21, అక్టోబర్ 2022, శుక్రవారం

సమస్య - 4226

22-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుస్తకమ్మునఁ బుటలెల్లఁ బొట్లములకె”
(లేదా...)
“పుస్తకమందునం బుటలు పొట్లములం దగఁ గట్టనౌనుగా”

17 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    సకల వేద శాస్త్ర సంగీత సాహిత్య
    సంగతులను దెల్పు సరసిజాక్షి
    అమ్మ వాణి "పుస్తకమ్మునఁబుటలెల్లఁ;
    బొట్లములకె "చిత్తు పుస్తకములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      నిస్తులమౌపురాణములు,నీతులు,నాలుగు వేద శాఖలున్
      ప్రస్తుతిఁగన్న శాస్త్రములు భారతి హస్తము నందునొప్పు నా
      పుస్తకమందునంబుటలు;బొట్లములందగఁగట్టనౌనుగా
      ప్రస్తుతసంగతుల్
      దెలుపుపత్రికలంబఠియించినంతనే.

      తొలగించండి
  2. వసుధ యందున చరవాణి వచ్చి నంత
    మూల పడి పోయె నందురు పుస్తకములు
    పనికి రానట్టి వై యవి వర్త కమున
    పుస్తకమ్మున పుట్టలె ల్ల పొట్లములకె

    రిప్లయితొలగించండి

  3. హస్తమునందు జేరెనొక యాభరణమ్ము మొబైలు ఫోనులే
    విస్తృతమయ్యె మానవుడు విశ్వమునే యరచేత గాంచెడిన్
    బ్రస్తుత కాలమందు ప్రతి వాడు గుగూలుకు దాసులైరికన్
    పుస్తకమందునం బుటలు పొట్లములం దగఁ గట్టనౌనుగా.

    రిప్లయితొలగించండి
  4. నాడదియె దూరదర్శను, నేడు జూడ
    చేబలుకుగా నవతరించి సెల్లుఫోను
    మనుజుని పఠనాసక్తిని మానిపింప
    పుస్తకమ్మునఁ బుటలెల్లఁ బొట్లములకె.

    రిప్లయితొలగించండి
  5. విస్తు గొలిపెడు విషయాల వివర మొప్ప
    వాస్తు సంబంధ నియమాల వాస్తవమ్ము
    వాస్తు విద్వాంసుడొక్కడు వ్రాసినాడు
    పుస్తకమ్మునఁ బుటలెల్లఁ బొట్లములకె

    రిప్లయితొలగించండి
  6. మనుమనికి దన తరగతి మారె ననుచు
    పాఠ్య పొత్తములను బండి వానికొసగ
    నేటినుండి జరుగబోవు నిశ్చయముగ
    పుస్తకమ్మునఁ బుటలెల్లఁ బొట్లములకె”

    రిప్లయితొలగించండి
  7. మస్తకమ్మునకశనమౌ శస్తమైన
    పుస్తకమ్మది యసలైన పుస్తకమ్ము
    యస్తిమితమున కెరలింప మస్తకమ్ము
    పుస్తకమ్మునఁ బుటలెల్లఁ బొట్లములకె

    రిప్లయితొలగించండి
  8. పుస్తకమన్న మిత్తరుడువోలె కనుంగొని యెల్లవేళలన్
    మస్తకమందు శస్తమగు మార్గము జూపఁగ నెమ్మియౌను తా
    నస్తిమితంబొనర్చిమది యారటపెట్టెడు రీతినున్ననా
    పుస్తకమందునం బుటలు పొట్లములం దగఁ గట్టనౌనుగా

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    అమరి కవనమ్ము కావ్యాన నద్భుతముగఁ
    దెలిసి మెచ్చెడు పండిత తృప్తిఁగనదె!
    తెలియ లేనట్టి మూర్ఖుల కలితమైన
    పుస్తకమ్మునఁ బుటలెల్లఁ బొట్లములకె! !

    ఉత్పలమాల
    విస్తృత భావ సంపదల వీణియ మీటెడు గ్రంథరాజమై
    మస్తకమందు నేర్పుఁగల మాన్యులనాదరణంబు పొందుఁ, ద
    చ్ఛస్తిని గాంచెడున్ మతియె చాలని వారల పాలఁ జిక్కినన్
    పుస్తకమందునం బుటలు పొట్లములం దగఁ గట్టనౌనుగా!

    రిప్లయితొలగించండి
  10. చదువురానట్టివారలపదవియందు
    కదలు యూహలకల్పితా ముదమునందు
    చేయుపనులెల్ల మాయగా చిత్రముగను
    పుస్తకమ్మున బుటలెల్ల బొట్లములకె

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. సుబ్బారావు గారి పూరణ:

      హస్తము లందు సెల్లులవి యాభర ణంబులు గాగ యుండుటన్
      నిస్తుల మైన వేదములు నిండగు శాస్త్రము లన్నివేళలన్
      బ్రస్తుత కాల మందుసులు వారగ నౌటను వార్త లన్నియున్
      బుస్తకమందునం బుటలు పొట్లములం దగఁ గట్టనౌనుగా”

      సెల్లు ఫోనులు రాకతో చేతి కిపుఁడు
      “పుస్తకమ్మునఁ బుటలెల్లఁ బొట్లములకె
      పరిమితములయ్యె నేమని పలుక వలయు
      నన్ని పనులకు సెల్లుదా మిన్న యయ్యె

      తొలగించండి
  12. మాట లెల్లఁ గా నక్కట బూటకములు
    దాఁట వింతగ నవి యెల్లఁ గోట లడరి
    యయ్య వ్రాయఁ గరమ్ములు డయ్య మిగులఁ
    బుస్తకమ్మునఁ బుట లెల్లఁ బొట్లములకె

    విస్తృత గ్రంథ రాజ మని భీకర రీతిని సంభ్రమించుచున్
    సుస్తిమితమ్ము లేక మదిఁ జోద్యపు వ్రాతలు వ్రాయ స్వీయ సం
    ప్రస్తుతి దాఁట మేరలను బాఠకు లమ్మఁగఁ బుస్తకమ్ములం
    బుస్తక మందునం బుటలు పొట్లములం దగఁ గట్ట నౌనుగా

    రిప్లయితొలగించండి
  13. ప్రస్తుత కాలమందునను బాఠకవర్యులు
    లేరు, సెల్లులో
    మస్తుగ మగ్నమై జగమె మర్చిరి మానవ జాతియంతయున్
    నేస్తమ! గూగులున్నిపుడు నిక్కము
    దెల్పుచునుండె సర్వమున్
    పుస్తక మందలింబుటలు పొట్లము
    లందగ గట్టనౌనుగా

    రిప్లయితొలగించండి
  14. చదువు సంధ్యలు లేనట్టి జనము లున్న
    పల్లెటూళ్ళలో కొందరు వ్రాసి నట్టి
    పొత్తమిడతలపోసిరి పురజనములు
    పుస్తకమ్మున పుటలెల్లపొట్లములకె

    రిప్లయితొలగించండి