5-10-2022 (బుధవారం)
కవిమిత్రులకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!
దసరా వేడుకల గురించి ఉత్పలమాల వ్రాయండి
1వ పాదం 1వ అక్షరం 'ద'
2వ పాదం 10వ అక్షరం 'శ'
3వ పాదం 14వ అక్షరం 'హ'
4వ పాదం 19వ అక్షరం 'ర'
(లేదా...)
పై అక్షరాలను వరుసగా పాదాదిలో న్యస్తం చేస్తూ కందపద్యం వ్రాయండి
కం. దసహర వేడుకలందున
రిప్లయితొలగించండిశశి బింబము లట్లు పడుచు చానల గనుచున్
హసితులు గా యువకుల మది
రసవంత ము లౌచు పొంగి రంజిలు చుండెన్
కందము
రిప్లయితొలగించండిదరహసిత వదన దుర్గన్
శరదృతు దశమీ దినాన జయ!దానవ సం
హర రూపిణి!రుద్రాణి!వ
ర,రజత గిరివాసిని!యని ప్రార్థింతురుగా.
ఉత్పలమాల
తొలగించండిదక్షసుతా!యుమా!గిరిజ!దానవు నా మహిషున్ వధించి,దు
ష్టక్షయ,శిష్టరక్షణ ప్రశస్తిని గాంచితివీవు నేడు మా
కక్షయమౌ జయమ్ములిడుమంచు మనోహరమైన యా శమీ
వృక్షముఁజేరి భక్తతతి వేడరె!యాడియు పాడరే రహిన్.
రిప్లయితొలగించండిదండిగ బూలు దెచ్చి ఖలు దైత్యుని యంతము సేసినట్టి యా
చండి నలంకరించి తగు శక్తినొసంగమటంచు గోరుచున్
గుండెను నిల్చియున్న శివ కోమలి సింహధరన్ గిరాతిఁ నా
కండగ నుండి బ్రోవమని యార్తిగ వేడితి భక్తి మీరగన్.
దశభుజి తామసియౌ యుమ
శశి ధరుఁబ్రియపత్నియైన చండాలిక సా
హస గాథలవిని తల్లికి
రశనా భరణమ్ము నొసగి ప్రార్థించితినే.
దశరా పండుగ రాకను
రిప్లయితొలగించండిశశిబింబపుఁ గాంతులీను జానలు మిగులన్
హసితంబగు ముఖు లగుచును
రసవంతముగా గడిపిరి రాత్రియుఁ బగలున్
దక్షతతోడనాజనని దానవముఖ్యుని మట్టుబెట్టగా
రిప్లయితొలగించండిసాక్షులు దేవతల్ గనిరి శర్వరశక్తిని సంభ్రమంబునన్
రాక్షస సార్వభౌముడగు రావణ దేహముగూల్చె రాముడే
వీక్షకులై తరింత్రుగద ప్రేక్షక బృందము భక్తిమీరగన్
దరహాస చంద్రికలతో
తొలగించండిశరణాగతులనరయంగ శైలతనూజా
హరగిరి నివీడి భువిజే
ర రయంబున నరుగుదెంచు రాజీవాక్షీ
దమనము క్రీడగనెంచుచు
రిప్లయితొలగించండిశమియించగ బాధలెల్ల శంభుని సతి మో
హమున మునిచి దైత్య వధను
రమియించెను దేవతలకు రక్షణనీయన్
దక్షతజూపి రాక్షసుల దారుణకాండల నాప నెఱ్ఱనౌ
చక్షువులన్ సుబాహువుల శర్వునిరాణి త్రిశూలి
శిష్టులన్
రక్షణసేయ దొమ్మిదగు రాత్రుల నాహవమందునన్
మహా
ప్రేక్షను జూపిగూల్చె నవలీలగ వేల్పుల కోర్కెదీరగా
దశరాలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు
దక్కును కంటికింపుగను దర్శనభాగ్యము వేంకటేశుదౌ
చక్కని భవ్యవిగ్రహము శర్మదమై తిరుగాడ
వీధులన్
దిక్కులు పిక్కటిల్లగను దివ్యపు వాహన సేవలందుచున్
మొక్కుల దీర్చగా తరలి భోరున భక్తులు చేరరారహో!
దండిగఁ బూలగుత్తులను దండగఁజేయుచు నమ్మ యైన యా
రిప్లయితొలగించండిచండిక కంఠమండిడుచు శక్తిని యుక్తిని నిమ్ము మాదయన్
దండముఁ బెట్టుచుంటి శివ! దైత్యుని దేహముఁ ద్రుంపు మిప్పుఁడే
యండజురాణి శారదయు నారమ యొక్కరు గారె యారయన్
గురుదేవులకు కవిమిత్రులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు 🙏
రిప్లయితొలగించండికందం
దరిసెనమిడి నవదుర్గలు
శరదృతు శోభల ఘటిల్లి సందడిఁ జేయన్
హరుస వసంతోత్సవ వీ
రరసము సల్లుకొనిరి ప్రజ రంజిలి దసరాన్
ఉత్పలమాల
దర్శన మీయగా మిగులఁ దా నవ దుర్గల రూపమందు ని
ష్కర్షగ లోక రక్షకయి శంకరి దానవ భంజనంబు నా
దర్శమనంగఁ జేసి జగదాంబయెసింహపు తేరుఁ దీరుచున్
హర్షము నిండి ముట్టగ విహాయస వీధుల బాపు భారముల్
దసరా పండుగ నాటి ద
రిప్లయితొలగించండిశ సంబరమనుచు దలంచి సహచరు లెల్లన్
హసనము సలుపుచు గడిపిరి
రసజ్ఞులై యా దినమున రాసము తోడన్
రిప్లయితొలగించండిదశమి దినమ్మునఁ బూజలు
శశి సదృశానన కొనర్చి చండికి నిజ వా
హ శకటములఁ బూజింతురు
రశ నాదు లొసంగి సుందరమ్ముగ నెలమిన్
దక్కఁగ నింపుగా జయము తద్దశ రాత్రము నాచరింతురే
చక్కఁగఁ బార్వతీ సతిని శక్తినిఁ గొల్తురు భక్తి నెల్లరుం
బిక్కటిలంగ రక్షణము పేర్మిని వాహన రాజ పూజలం
దక్కక చేయుచుండుదురు ధాత్రి నెడందల రక్తి మూరఁగన్
ఉ.
రిప్లయితొలగించండిదమ్మును జూపగన్ మహిషుఁ దల్లియె చంపెను ధర్మరక్షగా
సమ్మతి సర్వలోకములు శంకర విష్ణువు బ్రహ్మ దేవులున్
తెమ్మెర వెన్నెలన్ గనుచుఁ దీరుగ గేహమునందు వేడుకల్
గుమ్మల నృత్యముల్ గురువు గొంతున దీవన ప్రీతి ధోరణిన్.
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిదరిసెన మొసగుము శంకరి
శరణమువేడితినినిన్ను జయములనిడుచున్
హరియించు దోష మో మా
రరిపుని సతి మ్రొక్కు చుంటి రహినిడుమమ్మా
దరహాసముతో బాలలు
రిప్లయితొలగించండిశరములు చేబూని యిండ్ల చావిడులందున్
హరువుగ పాటలు పాడి ము
రరిపుని గొనియాడిరి దసరా దివసమునన్
మరొక పూరణ
రిప్లయితొలగించండిడా బల్లూరి ఉమాదేవి
దమ్మముతప్పుచున్షతముదైత్యులు సల్పగ ఘోర కృత్యముల్
సమ్ముఖమందునిల్చుచును శస్త్రము లష్టభు జమ్ములందునన్
అమ్మలగన్నయమ్మయగు నంబయునాహవమందుదాల్చుచున్
నిమ్ముగచంపెతావడిగనెల్లసురాళియకాంక్షదీరగా
కందం
రిప్లయితొలగించండిదరహాసచంద్రికలతో
శరణ్యుడు ,సరసిజనాభు ,జయజయ రవమున్
హరుసించి సేవలన మా
రరిపుని రమణిని పొగిడిరి రహియుత రీతిన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
దర్శన మీయుమా లలిత దైవము నీవని యెల్ల వేళలన్
రిప్లయితొలగించండిస్పర్షనులేకయుందునుగ శంకరధారిని ధ్యాన మందునన్
దర్శకుడన్ యుమామహిమతాముగ సింహము నెక్కి మీరు సం
దర్శన భాగ్యముల్నిడగ తన్మయ మొందుదు తృప్తిమీరగన్
దరిశన మిచ్చును శాంభవి
రిప్లయితొలగించండిశరణమువేడుచును బగితి సన్నుతి చేయన్
హరియించి మహిషుఁ దా ఘో
ర రణము మృగరాజు నెక్కి ప్రజలను కాచెన్
*ద* న్నుగ నిల్చుశాంకరి సదా మది నిల్పి కరమ్ము నిష్ఠతో
రిప్లయితొలగించండిసన్నుతి చేయ, తప్పక వ *శ* మ్మగు పూర్తిగ భక్త పాళికిన్
మన్నన జేసి వారల సమస్యల తా *హ* రియించి పాపముల్
క్రన్ననఁ గాంచి కష్టముల కాచు నిశాటుల దున్మి ధీ *ర* యై
వంధ్యం బెందుల కగు నా
రిప్లయితొలగించండివింధ్యాచలమున కరిగిన వీడను భక్తిన్
సంధ్యా విను నే నెన్నఁడు
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్
ఆంధ్యాచారము లేల నిర్మలపుఁ జిత్తౌన్నత్యమే లేనిచో
వంధ్యా క్షేత్రము భంగి నిష్ఫలములౌ పాపాత్ము పూజావళుల్
కంధ్యాత్మోద్భవ నాథునిం గొలువ శ్రీకాంతున్ ధరం జాలదే
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై