8, మే 2022, ఆదివారం

సమస్య - 4074

9-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్”
(లేదా...)
“పలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో”

38 కామెంట్‌లు:


  1. పలువిధముల పనులందున
    నలసిన పరిగృహ్య యాగ్రహమ్మున కఠినో
    క్తులఁ బలికిన బదులింకను
    పలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్.

    రిప్లయితొలగించండి
  2. కందం
    కొలువున కధిపతియైనన్
    తెలియదు మీకేమటంచు దెప్పఁగనింటన్
    దలయూచుచు నడ్డేమియుఁ
    బలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్!

    చంపకమాల
    కొలువున మేటియౌచు యనుకూలముగన్ వచియింపనెల్లరున్
    నెలఁతయుఁ బిల్లలున్ సతము నేరము లెంచుచు నింట పోరుచున్
    దెలియదు మీకులోకమని దెప్పుచునుండఁగ నడ్డుమాటలన్
    బలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో!

    రిప్లయితొలగించండి
  3. అలసటలేకనువడివడి
    జలజలనిజసతిపలుకులఝాడింపంగా
    విలువలుదెలిసినవాడై
    పలుకులకూర్చున్నపతియెపడయుసుఖముల్

    రిప్లయితొలగించండి
  4. ఖలు డొకరుడు పరుషము గా
    బలికినను గాని తాను బదు లీయక నే
    కలవర మందక నయ్యెడ
    పలుకక కూర్చున్న పతియె పడ యు శుభముల న్

    రిప్లయితొలగించండి
  5. నెలనెల ఖర్చులపై తన
    కలవాటుగ నుడివి నట్టి యాలి ప
    లుకులన్
    విలువలు లేకున్న నెదురు
    పలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్

    రిప్లయితొలగించండి
  6. సులువగుసాధనంబునటశోధనసేయగబ్రహ్మతత్త్వమున్
    అలగడుసోక్రటీసుఘనయానమునందునభార్యధాటికిన్
    తలపులసౌమ్యభావననుధర్మమునెంచుచుకృష్ణుపద్ధతిన్
    పలుకకకూరుచున్ననెశుభంబొనగూడునుభర్తకింటిలో

    రిప్లయితొలగించండి
  7. అలికులవేణి సుందరపు టాలి లభించెను
    నాక టంచు తా
    దలపున నెంచుచుండె మరి తామర
    సాక్షియు భర్తనెప్పుడున్
    పలుమరు బాధ పెట్టు కడు భారముగా
    గల భార్య సన్నిధిన్
    పలుకక కూరుచున్ననె శుభంబొన
    గూడును భర్త కింటిలో

    రిప్లయితొలగించండి

  8. వెలుగులరేడు శక్రదిశ విశ్నము బంచగ రాకపూర్వమే

    లలనలు నిద్రవీడుచు విరామమెఱుంగని శ్లాఘతోడ తా

    మలసిన వేళ గొంత శఠమందు పరాకున దూరు నత్తరిన్

    బలుకక కూరుచున్ననె శుభంబొనగూడును భర్తకింటిలో.

    రిప్లయితొలగించండి
  9. నెలతుక పలుకుల కెప్పుడు
    విలపన తెలియని పొలుపున విలువల నిడుచున్
    కలహపు పలుకులకు నెదురు
    పలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్

    రిప్లయితొలగించండి
  10. అలుకను బూనెడు సతితో
    కలతల కాపురము సేయ గమకించి వెసన్
    కలహము కొనసాగింపక
    పలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్

    అలుకనుబూనుటన్ననది యాలికి యస్త్రము కాపురంబునన్
    కలతల మబ్బు దొంతరలఁ కాంతుని మౌనమె పారదోలునా
    కలహము శాశ్వతంబగునె? కావున యల్క వహించు పత్నితో
    పలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో

    రిప్లయితొలగించండి
  11. కందం
    చిలుకల కొలికిల కోపము
    కలతల కారణ మయినను కలవర పడకన్
    లలనలతో వాదింపక
    పలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్.


    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  12. చిలుకల కొల్కి భార్యయయి చెన్నగు రూపముతోడ మించుచున్
    విలువగు జీవితమ్మునిడి వేడుక పెంచుచు చెంగలించుచున్
    చెలగుచు నున్న కోపమున, చేసిన నల్పపుఁ దప్పిదమ్ముతో
    పలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో

    రిప్లయితొలగించండి
  13. కం//
    పలుచీరలింట యున్నను
    కులుకుచు సతి క్రొత్తచీరఁ గొనుమని యడుగన్
    వెలయెంతైనను వలదని
    పలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పలు చీర లింట నున్నను.." అనండి.

      తొలగించండి
  14. ఉ:పలుకక దేనికిన్ పతియె బాధ్యత నెట్టగ భార్య యిట్లనెన్
    "పలుక డిదేమి భర్త!ప్రతి భారము నా పయి బెట్టు నేలనో!"
    కెలుకుచు నన్ని భర్త తన క్లిష్టత బెంచగ భార్య యిట్లనెన్
    *పలుకక కూరుచున్ననె శుభం బొనఁ గూడును భర్త కింటిలో*

    రిప్లయితొలగించండి

  15. (3)చం:అలసత జెంది మానసము నందున బ్రహ్మకు దోచె నిట్టులన్
    పలుకుల దేవి నా సతియె పల్కులు ,వాదము నాకు నేల !నా
    తలపుల తోనె సృష్టి యగు తక్కిన దామెయె మాటలాడు లే
    పలుకక కూరుచున్ననె శుభ మ్మొనగూడును భర్త కింటిలో

    రిప్లయితొలగించండి
  16. పలుచన సేయగ సతి నెటు
    పలుకక కూర్చున్న పతియె? పడయు శుభములన్
    పలువురిలో బడతి పరువు
    నిలబెట్టెడి పతియె జగతి నిక్కము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  17. పలు పలు రీతులన్ దనదు పాక చమత్కృతి జూపనెంచుచున్
    పలు ఫలహారముల్ వివిధ భక్ష్యములన్ దగ జేసి పత్ని దా
    పలువుర బిల్చి విందునిడ వంటల వంకలు బెట్టరాదయో
    పలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో

    రిప్లయితొలగించండి
  18. అలుక మదిలోఁ జెలఁగ నేఁ
    జలమునఁ బలికిన పలుకులు సరకుగొనకు నాఁ
    బలికి తన సతీమణితోఁ
    బలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్


    లలనలు కోప తాపములు రంజిల నేర్వరు మంచి చెడ్డలం
    గలికి కొకింత వేళ నొసఁగం బరికించు మనమ్ము నందుఁ బే
    రలుక వహించి పల్కు సతి కాగ్రహ మూర్తికి వాలుఁగంటికిం
    బలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో

    రిప్లయితొలగించండి
  19. పలికె వరంబు గోరుమని బంక్తిరథుండల వంత పాలయెన్
    పలికెను నొచ్చెనంచు ముని పాదమునా హరి బాసె లక్ష్మినే
    పలికెను పారిజాతమిడ భైష్మకికిన్ గొనె తాడనంబునే
    పలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో

    రిప్లయితొలగించండి
  20. అలకను బూనుచు సతతము
    కలహమునకు సిద్ధమగుచు కస్తిన్ బెట్టన్
    విలువ నొసంగని సతితో
    పలుకక కూర్చొన్నపతియె పడయు శుభములన్.

    నిలువక నొక్క చోటనెట నిత్యమునెల్లర శాంతి కూల్చుచున్
    కలతలు నింపుచుండసతికారణమేదొయెరుంగలేకయే
    కలహములుండకూడదనిగట్టిగనమ్ముచుమానసంబులో
    పలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో”

    రిప్లయితొలగించండి