28, అక్టోబర్ 2022, శుక్రవారం

సమస్య - 4233

 29-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె”
(లేదా...)
“అన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్”

43 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నుంచి' వ్యావహారికం, 'నుండి' గ్రాంధికం. "పదవిని దప్ప జేసి.... చెప్పదొడగిరిటు । లన్నకుం..." అనండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు గురువుగారు.
      తేటగీతి
      రాజకీయాల యన్న పై రాళ్ళురువ్వి
      చెప్పులేయించి పదవిని దప్ప జేసి
      పదవి చేపట్ట, జనులు చెప్పదొడ గిరటు
      లన్నకుం జేటు గూర్చి మహాత్ముడయ్యె.
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటరు.

      తొలగించండి
  2. తేటగీతి
    వివిధ రీతులఁజెప్పె విభీషణుండు
    సాధ్వి సీతను శ్రీరామ చంద్రునికిడి
    బ్రోవు మంచును వినడయ్యె రావణుండు
    అన్నకుంజేటుఁగూర్చి మహాత్ముఁడయ్యె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      అన్నయ!రామభద్రునకు నన్నుల మిన్నను దేవి జానకిన్
      గ్రన్నన నిచ్చివేయుమన రావణుఁడున్ వినకున్న, నొచ్చియున్
      దిన్నగ నా విభీషణుఁడు నీతిపథంబును ద్రొక్కినంతనే
      యన్నకుఁజేటుఁగూర్చిన మహాత్మునిఁదమ్ముని మెచ్చిరెల్లరున్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. రామ రావణుల నడిమ రణము నందు
    పెద్దవాని గుప్తమును విభీషణుండు
    ద్వేషియైన దాశరథికి దెలుపినంత
    నన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  4. విన్నపముల్ ఘటించెను విభీషణుఁడుత్తమ ధర్మవర్తియై
    చెన్నగు నీతివాక్యములు శ్రీరఘురాముని పౌరుషంబులన్
    పన్నుగ చెప్పిజూసె విడు వైరమటంచును - యాలకింపడా
    యన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వైరమటంచును నాలకింపడా..." అనండి.

      తొలగించండి
  5. అన్నులమిన్న సీతనటు నార్యుడు రామున కప్పగించుటే
    మన్ననటంచుబల్క, నభిమానముతో దశకంఠు డంతటన్
    గ్రన్నన పాఱఁదోలగనె, గావ రఘూత్తము నాశ్రయంబులో
    నన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్న బలాఢ్యుడౌత, హనుమన్నను మంత్రిగ గల్గినట్టి యా
      పన్న దినేశ్వరాత్మజుడు, భవ్యమనస్కునిరామచంద్రునే
      దన్నుగ నెంచి వాలిని మదంబడగించిన వాడెయైన, వా
      నన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ, దమ్ముని మెచ్చిరెల్లరున్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  6. ధరణిజను బంధిసేయుట తగదటంచు
    హితము గోరినన్ విననట్టి హీనగుణుని
    కాదనుచు విభీషణుడంత కామచారి
    యన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె.


    మన్నికలైన వారలు సుమధ్యల రక్షణ జేయుచున్ సదా
    మన్నన జేయుటొప్పుగద, మానవ కాంతను బంధి కూడదా
    యన్నువుఁ వీడుమంచనిన యాగ్రహ మందిన కామచారియౌ
    యన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్.

    రిప్లయితొలగించండి
  7. కపట బుద్ధిని చంద్రబాబు పగఁజేత
    అన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె
    ననుట సరిగాదు ,సంస్కార హీనుఁడయ్యె
    రాజకీయము లట్లనే రాజు కొనును

    రిప్లయితొలగించండి
  8. అన్నరొ నాదుమాటవిను మన్నయ! సీతను రామునొద్ద కే
    గ్రన్ననఁబంపు మంచనగ రావణుఁడంతట మిన్న కుండుటన్
    దిన్నగ నావిభీషణుఁడుఁదేకువ తోడను రాముఁజేరగాఁ
    నన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్”

    రిప్లయితొలగించండి
  9. పరమసాధ్విని చెఱబట్టి పరిభవింప
    ధర్మమిది కాదు సోదరా తగదటన్న
    వినని రావణు వీడి విభీషణుండు
    అన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  10. పుడమి పుత్రిని రాముని కడకుబంప
    హితము పలికిన దేశబహిష్కృతుండు
    విప్పి చెప్పి మర్మమును విభీషణుండు
    అన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    కొంటె కృష్ణుని చేష్టలు వింటె చెలియ!
    రుక్మిణింగొని పోవగ రుక్మి యడ్డు
    పడ,పరాభవించెను వాని బళిర!పడతి
    యన్నకుంజేటుఁగూర్చి మహాత్ముఁడయ్యె.

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    సీత వీడిన రావణ! సేమమనిన
    ముదిరి మోహాంధకారుడు వదలననఁగ
    విమలగుణ రాముఁ జేరి విభీషణుండు
    నన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె

    ఉత్పలమాల
    "అన్నిట భ్రాత! మీరలు 'మహాత్ము'ల"టంచును రావణాసురున్
    "సన్నుత రామమూర్తి సతి జానకి వీడుట సేమమం"చనన్
    గన్నును మిన్నుఁ గానక వినాశము నెంచ వి భీషణుండు దా
    నన్నకుఁ జేటుఁ గూర్చిన, 'మహాత్ము'నిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్!

    రిప్లయితొలగించండి
  13. ఉ.

    అన్నకు రాజ్యమేల ! సుసిమాఖ్యుని భ్రాతృల సంహరించగన్
    మిన్నగు పాటలీ పురము మెట్టెను చెందిన రాజ్యకాంక్షతో
    మన్న కళింగ రాజ్యమును మాపెను కుందెను బౌద్ధుడాయెనే !
    *యన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్.*

    {దివ్యవదానం ఆధారంగా బిందుసారుడు తన పెద్ద కుమారుడు *సుసిమా* తన తరువాత వారసుడుగా రావాలని కోరుకున్నాడు. సుసిమా అహంకారంగా, వారి పట్ల అగౌరవంగా ఉన్నట్లు గుర్తించిన బిందుసారుడి మంత్రులు అశోకుడికి మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ అశోకుడు తన 99 మంది సోదరులను చంపినట్లు దిపావన్సా, మహావంసా సూచిస్తున్నాయి.}

    రిప్లయితొలగించండి
  14. నీతి మాలిన చర్యలు నేర మంచు
    ప్రీతి హిత బోధ చేసె వి భీ ష ణు o డు
    నన్న కుం జేటు గూర్చి మహా త్ము డయ్యె
    ననుచు గేలి సేసిరి వాని నసురు లపుడు

    రిప్లయితొలగించండి
  15. క్రన్నన జానకీ సతిని రామునకర్పణ జేయుమన్న రా
    మన్న దయాళుడై శరణమన్న నినున్ దయఁ జూచునన్న నా
    విన్నపమున్ గణింపని వివేక విహీనుని వీడ చెచ్చరన్
    అన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్

    రిప్లయితొలగించండి
  16. పన్నుగ రామచంద్రుడునుభాహు బలా
    ఢ్యడు రావణాసురుం
    డెన్నగ జేయు యుద్ధమున నింటివి గుట్లు
    విభీషణార్యుడే
    తిన్నగ విన్నవించె గద ధీరునకున్ రఘు
    రామమూర్తికిన్
    అన్నకు చేటుగూర్చిన మహాత్ముని తమ్ముపి మెచ్చిరందరున్

    రిప్లయితొలగించండి
  17. ఆత్మజుని హిరణ్యకశిపుఁ డత్యధికపు
    టాగ్రహమ్మున హరిఁ జూపు మంచుఁ గోరి
    నంతఁ బ్రహ్లాదుఁ డా హిరణ్యాక్షు దైత్యు
    నన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె

    మున్ను విభీషణుండు పరిపూర్ణ నయజ్ఞుఁడు రావణానుజుం
    డన్నను వీడి రామ శరణాగతుఁడై యని లోనఁ దోడ్పడెన్
    మిన్నగ స్వీయ మంత్రుల సమేతము తెల్పెను లంక గుట్టునే
    యన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  18. పన్నెను వ్యూహమున్ చెరను పట్టగ జానకి మాతనవ్వనిన్
    క్రన్నన రామచంద్రునకు కాంత నసంగ విభీషణుండనన్
    మన్నన చేయకుండగను మానస మందున చింత చేయుచున్
    అన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్”

    రిప్లయితొలగించండి
  19. అసురబుద్ధిని చూపుచు అపహరించి
    తెచ్చె నతివసీతమ్మను తెలివి మాలి
    యనుచు నావిభీషణుడెంచి యాత్మలోన
    అన్నకుం చేటు గూర్చి మహాత్ముడయ్యె.

    రిప్లయితొలగించండి