3, మే 2022, మంగళవారం

సమస్య - 4069

4-5-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్”
(లేదా...)
“మినుములఁ జల్లఁగా మొలిచె మేలిమి కందులు జొన్నచేనులో”
(ముడుంబై పురుషోత్తమాచార్యులకు ధన్యవాదాలతో...)

45 కామెంట్‌లు:

 1. కందం
  అనయము మిశ్రమ పంటలు
  నొనగూర్చును రాబడులన నుత్తమమనఁ దా
  ననువుగ కందుల గలుపుచు
  మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్

  చంపకమాల
  అనయము మేటి రాబడులు నప్పులఁ దీర్చునటంచుఁ జెప్ప సూ
  చనలవె శాస్త్ర పద్ధతిని సాగుకు మిశ్రమ పంటమేలనన్
  బనిగొని రైతులున్ దిగుచు పాడిగ జొన్నలు గల్పి కందులున్
  మినుములఁ జల్లఁగా మొలిచె మేలిమి కందులు జొన్నచేనులో

  రిప్లయితొలగించండి
 2. కందం
  మినుములు ,కందుల విత్తులు
  పనితనమున వరిపొలాన పదునుగ జల్లెన్
  ఉనికి తదుపరి గనుగొనన్
  మినుములు జల్లంగ మొలిచె మేలిమి కందుల్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 3. వనమందు రైతు కందులు
  మినుములుఁజల్లంగ;మొలిచె మేలిమి కందుల్
  కనుగొను మా!యీ మొక్కలు
  మినుములు మొలకెత్తవలెసుమీ!యిఁకమీదన్.

  రిప్లయితొలగించండి


 4. ఇనకుల తిలకుడు రాముడె
  తనకు శరణమంచు వేడు దనుజుండు విభీ
  షణుఁ గాథ తెలిపి యిట్లనె
  మినుములుఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్.  వనితను బంధిసేయుట శుభంబది కాదని యెన్ని మారులో

  వినయము తోడ చెప్పిన విభీషణుఁ గైకసి పుత్రుడైన యా

  దనుజుడు రావణాసురుని తమ్ముని గూర్చి వివేకు డిట్లనెన్

  మినుములు జల్లఁగా మొలిచె మేలిమి కందులు జొన్న చేనులో.

  . — విరించి.

  రిప్లయితొలగించండి
 5. జననమునందెరాజుగనుజంగమదేవరయానతీయగా
  కనగనుమన్యవీరుడుగకానలయందునసంచరించెనే
  అనయముతెల్లవారలకుహద్దులుజూపెనుసీతరాముడై
  మినుములుజల్లగామొలిచెమేలిమికందులుజొన్నచేనులో

  రిప్లయితొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  తనిగను కందులు కొన్నియు
  పెనగియు మినుముల నిలచిన వీక్షించకయే
  అనువుగ దుక్కిన పొలమున
  మినుములు జల్లంగ మొలిచె మేలిమి కందుల్.

  రిప్లయితొలగించండి
 7. కనుమాజగతినినొకపరి
  మౌనులుగాగనుమనుజులుమాటునమేథన్
  పనిగొనివింతలదెలిపిరి
  మినుములుజల్లంగమొలిచెమేలిమికందుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదాన్ని గురువుతో ప్రారంభించారు.

   తొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రీతిని' అనండి.

   తొలగించండి
  2. అనయము శ్రమియించుచు తన
   పని ముగిసినవేళ రైతు పగటికలగనెన్
   కనివిని యెరుగని రీతిని
   మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్

   తొలగించండి
 9. పనులను శ్రద్ధగ నెరపుచు
  ననువుగనెరువులనువేయ నందించుసిరుల్
  మొనగాడు రైతు యాతడు
  మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రైతు+ఆతడు' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  ధనమును కోరివచ్చి సభ దగ్గర భూపతితోడ పేదయే
  ననిన పదమ్ము లన్నిటికి నచ్చగు రీతిని కాళిదాసుడే
  ననువగు నర్థముల్ పలికి నాతని కర్థమొసంగ జేసెలే!
  మినుములు చల్లగా మొలిచె మేలిమి కందులు జొన్నచేనులో.

  రిప్లయితొలగించండి
 12. మినుములని జెప్ప పూర్తిగ
  వినకుండగ నచట గంది విత్తుల జల్లన్
  జనులాశ్చర్య పడిరిటుల
  “మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్”

  రిప్లయితొలగించండి
 13. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  వినుటకు వింతగ తోచును
  కనికట్టును చేసె నొకడు క్షణకాలమునన్
  జనులందరు గాంచు వడిన్
  మినుములు జల్లంగ మొలిచె మేలిమి కందుల్.

  రిప్లయితొలగించండి
 14. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  వినుటకు వింతగాదు నిది వేవురు పల్కుచునుండ నిక్కమే
  ఘనుడగు నింద్రజాలికుడు కన్నుల గాంచుచు నుండగా బ్రజల్
  తనదగు దండమూపుచును ధాటిగ నబ్బరదబ్బరంచటన్
  మినుములు జల్లగా మొలిచె మేలిమి కందులు జొన్న చేనులో!

  రిప్లయితొలగించండి
 15. మునుపటి పంటకు పనిగొని
  మినుములఁ జల్లంగ; మొలిచె మేలిమి కందుల్
  అనువుగ నీ పరి వరి పొల
  మున పూడ్చ గ నత్రజనిని ముందుగ ఘనతన్

  రిప్లయితొలగించండి
 16. మినుముల మొక్కల వేపుగ
  మినుములు జల్లంగ మొలచు :మేలిమి కందుల్
  కొనుటకు జనతతి యెగబడ
  ఘనమగు వరుసలుగ జేర గడబిడ హెచ్చె న్

  రిప్లయితొలగించండి
 17. గునగున వచ్చి కైతలను గూర్చితి రెట్లని యెంచి గుంపులోఁ
  గనవిన వింత కాదు కలికాలము పైన నెపమ్ము వేసి వ్రా
  సిన కవితల్ గథల్ గన విశేషములీయవి యంచుఁ జెప్పి రా
  మినుములఁ జల్లఁగా మొలిచె మేలిమి కందులు జొన్నచేనులో

  రిప్లయితొలగించండి
 18. అనయము సారవంతములునౌగద భూములు కోనసీమలో
  కనుగొనఁగొబ్బరుల్, పనస,కంది,యరంటి ఫలించునచ్చటన్
  *మినుములుఁజల్లగా మొలిచె,మేలిమి కందులు,జొన్న,చేలలో*
  కనులకు పండువై పెరిగె కర్షకులెల్లరు హర్షమొందగన్.

  రిప్లయితొలగించండి
 19. మినుముల నినుములు కలవని
  యినుములఁ గూర్పంగఁ బైరు కింపగు నంచున్
  జని నే నెరువుగఁ గలలో
  "మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్”

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. కం||
  పనిలో సాయము కోరగ
  మునుపెన్నడు గనని కొడుకు ముదమున; కందుల్
  మినుమని భ్రమపడి పొలమున
  మినుములు జల్లంగ మొలిచె మేలిమి కందుల్!

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. వినుమల దైత్య నందనుఁడు పేర్మి చరించెను విష్ణుభక్తుఁడై
  తనరుచు వామనాఖ్యునికి దానమిడెన్ బలి సత్యసంధుడై
  జనకులు రాక్షసేశ్వరులు సాధువులైరి సుతుల్ దలంపగా
  మినుములఁ జల్లఁగా మొలిచె మేలిమి కందులు జొన్నచేనులో

  రిప్లయితొలగించండి
 24. కనుము తలెత్తె మొలకలటు
  మినుములఁ జల్లంగ, మొలిచె మేలిమి కందుల్
  దనరుచు తనయుని పొలమున,
  జనకుని కన్నులు చెమర్చె సంతసమొప్పన్

  రిప్లయితొలగించండి
 25. కన నెంచి రెండు పంటల
  ననుకూలమ్ముగ నొకింత యసమంజస మై
  నను నేఁ గందులను గలిపి
  మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్


  చొనుప ననుక్రమమ్మునను జొన్నలు కందులు నింక మిన్ములున్
  ఘనముగ నేఁట నేఁటను సుఖమ్ముగ జొన్నలు నేఁడు చల్లఁగాఁ
  గనుల కొసంగ నచ్చెరువు క్రన్నన రెండును జల్ల కుండినన్
  మినుములఁ జల్లఁ గా మొలిచె మేలిమి కందులు జొన్నచేనులో

  [చల్లఁ గా= చల్లను గా; చల్లనుగా రెండును, జల్లకుండినన్ మినుములు, మేలిమి కందులు మొలిచె]

  రిప్లయితొలగించండి
 26. అనయము పంట మార్పిడిని యద్భుతమౌ ఫలమొంద నెంచుచున్
  పనిగొని జొన్న నూడ్చి, తరువాత కృషీవలుడాస్థ కందులున్
  పెనుపగు యాయమున్ గొనగ ప్రీతిగ నంతర పంటకోసమై
  మినుములఁ జల్లఁగా మొలిచె, మేలిమి కందులు, జొన్నచేనులో,
  ఘనముగ పంట నీయగను కర్షకు డందెను రెండుపంటలన్

  రిప్లయితొలగించండి
 27. కనుగొన కర్షకావళియు కాలము బట్టియు
  పంట మార్పు వా
  రనయము వేయుచుంద్రుగద రాబడిపెంచను
  గలిపి ధాన్యముల్
  మినుములు జల్లగా మొలచె మేలిమి
  కందులు జొన్నచేలలో
  వినగ విచిత్రమేయయిన బెర్గును మిశ్రమ
  పంటలిట్టులన్

  రిప్లయితొలగించండి
 28. కనుమిదిపుత్రాచక్కగ
  ననువుగ కందులు కలుపుచు నవనిన త్వరగా
  జొనుపుచు నందొక సాలున
  మినుములు జల్లంగ మొలిచె మేలిమి కందుల్

  రిప్లయితొలగించండి