12, అక్టోబర్ 2022, బుధవారం

సమస్య - 4216

13-10-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మత్స్యయంత్రమున్ గొట్టెను మాద్రి సుతుఁడు”
(లేదా...)
“మానక మత్స్యయంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై”

23 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఏమి తెలియని వానిని స్వామియనుచుఁ
    బ్రవచనము సేయఁ దెచ్చితె పాపమయ్య
    భారతము సెప్పె నవ్వఁగ పలువురచట
    మత్స్యయంత్రమున్ గొట్టెను మాద్రి సుతుఁడు

    ఉత్పలమాల
    జ్ఞాన విహీనునిన్ బిలువ సర్వము నేర్చినవాడటంచు నీ
    మానము దీసె వేదిని సుమారు నమాయక చక్రవర్తిగన్
    గానమె పూర్వమెప్పుడిల గాథను జూడఁగ వాని కూతలన్
    "మానక మత్స్యయంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై"

    రిప్లయితొలగించండి
  2. విప్రు వేషాన విజయుడు విల్లు దాల్చి
    గురిని జూచియు సభ యంత మురియు చుండ
    మత్స్య యంత్రమున్ గొట్టెను : మాద్రి సుతుడు
    వేషమును దాల్చి చేరెను విరటు గొల్వు

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    అర్జునుండు "మత్స్యయంత్రమున్ గొట్టెను,
    మాద్రిసుతుఁడు,"మరియు మారుతి,సహ
    దేవ,ధర్మరాజులే వహవా!యన
    మారు మ్రోగెను చప్పట్లు జోరుగాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      మానిత ద్రోణశిష్యుఁడసమానుఁడు, వీరుఁడు, సవ్యసాచి,స్మే
      రాననుఁడై శరమ్ముఁగొని యందఱు జూచుచు నుండ గొట్టెగా
      *మానక మత్స్యయంత్రమును;మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై *
      యానయగారముంగనుచు,నబ్బురమొందుచు వేడ్కఁజప్పటుల్.

      తొలగించండి
    2. సవరణ:ఆటవెలది పద్యములో 4వ పాదం తొలగించి"జయజయధ్వనులు దిశలఁజెలంగె.

      తొలగించండి

  4. వేదిజన్ స్వయం వరమున బెండ్లియాడ
    నరుడు చేసిన దేమిటి? నకులు డనగ
    నెవ్వడో తెలుపు మనగ నిట్లు పలికె
    మత్స్యయంత్రమున్ గొట్టెను, మాద్రి సుతుఁడు.

    రిప్లయితొలగించండి
  5. శకార ఉవాచ

    జానకి పెండ్లియాడె బహు సంతస మందుచు రావణాసురున్
    పూనిక కర్ణుడేచెనని పూజ్యుడు భీష్ముని తోషమందుచున్
    చానల కోకలన్ హరుడె చక్కగ దోచెను
    గౌరిమెచ్చగా
    మానక మత్స్యయంత్రమును మాద్రికుమారుడు
    గొట్టె వీరుడై

    రిప్లయితొలగించండి
  6. మత్స్యయంత్రమున్ గొట్టెను మాద్రి సుతుఁడు
    సత్య దూరము మీమాట సామి! యేమి
    యిటులు బలుకుట న్యాయమే కఠిన ముగను
    మత్స్యయంత్రమున్ గొట్టెను మఘవ సుతుఁడు

    రిప్లయితొలగించండి
  7. స్వయంవరపు యేర్పాటుగ సవ్యసాచి
    మత్స్యయంత్రమున్ గొట్టెను : మాద్రి సుతుఁడు
    నకులుడు నుతించగ గృహమునకు వెడలిరి
    మాతకుదెలుప తమ బహుమతిని గూర్చి

    రిప్లయితొలగించండి
  8. *పోతన భాగవతంలో*
    *దశమ స్కంధము - ఉత్తర :*
    *లక్షణ, ద్రౌపదీ సంభాషణంబు: ఆధారముగా*

    నా ప్రయత్నం ఇలా...

    ఉ.

    *మానక మత్స్యయంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై*
    వీనులకింపు గాదనుచు వీక్షగ లక్షణ బోధ కృష్ణకున్
    మానక మత్స్యయంత్రమును మద్రపురీకృతిఁ గొట్టె వీరుఁడై
    ధ్వానము కర్ణ భీములకుఁ బార్థుని కోటమి, సిద్ధి వెన్నుడై.

    రిప్లయితొలగించండి

  9. మానుము పిచ్చి మాటలవి మాన్యులు మెచ్చి నుతించి నీకు స
    న్మానము సేయబోరు, వరుణాత్మజమున్ జవి గొన్న మత్తులో
    మౌనమె మేలు నీకనుచు మానిని చెప్పిన వాగెనిట్టులన్
    మానక, మత్స్యయంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై.

    రిప్లయితొలగించండి
  10. నిండు పేరోలగమునందు పాండు సుతుఁడు
    ఫల్గుణుడు విల్లు చేబూని పన్నిదముగ
    మత్స్యయంత్రమున్ గొట్టెను, మాద్రి సుతుఁడు
    మేలు భళియంచు సోదరున్ మెచ్చుకొనగ.

    రిప్లయితొలగించండి
  11. మానక మత్స్యయంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై
    కానగ రాదు సామియిది కన్నులు గాయలు గాచ చూడగన్
    బానపు మత్తులోఁ బల్కుచు నుంటిరె? కాని మాటలన్
    బూనిక తోడ ఫల్గునుఁడు ముక్కలు సేసెను మత్స్య యంత్రమున్

    రిప్లయితొలగించండి
  12. కుంతి కొమరుడు లక్ష్యాన గురిని నిల్పి
    మత్స్యయంత్రమున్ గొట్టెను; మాద్రి సుతుఁడు
    హస్త తాళధ్వ నులనిడి ప్రస్తుతింప
    సవ్య సాచియు మిక్కిలి సంతసించె

    రిప్లయితొలగించండి
  13. నృప కుమారు లెల్ల రెదల నివ్వెఱపడ
    ధరణిసుర సంఘ మెల్ల ముదమ్ము వడయ
    బెట్టిదమ్ముగఁ జప్పటల్, కొట్ట నరుఁడు
    మత్స్య యంత్రముం, గొట్టెను మాద్రి సుతుఁడు

    ఆ నర నామధేయుఁ డసితాభ్ర నిభాంగుఁ డవక్ర విక్రముం
    డా నగ వైరి యాత్మ భవుఁ డర్జునుఁ డాజిని దుర్జయుండు దా
    మానిని కుంతి కాత్మజుఁడు మాద్రికిఁ బుత్రుఁడు కాక యుండునే
    మానక మత్స్య యంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై

    రిప్లయితొలగించండి
  14. పానముచేసి మద్యమును వాగెదవిట్టుల మైకమందునన్
    మానక మత్స్యయంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై
    దాన గుణంబు నందతడు తద్దయు కర్ణుని సాటియంచు, నీ
    వైనము గాంచ తెల్లమగు వావిరి సొక్కితివీవు కైపునన్

    రిప్లయితొలగించండి
  15. పెండ్లి యాడ నెంచికిరీటి పేర్మితోడ
    మత్స్య యంత్రమున్ గొట్టెను మాద్రి సుతుడు
    పురజనులతోడనచ్చట మురిపెమలర
    గనియె రెప్పలార్పకతాను కన్నులార

    రిప్లయితొలగించండి
  16. విప్రవేషముననె క్రీడి వేగిరముగ
    మత్స్య యంత్రమున్ గొట్టెను, మాద్రి సుతుడు
    సమర రంగమున శకునిన్ సంహరించ
    మేటి వీరుడ టంచును మెచ్చిరెల్ల

    రిప్లయితొలగించండి
  17. భూనరనాధులెల్ల జని పూని ప్రయత్నము
    సేసియోడినన్
    దానవ శత్రు రాముడతి దర్పముతోడను
    దృంచె సుళ్వుగా
    మానక మత్స్యయంత్రమును, మాద్రి
    కుమారుడు గొట్టె వీరుడై
    యానయవంచకున్ శకుని యావహమందు
    నేర్పుతో

    రిప్లయితొలగించండి
  18. తే.గీ:ఐదు బాణాల తోడనే అఖిల వీరు
    లక్కజము నొంద నిపుణుడౌ నర్జునుండు
    మత్స్యయంత్రమున్ గొట్టెను ,మాద్రి సుతుడు
    కొట్టె చప్పటు లగ్రజు గొప్ప జూచి.

    రిప్లయితొలగించండి
  19. ఉ:పూనియు విప్రవేషమును,పూనికతో ధను వెక్కు పెట్టి ద
    ర్పాన జయించె నర్జునుడు రాచరిక మ్మిసు మంత యేనియున్
    మానక మత్స్యయంత్రమును , మాద్రికుమారుడు కొట్టె వీరుడై
    దానిని గెల్చు నర్జును విధమ్మును మెచ్చుచు నెన్నొ చప్పటుల్.

    రిప్లయితొలగించండి

  20. నాటిస్వయమువరమునదు, మేటి బాణ
    విద్యతోదేనిగొట్టెను విజయు డపుడు ?
    చివరివాడు పాండవులలో నెవరి సుతుడు ?
    *మత్స్య యంత్రమున్ గొట్టెను, మాద్రి సుతుడు*.

    రిప్లయితొలగించండి