6-10-2022 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్”(లేదా...)“సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై”
కందముసంధ్యల నిత్యముఁజేయుముసంధ్యావందనము, విడువ స్వర్గము;దక్కున్ వంద్యుఁడ!విప్రుఁడ!మోక్షంబాంధ్యంబును తొలగిపోవు హరిఁజేరంగన్.
శార్దూలముఆంధ్యంబందున నుండిపోయి యకటా!యా నాస్తిక బ్రాహ్మణుల్ సంధ్యావందనమిచ్చగింపరు;బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై సంధ్యాదేవినిఁగొల్చిమోక్షపదమున్ సాధించగా నెంచరే!సంధ్యాతంబిదివిప్రకోటికినిశిష్టాచారమార్గంబగున్
కందంసంధ్యను సాయంవేళలసంధ్యాదేవిని భజింప జ్ఞానమ్మబ్బున్వంధ్యపు కర్మలఁ, జేయగసంధ్యావందనము, విడువ స్వర్గము దక్కున్శార్దూలవిక్రీడితముసంధ్యన్గాంచఁగ భక్తిభావములవే సాయంత్రముప్పొంగెడున్సంధ్యాదేవి సరస్వతీ జనని విశ్వాసమ్మునన్ బ్రోచెడున్వంధ్యమ్మౌ గతి కర్మలన్ నెరుపుటల్, భక్త్యాత్ములై చేయగన్సంధ్యావందనమి,చ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వరూధిని ప్రవరునితో మాంద్యము వీడుము జడుడా!వంద్యాంగన నిన్నుగోర వలదన దగునేనింద్యము గాదది విప్రుడసంధ్యా వందనమును విడువ స్వర్గము దక్కున్
సంధ్యను మానుమటంచును జంద్యము తొలగించమంచు జగడము లేలా వింధ్యా! మోక్షార్థి కిలను సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్?
సంధ్యను వార్చగ వలయును సంధ్యా కాలంబులందు సన్మతి తోడన్ సంధ్యా వందన మిదియే సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్?
జంద్యమ్మున్ ధరియించు వారలిలన్ శ్రద్ధన్ ద్రిపర్యాయముల్ సంధ్యావందనమాచరింతురు కదా సద్భక్తితో నిత్యమున్ సంధ్యా! నేమము వీడబోరెపుడు దిష్టమ్మే విలంబించెడిన్ సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై.
వింధ్యాచల పరిసరములవంద్యుల దర్శనమునొంది వందనమేలన్జంధ్యాల హాస్యము గనినసంధ్యా!వందనము విడువ స్వర్గము దక్కున్
సంధ్యావందనమననదివంద్యంబని వేదవిహిత ప్రక్రియయని నీ వింధ్యను విడువకు సఖుడాసంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్
సంధ్యల నడి ఖలముడుగదుసంధ్యావందనము విడువ, స్వర్గము దక్కున్సంధ్యోపాసన జరుపగసంధ్యావందన మొసగును స్వాస్థ్యము కూడన్
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై సంధ్యావందన మాచరించఁదగు నా సంధ్యన్ శుభాకారులై సంధ్యన్ వార్చిన సూర్య దేవుఁడు గడున్ సంతోష మగ్నుండు నై దధ్యంబౌ విధ మిచ్చు సుస్థత నికన్ దార్ఢ్యంబు సౌఖ్యంబునున్
వంద్యంబౌ సురలోక సౌఖ్యములు నీవొందంగ నిచ్చోటనేసంధ్యావందనమాది సువ్రతములన్ సల్పంగ నింకేటికిన్,నింద్యంబెట్టులగున్, సుఖంబులొదవన్ నిత్యంబులై యీభువిన్సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై
సంధ్యా సమయము నందునసంధ్యా వందనము సలుప సార్థక్య మగున్నింద్యo బగు నంద్రె టు లన్సంధ్యా వందనము విడువ స్వర్గము దక్కున్?
*దేవీ భాగవతంలో 9వ స్కంధములో, శ్రీహరి నారద మహర్షికి కలియుగ లక్షణములను వివరించు అంశం ఆధారంగా, నా ప్రయత్నం ఇలా.....*శా.సంధ్యాకాలములిట్లు మూడు దినమున్ సత్బ్రాహ్మణుల్ గొల్వగన్వింధ్యాద్రిన్ గనగా నగస్త్యుడు పసన్ విఖ్యాతిఁ బోగొట్టెనే*సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై*సంధ్యన్ వార్చఁ గలిన్ వ్యళీక, హరిచే సంబుద్ధి, మౌనిన్ రహిన్.
మాంద్యము కలుగును నరునకుసంధ్యావందనము విడువ: స్వర్గము దక్కున్సంధ్యను వార్చుచునుండినవంద్యుండగుననుటనిజము వసుధా స్థలిలో
సంధ్యల మరువని దేమిటి ?ఆంధ్యము మూర్ఖుల కలయిక యనుచున్ వారిన్ ?సంధ్యావాటిని గొలిచిన ?" సంధ్యా వందనము, విడువ, స్వర్గము దక్కున్"
వంధ్యమంచునుపండితుల్ పలుకుచున్ పాటించరీనేలపైసంధ్యారాముని గొల్వ బోరు జడులై సంస్కృతి బాటించరే?వింధ్యావాసిని పూజలన్ విడువకన్ ప్రెబ్బొత్తిచే జూతురే?“సంధ్యావందన మిచ్చగింపరు, బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై”
వంధ్యం బెందుల కగు నా వింధ్యాచలమున కరిగిన వీడను భక్తిన్ సంధ్యా విను నే నెన్నఁడుసంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్ఆంధ్యాచారము లేల నిర్మలపుఁ జిత్తౌన్నత్యమే లేనిచో వంధ్యా క్షేత్రము భంగి నిష్ఫలములౌ పాపాత్ము పూజావళుల్ కంధ్యాత్మోద్భవ నాథునిం గొలువ శ్రీకాంతున్ ధరం జాలదే సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై
కందము
రిప్లయితొలగించండిసంధ్యల నిత్యముఁజేయుము
సంధ్యావందనము, విడువ స్వర్గము;దక్కున్
వంద్యుఁడ!విప్రుఁడ!మోక్షం
బాంధ్యంబును తొలగిపోవు హరిఁజేరంగన్.
శార్దూలము
తొలగించండిఆంధ్యంబందున నుండిపోయి యకటా!యా నాస్తిక బ్రాహ్మణుల్
సంధ్యావందనమిచ్చగింపరు;బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై
సంధ్యాదేవినిఁగొల్చిమోక్షపదమున్ సాధించగా నెంచరే!
సంధ్యాతంబిదివిప్రకోటికినిశిష్టాచారమార్గంబగున్
కందం
రిప్లయితొలగించండిసంధ్యను సాయంవేళల
సంధ్యాదేవిని భజింప జ్ఞానమ్మబ్బున్
వంధ్యపు కర్మలఁ, జేయగ
సంధ్యావందనము, విడువ స్వర్గము దక్కున్
శార్దూలవిక్రీడితము
సంధ్యన్గాంచఁగ భక్తిభావములవే సాయంత్రముప్పొంగెడున్
సంధ్యాదేవి సరస్వతీ జనని విశ్వాసమ్మునన్ బ్రోచెడున్
వంధ్యమ్మౌ గతి కర్మలన్ నెరుపుటల్, భక్త్యాత్ములై చేయగన్
సంధ్యావందనమి,చ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివరూధిని ప్రవరునితో
తొలగించండిమాంద్యము వీడుము జడుడా!
వంద్యాంగన నిన్నుగోర వలదన దగునే
నింద్యము గాదది విప్రుడ
సంధ్యా వందనమును విడువ స్వర్గము దక్కున్
రిప్లయితొలగించండిసంధ్యను మానుమటంచును
జంద్యము తొలగించమంచు జగడము లేలా
వింధ్యా! మోక్షార్థి కిలను
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్?
సంధ్యను వార్చగ వలయును
రిప్లయితొలగించండిసంధ్యా కాలంబులందు సన్మతి తోడన్
సంధ్యా వందన మిదియే
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్?
రిప్లయితొలగించండిజంద్యమ్మున్ ధరియించు వారలిలన్ శ్రద్ధన్ ద్రిపర్యాయముల్
సంధ్యావందనమాచరింతురు కదా సద్భక్తితో నిత్యమున్
సంధ్యా! నేమము వీడబోరెపుడు దిష్టమ్మే విలంబించెడిన్
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై.
వింధ్యాచల పరిసరముల
రిప్లయితొలగించండివంద్యుల దర్శనమునొంది వందనమేలన్
జంధ్యాల హాస్యము గనిన
సంధ్యా!వందనము విడువ స్వర్గము దక్కున్
సంధ్యావందనమననది
రిప్లయితొలగించండివంద్యంబని వేదవిహిత ప్రక్రియయని నీ
వింధ్యను విడువకు సఖుడా
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్
సంధ్యల నడి ఖలముడుగదు
రిప్లయితొలగించండిసంధ్యావందనము విడువ, స్వర్గము దక్కున్
సంధ్యోపాసన జరుపగ
సంధ్యావందన మొసగును స్వాస్థ్యము కూడన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై
రిప్లయితొలగించండిసంధ్యావందన మాచరించఁదగు నా సంధ్యన్ శుభాకారులై
సంధ్యన్ వార్చిన సూర్య దేవుఁడు గడున్ సంతోష మగ్నుండు నై
దధ్యంబౌ విధ మిచ్చు సుస్థత నికన్ దార్ఢ్యంబు సౌఖ్యంబునున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివంద్యంబౌ సురలోక సౌఖ్యములు నీవొందంగ నిచ్చోటనే
రిప్లయితొలగించండిసంధ్యావందనమాది సువ్రతములన్ సల్పంగ నింకేటికిన్,
నింద్యంబెట్టులగున్, సుఖంబులొదవన్ నిత్యంబులై యీభువిన్
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై
సంధ్యా సమయము నందున
రిప్లయితొలగించండిసంధ్యా వందనము సలుప సార్థక్య మగున్
నింద్యo బగు నంద్రె టు లన్
సంధ్యా వందనము విడువ స్వర్గము దక్కున్?
*దేవీ భాగవతంలో 9వ స్కంధములో, శ్రీహరి నారద మహర్షికి కలియుగ లక్షణములను వివరించు అంశం ఆధారంగా, నా ప్రయత్నం ఇలా.....*
రిప్లయితొలగించండిశా.
సంధ్యాకాలములిట్లు మూడు దినమున్ సత్బ్రాహ్మణుల్ గొల్వగన్
వింధ్యాద్రిన్ గనగా నగస్త్యుడు పసన్ విఖ్యాతిఁ బోగొట్టెనే
*సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై*
సంధ్యన్ వార్చఁ గలిన్ వ్యళీక, హరిచే సంబుద్ధి, మౌనిన్ రహిన్.
మాంద్యము కలుగును నరునకు
రిప్లయితొలగించండిసంధ్యావందనము విడువ: స్వర్గము దక్కున్
సంధ్యను వార్చుచునుండిన
వంద్యుండగుననుటనిజము వసుధా స్థలిలో
సంధ్యల మరువని దేమిటి ?
రిప్లయితొలగించండిఆంధ్యము మూర్ఖుల కలయిక యనుచున్ వారిన్ ?
సంధ్యావాటిని గొలిచిన ?
" సంధ్యా వందనము, విడువ, స్వర్గము దక్కున్"
వంధ్యమంచునుపండితుల్ పలుకుచున్ పాటించరీనేలపై
రిప్లయితొలగించండిసంధ్యారాముని గొల్వ బోరు జడులై సంస్కృతి బాటించరే?
వింధ్యావాసిని పూజలన్ విడువకన్ ప్రెబ్బొత్తిచే జూతురే?
“సంధ్యావందన మిచ్చగింపరు, బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై”
వంధ్యం బెందుల కగు నా
రిప్లయితొలగించండివింధ్యాచలమున కరిగిన వీడను భక్తిన్
సంధ్యా విను నే నెన్నఁడు
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్
ఆంధ్యాచారము లేల నిర్మలపుఁ జిత్తౌన్నత్యమే లేనిచో
వంధ్యా క్షేత్రము భంగి నిష్ఫలములౌ పాపాత్ము పూజావళుల్
కంధ్యాత్మోద్భవ నాథునిం గొలువ శ్రీకాంతున్ ధరం జాలదే
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై