6, అక్టోబర్ 2022, గురువారం

సమస్య - 4210

7-10-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్”
(లేదా...)
“చితిమీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్”

20 కామెంట్‌లు:

  1. కందం
    అతఁడే నావాడనుచున్
    జతఁగూడఁగ రుక్మిణమ్మ చక్రిని గూడన్
    శ్రితజన వత్సలుడన నౌ
    చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      సతతమ్మా యదునందనున్ దలచి తా సంధించి సందేశమున్
      జతగానెంచుచు రుక్మిణీ రమణియే సాగంగ నా శౌరితో
      నతడే శ్రేష్ఠుడు నీడుజోడనుచు శ్రేయంబెంచి ప్రేమంపు టౌ
      చితిమీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్

      తొలగించండి
    2. గతమును దలచుంగొనుచును
      సతతము వారిర్వురెపుఁడు జంటగ నుంటన్
      నతఁడే యామెకుఁ దగు నౌ
      చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్

      తొలగించండి
  2. అతివల సందడి చెలగగ
    సుతిమెత్తని వేదిపైన జోడగు రీతిన్
    స్థితులగు జంటను సుమముల
    చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్

    చితి = రాశి
    పూలను పరచిన వేదికపైన స్థితులైన జంటనని భావన

    అతి వైభోగము జాటుచున్ జనము నాహ్వానించుచున్ బందిరిన్
    ద్యుతిమంతంబగు రీతిగా నిలిపి విద్యుద్దీప గుచ్ఛంబులన్
    స్తుతిపాత్రంబుగ వేదికన్ బొలుపు పూదోరంబులన్
    నిల్పి పూ
    చితిమీదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్

    రిప్లయితొలగించండి
  3. మతితో నాలోచించుచు
    నతిగుణవంతుడు వరుడని యందరు నింటన్
    స్తుతి చేయగ మెచ్చుచు ని
    శ్చితి పైనాశీర్వదించి చేసిరి పెండ్లిన్

    రిప్లయితొలగించండి
  4. నుతధీమతి, వినయవతి, యు
    వతి,సద్గుణవతి, సుశీలవతి, యతిగా,నా
    మతిఁదోచిన సుదతి, వరిం
    చితి, పైనాశీర్వదించి చేసిరి పెండ్లిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభము
      అతిమర్యాద కులోద్భవుండు, సుభగుండయ్యారె!నాకీడునౌ
      మతిమంతుండు, గుణాన్వితుండు,బహుధా మాన్యుండు, శ్రీమంతుఁడా
      శ్రితవాత్సల్యుఁడు, విద్యలందుఁగడు మేల్మేలీతడంచున్ వరి
      చితి,మీదన్ జరిపించిరుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్.

      తొలగించండి
  5. సుతునకు పెండిలి సలుపగ
    జతపడు చుండిన నెలతుక జక్కొనె ననుచున్
    గత కాలమందు గల పరి
    చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్

    రిప్లయితొలగించండి
  6. గతిలేనితనస్థితియే
    ప్రతికూలంబైనగాని వరుడే గెలిచెన్
    గతమున వానికి గల పరి
    చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్

    రిప్లయితొలగించండి
  7. మ.

    పతియే దైవముగా దలంచు కొమ నాపాదించఁ బుత్రున్ రహిన్
    సతినిన్ సూనుడు నర్ధ దేహమనుచున్ శ్లాఘించ మర్యాదతో
    ప్రతికర్మంబును జేయుచున్ జరులు సంప్రాప్తమ్ము శీలించి, యౌ
    *చితి మీదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్.*

    రిప్లయితొలగించండి
  8. గతమున్ వారలు దల్చుకొంటగను నాగామంబు నూహించి యౌ
    చితిమీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్
    సతముంజక్కగ నొండొరుల్ దమిని నాశా జ్యోతు లుప్పొంగగాఁ
    బ్రతుకున్ ముచ్చట యౌ విధంబు గను నాస్వాదించు సాయీలతా!

    రిప్లయితొలగించండి
  9. జతగాగూడి వివాహమాడ నొక సత్సారున్ మదిన్ నెమ్మితో
    సుత తాగోరెను తల్లిదండ్రులను యస్తోకంబునౌ పూనికన్
    గతమున్ వంశపు గౌరవమ్ములను సంగాతమ్ము యోచించి యౌ
    చితిమీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్

    సత్సారుడు=కళాకారుడు

    రిప్లయితొలగించండి
  10. జతగా వఛ్చిన వారల
    సతి పతులుగగూర్ప నెంచి శాంభవి యెదుటన్
    వితరణ శీలుండై పరి
    చితి పై నాశీర్వ దించి చేసె ను బెండ్లిన్

    రిప్లయితొలగించండి


  11. సుత మెచ్చిన వరు డొక ధీ
    మతి గుణశీలుడని జనులు మరిమరి చెప్పన్
    హితవరు నుడులందున నౌ.
    చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్.


    సుతతామెచ్చిన సుందరాంగుడతడే శుభ్రాంశువే గాంచ స
    మ్మతమున్ దెల్పిన చాలటంచు సతి సౌమాంగల్య మందట్టి శ్రీ
    పతి సాన్నిధ్యములోన కొండపయినన్ బాణౌకృతంబన్న మె
    చ్చితి, మీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్.

    రిప్లయితొలగించండి
  12. అతి సంపన్నుం డాతఁ డ
    ని తెలియఁగనె తద్ద ప్రీతినిన్ నమ్మకమున్
    వితతముగ నుంచి ధన సం
    చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్

    సతతం బల్లరి చేయు బాలికయె లజ్జన్ గంపలో నుండ నే
    నతి భారమ్మున మేనమామ నడరన్ హర్షమ్ము భూషావళి
    ద్యుతి భాసిల్లఁగఁ గాంచి పీఠము వధూ ద్యుమ్నమ్మునుం బ్రీతి నుం
    చితి మీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్

    రిప్లయితొలగించండి
  13. వివాహానంతరం చెలులతో పార్వతి ముచ్చట్లు

    జతగాడాతడు నీకునున్ దనయ! యజ్ఞానంబు వీడంగనౌ
    స్థితిలేదాతని కేవిధిన్ గలుగు సుశ్రేయంబు కాట్రేనితో?
    సుత! మామాటల నాలకించి విడు నీచోద్యంపు గోర్కెన్ననున్
    హితబోధల్ వినకాతనిన్ వలచి సుప్రీతిన్ తపోదీక్ష ని
    ల్చితి! మీదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్ !

    రిప్లయితొలగించండి
  14. అతగాడు నీకు తగడని
    జతగానుండ విడదీయ చచ్చిరి వారల్
    హితమని తలిచిరి చివరకు
    “చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్”

    రిప్లయితొలగించండి
  15. మతిమంతుండగు మాన వుండొకడు శ్రీమంతుం డనంచున్‌ తలం
    చితనో కోరిక కోరెపెండ్లి జరపన్‌చేయండి నూత్నమ్ము గా
    గతమున్జర్గని రీతినా కనగ నాకాంతున్ సుమాలం కృతున్
    “చితిమీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్”

    రిప్లయితొలగించండి
  16. సుత తాగోరెను పతిగా
    నతులిత సుగుణంపు రాశియగు సుకుమారున్
    గతమరసి పరిచయఁపునౌ
    చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్

    రిప్లయితొలగించండి