27, అక్టోబర్ 2022, గురువారం

సమస్య - 4232

28-10-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్”
(లేదా...)
“హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్”

34 కామెంట్‌లు:

 1. కందం
  పలువురి భాగస్వామ్యము
  వెలయింపగ కృతి విశాఖ వేడ్కలకనుచున్
  బులకల పాల్గొనెడు కుతూ
  హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్!

  చంపకమాల
  తెలియని చంధముల్ వనుచ తీర్చిరి పద్యశతమ్ము నూర్గురున్
  విలువగు పొత్తమున్ మలచి వేడ్క విశాఖను గూర్చినంతటన్
  బులకలు రేగ పండితుల ముందర గౌరవమందెడున్ గుతూ
  హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్?

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. బలవంతము లేకుండగఁ
   బలువురి కవుల నొకచోట పరవశ మొందన్
   గలిపిన తోబాసుఁ గుతూ
   హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్

   తొలగించండి
 3. తొలకరి జల్లులకు పుడమి
  పులకింతల నేరువాక మొదలై రైతుల్
  హలముల బట్టిరి కోలా
  హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్

  రిప్లయితొలగించండి
 4. పలువుర కవులను జే ర్చగ
  విలసిత రీతిగ కవితల వేడుకలజూడన్
  గలిసిన నచ్చో ట కుతూ
  హలమున బ్రజ లెల్ల మున్గి రద్భుత రీతిన్

  రిప్లయితొలగించండి
 5. కందం
  నెల కార్తికంబు వచ్చెను
  తెలతెల వారంగ లేచి దీపము లిడగా
  వలెనని నదులందుఁగుతూ
  హలమునఁబ్రజలెల్ల మున్గిరద్భుత రీతిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంపకమాల
   ఫలితము నిచ్చుఁగార్తికము పాపములెల్లను బాపునంచు,నో
   ములు,వ్రతముల్, శివార్చనలు మోదము తోడను జేయఁబూనియున్
   దెలతెలవారు చుండగనె తీర్థములందుఁబవిత్రులౌ కుతూ
   హలమున మున్గిరెల్ల ప్రజలద్భుత రీతిని వింతయెట్లగున్.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. కలిగెను నేఁడదృష్టమని కాశికిబోయి విశుద్ధ భక్తి సం
  తులిత మనంబుతోడనిదె స్తోత్రముజేసి హరున్ దలంచుచున్
  కలిత వియన్నదిన్ గదిసి కమ్ర జలంబును గాంచి వేఁ గుతూ
  హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్?

  రిప్లయితొలగించండి

 7. తెలుగు మహాసభల కొరకు
  పలువురి యభిమాన నటుడు వచ్చునటంచున్
  తెలిపగ ధురీణుడు కుతూ
  హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్.

  రిప్లయితొలగించండి
 8. చం.

  తిలక క్రియా స్వరూప మణి దీపిక కోశము విశ్వనాథచే
  బలము ప్రథా నిఘంటువులు బ్రౌణ్య కృతీ, ఖని శబ్దరత్నముల్
  కలనము రెడ్డి రవ్వ వహి గాంచ, ప్రశస్తపు పద్య జన్మ, దో
  *హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్*

  [దోహలము = ఉత్సాహము]

  రిప్లయితొలగించండి
 9. చలనము మానసంబునను సర్వజనావళి
  కోర గల్గియున్
  విలవను దించె గ్యాసుపయి వేగ ప్రభు
  త్వము చిత్తశుద్ధితో
  మలిన విహీన చిత్తులయి మార్పును దల్చుచు వేడ్కతో గుతూ
  హలమున మున్గిరెల్ల ప్రజ యద్భుత రీతిగ వింతయెట్లగున్
  చలనము మానసంబునను సర్వజనావళి

  కోర గల్గియున్

  విలవను దించె గ్యాసుపయి వేగ ప్రభు

  త్వము చిత్తశుద్ధితో

  మలిన విహీన చిత్తులయి మార్పును దల్చుచు వేడ్కతో  గుతూ

  హలమున మున్గిరెల్ల ప్రజ యద్భుత రీతిగ వింతయెట్లగున్


  రిప్లయితొలగించండి

 10. లలనయె కోరెనంచు రఘు రాముడు సీతయు లక్ష్మణుండు కుం
  దిలమున చిక్కుపాటులను ధీటుగ మార్కొని కామచారిఁ ద్రె
  క్కలిగొని యయ్యయోధ్యకు సకాలము నందున చేరగన్ గుతూ
  హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్.

  రిప్లయితొలగించండి
 11. తెలతెలవారక మునుపే
  చెలువలు కార్తీకమందు శివసన్నిధిలో
  కలిసిననచ్చట కోలా
  హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్

  రిప్లయితొలగించండి
 12. అలర విశాఖరమ్యముగ నాయత రీతిని పండితావళిన్
  గలిగిన సంత సంబునను గమ్రపు భావముఁ గల్గగా, కుతూ
  హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్
  మలినము లేని శర్మను రమాపతి గావుత!యెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 13. గెలుచుకొనుచు వచ్చిరి తమ
  నెలవుకు క్రికెటు దళమనుచు నెరవగు రీతిన్
  కలసి గరువమిడు
  కోలా
  హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్

  రిప్లయితొలగించండి
 14. తెలతెలవారుచుండగనె తీర్థములందున భక్తులెల్లరున్
  చలియని యెంచకన్ మదిని స్నానము చేసిరి కార్తికమ్మునన్
  చెలువపు దీపకాంతి విరజిమ్మగ తోయమునందునన్ కుతూ
  హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్

  రిప్లయితొలగించండి
 15. కందం
  ఇల బృందావన మందిర
  ముల కృష్ణాష్టమి శుభదిన మురళీస్వర రా
  గలహరి వేడుక కోలా
  హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 16. కులుకుచు నాటలఁ బాటల
  లలనలు బాలలు పురుషులు రమ్య తరముగా
  లలి తోత్సవ ఘన కోలా
  హలమునఁ బ్రజ లెల్ల మున్గి రద్భుత రీతిన్

  కలవర మింత లేక మదిఁ గ్రన్నన సిద్ధినిఁ బొందఁ గోరుచుం
  దెలతెలవాఱ లేచి కడు దిట్ట తనమ్మున సంభ్రమించుచున్
  వలసిన రీతి నింపుగను బండుగ నాఁడు నిజేష్ట కార్య దో
  హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుత రీతిని వింత యెట్లగున్

  రిప్లయితొలగించండి
 17. డా బల్లూరి ఉమాదేవి

  బిలబిల లాడుచు మిత్రులు
  తలచుచుకలవంగనెంచ తమియది హెచ్చన్
  నెలతలును చేర కోలా
  హలమున ప్రజలెల్ల మున్గిరద్భుత రీతిన్


  రిప్లయితొలగించండి