18-10-2022 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పాపమది పుణ్యమయ్యెను పావనముగ”(లేదా...)“పాపము పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్”
తేటగీతికోపమున శిశుపాలుఁడు గోప బాలువందనిందల సుతియింప వైరభక్తిచక్రి సాయుజ్యమున్ బొందె సమసియచటపాపమది పుణ్యమయ్యెను పావనముగ!ఉత్పలమాలగోపకులైక భూషణు వికుంఠ పురాధిపు వైరభక్తితోఁకోపము మీరుచున్ మదము గుప్పఁగ నిందల చేదిరాజహో!పాపిని చక్రి కూల్చి తన పంచకుఁ జేర్చె! వరమ్ములందినన్బాపము పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్!
లేడిపిల్లను గావగ నిడుమునుండిమౌనిచంద్రుడు పల్కెను కానిమాటదేవతలు మెచ్చి దీవించి తేల్చె నిట్లుపాపమది పుణ్యమయ్యెను పావనముగ
ఆటవెలదిజీవితంబునందుఁజిక్కులు తప్పవు చావఁబూనుటకట! సరియ కాదు ఆత్మహత్య"పాపమది;పుణ్యమయ్యెనుపావనముగ "నెంచి జీవి బ్రతుక. ఉత్పలమాల కోపముఁబూని కొంపలనుఁగూల్చుట పాడియె?యద్దియే మహా *పాపము; పుణ్యమై పరమ పావన పీఠమలంకరించెడిన్*భూపతి యెల్లవేళలను భూరిగఁజేయుచు దానధర్మముల్ చూపులలో కృపారసముఁజూపుచుఁబ్రోవగ తజ్జనంబులన్.
ఉ.మేపును నమ్మకస్థులుగ మ్లేచ్ఛులు గోవుల మాంసభోక్తలై*పాపము పుణ్యమై పరమ పావన పీఠమలంకరించెడిన్*గోపముతోడఁ గల్కి, వధ ఘోరముగా సమకట్టుఁ ద్రుంగుడున్గాపుగ విష్ణువే కృతయుగమ్మునుపక్రమణమ్ము శిష్టులన్.
ఆకలి యని చేరినవారి కన్నమిడకదూరి హేళన జేయుట ఘోరమైనపాపమది, పుణ్యమయ్యె పావనముగగంగలో మునిగినచాలు కాశి లోన.బాపనునింట బుట్టియు విభావరి పొందును గోరువాడు భారూపుని దూరెడిన్ పరమ లోభియొకండట కాశికేగి యయ్యాపగలోన దూకుచు మహాశివ రాత్రి దినంబు చావగా పాపము పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్.
హర్షమందున దీపము నార్పు టనగపాపమది ; పుణ్యమయ్యెను పావనముగజన్మ దిన వేడుక జరుపు సమయ మందుదివ్వె నూది మొదలిడ విదేశ రీతి
పాప కార్యములునెరపు పాపియతడుఓట్లనాశించి వెదజల్లె నోట్లనెన్నొకూటి పేదకు చిక్కిన నోటు నెన్నపాపమది పుణ్యమయ్యెను పావనముగ
వేట పేరున మృగముల వెంట బడుట పాపమది,పుణ్యమయ్యెను పావనముగ దాన ధర్మముల్ సేయుచు మానకుండ తీర్థ యాత్రలు సేయనౌ దిరుగు కతన
దారుణకృత్యముల్ సల్పెడు దానవులకుపాపమది పుణ్య మయ్యెను పావనముగధర్మబద్ధముగా మెల్గు తాత్వికులకుపాప మేరీతి పుణ్యమై పరిఢ విల్లు?
కాపురమున్ త్యజించి కడుఁ గాదిలి పత్నినిఁ గష్టపెట్టుచున్చూపుచు నిచ్చ వర్తిలిన సుందరియౌ వెలచాన యింటిలోనాపె మరల్చగా మదిని నాపరమాత్ముని సేవలఁ దన్పు వానిదౌ పాపము పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్
ఆపద యందు స్రుక్కెడు జనాళిని రక్షణ జేయు వానికిం బాపము పుణ్యమైపరమ పావన పీఠమలంకరించెడిన్ బ్రాపును నీయ గల్గునిలఁ బ్రాభవ మీజగ మందు బాగుగాఁ బాపము పుణ్యముల్ గలవు భద్రము గామన గుండె లోపలన్
చూపరులెల్ల సోద్యపడ జిత్తము నిల్పియునెల్లవేళలన్లోపలి స్వార్థ చింతనము లోభము క్రోధముకామవాసనల్లాపియు శ్రీహరిన్ దలప, నప్పుడు దప్పక పూర్వ జన్మపుంపాపము పుణ్యమై పరమ పావన పీఠమలంకరించెడిన్
కలుషితం బయ్యెఁ దోయము కాశి యందుఁ దోరముగ మునుక లచట మూరఁ జంద్ర శేఖర పుర గంగను శుద్ధి సేయఁగ మును పాప మది పుణ్య మయ్యెను పావనముగ [మునుపు + ఆపము+అది =మును పాప మది]పాప మనమ్ము తోడ శిశుపాలుఁడు సంతత మూని వైరముంగోపము ద్వేష తాపములు ఘోర తరమ్ము సెలంగఁ గృష్ణు సంతాప మొసంగఁ దిట్టఁగను దారుణ చక్ర నికృత్త కంఠుఁడై పాపము పుణ్యమై పరమ పావన పీఠ మలంకరించెడిన్
మేలు చేసినవారిపై కాలుదువ్వపాపమది, పుణ్యమయ్యెను పావనముగకీడు చేసిన వారిని కూడ మహినిమేలొనర్పగ మదిలోన మేకొనంగ
కోపమనర్థదాయకము ఘూర్ణితమై నినుఁ గూల్చివేయు నేపాపమెరుంగనట్టి కడు భవ్యచరిత్రులఁ గీడొనర్పుటేపాపము, పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్లోపములెంచకన్ మదిని రోయక వైరికి మేలుఁ గూర్చగన్
రావణాసురుడానాడు కావరమునసీతమాతనపహరించె సిగ్గు విడచిచివర రాముడు చంపగ చేసి నట్టి"పాపమది పుణ్యమయ్యెను పావనముగ”
తేటగీతి
రిప్లయితొలగించండికోపమున శిశుపాలుఁడు గోప బాలు
వందనిందల సుతియింప వైరభక్తి
చక్రి సాయుజ్యమున్ బొందె సమసియచట
పాపమది పుణ్యమయ్యెను పావనముగ!
ఉత్పలమాల
గోపకులైక భూషణు వికుంఠ పురాధిపు వైరభక్తితోఁ
కోపము మీరుచున్ మదము గుప్పఁగ నిందల చేదిరాజహో!
పాపిని చక్రి కూల్చి తన పంచకుఁ జేర్చె! వరమ్ములందినన్
బాపము పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్!
లేడిపిల్లను గావగ నిడుమునుండి
రిప్లయితొలగించండిమౌనిచంద్రుడు పల్కెను కానిమాట
దేవతలు మెచ్చి దీవించి తేల్చె నిట్లు
పాపమది పుణ్యమయ్యెను పావనముగ
ఆటవెలది
రిప్లయితొలగించండిజీవితంబునందుఁజిక్కులు తప్పవు
చావఁబూనుటకట! సరియ కాదు
ఆత్మహత్య"పాపమది;పుణ్యమయ్యెను
పావనముగ "నెంచి జీవి బ్రతుక.
ఉత్పలమాల
కోపముఁబూని కొంపలనుఁగూల్చుట పాడియె?యద్దియే మహా
*పాపము; పుణ్యమై పరమ పావన పీఠమలంకరించెడిన్*
భూపతి యెల్లవేళలను భూరిగఁజేయుచు దానధర్మముల్
చూపులలో కృపారసముఁజూపుచుఁబ్రోవగ తజ్జనంబులన్.
ఉ.
రిప్లయితొలగించండిమేపును నమ్మకస్థులుగ మ్లేచ్ఛులు గోవుల మాంసభోక్తలై
*పాపము పుణ్యమై పరమ పావన పీఠమలంకరించెడిన్*
గోపముతోడఁ గల్కి, వధ ఘోరముగా సమకట్టుఁ ద్రుంగుడున్
గాపుగ విష్ణువే కృతయుగమ్మునుపక్రమణమ్ము శిష్టులన్.
రిప్లయితొలగించండిఆకలి యని చేరినవారి కన్నమిడక
దూరి హేళన జేయుట ఘోరమైన
పాపమది, పుణ్యమయ్యె పావనముగ
గంగలో మునిగినచాలు కాశి లోన.
బాపనునింట బుట్టియు విభావరి పొందును గోరువాడు భా
రూపుని దూరెడిన్ పరమ లోభియొకండట కాశికేగి య
య్యాపగలోన దూకుచు మహాశివ రాత్రి దినంబు చావగా
పాపము పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్.
హర్షమందున దీపము నార్పు టనగ
రిప్లయితొలగించండిపాపమది ; పుణ్యమయ్యెను పావనముగ
జన్మ దిన వేడుక జరుపు సమయ మందు
దివ్వె నూది మొదలిడ విదేశ రీతి
పాప కార్యములునెరపు పాపియతడు
రిప్లయితొలగించండిఓట్లనాశించి వెదజల్లె నోట్లనెన్నొ
కూటి పేదకు చిక్కిన నోటు నెన్న
పాపమది పుణ్యమయ్యెను పావనముగ
వేట పేరున మృగముల వెంట బడుట
రిప్లయితొలగించండిపాపమది,పుణ్యమయ్యెను పావనముగ
దాన ధర్మముల్ సేయుచు మానకుండ
తీర్థ యాత్రలు సేయనౌ దిరుగు కతన
దారుణకృత్యముల్ సల్పెడు దానవులకు
రిప్లయితొలగించండిపాపమది పుణ్య మయ్యెను పావనముగ
ధర్మబద్ధముగా మెల్గు తాత్వికులకు
పాప మేరీతి పుణ్యమై పరిఢ విల్లు?
కాపురమున్ త్యజించి కడుఁ గాదిలి పత్నినిఁ గష్టపెట్టుచున్
రిప్లయితొలగించండిచూపుచు నిచ్చ వర్తిలిన సుందరియౌ వెలచాన యింటిలో
నాపె మరల్చగా మదిని నాపరమాత్ముని సేవలఁ దన్పు వానిదౌ
పాపము పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్
ఆపద యందు స్రుక్కెడు జనాళిని రక్షణ జేయు వానికిం
రిప్లయితొలగించండిబాపము పుణ్యమైపరమ పావన పీఠమలంకరించెడిన్
బ్రాపును నీయ గల్గునిలఁ బ్రాభవ మీజగ మందు బాగుగాఁ
బాపము పుణ్యముల్ గలవు భద్రము గామన గుండె లోపలన్
చూపరులెల్ల సోద్యపడ జిత్తము నిల్పియు
రిప్లయితొలగించండినెల్లవేళలన్
లోపలి స్వార్థ చింతనము లోభము క్రోధము
కామవాసన
ల్లాపియు శ్రీహరిన్ దలప, నప్పుడు దప్పక
పూర్వ జన్మపుం
పాపము పుణ్యమై పరమ పావన పీఠ
మలంకరించెడిన్
కలుషితం బయ్యెఁ దోయము కాశి యందుఁ
రిప్లయితొలగించండిదోరముగ మునుక లచట మూరఁ జంద్ర
శేఖర పుర గంగను శుద్ధి సేయఁగ మును
పాప మది పుణ్య మయ్యెను పావనముగ
[మునుపు + ఆపము+అది =మును పాప మది]
పాప మనమ్ము తోడ శిశుపాలుఁడు సంతత మూని వైరముం
గోపము ద్వేష తాపములు ఘోర తరమ్ము సెలంగఁ గృష్ణు సం
తాప మొసంగఁ దిట్టఁగను దారుణ చక్ర నికృత్త కంఠుఁడై
పాపము పుణ్యమై పరమ పావన పీఠ మలంకరించెడిన్
మేలు చేసినవారిపై కాలుదువ్వ
రిప్లయితొలగించండిపాపమది, పుణ్యమయ్యెను పావనముగ
కీడు చేసిన వారిని కూడ మహిని
మేలొనర్పగ మదిలోన మేకొనంగ
కోపమనర్థదాయకము ఘూర్ణితమై నినుఁ గూల్చివేయు నే
రిప్లయితొలగించండిపాపమెరుంగనట్టి కడు భవ్యచరిత్రులఁ గీడొనర్పుటే
పాపము, పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్
లోపములెంచకన్ మదిని రోయక వైరికి మేలుఁ గూర్చగన్
రావణాసురుడానాడు కావరమున
రిప్లయితొలగించండిసీతమాతనపహరించె సిగ్గు విడచి
చివర రాముడు చంపగ చేసి నట్టి
"పాపమది పుణ్యమయ్యెను పావనముగ”