణ జేయుచున్ సుజనులన్ కొంచెమ్ముగా జూపుటే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివత్సా!వెలుగును నింపును
రిప్లయితొలగించండిసత్సాంగత్యమ్ము, గూర్చుసర్వాఘములన్
కుత్సితముననుండుగపె
న్మత్సగజీవికెపుడుతగునాజూడుమదిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంధి విఫలమై వచ్చిన తర్వాత శ్రీకృష్ణపరమాత్మ పాండునందనులతో దుర్యోధన దుష్టచతుష్టయము గూర్చి:
రిప్లయితొలగించండికందం
ఉత్సాది చతుష్టయమై
దాత్సారము సేయకయె కదన వ్యూహమ్ముల్
మత్సరముననల్ల నగునె
సత్సాంగత్యమ్ము? గూర్చు సర్వాఘములన్!
(ఉత్సాది : నాశనము చేయునది)
శార్దూలవిక్రీడితము
ఉత్సాహంబున సంధివీగెనని మాయోపాయముల్ బన్నుచున్
దాత్సారంబును జేయఁబోక యనిలో తామెంచ వ్యూహమ్ములన్
మాత్సర్యమ్మున నా చతుష్టయము సంభాషించు నవ్వారి దే
సత్సాంగత్యము? పాపకారణమగున్ సందేహమింకేలనో?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమత్సర గుణమును బాపును
రిప్లయితొలగించండిసత్సాంగత్యమ్ము : గూర్చు సర్వాఘములన్
కుత్సిత పరులై మెలగుచు
మత్సరమున నుండు నట్టి మనుజుల కిలలో న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివత్సా!వినుమీ సత్యము
రిప్లయితొలగించండినుత్సాహమువలన జ్ఞాన ముద్దీపించున్
కుత్సిత బుద్ధులకైనను
సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్
కూర్చు = సరిచేయు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం:
రిప్లయితొలగించండివత్సా సత్ఫలితములన్
సత్సాంగత్యమ్ము గూర్చు, సర్వాఘములన్
కుత్సితములు సలుపుటలో
నుత్సుకతను చూపునట్టి యుక్కివుడొందున్
శార్దూలవిక్రీడితము:
ఉత్సాహంబును ప్రోదిగాగొని నరుండుద్యుక్తుడై సాగగన్
సత్సాంగత్యము సాధుజీవన విశేషంబొందు, సత్కర్మలన్
తాత్సారంబు విలంబనంబులు నితాంతంబైన ముమ్మాటికిన్
సత్సాంగత్యము పాపకారణమగున్ సందేహ మింకేలనో
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిఉత్సాహము కూడినదని
కుత్సితు డవ్వాని తోడ కూరిమి గొనుటన్
వత్సా! జెప్పు మదెట్లగు
సత్సాంగత్యమ్ము? గూర్చు సర్వాఘములన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిఉత్సాహమ్ము జనించె నాకనుచు మాకున్ జెప్పి నత్యంతమౌ
మాత్సర్యంబున నార్భటించు కపటిన్ మండాడి నవ్వానితో
వత్సా! స్నేహము చేయ నెంచితివి జెప్పంగా యదిన్ గాదుగా
సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహ మింకేలనో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభీష్ముడు రాజరాజుతో
రిప్లయితొలగించండిమాత్సర్యమ్మును వీడిసోదరుల సమ్మానమ్ముతో చూడు, జీ
వత్సారమ్మునెరింగి వారి పితదౌ పాలిమ్ము, నాపల్కు నీ
వుత్సాహమ్మున స్వీకరించు, విడుమా యుక్కీల మైత్రిన్, వినా
సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహమింకేలనో
ఉక్కీలు: మూర్ఖులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిమత్సర హృదయపు నలుగురు
కుత్సిస మదితో జనులను కూడగ జేయన్
గుత్సకము లిడిన యగునా
సత్సాంగత్యమ్ము ?గూర్చు సర్వాఘములన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
గుత్సకము-పూగుత్తి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాత్సా! వీడుము దుర్జనాళి చెలిమిన్
రిప్లయితొలగించండిబాడౌను సద్భావముల్
వాత్సల్యంబు నశించు దూరమరుగున్
బాంధవ్య భావంబు నీ
మాత్సర్యంబును బెంచుచుండు జెరచున్
మర్యాద , పుత్రా! వినా
సత్సాంగత్యము పాపకారణమగున్
సందేహమింకేలకో !
సత్సాహిత్యము నస్ఖలి
రిప్లయితొలగించండితోత్సాహము సాధు వృత్తు లుపయుక్తమ్ముల్
వత్సా! విను దూరీకృత
సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్
వాత్సల్యమ్మున ధర్మ చింతనము సంప్రాప్తించు నాశించినన్
సత్సాంగత్యము శుద్ధ చిత్తమున నిస్సందేహమే దుర్జన
ప్రోత్సాహ స్ఫుర ణాంతరంగమున దుర్బుద్ధిన్ భువిన్ సంత తా
సత్సాంగత్యము పాప కారణ మగున్ సందేహ మింకేలనో
[సంతత + అసత్సాంగత్యము = సంత తాసత్సాంగత్యము]
ఉత్సాహంబునమిత్రసంగతినినీవూరేగుసద్బుద్ధితో
రిప్లయితొలగించండివత్సాపొందుముభావనిర్మలతనీవాగ్రుచ్చుయానంబుగా
సత్ సాంగత్యము, పాపకారణమగున్సందేహమింకేలనో
దుత్సాంగత్యము, వీడుమీనడతలోతోరంపుదీక్షన్వడిన్
సత్సంబంధముపెంచును
రిప్లయితొలగించండిసత్సాంగత్యమ్ము,గూర్చుసర్వాఘములన్
మాత్సర్యమ్మెద నిండగ
నుత్సుకతయుతగ్గితుదకు నొగులది హెచ్చున్.
సత్సాహిత్యము నెల్లవేళలపఠించంగాను కల్గున్గదా
*"సత్సాంగత్యము పాపకారణమగున్ సందేహమింకేలనో”*
మాత్సర్యమ్మునుపూనిచున్ననటుపై మాయంబగున్మంచి యున్
సత్సందేశములాలకించుచుచనన్ సన్మానముల్ దక్కుగా
వత్సా సద్విధి మానవాళికిల సౌభ్రాత్రంబు భావింపగా
రిప్లయితొలగించండిహృత్సౌందర్యవికాసకారకము సౌహృద్వర్ధకంబౌ సదా
సత్సాంగత్యము, పాపకారణమగున్ సందేహమింకేలనో
తత్సత్యంబునెరుంగకన్ మరగి దుస్సాంగత్యమున్ దేలుటే