27, మే 2022, శుక్రవారం

సమస్య - 4092

28-5-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వృద్ధాప్యములోన బలము పెంపొందు గదా”
(లేదా...)
“వృద్ధాప్యంబున దేహదార్ఢ్యము గడున్ బెంపొందుచుండున్ గదా”

11 కామెంట్‌లు:

 1. ఉద్ధవుడు పలికె వింటివె
  వృద్ధాప్యములోన బలము పెంపొందుగదా
  యిద్ధర జరుగునె నట్లుగ
  బద్ధుడుగానాయెనేమొ వారుణి కతడున్

  రిప్లయితొలగించండి
 2. శద్ధా సక్తులు గల్గియు
  వృద్ధులు వ్యాయామములను విడువక సేయన్
  బద్ధకము దొలఁగి యయ్యెడ
  వృద్ధాప్య ము లోన బలము పెంపొందు గదా !

  రిప్లయితొలగించండి
 3. శ్రద్ధాసక్తులుఁ గదురన్
  వృద్ధుల సంక్షేమమరసి పెద్దమనసుతో
  నుద్ధతిఁ జూపక సాఁకిన
  వృద్ధాప్యములోన బలము పెంపొందు గదా

  రిప్లయితొలగించండి
 4. వృద్ధాప్యంబున దేహదార్ఢ్యము గడున్ బెంపొందుచుండున్ గదా”
  వృద్ధాప్యంబున నేరికైనను గనన్ వీడున్ బ లంబుల్ గదా
  ఔద్ధత్యంబున నట్లు గాబలుక నో ర్వన్ న్యాయమేచెప్పుమా
  బుద్ధావేంకన! నీవ దెల్పుమ యికన్ బూర్వాప రంబుల్ సుమా

  రిప్లయితొలగించండి
 5. శ్రద్ధాసక్తులుజూపి వృద్ధులపయిన్ స్వాస్థ్యంబుఁ జేకూర్చుచున్
  వృద్ధింగోరుచు వారినెట్టులయినన్ వేధించకన్ దిట్టకన్
  ఔద్ధత్యంబును జూపకన్ కరుణతో నౌన్నత్యమున్ నిల్ప నా
  వృద్ధాప్యంబున దేహదార్ఢ్యము గడున్ బెంపొందుచుండున్ గదా

  రిప్లయితొలగించండి
 6. పద్ధతితెలియగమనుగడ
  నుద్ధతిలేకనుమనసుననోర్పుననరుఁడున్
  తద్ధనమధ్యాత్మంబున
  వృద్ధాప్యములోనబలముపెంపొందుగదా

  రిప్లయితొలగించండి
 7. క్రుద్ధుల్గాకనుజీవయాత్రసమతన్గోరంతనేర్చున్మదిన్
  బోద్ధల్నౌచునుమాయదాటగనునాబుద్ధున్పరంబంచునున్
  తద్ధామంబునసంచరింపతనువేతాల్మిన్సుధల్గ్రోలగా
  వృద్ధప్యంబునదేహదార్ఢ్యముగడునపెంపొందుచుండున్గదా

  రిప్లయితొలగించండి
 8. ఇద్ధాత్రిఁ జరించి విమల
  బుద్ధిని నిత్యమ్మును నరపుంగవు లెదలన్
  శ్రద్ధగఁ బూజింప హరిని
  వృద్ధాప్యము లోన బలము పెంపొందు గదా


  వృద్ధిం జెందుచు సంతతమ్ము ఘనులై విద్యాప్రసంగమ్ములన్
  శుద్ధస్వాంతత నుండగా విగత సంక్షోభమ్ము తారుణ్య కా
  లోద్ధారమ్మున మానవాళి కిల నిత్యోత్సాహమై తక్కఁగా
  వృద్ధాప్యంబున దేహ దార్ఢ్యము గడున్ బెంపొందు చుండున్ గదా

  రిప్లయితొలగించండి
 9. బుద్ధియు,శక్తియు,తగ్గును
  వృద్ధాప్యములోన;బలము పెంపొందు గదా!
  యద్దిర!కామవికారము
  క్రుద్ధత, యౌవనములోన కుదురెట్లుండున్ .

  బుద్ధిందోచును మాంద్యమున్ మఱపు నబ్బో!క్షీణమౌ శక్తియే
  వృద్ధాప్యంబున; దేహదార్ఢ్యముగడున్ పెంపొందు చుండున్ గదా!
  తద్దేహంబునె యౌవనంబున బళీ!తర్కించగా బాల్యమం
  దౌద్ధత్యంబును కానరాదు కనగా నౌరా!యెంత చిత్రంబొకో!

  రిప్లయితొలగించండి
 10. కందం
  ఇద్ధరలో నర్ధముతో
  బద్ధునిగా ధర్మ కామ పాలితు డైనన్
  ఔద్ధత్యస్థితి బొందున్
  వృద్ధాప్య ములోన ,బలము పెంపొందు గదా.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 11. ఔద్ధత్యంబణగారు నైహికములందాసక్తియున్ క్రుంగుగా
  వృద్ధాప్యంబున దేహదార్ఢ్యము, గడున్ బెంపొందుచుండున్ గదా
  శ్రద్ధాసక్తులు దైవమందచల విశ్వాసంబు, సంసిద్ధికై
  సిద్ధంబౌ గద మానసంబొనరు నైశ్చింత్యంబు నిష్కామముల్

  రిప్లయితొలగించండి