7, మే 2022, శనివారం

సమస్య - 4073

8-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి”
(లేదా...)
“నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్”

34 కామెంట్‌లు:

  1. సిరినివాణినిగిరిజనుసేమమరసి
    ఉరమురసననునర్ధంబునోర్చిగాదె
    ముగురుమూర్తులుసృష్టికిమూలమైరి
    కాంతలగొల్చునరులకెగలుగుముక్తి

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    వదనమందున బ్రహ్మకు వాణిమెరయ
    విష్ణు హృదయపద్మమ్మున వెలయలక్ష్మి
    హరుని తనువున సగమైన గిరిజ లనెడు
    నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి

    తేటగీతి
    అజుని మోమున వాణిని నడుగ విద్య
    హరి హృదయసీమను రమను సిరుల గోరి
    శంకరుని సగమై గౌరి శక్తి నొసఁగ
    నెలఁతలన్గొల్చు నరులకె కలుగు ముక్తి


    చంపకమాల
    నలువముఖమ్మునన్ వెలుగు నాయకి వాణిని జ్ఞానభిక్షకై
    జెలియగ శౌరికిన్ హృదయసీమను భాసిలు లక్ష్మిఁ గల్మికై
    యలరగ భర్తమేన సగమైగిరి పుత్రిక శక్తిఁ గూర్పఁగన్
    నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్

    రిప్లయితొలగించండి
  3. మలిన విహీన మానసపు మానిని
    మక్కువతోడ భర్తతో
    సలలిత రాగ మాధురులు చయ్యన
    బంచుచునుండు నిత్య మా
    యలికులవేణి యాదరణ యద్భుత
    మొప్పగనుండునట్టి యా
    నెలతను గొల్చు పూరుషులె నిక్కముగా
    గనుగొంద్రు మోక్షమున్

    రిప్లయితొలగించండి
  4. డా బల్లూరి ఉమాదేవి

    హరియురమ్ముననొప్పిన సిరికి హరుని
    తనువునసగమై నిలిచిన దక్షసుతను
    నజుని మోమున గల యంచయాన యనెడు
    *"నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి”*

    రిప్లయితొలగించండి
  5. శ్రీ మహాలక్ష్మి మనలకు సిరులనొసగు
    శ్రీ భవాని ప్రసాదించు చిత్త శాంతి
    శ్రీ లలితను గొలిచిన నిశ్చింత కలుగు
    నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి

    రిప్లయితొలగించండి
  6. దేహ మందున సగమైన దేవి యొకతె
    యురము నందునవెలసిన యువిద యొకతె
    యజుని రాణి గ వాణి దా నలరు గాన
    నెలతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి

    రిప్లయితొలగించండి
  7. కన్నబిడ్డల పాలిట కల్పవల్లి
    కష్టసుఖములనరయుచు గాచుతల్లి
    అమ్మలందరి దివసమం దమితభక్తి
    నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి

    రిప్లయితొలగించండి

  8. శ్రీహరి హృదయాంతరవాసి సింధుకన్య
    శివుని యర్థభాగమ్మగు సింహయాన
    యజుని ముఖమై వెలుగు శుక్లలనెడు మువురు
    నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి.



    నలువ ముఖమ్ముగాగల సనాతని భారతి బ్రహ్మకన్యకన్

    జలనిధిఁ బుట్టినట్టి హరి శాలిని పద్మిని యంబుజాసనన్

    మలహరి యర్థభాగమగు మాలిని మంగళ మువ్వు రమ్మలౌ

    నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁ గొంద్రు మోక్షమున్

    రిప్లయితొలగించండి
  9. నెలతలుగారె దేవతలు? నిత్యము గీమున వంటశాలలో
    సలసలమగ్గ నేల? సరిసాటియె భర్తలకన్నిటన్గనన్
    సలిలముకన్న స్వచ్ఛమగు చల్లనితల్లులె వేల్పులీ భువిన్
    నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్

    రిప్లయితొలగించండి
  10. పతిసతుల చర్చలందు నీప్రత్య యములె
    భావ్యమని యనునిత్యము భజనసలిపి
    నెలఁతలన్ గొల్చు నరులకె , కలుగు ముక్తి
    యనుదినము జరిగెడు కలహముల నుండి

    రిప్లయితొలగించండి
  11. ఇలఁ గల మానవావళికి నెల్ల నుతింప భజింప యోగ్యమై
    వెలిఁగెడి మూల మమ్మయె, పవిత్ర జనాంతములందు శక్తి పెం
    పలరఁ గనేక రీతుల మహత్తర మాతృక లైన యమ్మ ల
    న్నెలతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్.

    జనాంతము-గ్రామము

    రిప్లయితొలగించండి
  12. ఆటవెలది
    కలువకంటి,కలికి,కాంత, కురంగాక్షి,
    గుబ్బలాడి,గుమ్మ,గుబ్బెత యన
    రక్తి కలుగు *నెలఁతలన్ గొల్చు నరులకె;
    కలుగు ముక్తి* హరిని గొలువగాను.

    "చిలుకలకొల్కి,చాన,చెలి,చేడియ, చక్కెర ముద్దుగుమ్మ,యీ
    కలికి "యటంచు రక్తులవఁగాంతల దాసులుగారె యక్కటా!
    *నెలఁతలగొల్చు పూరుషులు;నిక్కముగా కనుగొంద్రు మోక్షమున్*
    కలఁతను వీడి శ్రీహరిని గాటపు భక్తిని గొల్ఛువారలున్.

    రిప్లయితొలగించండి
  13. నెలతలను గొల్చు నరులకు గలుగు ముక్తి
    తే.గీ:ఆంగ్లవనితల గా నెంచి యవల విడక
    నా నివేదితా సోదరి,ననిబిసెంటు
    బోలు భరతతాత్వికతల బొందినట్టి
    నెలతలను గొల్చు నరులకు గలుగు ముక్తి

    రిప్లయితొలగించండి
  14. చం:తెలియక బ్రహ్మచర్య మను దీక్షను గూల్చెద రాడువా రటం
    చలుసుగ,నీచభావమున నంగన జూచుట ధర్మ మౌనె ఆ
    లలనల యందమున్ గనక లక్ష్మిగ,వాణిగ,నమ్మవారిగా
    నెలతల గొల్చు పూరుషులె నిక్కముగా గనుగొంద్రు మోక్షమున్.

    రిప్లయితొలగించండి
  15. తేటగీతి
    వాణినిబ్రహ్మ దేవుడు వాక్కు నుంచె
    లక్ష్మిని హరి తన హృదయ లక్ష్మి జేసె
    శంభు నిశరీర భాగిగ శక్తి నిలిచె
    నెలత లన్ గొల్చు నరులకె కలుగు ముక్తి
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  16. నిలుపుచు వెంకటేశ్వరుని నిశ్చల మౌమతి సన్నుతించుచున్
    చెలికనుసన్నలన్ మెలగి చేయుచు కార్యము లన్నిఇచ్ఛతో
    కలతలు లేక జీవితము కమ్మగ సాగ గృహమ్ము నందునన్
    నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్

    రిప్లయితొలగించండి
  17. కాంతలకు నుండు ననురక్తి కాంత లందు
    కాంత కెనలేని రతి యుండుఁ గాంతు పైన
    ముక్తి కామ్యంపుఁ గాంతయై మూరుఁ గాన
    నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి


    నెలఁతను స్వీయ వక్షమున నిత్యము లక్ష్మిని నుంచె విష్ణువే
    నెలఁతను వామ భాగమున నిల్పెను బార్వతి నీశ్వరుం డహో
    తలఁపఁగఁ గామి కాని యెడఁ దా నిఁక నందఁడు మోక్ష లబ్ధినిన్
    నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్

    రిప్లయితొలగించండి
  18. మరొక పూరణ

    జలనిధిపుత్రితానొసగుసంపద,లీమనుజాళికీధరన్
    పలుకులతల్లివిద్యలనువాసిగనెప్పుడు నందచేయగా
    చలిమలపట్టియున్విడకచక్కగకాచుచునుందురందురా
    నెలతల గొల్చు పూరుషులెనిక్కముగాగనుగొంద్రు మోక్షమున్


    రిప్లయితొలగించండి
  19. కొలిచెను కాళికాంబ నల కోవిదుఁడై జనె కాళిదాసు దా
    పలుకువెలంది నమ్మి మది భాగవతంబిడె పోతనార్యుడున్
    కలుముల రాణి గొల్చి గనె కాంచనవర్షము శంకరుండహా
    నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్

    రిప్లయితొలగించండి