27, జులై 2022, బుధవారం

సమస్య - 4146

28-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరి తాఁకిన వస్తుచయము గనుమరుగయ్యెన్”
(లేదా...)
“కరి స్పృశియించినంతటనె కన్మఱుగయ్యె సమస్తవస్తువుల్”

47 కామెంట్‌లు:

M.B.G.TILAK చెప్పారు...

సరిసాటెవ్వరు మాయల
మరాటికి మహేంద్రజాల మహిమను జూపన్
పురమందిరంబునన్ కా
కరి తాఁకిన వస్తుచయము గనుమరుగయ్యెన్

sitharamayya solasa చెప్పారు...

పురమంతయు జలమే ! తొల
కరి తాఁకిన .; వస్తుచయము గనుమరుగయ్యెన్
వరదకు కొట్టుకు పోవగ ,
చరిత్ర యిదియె కొనసాగు సంశయ మేలా !

తొలకరి = వర్షర్తువు

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ఉరుములు మెరుపుల వానలు
వరదలు పొంగంగగురియ పంటలు మునిగెన్
జొర బడియు గృహ ము లను దొల
కరి తాకిన వస్తు చయము గను మరు గయ్యె న్

subbarao చెప్పారు...

సరి జూడుడనుచు నొక పరి
కరమును దావ్రేళ్ళమధ్య కనిపించునటుల్
గరములఁ ద్రిప్పగఁ గన, కా
కరి తాఁకిన వస్తుచయము గనుమరుగయ్యెన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
పరిపాలననందుకొని య
పరిమితముగ దోచు యావ ఫలవంతమ్మై
మురిసెడు దెస కలలో ట
క్కరి తాఁకిన వస్తుచయము గనుమరుగయ్యెన్!

చంపకమాల
దొరలుగ నమ్మఁ బల్కుచును దోపిడి జేయుటె రాజకీయమన్
బరిణతిఁ జెంది పారగనె పాచిక పాలక పగ్గమందుచున్
మురిసెడు వంచకుండలర ముచ్చట తీర్చుచు స్వప్నమందు ట
క్కరి స్పృశియించినంతటనె కన్మఱుగయ్యె సమస్తవస్తువుల్!

విరించి చెప్పారు...


పురజనులే పిలువగ జా
తరకేగితి నచట నొక ప్రదర్శన గన న
బ్బురమయ్యెను గాదే, మత
కరి తాఁకిన వస్తుచయము గనుమరుగయ్యెన్.

BMahalakshmi చెప్పారు...

తరిమెనుగ్రీష్మాతపమును
పరుగిడెనాషాఢమొయిలుపంటలపైనన్
విరిదమ్మివెలనుబోతొల
కరితాకినవస్తుచయముగనుమరుగయ్యెన్

subbarao చెప్పారు...

సరిగను జూడుమంచురమ చాచగవ్రేళ్ళను మాయమయ్యె, కా
కరి స్పృశియించినంతటనె కన్మఱుగయ్యె సమస్తవస్తువుల్
కరములుఁ ద్రిప్పు చుండియును గారడి జేయగ మార్పు గల్గె,నా
భరణము లన్ని వింతగ ను భాసిలెఁ జూడుమ యొక్కసారిగా

విరించి చెప్పారు...


సరియగు విద్యలేక ధన సాధన మార్గము లేక నీచుడై
పరగృహ మందు వస్తువుల బాటవ మందున దొంగిలించెడిన్
గురణము నందు చేరెనొక కొంపకు రాతిరి వేళ
నట్టి ము
ష్కరి స్పృశియించినంతటనె కన్మఱుగయ్యె సమస్తవస్తువుల్.

BMahalakshmi చెప్పారు...

అరిగనుజూచెనాయనగహంగునపైబడెనంతలోనతా
నరిమురినాట్యమాడుచునునాహరిబంటుచలంబుతోకతో
పురమునులంకయంతయునుభోజనమయ్యెనునాంజనేయుకున్
కరిస్పృశియించినంతటనెకన్మఱుగయ్యెసమస్తవస్తువుల్

Rama Murthy Duvvuri చెప్పారు...

కందము
పరిచర్య చేయు నెపమున
పొరిపొరి యిల్లంతఁదిరిగి మోసముఁజేసెన్
అరెరే!కడు టక్కరి కిం
కరి,తాకిన వస్తుచయము కనుమఱుగయ్యెన్.

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు: ఉడ్బర్రీ, అమెరికా:

అరుదగు గారడి విద్యను
పరవశమున మురియుచుండి పరికించు వడిన్
పురజనులనుండి తా మత
కరి తాకిన వస్తుచయము గనుమరుగయ్యెన్.

Siva Prasad Chavali చెప్పారు...

కందం
తరముల తరబడి యనవ
స్కర శోభిత ఛలి! వినోద గారడి కళలున్
కరతల సంచిత విలస
త్కరి! తాఁకిన, వస్తుచయము గనుమరుగయ్యెన్

Siva Prasad Chavali చెప్పారు...

బెరికుల సంవాస నిరం
తర వ్యసనపు జూదరి ఘనతర సంక్రమణా
భరణంబుల నొడ్డగ, ట
క్కరి తాఁకిన వస్తుచయము గనుమరుగయ్యెన్

(బెరికి: దుష్టుడు)

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అరయగ నచ్చరువందితి
కరమును త్రిప్పుచు నటునిటు గంభీరముగా,
మురిపించి జనులనొక కా
కరి తాఁకిన వస్తుచయము గనుమరుగయ్యెన్

A.Satyanarayana Reddy చెప్పారు...

వరదు డటంచునర్మిలిని పంచుచు సేవలతోడ తన్పగా
నిరతము జ్ఞానమగ్నుడయి నిశ్చలమౌగతి కానిపించుచున్
కరముల మాయతోడ కనుకట్టు నెఱింగిన దుండగీడు ట
క్కరి, స్పృశియించినంతటనె కన్మఱుగయ్యె సమస్తవస్తువుల్

sarada చెప్పారు...

కందం
కరతలముల గారడి ట
క్కరి తాకిన వస్తు చయము గను మరుగయ్యెన్
తెరమరుగైన కళను చా
తురి జూపగ వీక్షక తతి తోషితు లయ్యెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పురమున రాజమార్గమునఁ బోవుచునుండగ వింత గాంచితిన్
కరముననున్న దండమును క్రన్నన తిప్పుచు నుచ్చరించుచున్
సరగున వింత శబ్దములు సంభ్రమమొందగ చూచువారు కా
కరి స్పృశియించినంతటనె కన్మఱుగయ్యె సమస్తవస్తువుల్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కరములనటునిటు త్రిప్పుచు
సరుగునగదిలోనవాస్తు సరిలేదనుచున్
తరుముచునందరినామత
కరి తాకిన వస్తుచయముకనుమరుగయ్యెన్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...



మరొక పూరణ

పరపతితోనిలుచేరెను
పరిచారికగా సతతముపనిచేయుంగన్
కరలాఘవమున నాము
ష్కరితాకిన వస్తుచయము కనుమఱుగయ్యెన్


కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పర మాశ్చర్యం బక్కట
కరి మ్రింగిన వెలఁగ పండు కరణి గృహమునన్
గరిమంపు దొంగ యా ట
క్కరి తాఁకిన వస్తు చయము గనుమఱుఁ గయ్యెన్


మరు దతి వేగధాటికి సమస్తము లిద్ధరఁ గంపితమ్ములౌ
ధర నుదకమ్మునం దడియఁ దప్పక యార్ద్రము లెల్ల వస్తువుల్
తర తమ భేద మెంచ కతి దారుణ వహ్ని జగత్ప్రజా భయం
కరి స్పృశియించి నంతటనె కన్మఱుఁ గయ్యె సమస్త వస్తువుల్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆషాఢ మొయిలు... దుష్టసమాసం. "ఆషాఢ ఘనము" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...తతి తోషితమయ్యెన్'

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

Siva Prasad Chavali చెప్పారు...

ధన్యవాదాలండీ గురువు గారు 🙏

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

దురితపు కార్యముల్ సలిపి దండిగ డబ్బును గూడబెట్టియున్
విరివిగ వస్తుసంపదను వేల మనోహర
కన్క హారముల్
సరగున గూడ బెట్టె నది సర్వమెరంగి
ప్రభుత్వ మట్టి వై
కరిస్పృశి యించినంతటనె కన్మరుగయ్యె
సమస్త వస్తువుల్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా🙏

సవరించిన వృత్తపూరణ పరిశీలింప ప్రార్థన

చంపకమాల
దొరలుగ నమ్మఁ బల్కుచును దోపిడి జేయుటె రాజకీయమన్
బరిణతిఁ జెంది పారగనె పాచిక శీఘ్రమె పట్టమందుచున్
మురిసెడు వంచకుండలర ముచ్చట తీర్చుచు స్వప్నమందు ట
క్కరి స్పృశియించినంతటనె కన్మఱుగయ్యె సమస్తవస్తువుల్!

A.Satyanarayana Reddy చెప్పారు...

గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు