25-5-2022 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్”(లేదా...)“మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్”
నిరతము సాధన జేయగ వరియించెను విజయ మనుచు వాత్సల్య మునన్ కర మను రాగము జూపుచు మరిదిని ముద్దాడెను సతి మఱి మఱి ప్రేమన్
కందంమరచి కుటుంబ నియంత్రణమురిసి కనఁగ నమ్మయె పదమూడవ తమ్మున్పెరిమ మొదటి కోడలిగన్మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్చంపకమాలమరచుచు నాదు తల్లి తనె మాని కుటుంబ నియంత్రణమ్ము దామురిసి కనంగఁ దమ్ముఁ బదమూడవ వాడిని, ముద్దులొల్కఁగన్బెరిమను జేరఁ దీసి తగు వేడ్కను గైకొని పెద్దకోడలైమరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్!
బరువున ముద్దుల నొలుకుచు నిరవుగ దానుండ జూచి యింపగు మనమున్ నిరువది నెలలును నిండని మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
అరయగమెట్టినయింటనువిరబూసినపూవుననగపెంపునమదిలోకరమునుబట్టినబిడ్డడుమరదినిముద్దాడెనుసతిమఱిమఱిప్రేమన్
తరుణికి పినతల్లి సుతుడుమురిపాలొలికెడు భడిలుడి పుట్టిన రోజంచరిగి యచట పెనిమిటికినిమరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్.
అరుదుగముద్దరాలుగనునాయమబాల్యవివాహితయ్యెనేమురిసినయత్తగారుఁగనెముంగిటముత్యముచిన్నిబిడ్డనిన్కురిసినప్రేమజల్లులనుకూననుసాకెనుపెద్దకోడలున్మరదికిమాటిమాటికినిమానినిముద్దులువెట్టెఁబ్రీతితోన్
కందంసరసపు ధరకుప్రేయసిచిరకాలపు వాంఛ దీర్చ చీరను, సరిగన్హరిబువ్వము, పతి గొనగ, నమర, దిని ముద్దాడెను సతి మరిమరి ప్రేమన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.సరిగ-హారము,హరి బువ్వ ము-విందు.
అరసము తోడ పుట్టిన దినంబని పిన్నియె పిల్చినంతనే పురుషుని వెంటబెట్టుకుని ముద్దులబాలుని గాంచి రచ్చటన్ దరుణియె యందమొల్కు తన తమ్ముని చెంతన యున్న వల్లభున్ మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు పెట్టెఁ బ్రీతితోన్.
పురమున తిరుగుట గని , చామ రఁదిని ముద్దాడెను ; సతి మఱిమఱి ప్రేమన్పఱిపఱి విధముల జూపగపురుషుడు యెచ్చరిక జేసె పొరిచూపులతో
రది = ఏనుగుపొరిచూపు = ఉగ్రదృష్టి
వరగుణుని,కీర్తిమంతుని,సురుచిరరూపంబువాని,షోకగు వానిన్,సరసుని,భర్తని,యక్కకుమరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్.
తరుణికి సంతతికలుగనితరుణములోనత్తగనెను తనయుని వేడ్కన్మురియుచు పరిపరి తెఱగులమరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
పరవశమొందుచునింటనుతిరుగుచునలుదెసలనిరువదినెలల కూనన్మురిపెముతోడను గాంచుచు*మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్”
తరుణికి చంటిపాపలన తద్దయు మక్కువ, సంతు లేమితోమురిపెముదీరఁ బెంచుకొనె ముద్దుగ మాతులి పుత్రరత్నమున్సురుచిరమందహాసవిలసోద్ధితసుందర మోహనాంగుడౌమరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్
చిరుతవయస్సునుంగలిగి చేతుల నీయగ నిచ్చగించునా మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్ నరయగ ముద్దులన్గొలుపునా శిశుజూడగ నేరికైననున్ నురమునగల్గు సంతసమునుబ్బడిముబ్బడిగాగ దప్పకన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పరమానందంబలరగమురియుచు మేనత్తకన్న ముద్దుల శిశువున్కరములనెత్తుకు తిరుగుచుమరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
మరి మరి రండిరండని సమంచిత రీతినిఁబిల్చినంతనేకరము ముదంబుతోడ వెనుకందగ నుండియు ముద్దుచెల్లికిన్మరఁదికి;మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ, బ్రీతితోన్కురులను దువ్వి యెత్తుకొనె కుఱ్ఱని,పుట్టినరోజుపండగన్.
అరుదగు పెద్ద కుటుంబముపరువము నెలల పసిబిడ్డ, పరికింపగ కాపురమున కొచ్చిన సరణిని మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
కం//బొరుగుల భేల్పురిఁ బట్టుకుసరసముగా భర్త పత్ని సరసన జేరన్కరకర లాడెడు నొక మరమరఁ దిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్!(మరమర = మరమరాలుకు ఏకవచనముగా వాడాను. సరియో కాదో తెలియదు)
సురుచిర సుందర వదనుడు,నరసఖుడు,మురళిధరుండు, నల్లనివాడౌచిరునగవులొల్కురేవతిమరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కరమగు నెమ్మితోఁ గడు నకల్మష బుద్ధిని పెండ్లి చేసె నోతరుణి యనుంగు చెల్లికి, నుదారగుణమ్మున భర్తయౌననన్మరఁదికి, మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్వర శిశువై జనించ నొకబాలుడు వారి విరాళి పండగా
మురియుచు నభినందించెనుమరఁదిని, ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్బురుకని ముదమున వంశాంకురమని, మరచెను తన వెత గొడ్రాలౌటన్
చిరుతని మ్రుచ్చిలించిరని సేమమెరుంగక తల్లడిల్లగాచెర విడిపించి బాలకుని చెంతకు జేర్చగ నంజలించె దామరఁదికి, మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్మురిపెపు బిడ్డ నెత్తుకొని మ్రోయుచు సాంత్వనమొందెనంతటన్
అరవింద లోచన సుదతి సురుచిర భాషణము లాడుచుఁ దన పతి కొసంగి రమణి కమ్మని గారె లమరఁ దిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్ విరిసిన పూలు వెట్టికొని పెద్ద కుమారుని భార్య భీతిఁ గాఁపురమున కేఁగి కాంచె నట ముచ్చట నత్త కనిష్ఠ పుత్రు నా యరుదగు మందహాసమున నందము లొల్కెడు చంటి బిడ్డకున్ మరఁదికి మాటి మాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్
వరుసకు భర్తకున్ యగును భ్రాత యు గాంచగపిన్పబాలుడేమురిపెముతోడచేరదరిముద్దులు మూటనుగట్టురీతిగాకరములుచాచనెత్తుకొనిగట్టిగహత్తుకొనంగ ప్రీతితో*మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్”
నిరతము సాధన జేయగ
రిప్లయితొలగించండివరియించెను విజయ మనుచు వాత్సల్య మునన్
కర మను రాగము జూపుచు
మరిదిని ముద్దాడెను సతి మఱి మఱి ప్రేమన్
కందం
రిప్లయితొలగించండిమరచి కుటుంబ నియంత్రణ
మురిసి కనఁగ నమ్మయె పదమూడవ తమ్మున్
పెరిమ మొదటి కోడలిగన్
మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
చంపకమాల
మరచుచు నాదు తల్లి తనె మాని కుటుంబ నియంత్రణమ్ము దా
మురిసి కనంగఁ దమ్ముఁ బదమూడవ వాడిని, ముద్దులొల్కఁగన్
బెరిమను జేరఁ దీసి తగు వేడ్కను గైకొని పెద్దకోడలై
మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్!
బరువున ముద్దుల నొలుకుచు
రిప్లయితొలగించండినిరవుగ దానుండ జూచి యింపగు మనమున్
నిరువది నెలలును నిండని
మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
అరయగమెట్టినయింటను
రిప్లయితొలగించండివిరబూసినపూవుననగపెంపునమదిలో
కరమునుబట్టినబిడ్డడు
మరదినిముద్దాడెనుసతిమఱిమఱిప్రేమన్
రిప్లయితొలగించండితరుణికి పినతల్లి సుతుడు
మురిపాలొలికెడు భడిలుడి పుట్టిన రోజం
చరిగి యచట పెనిమిటికిని
మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్.
అరుదుగముద్దరాలుగనునాయమబాల్యవివాహితయ్యెనే
రిప్లయితొలగించండిమురిసినయత్తగారుఁగనెముంగిటముత్యముచిన్నిబిడ్డనిన్
కురిసినప్రేమజల్లులనుకూననుసాకెనుపెద్దకోడలున్
మరదికిమాటిమాటికినిమానినిముద్దులువెట్టెఁబ్రీతితోన్
కందం
రిప్లయితొలగించండిసరసపు ధరకుప్రేయసి
చిరకాలపు వాంఛ దీర్చ చీరను, సరిగన్
హరిబువ్వము, పతి గొనగ, న
మర, దిని ముద్దాడెను సతి మరిమరి ప్రేమన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
సరిగ-హారము,
హరి బువ్వ ము-విందు.
రిప్లయితొలగించండిఅరసము తోడ పుట్టిన దినంబని పిన్నియె పిల్చినంతనే
పురుషుని వెంటబెట్టుకుని ముద్దులబాలుని గాంచి రచ్చటన్
దరుణియె యందమొల్కు తన తమ్ముని చెంతన యున్న వల్లభున్
మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు పెట్టెఁ బ్రీతితోన్.
పురమున తిరుగుట గని , చా
రిప్లయితొలగించండిమ రఁదిని ముద్దాడెను ; సతి మఱిమఱి ప్రేమన్
పఱిపఱి విధముల జూపగ
పురుషుడు యెచ్చరిక జేసె పొరిచూపులతో
రది = ఏనుగు
రిప్లయితొలగించండిపొరిచూపు = ఉగ్రదృష్టి
వరగుణుని,కీర్తిమంతుని,
రిప్లయితొలగించండిసురుచిరరూపంబువాని,షోకగు వానిన్,
సరసుని,భర్తని,యక్కకు
మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్.
తరుణికి సంతతికలుగని
రిప్లయితొలగించండితరుణములోనత్తగనెను తనయుని వేడ్కన్
మురియుచు పరిపరి తెఱగుల
మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
పరవశమొందుచునింటను
రిప్లయితొలగించండితిరుగుచునలుదెసలనిరువదినెలల కూనన్
మురిపెముతోడను గాంచుచు
*మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్”
తరుణికి చంటిపాపలన తద్దయు మక్కువ, సంతు లేమితో
రిప్లయితొలగించండిమురిపెముదీరఁ బెంచుకొనె ముద్దుగ మాతులి పుత్రరత్నమున్
సురుచిరమందహాసవిలసోద్ధితసుందర మోహనాంగుడౌ
మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్
చిరుతవయస్సునుంగలిగి చేతుల నీయగ నిచ్చగించునా
రిప్లయితొలగించండిమరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్
నరయగ ముద్దులన్గొలుపునా శిశుజూడగ నేరికైననున్
నురమునగల్గు సంతసమునుబ్బడిముబ్బడిగాగ దప్పకన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరమానందంబలరగ
తొలగించండిమురియుచు మేనత్తకన్న ముద్దుల శిశువున్
కరములనెత్తుకు తిరుగుచు
మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
మరి మరి రండిరండని సమంచిత రీతినిఁబిల్చినంతనే
రిప్లయితొలగించండికరము ముదంబుతోడ వెనుకందగ నుండియు ముద్దుచెల్లికిన్
మరఁదికి;మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ, బ్రీతితోన్
కురులను దువ్వి యెత్తుకొనె కుఱ్ఱని,పుట్టినరోజుపండగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅరుదగు పెద్ద కుటుంబము
రిప్లయితొలగించండిపరువము నెలల పసిబిడ్డ, పరికింపగ కా
పురమున కొచ్చిన సరణిని
మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
కం//
రిప్లయితొలగించండిబొరుగుల భేల్పురిఁ బట్టుకు
సరసముగా భర్త పత్ని సరసన జేరన్
కరకర లాడెడు నొక మర
మరఁ దిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్!
(మరమర = మరమరాలుకు ఏకవచనముగా వాడాను. సరియో కాదో తెలియదు)
సురుచిర సుందర వదనుడు,
రిప్లయితొలగించండినరసఖుడు,మురళిధరుండు, నల్లనివాడౌ
చిరునగవులొల్కురేవతి
మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కరమగు నెమ్మితోఁ గడు నకల్మష బుద్ధిని పెండ్లి చేసె నో
రిప్లయితొలగించండితరుణి యనుంగు చెల్లికి, నుదారగుణమ్మున భర్తయౌననన్
మరఁదికి, మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్
వర శిశువై జనించ నొకబాలుడు వారి విరాళి పండగా
మురియుచు నభినందించెను
రిప్లయితొలగించండిమరఁదిని, ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
బురుకని ముదమున వంశాం
కురమని, మరచెను తన వెత గొడ్రాలౌటన్
చిరుతని మ్రుచ్చిలించిరని సేమమెరుంగక తల్లడిల్లగా
రిప్లయితొలగించండిచెర విడిపించి బాలకుని చెంతకు జేర్చగ నంజలించె దా
మరఁదికి, మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్
మురిపెపు బిడ్డ నెత్తుకొని మ్రోయుచు సాంత్వనమొందెనంతటన్
అరవింద లోచన సుదతి
రిప్లయితొలగించండిసురుచిర భాషణము లాడుచుఁ దన పతి కొసం
గి రమణి కమ్మని గారె ల
మరఁ దిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్
విరిసిన పూలు వెట్టికొని పెద్ద కుమారుని భార్య భీతిఁ గాఁ
పురమున కేఁగి కాంచె నట ముచ్చట నత్త కనిష్ఠ పుత్రు నా
యరుదగు మందహాసమున నందము లొల్కెడు చంటి బిడ్డకున్
మరఁదికి మాటి మాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్
రిప్లయితొలగించండివరుసకు భర్తకున్ యగును భ్రాత యు గాంచగపిన్పబాలుడే
మురిపెముతోడచేరదరిముద్దులు మూటనుగట్టురీతిగా
కరములుచాచనెత్తుకొనిగట్టిగహత్తుకొనంగ ప్రీతితో
*మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్”