13, అక్టోబర్ 2022, గురువారం

సమస్య - 4217

14-10-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లలలన నా యొడలు వడఁకె లావును దగ్గెన్”
(లేదా...)
“లలలన నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా”

24 కామెంట్‌లు:

  1. గలగల లాడుగజ్జెలును గంటలఁగుప్పెల సోయగమ్ముతో,
    నలరుల సౌరభంబునను హాయిగ వచ్చిన మాలినీమణీ!
    సలలిత రాగమాధురుల సంగమ మందగ భీతియేల? బే
    ల!లలన !నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  2. ప్రియుడు ప్రేయసితో.......

    కందం
    వలపునఁ బెద్దల నెదురుచుఁ
    గులములు వేరైన మనము గూడుదమని నీ
    కిల నాత్మహత్య తలపే
    ల? లలన నా యొడలు వడఁకె లావును దగ్గెన్!

    చంపకమాల
    వలపులు పొంగి యిద్దరము పంచుకొనంగను జీవితమ్మిలన్
    గులములు నొప్పకున్న మదికూరిమినెంచి నెదుర్చఁ బెద్దలన్
    దలపుల నిర్ణయించుకొని, దారుణమెంచితె యాత్మహత్యకే
    ల? లలన నా యొడల్ వడఁకె! లావును బింకము దగ్గెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి
  3. బలవంతముగా నీవిడి
    న లంఖణ సరళి భరింప నాకికతగునా
    తెలియని యుపవాసములే
    ల లలన నా యొడలు వడఁకె లావును దగ్గెన్

    రిప్లయితొలగించండి
  4. *ప్రవరుడు వేడుచు మాటలాడుట:*

    చం.

    కొలిచితి భక్తితోడఁ జను కోరిక, సిద్దుని పాదలేపమున్
    పులుముకొనంగ చేరితిని పొంతము కొండలలో గృహస్థుడన్
    నెలవుకొనన్ వరూధిని ! పునీతమె, మోహము పాడియే ! సుశీ
    *ల ! లలన ! నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా*!

    రిప్లయితొలగించండి
  5. సంధి విఫలము కాగా ధృతరాష్ట్రుడు గాంధారి తో:

    లలిని సుయోధనాదుల విలాసము తోడుత బెంచ, నేడు పె
    ద్దల హిత వాక్కులన్ వినక ధర్మమెరుంగక యుద్ధకాంక్షతో
    సలసల కాగుటం గనగ సౌబలి! యాలము దప్పదాయె.......యే
    *ల? లలన నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా!*

    లలి-ప్రేమ
    సౌబలి-గాంధారి.

    రిప్లయితొలగించండి
  6. అలరు విలుకాని శరములు
    తలపులలో గ్రుచ్చుచుండె తాళగ లేనే
    వలరాచ పనికి జాగే
    ల, లలన నా యొడలు వడఁకె లావును దగ్గెన్.


    కలతను బెంచె నీ నుడులు కాంతరొ నిర్దయ తోడ బల్కు నీ
    పలుకులు నాలకింపగ శుభమ్మది కూర్చదు రామభద్రునిన్
    బొలమున కంపుటన్ననది మూర్ఖపు యోచన కాదె తాళజా
    ల, లలన నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా.

    రిప్లయితొలగించండి
  7. కందం
    కిలకిల పక్షులు కూయగ
    గలగలప్రవహించ ఝరులు కందర్పుండున్
    బళిబళి!సంధించ శరము
    ల;లలన!నాయొడలు వడఁకె లావును దగ్గెన్.

    చంపకమాల
    కలకల రావముల్ శుకపికంబులు సేయుచునుండ, చంద్రికల్
    తళతళలాడ ,తెమ్మెరలు తాకుచు నుండగ, గండుతుమ్మెదల్
    బిలబిల సేయ నాదములు, వింటిని నెక్కిడె మారుఁడౌర!బా
    ల!లలన!నా యొడల్ వడఁకె లావును బింకముఁదగ్గెఁజూడుమా!

    రిప్లయితొలగించండి
  8. చెల రేగి జిమ్ము చేసియు
    పలు దినములు లంఖ ణంబు పాటించియు నే
    నలసితి నిక తాళ గ జా
    ల ' లలన నాయొడలు వడకె లావును దగ్గెన్

    రిప్లయితొలగించండి
  9. చిలుకల కొలికివి మఱిమఱి
    యలకలుగొనతగదు వనితలకు నెన్నండున్
    కలిమియె తాలిమి వినవే
    “ల లలన! నా యొడలు వడఁకె లావును దగ్గెన్”

    రిప్లయితొలగించండి
  10. వలచితిమనసారానిను
    తలపులలోనిండనీవు తడవేమిటికే
    కులుకుచురావేనామ్రో
    ల,లలన నాయొడలువడకెలావునుదగ్గెన్

    రిప్లయితొలగించండి
  11. చిలకలకొల్కి నీకిటుల చీటికి మాటికి గోపమేలనే?
    కలువలఱేని వెన్నెలల కాకకు నోర్వగలేను సుమ్మి నీ
    యలుకలు మాని వేగిరమె యారడి పెట్టక చెంతచేరవే
    ల? లలన! నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  12. మెలికలు త్రిప్పుచు నూగగ
    లలలన నా యొడలువడఁకె,
    లావును దగ్గెన్
    తులుచన రీతిగ, దీనిని
    సులువయిన విధానమంచు జూచిరి జనుల్

    రిప్లయితొలగించండి
  13. మలమల మాడగ నిఁక బే
    ల! లలన !నా యొడలు వడఁకె లావును దగ్గెన్
    మేలము లాడుట సబబే
    గలగల మాటాడు నీకు కారణ మిదియా

    రిప్లయితొలగించండి
  14. కొలువగ భక్తి మీరగను గొండల రాయును నాక్షణంబు బే
    ల,లలన! నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా
    మలమల మాడగా నగును మాపులు రేపులు భోజనంబునున్
    జలములు మాత్రమే గొనుచు సంధ్యను వార్పగ ంమేలుసూడగా

    రిప్లయితొలగించండి
  15. కం:అల సినిమా వారల పా
    టలకై బాణీలు కట్టుటకు రే యెల్లన్
    దలపక తిండిని నిద్రను
    లల లన నా యొడలు వడకె లావును తగ్గెన్
    (లలలు+అన=పాటలకి బాణీలు కట్టే టప్పుడు లలలా అంటూ కడతారు.ఆ బాణీలు కడుతూ తిండి,నిద్ర తగ్గినాయి.)

    రిప్లయితొలగించండి
  16. చం:చిలిపిగ బల్కితో, పరులు చేసిన బోధల వించు బల్కితో,
    శిల వలె మారిపోయితివొ!ఛీ రఘురాముని కాన కంపుదో
    కలలను నిట్టి యూహ యెటు కల్గును కైకమ!ఓసి యిచ్చకా
    లలలన నా యొడల్ వడకె లావును బింకము దగ్గె జూడుమా
    (రాముణ్ని అడవికి పంపా లని కైక అనటం తో ఆశ్చర్య పడిన దశరథుడి స్పందన.)

    రిప్లయితొలగించండి
  17. అలిగెన వానదేవుడన నంబర క్షేత్రము లొక్కటౌగతిన్
    సలిలము గుమ్మరించగను సర్వము నీటనుమున్గె!
    ధాన్యమున్
    వలువలు వస్తుసంచయము! వాసమునిల్పు ప్రధాన రాటగూ
    ల లలన! నాయొడల్ వణకె లావును బింకము దగ్గె జూడుమా!

    రిప్లయితొలగించండి
  18. లలితో మద్యంబును గొని
    తులువలతో గూడి తూలి తొయ్యలిబట్టన్
    బలిమిని ద్రోయగ చెఱశా
    ల లలన నాయెడలు వణకె లావును దగ్గెన్

    రిప్లయితొలగించండి
  19. సలలితము నాదు డెందము
    వలదీ రీతిఁ బలుకంగ వచనము లంభో
    ధు లన మహా నదు లన వల
    లల లన నా యొడలు వడఁకె లావును దగ్గెన్

    [వలలు+అలలు+అన= వల లల లన ]

    పలు పలు రీతులన్ మదిని భామరొ యూహలు రేఁగు చున్నవే
    తలఁపుల శార దేందుముఖి తాండవ మాడుచు వీడ కుంటివే
    కలవర మాయె డెందమునఁ గాంతరొ కంటివె నిన్ను జూడ బా
    ల లలన నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  20. సలిపితి సేవనమ్ములనుఁ జక్కగ నీతలి దండ్రులన్ గడున్
    విలువనొసంగి సంతతముఁ బ్రేమనుఁ బంచుచుఁ జిత్తశుద్ధితో
    పలుకక, నత్తమామలను బాధలఁ బెట్టుచు నీసడించు టే
    ల? లలన! నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  21. కలియుగమందు భామలను గాంచియు
    పుర్షులు చిన్నచూపుతో
    చెలియలు బేలలంద్రుగద ,చిత్రము
    గాంచితి నేడు గట్టిగా
    పులివలె నర్చె నాసతియు, ప్రోథముతోడ
    నడ్గితి గ్రోధ మే
    ల లలన !నాయొడల్ వడకెలావునుబింకము
    దగ్గె చూడుమా!

    రిప్లయితొలగించండి
  22. తలచుచుసతతమునిన్నే
    వలచిన నినుమరువలేక వచ్చితి వడిగా
    దలచితి పితపట్టిన కో
    లలలన నాయొడలు వడకె లావును దగ్గెన్

    రిప్లయితొలగించండి