6, మే 2022, శుక్రవారం

సమస్య - 4072

7-5-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్”
(లేదా...)
“ముక్కునుఁ గోసి భర్త సతి ముచ్చటఁ దీర్చెను ముద్దుముద్దుగన్”

42 కామెంట్‌లు:

  1. కం ||
    రక్కసిని సత్కరించెను
    "ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చట దీర్చెన్"
    మక్కువ మల్లెల నల్లియు
    చక్కగ కొప్పునిడెఁ సీత సంతసమందన్.
    ***
    6-5-2022.
    ***🙏***

    రిప్లయితొలగించండి

  2. చక్కగ మొక్కను బెంచగ
    పెక్కుగ వర్షంబుకురిసి పీథము నందున్
    జిక్కిసురిగ ముక్కగ నా
    ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్.

    రిప్లయితొలగించండి

  3. అక్కునజేర్చినబిడ్డకు
    చక్కనిపోలికయనుచునుచాలగప్రేమన్
    మక్కువగాగనుముద్దున
    ముక్కునుఁగోసిపతిభార్యముచ్చటఁదీర్చెన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    చిక్కగ పతి నటి వలలోఁ
    జెక్కగ నద్దాని ముక్కు చింతనఁజేసెన్
    టక్కరి పౌలస్తి నటన
    ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్!

    ఉత్పలమాల
    చిక్కెఁ బతీశ్వరుండు నొగి జిత్తులమారి నటీలలామకున్
    జెక్కగ దాని నాసికను జిందులు వైచెడు భార్య స్వప్నమై
    టక్కరి చుప్పనాతిగను నాథుడు లక్ష్మణుఁడైన నాటికన్
    ముక్కునుఁ గోసి భర్త సతి ముచ్చటఁ దీర్చెను ముద్దుముద్దుగన్

    రిప్లయితొలగించండి
  5. చెక్కటచేయిజేర్చికొనిచెంపకుచారెడుకళ్లతోగనన్
    ముక్కెరయందముల్మెఱయముంగిటసత్యగభార్యయుండగా
    నిక్కునపంతమాడుసతినెమ్మదిజేయుచుచెంతజేర్చియా
    ముక్కునుగోసిభర్తసతిముచ్చటఁదీర్చెనుముద్దుముద్దుగన్

    రిప్లయితొలగించండి

  6. పెక్కుగ వర్షముల్ కురిసి పీథమె వెల్లవనెత్త నందులో

    చక్కగ తానుపెంచిన రసాలపు మొక్కయె మున్గిపోవగా

    ముక్కెను కొన్ని శాఖలని ముగ్దయె కోరగ ముర్గినట్టి యా

    ముక్కును గోసి భర్త సతి ముచ్చట దీర్చెను ముద్దుముద్దుగన్.


    పెక్కుగ చేపలున్నవట వీసెడు జొన్నల బోసి తెచ్చితిన్

    చక్కగ పుల్సు జేసెదను సన్నని ముక్కల జేయుమంచు నా

    చక్కని చుక్క కోరెనని సన్నని వస్త్రము తోడ మూయుచున్

    ముక్కును, గోసి భర్త సతి ముచ్చట దీర్చెను ముద్దుముద్దుగన్.

    రిప్లయితొలగించండి
  7. రక్కసి గర్వము నణచెను
    ముక్కును గోసి : పతి ముచ్చ ట దీర్చెన్
    టక్కున కానకు బంపియు
    మక్కువ తో పంపి తనుచు మరిమ రి పలికెన్

    రిప్లయితొలగించండి
  8. చక్కని వనవిహరణమున
    మిక్కుటమగు రుచిగలిగిన మేలగుపండ్లన్
    మిక్కిలిపదునగు బాణపు
    ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెక్కుగ వాలిన చిలుకల
      ముక్కుల దలపును కనులకు మోదుగ విరులున్
      మక్కువ పడినంతటనో
      ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. మక్కువగ దాను దెచ్చిన
    నొక్కగనే దరికి జేర నూల్కొన జేసే
    చక్కని యత్తరు సీసా
    ముక్కునుఁ గోసి , పతి భార్య ముచ్చటఁ దీర్చెన్

    రిప్లయితొలగించండి
  11. చక్కని చిత్రములెన్నియొ
    నక్కజముగ గీయుచుండ నకటా! పెన్సిల్
    ఠక్కున విఱిగెను దానికి
    ముక్కునుఁగోసి పతి,భార్య ముచ్చటఁదీర్చెన్.

    చక్కెర బొమ్మ సోయగము చక్కగ తీరిచి దిద్దఁగోరియున్
    చుక్కల చీరయున్ రవిక సొన్నపునాభరణంబులెన్నియో
    లెక్కకు మిక్కిలేయిడి బళీబళి!ముక్కెర వెట్ట చిన్నగా
    ముక్కునుఁగోసి భర్త,సతి ముచ్చటఁదీర్చెను ముద్దుముద్దుగా.

    రిప్లయితొలగించండి
  12. చక్కని చెక్కుటద్దముల చంద్రముఖిన్ గని మందిరమ్ములో
    మక్కువతోడ వైద్యుడల మానిని గైకొనె నిల్లుటాలుగా
    తక్కువయై కనంబడెడి తావుల తా సవరింప నెంచుచున్ (చట్టిదౌ)
    ముక్కునుఁ గోసి భర్త సతి ముచ్చటఁ దీర్చెను ముద్దుముద్దుగన్

    రిప్లయితొలగించండి
  13. ఉ:చక్కని భార్యనే బడసె చక్కని వైద్యుడు కాని భార్య నా
    ముక్కొక చట్టి ముక్కనుచు ముచ్చట నొందగ సర్జరీకి నే
    మక్కర లేదు పొమ్మనక నట్టులనే యని వైద్యశాలలో
    ముక్కును గోసి భర్త సతి ముచ్చట దీర్చెను ముద్దు ముద్దుగన్.

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు
      చక్కంగా... అనడం వ్యావహారికం. "చక్కగ కనుముక్కులనే... సజీవ మనుజుగా" అనండి

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు.

      చక్కగ కనుముక్కులనే
      చెక్కగ, స్థపతి దలచెను సజీవ మనుజుగా
      తిక్కగల భార్య గోరగ
      ముక్కును గోసి పతి భార్య ముచ్చట దీర్చెన్
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్యం శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.

      తొలగించండి
  16. కం:"ము" క్కనున దింటి పేరై
    చిక్కుగ భావించె ,పెండ్లి చేయగ పెద్దల్
    ముక్కను పేరే పోయెన్
    ముక్కును గోసి పతి భార్య ముచ్చట దీర్చెన్
    (అమ్మాయికి ముక్కు అనే తన ఇంటి పేరు నచ్చ లేదు.పెళ్లి అయ్యేసరికి ఇంటి పేరు మారింది.ఆ విధంగా భర్త ఆమె ముక్కు కోసి తృప్తి పరిచాడు.)

    రిప్లయితొలగించండి
  17. వెక్కసముగ నెక సెక్కెము
    లక్కడ నాడుచుఁ జెలంగి యానందముగన్
    టక్కరి యుత్తగ నుత్తగ
    ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్


    ముక్కును గోసి యీఁ గలవ పొక్కక నీ విట నంచు వేఁడఁగా
    నొక్కి వచించి యిత్తు నని నోటిని నోటి కొసంగి దారకున్
    గ్రక్కునఁ బంచదార చిలుకం గొని లీలగ సుందరంపు టా
    ముక్కునుఁ గోసి భర్త సతి ముచ్చటఁ దీర్చెను ముద్దుముద్దుగన్

    రిప్లయితొలగించండి
  18. రక్కసి‌ నెటుల‌‌‌ మదమణిచె

    లక్కుము డేమగు దెలుపు జలధిజకు హరి,యా

    చెక్కిలి పై పతి ముద్దిడి

    ముక్కును‌గోసి,పతి,భార్య ముచ్చట దీర్చెన్

    రిప్లయితొలగించండి
  19. మక్కువగా జేసె మగువ
    చక్కని భక్ష్యంబు చిలుక చందమునందున్
    ముక్కను రుచి చూడుడనగ
    ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్

    రిప్లయితొలగించండి
  20. చక్కెర తోడను బొమ్మలు
    చక్కగ చేయగమొదలిడ సాగచిలుకకున్
    ముక్కును, గనుచును హెచ్చగు
    ముక్కునుగోసిపతిభార్యముచ్చటతీర్చెన్

    రిప్లయితొలగించండి
  21. ముక్కుకు ముక్కెరందమని ముత్తెపు ముక్కెర దెమ్మటంచు బల్
    చక్కనిచుక్కయైన తన జవ్వని గోముగ కోరినంతనే
    మక్కువదీర్చనెంచితన మానిని ముక్కుకు రంధ్రమేర్పడన్
    ముక్కునుఁ గోసి భర్త సతి ముచ్చటఁ దీర్చెను ముద్దుముద్దుగన్

    రిప్లయితొలగించండి