11, మే 2022, బుధవారం

సమస్య - 4077

12-5-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్”
(లేదా...)
“చల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగిలించె మంటలన్”

42 కామెంట్‌లు:

  1. కల్లరితనమునకృష్ణుఁడు
    పిల్లనగ్రోవినియెడనెడపిలువగరాగా
    ఝల్లనమదిలోకోరిక
    చల్లనివెన్నెలరగిల్చంసాధ్వియెడందన్

    రిప్లయితొలగించండి
  2. అల్లరి భర్త చేష్ట లతియవ్వన కోమల
    మోహనాంగికిన్
    జల్లగ వీచు వాయువుకు సంగమ
    కోరిక యుప్పతిల్లియున్
    దల్లడ మొంద జేయ మరి దానికి
    తోడగ చందమామ యా
    చల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగించె మంటలన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఫుల్లసరోజ నయన చిం
    తిల్లఁగ రావణుఁడు లంక దింపియు భ్రమలన్
    దల్లడపఱుచ పతి స్మృతులఁ
    జల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్

    ఉత్పలమాల
    ఫుల్ల సరోజ నేత్రఁ గుజ మోహమునన్ గొని లంకఁజేర్చి చిం
    తిల్లఁగ జేసి రావణుఁడు దీవ్ర వచశ్శరఘాతసంగతిన్
    దల్లడపెట్ట రోదనల దైన్య బతీ విరహానలంబునన్
    జల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగిలించె మంటలన్

    రిప్లయితొలగించండి
  4. మ ల్లియమాధురీలతలమాటువియోగమునందెకాంతయున్
    పెల్లుగభూ సురుండునటపేర్చినదుఃఖముకౌగిలింపగావల్లనుకానివైరమునభామినికోరికనీసడింపగా
    చల్లనిపండువెన్నెలలుసాధ్వియెదన్రగిలించెమంటలన్

    రిప్లయితొలగించండి

  5. అల్లన వేణుగానమది హాయిని గొల్పుచు నుండనేమి యా

    నల్లని వాడు వృష్ణి యమునాతటి లో కనిపింపడయ్యెనే

    మల్లెలు వాసనల్ మదిని మంటలు రేపుచు నుండు నత్తరిన్

    జల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగిలించె మంటలన్.

    రిప్లయితొలగించండి

  6. ఉల్లముఁ దాకిన యా నెల
    యల్లుని కుసుమాస్త్రములవి యలజడి రేపన్
    మల్లెలె భారంబయ్యెను
    చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్

    రిప్లయితొలగించండి
  7. చెల్లెలి రాక మదికి నిడె
    చల్లని వెన్నెల ; రగిల్చె సాధ్వి యెడందన్
    నొల్లమి తనిదినములలో
    కల్ల నుడులిరువురి నడమ గలుగుట చేతన్

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దీనత్వముతో నుల్లము...' అనండి.

      తొలగించండి
    2. అల్లరి కృష్ణుడు రాడని
      తెల్లంబైసత్యభామ దీనత్వముతో
      నుల్లముకల్లోలపడగ
      చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్

      తొలగించండి
  9. మల్లెలు పరిమళమునువెద
    జల్లుచునుండగ పతియును చనగా దవ్వున్
    పెల్లుబుక ప్రేమ పతిపై
    చల్లని వెన్నెల రగిల్చె సాధ్వియెడందన్

    రిప్లయితొలగించండి
  10. మెల్లగ వీచెను తెమ్మెర
    అల్లదె మదనుండు పూవుటమ్ములు గ్రుచ్చన్
    ఝల్లుమనె మేను రావే!
    *చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి!యెడందన్.*

    మెల్లగ పిల్లగాలులును మేనికి తాకుచునుండె సారెకున్
    అల్లదె తుంటవిల్తుఁడు సుమాస్త్రములంగురిచూచి నెక్కిడెన్
    *చల్లని పండువెన్నెలలు సాధ్వి!యెదన్ రగిలించె మంటలన్*
    చెల్లున!జాగుసేయుటలు?శీఘ్రమె రాగదె కంతుకేళికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'చూచి యెక్కిడన్'

      తొలగించండి
    2. నమస్తే శంకరయ్య గారు!చూచి యెక్కిడన్ యడాగమమే చేయాలి, ధన్యవాదములు.

      తొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జల్లనె నుల్లమ్మతనికి' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారు

      పిల్లన గ్రోవిని నూదుచు
      చల్లగ పిల్లని పిలువగ సరసంబునకున్
      జల్లనె యుల్లమ్మతనికి
      చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్.
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.

      తొలగించండి
  12. మల్లె సువాసనల్ మదిని మత్తున దేల్చుచు సందడింపగా
    యల్లన వీచు తెమ్మెరలు హాయిగ సాంత్వన నీయవేలనో!
    యల్లరి పచ్చవింటిదొర యారడి కోలుమసంగు వేళలో
    చల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగిలించె మంటలన్

    రిప్లయితొలగించండి
  13. అల్లన యమునాతీరపు
    మొల్లలు విరబూసి మదిని మురిపించగనా
    నల్లని కృష్ణుని గాంచక
    చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్

    రిప్లయితొలగించండి
  14. ఎల్లలు దాటియు వెడలెను
    పెల్లుగ నార్జింప ధనము పెనిమిటి యనుచున్
    మల్లెలు వాడుచు నుండగ
    చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడంద న్

    రిప్లయితొలగించండి
  15. ఉల్లము పల్లవించ గని యుగ్మలి నొక్కతె నెయ్యునింటిలో
    కల్లలెరుంగనట్టి దని కైకొనె చక్కని చిన్నవాడు, రా
    జిల్లగ వానియోచనలు, చేరక యున్నను వాడు యామినిన్
    చల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగిలించె మంటలన్

    రిప్లయితొలగించండి
  16. చల్లిన గంధము తగ్గక
    యుల్లమ్మునఁ దీపి దలఁపు లొక్కుమ్మడి వ
    ర్ధిల్లఁగ విరహ మనలమై
    చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్


    తల్లయ కారకుండు ధృతిఁ దత్పర సేనలఁ జంపి కౌరవుల్
    తల్లడిలంగ నుగ్ర తమ ధన్వి వరుండు దురాసదుం డనిన్
    డుల్ల భ టాభిమన్యుఁడు కఠోరపు వార్త వినంగ మాయమై
    చల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగిలించె మంటలన్

    [భటుఁడు = యోధుఁడు]

    రిప్లయితొలగించండి
  17. చెల్లె ఋణంబెడలెను బతి
    తల్లడిలెన్ మదిని బడతి తాళగ లేకన్
    కల్లలు గాగ కలలటుల
    చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్

    రిప్లయితొలగించండి
  18. నల్లని కృష్ణుండచ్చో
    నుల్లము రంజిల్లునటుల నూదుచునుండన్
    పిల్లంగ్రోవిని నదివిన
    చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్.

    అల్లననారదుండొసగహాయినిగూర్చెడుపారిజాతమున్
    పుల్లసరోజనేత్రుకట మోదముతోనిడ పెద్ద భార్యకున్
    చల్లగనూదగాచెవినిసత్యకు క్రోధము హెచ్చగా మదిన్
    చల్లని పండు వెన్నెలలు సాధ్వియెదన్ రగిలించె మంటలన్
    గొల్లుననేడ్చుచుండగను కూరిమి చూపగ వచ్చె శౌరితా

    రిప్లయితొలగించండి