14, జులై 2022, గురువారం

సమస్య - 4134

15-7-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ”
(లేదా...)
“తార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ”

16 కామెంట్‌లు:

vsnmhari చెప్పారు...

తార్‌క్ష్యుడు పెద్ద రాక్షసుడు తద్విషయంబును మీకుదెల్పెదన్
తార్‌క్ష్యుని బంధువర్గమును దాము గ్రహింపుడటంచు బల్కెనా
తార్‌క్ష్యుని నామమైన మును దానిట దెల్వనివా డొకం డిటుల్
తార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
ఈర్క్ష్య రగులంగ వంశపు
వార్క్ష్యంబందు నటులెల్ల వాసినిఁ గనిరే
తార్క్ష్యుని సాక్షిగ నాటికఁ
దార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ!

ఉత్పలమాల
ఈర్క్ష్య చెలంగ లోకమున నెల్లర బంధువులట్లు వంశపున్
వార్క్ష్యము నందునన్ నటులు వాసిని గాంచిరి పాటవమ్ములన్
తార్క్ష్యుని సాక్షిగన్ నిజము నాటకమందున పాత్రధారులన్
తార్క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ!

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

తార్ క్ష్యు డన నెవరనుచు న్
తా ర్ క్ష్యు ని గూర్చి తెలియదని దక్షుని గోరన్
తా ర్ క్ష్యు ని వివరము లివియని
తార్ క్ష్యు ని తనయుండు గ్రీడి తమ్ముడు హరియౌ

sitharamayya solasa చెప్పారు...

తార్క్ష్యుడని యెవరినందురు ?
తార్క్ష్యుడెవరనంగ చక్రధరు డందురుగా !
తార్క్ష్యుడొక పక్షి , మరెటుల
తార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ ?

Rama Murthy Duvvuri చెప్పారు...

తేటగీతి
వాహనముగఁగొనె నెవరిన్ బలివిరోధి?
వినతకతఁడేమగును?కఱ్ఱి యని నెవఁడన?
నుత్తరమిడె *తార్ క్ష్యుని,తనయుండు,గ్రీడి,
తమ్ముఁడు హరియౌ*గద హలధరుని కనుచు

subbarao చెప్పారు...

తార్ క్ష్యుని బేరును దెలియక
తార్ క్ష్యుని బంధమ్ము గురిచి తామసు డనెసూ
తార్ క్ష్యుడు రాక్షసు డైనను
దార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ

M.B.G.TILAK చెప్పారు...

తార్ క్ష్యుండెవరనియడుగగ
తార్ క్ష్యుని పొరుగింటివాడు తావివరించెన్
తార్ క్ష్యుని బంధువు లిరువురు
తార్ క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ

subbarao చెప్పారు...

తార్ క్ష్యుని బేరుతోఁ గలఁడు తామస రూపుడు రాక్షసుండు నై
దార్ క్ష్యునె ఱుంగకే యొకడు దానిటు పల్కెను వింటిరే యిదిన్
దార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ
తార్ క్ష్యుని నామమే జపము తార్ క్ష్యుని చేష్టలు బూజయే యెమో

విరించి చెప్పారు...


తార్క్ష్యుని జనని వినతయని
తార్క్ష్యుడు హరివాహనమని తలచితి మరి యీ
తార్క్ష్యుండెవ్వడు భువినే
తార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ?

విరించి చెప్పారు...


తార్క్ష్యుని తల్లియే వినత తండ్రియె కశ్యపు డంచెఱంగితిన్
దార్క్ష్యుడె విష్ణు వాహనమతండని నమ్మిరి లోకులెల్లరుల్
తార్క్ష్యుడెవండొ తెల్యకనె ద్రాపుడొకండు వచించె నిట్టులన్
తార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ

Rama Murthy Duvvuri చెప్పారు...

సవరణము:రెండవ పాదములో "కఱ్ఱియన నెవడన"?

Rama Murthy Duvvuri చెప్పారు...

ఈ,'ర్ క్ష్య'ను ప్రాస దుష్కరమె యిట్టుల నిచ్చుట
పాడియా కవీ!
తార్ క్ష్యుడెవండు చెప్పుమన తప్పుగ నిట్టులఁజెప్పె శిష్యుఁడున్
సార్!"క్ష్యుని "వంశమందతఁడు చక్కగఁబుట్టెను గాదె పూర్వమా
తార్ క్ష్యుని పుత్రుఁడర్జునుఁడు తమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ.

Siva Prasad Chavali చెప్పారు...

లక్ష్యముగ దత్తపాదము
తార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ
వీక్ష్యమె! పూరణ ప్రతిగా
భక్ష్య రసజ్ఞత చవిగొను భక్షణ మేలౌ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తార్క్ష్యుడన గరుత్మంతుడు
తార్క్ష్యుడన ననూరుడుమరి తరిదాల్పతడే
తార్క్ష్యుని చుట్టము లెట్లగు
"తార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ"?

sarada చెప్పారు...

కందం
కక్ష్యకు యావలి ప్రశ్నిది
తార్ క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ
తార్ క్ష్యుం డెవ్వడు దెలియదు
తార్ క్ష్యుని ప్రవర వివరించ తార్కిక భంగిన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వార్క్ష్యమున నుందు రేల స
రర్క్ష్య సదృశ కాంతి సంబరమ్మున నెవఁ డీ
తార్క్ష్యుఁడు వీరలు నెవ్వరు
తార్క్ష్యుని తనయుండు క్రీడి దమ్ముఁడు హరియౌ

[సరర్క్ష్య సదృశ కాంతి = నక్షత్ర సంబంధ (ప్రకాశము) నిభ కాంతితో]


వార్క్ష్య విరాజమాన తరు పంక్తి తటాక తటమ్ము లందు ఘో
రర్క్ష్య నినాద సంభరిత రమ్య గుహాంతర మందు నిల్చిరా
తార్క్ష్యుఁడు వాని బంధువులు తార్క్ష్యుని చుట్టలు వార లివ్విధిన్
తార్క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీ హరి బావ కర్ణుఁడౌ

[ఘోరరక్ష్య నినాదము = ఘోర భల్లూక సంబంధ నినాదము]