20, మే 2022, శుక్రవారం

సమస్య - 4086

21-5-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విశ్వమునకు టెర్రరిజమె వేడ్కఁ గూర్చు”
(లేదా...)
“బావా టెర్రరిజంబె సాధనము విశ్వశ్రేయముం గూర్చఁగన్”

40 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. తేటగీతి
   భువి నధర్మము మీరగ పుట్టుదునని
   నాడు సెప్పితె యుద్ధాన నళిననేత్ర
   యెన్నియవతారములని నేడెన్న గలవు
   విశ్వమునకు టెర్రరిజమె వేడ్కఁ గూర్చు!

   శార్దూలవిక్రీడితము
   మావారల్ మును నెగ్గుచేయ మము దుర్మార్గంబునన్, గృష్ణుఁడై
   నీవై యయ్యవతారమందున దగన్ నిర్జింప క్రూరాత్ములన్
   బ్రోవన్ శిష్టులఁ జెల్లె! నేడటులనే బోరంగ నీకౌనొకో?
   బావా టెర్రరిజంబె సాధనము విశ్వశ్రేయముం గూర్చఁగన్!!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి

 2. స్వార్థ చిత్తులై యవని నశాంతి నింప
  రక్తపాతంబు సృష్టించు రక్కసులను
  బోలు ఖలు తీవ్రవాదుల పొగరు మార్చ
  విశ్వముమకు టెర్రరిజమె వేడ్క గూర్చు


  భావావేశము లోకనాశమనుచున్ భాషించుచున్ శాంతికై

  నీవీ రీతిని పల్కుచుండు టదియే నేనిచ్ఛ గింపంగ లే

  నీ విశ్యంబును కాడు జేయదలచే హీనాత్ములన్ ద్రుంచగన్

  బావా! టెర్రరిజంబె సాధనము విశ్వశ్రేయమున్ గూర్చగన్.

  రిప్లయితొలగించండి
 3. శాంత్యహింసలు సత్యంబు సౌఖ్యమొసగు
  *విశ్వమునకు;టెర్రరిజమె వేడ్కఁగూర్చు*
  టెర్రరిష్టులకు నకట!కర్ర,కత్తి,
  మరతుపాకులు వలనను మారణంబె.

  రిప్లయితొలగించండి
 4. లావొక్కింతయు లేనివారిగతి యేలా?భయభ్రాంతులై
  జీవించన్ బహు కష్టమేయగును సంక్షేమంబెటుల్, ధర్మమా?
  బావా!టెర్రరిజంబు?సాధనము విశ్వశ్రేయమముంగూర్చగన్
  దైవారాధన,శాంత్యహింస, కరుణా దాక్షిణ్యభావంబులే.

  రిప్లయితొలగించండి
 5. వెర్రితలల విశ్వమునకు
  టెర్రరిజమె వేడ్కఁ గూర్చు టెక్కులుపోయే
  కుర్రతనపు వాచకులే
  గొర్రెల మందల కరణిగ కొంటెగ నుడువన్

  రిప్లయితొలగించండి
 6. శాంతి మార్గమె మోదము సలుపు నెపుడు
  విశ్వమునకు ; టెర్రరిజమె వేడ్కఁ గూర్చు
  నాడుల నడమ ద్వేషము నడిపి విశ్వ
  సోదరత్వముడుగ కోరు సుడియ లకును

  రిప్లయితొలగించండి
 7. ఆటవెలది
  అనఘ!చేటు*విశ్వమునకు టెర్రరిజము
  వేడ్కఁగూర్చు*గాదె వివిధముగను
  సెక్యులరిజము కడు సిరిసంపదలుమరియు
  శాంతి సౌఖ్యములిచ్చి చక్కగాను.

  రిప్లయితొలగించండి
 8. జనుల హననమె లక్ష్యమై జగతి యందు
  పెక్కు దారుణ కృత్యాలు పెచ్చ రిల్లె
  మనుజ బాంబులు గామారి మట్టు బెట్టు
  విశ్వ మునకు టెర్రరిజమె వేడ్క గూర్చు

  రిప్లయితొలగించండి
 9. భావావేశము కూడదంచు రిపు సంభావించుచున్ బోవగా
  నావైరుల్ దయవీడి వర్తిలుచు నన్యాయమ్ములన్ చేసెడిన్
  జీవించన్ భువి నేడు సమ్ముదముతో స్వేచ్ఛార్థమై వైరిపై
  బావా! టెర్రరిజంబె సాధనము విశ్వశ్రేయముం గూర్చఁగన్

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మానవ తెగ, వినాశన మైకము, దుర్మార్గ మూకలు... దుష్టసమాసాలు.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువు గారు.

   తొలగించండి
 11. సేవాభావమొకింతలేక ప్రజకున్ క్షేమంబునున్గూర్చకన్
  యావేలంబుగ నాత్మబాంధవులకున్నర్పించి సర్వస్వమున్
  భావోద్వేగము రెచ్చగొట్టి జనులన్ పట్టించుకోవేలనో
  బావా టెర్రరిజంబె సాధనము విశ్వశ్రేయముం గూర్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'క్షేమంబునున్ గూర్చకే..' అనండి.

   తొలగించండి
 12. దేవదేవునిలీలయేతెలియరండి
  జగతిసృష్టివిలయములజతనుజేర్చి
  వింతపుంతలఱేఁడునైవెలుగునింపు
  విశ్వమునకుటెర్రరిజమెవేడ్కఁగూర్చు

  రిప్లయితొలగించండి
 13. కావేషంబు రగిల్చి మానవుల దుష్కార్యంబులన్ దేల్చుగా
  బావా టెర్రరిజంబె; సాధనము విశ్వశ్రేయముం గూర్చఁగన్
  సేవా తత్పరులౌచు సజ్జనుల సంక్షేమంబు గాంక్షించుచున్
  వైవిధ్యంబగు భావజాలముల సద్భావంబునన్ గాంచుటే

  రిప్లయితొలగించండి
 14. మావోయిష్టులుముష్కరుల్దనరుమీమారాజులీబాటలో
  కావంగీనిలదేశమున్తమదుజాగాయంచుపోరాడిరే
  భావంబెయిదిభావిభారతమునాభానుండురూపీయగా
  బావాటెర్రరిజంబెసాధనమువిశ్వశ్రేయమున్గూర్చగా

  రిప్లయితొలగించండి
 15. ఈ విశ్వంబున బ్రాకి పోయెనుగదా యీ
  క్రూర కూటంబు ప
  ల్జీవంబుల్ గొనుచుండె నిర్దయత, దోషీ
  భూత దుర్వృత్తిచే
  బావా! టెర్రరిజంబె , సాధనము విశ్వ శ్రేయమున్ గూర్పగా
  జీవానందము బెంచ, శాంతి యొకటే క్షేమంబు జేకూర్చెడిన్.

  రిప్లయితొలగించండి
 16. శాంతి శాంతి యని నిలువ శాంత మూని
  సుంత యేని దేశమ్మున శాంతి రాదు
  దుష్టులకు బుద్ధి నేర్ప ననిష్ట మైన
  విశ్వమునకు ధర్షణ గతి వేడ్కఁ గూర్చు


  ఆవేశం బొక యింతయుం దగదు రక్షార్థమ్ము నిత్యమ్ము స
  ద్భావంబూని నరేంద్ర సంచయము నిర్ద్వంద్వమ్ముగా స్వీయ సు
  ప్రావీణ్యంబునఁ బాప కర్ములను గారన్ నిగ్రహింపన్ ధరన్
  బావా భర్త్సన చర్య సాధనము విశ్వశ్రేయముం గూర్పఁగన్

  రిప్లయితొలగించండి


 17. తేటగీతి
  శాంతి కాంక్ష సారధులవసరము గలదు
  విశ్వమునకు ,టెర్రరిజము వేడ్క గూర్చు
  మానవాళి హనన కార్యమందు మదిన
  మునిగి దేలెడి పాపుల ముచ్చటందు.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 18. హాని కలుగజేయుననుట యక్షరాల
  వాస్తవమటండ్రు బుధులు వడిగ నేడు
  విశ్వమునకు టెర్రరిజమె, వేడ్క గూర్చు
  శాంతి సహనము లేయండ్రు సాధు జనులు.

  రిప్లయితొలగించండి
 19. శాంతి సౌఖ్యముల్ గననట్టి జగము నందు
  శాంతికలుగంగ యత్నమ్ము జరుప దలచ
  విశ్వమునకు టెర్రరిజమె వేడ్క గూర్చు
  నదియె మార్గమ్ము నికలేదు మేదినరయ

  రిప్లయితొలగించండి
 20. బావా టెర్రరిజంబె సాధనము విశ్వశ్రేయమున్ గూర్చగన్ నావేశంబున మాటలాడకు రమా!యాశ్చర్యమౌనుంగదే
  యేవేళైనను గాదు శ్రేయము,గనన్ నీశాను డొక్కండెయౌ
  నేవాడున్సరిరాడు విశ్వమునుదా నీక్షించి రక్షించుగా

  రిప్లయితొలగించండి