16, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4221

18-10-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్”
(లేదా...)
“పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్”

18 కామెంట్‌లు:


  1. నరుడే నారాయణుడని
    పరులను సేవించుమంచు వచియించిరి యు
    త్తరులెందరెందరో మరి
    పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్?

    రిప్లయితొలగించండి
  2. కందం
    ధర నపకారికి సైతము
    నిరతము నుపకారమెంచు నీమము నెంచన్
    భరతావని ననఘుల కే
    పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్?

    చంపకమాల
    ధర నపకారి కైనను విదాయకమౌ నుపకారమెంచుటల్
    నిరతమటంచు నీమము వినిర్మితమై భరతావనిన్ మనన్
    వరగుణ శోభితమ్ముగ ప్రవర్తన దీపిల సంచరింప నే
    పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్?

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. పరులనుహింసించుటలో
      పరమానందమ్మునొందు పాపాత్మకులన్
      పురికొల్పెడి ధనతృష్ణా
      పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్

      తొలగించండి
  4. నరకమె ప్రాప్తించు తుదకు
    పరులను హింసింప ,పుణ్యఫలములు దక్కున్
    కరమతి ప్రీతిన్ వీడక
    నిరతమునారాయణునిల నిత్యము కొలువన్

    రిప్లయితొలగించండి
  5. పరులును మనవారుంగనె
    యరసిన చో హింస లేక హాయిగ మనువున్
    దరతమ భేదము లెఱుఁగక
    పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్?

    రిప్లయితొలగించండి
  6. కరములనుకట్టి వేయుచు
    పరిపరివిధముల జనులకు బాధలనిడుచున్
    ధరలో తిరుగు దురాశా
    పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్”

    రిప్లయితొలగించండి

  7. శరణమటంచు చేరినను శత్రువు నైనను పేర్మితోడ నా
    దరణము చూపమంచని యుదాత్తులు పూర్వుల మాటలెప్పుడున్
    మరువకు, కూళ్ళమారియగు మందుడు క్రూరుడు స్వార్థ చిత్తుడై
    పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్?

    రిప్లయితొలగించండి
  8. మరులుగ మానవ జాతిని
    నిరుపమ సేవా నిరతిగ నిశ్చల. మతులై
    కరముగ సేవింప నెటుల
    పరులను హింసింప పుణ్య ఫలముల్ దక్కున్?

    రిప్లయితొలగించండి
  9. పురవాసులు చనిపోయిన
    తరుణమునందు చితిపేర్చ ధనమాశించన్
    పురమున గల పితృవన కా
    పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్

    రిప్లయితొలగించండి
  10. నరకము వచ్చు దప్పకను నల్గురి యేహ్యత గల్గునెప్పుడుం
    బరులకు హింసఁ గూరిచెడి వానికి, దక్కు నగణ్యపుణ్యముల్
    బరులకు మేలు జేయుచును వారిని గంటికి ఱెప్పవోలె నే
    మరువక జూచుచుండుచును మన్నన లిచ్చుచు నుండు వారికిన్

    రిప్లయితొలగించండి
  11. ఉ.

    నరులను నాల్గు వర్ణములు నందము భాజ్యము వేదశాస్త్రముల్
    సురలను లెక్క చేయకనె చోద్యపు రీతిని హేతువాదమున్
    గరువము జూపకన్ మిగుల గర్వముతో నెడయాడు గిడ్డి మే
    *“పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్”*

    రిప్లయితొలగించండి
  12. నిరతము దుష్ట కార్యముల నీతిని వీడుచు దుష్టచిత్తులై
    దురితములందు మగ్నులయి దూరుచు పెద్దల సంచరించు కా
    వరుల నియంత్రణమ్మునకు బాధ్యత గైకొని దీక్ష నట్టి ఖ
    ర్పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్

    రిప్లయితొలగించండి


  13. నిరతము నీతి హీనుడయి నిర్దయు
    డై కడు క్రూరచిత్తుడై
    పరహిత మానవోన్నతుల బాధల
    పాలొనరించునీచుకున్
    భరతపవిత్రదేశమున ప్రస్తుత కాలమునందు
    గాంచగన్
    పరులకు హింస గూరిచెడి వారికి దక్కు నగణ్య పుణ్యముల్

    రిప్లయితొలగించండి
  14. పరికింపఁగ సూ క్ష్మార్థ మ
    డరు హింసా పదమునకు నెడఁద నిక్కముగన్
    ధర వీడి సజ్జ నాలినిఁ
    బరులన్ హింసింపఁ బుణ్య ఫలముల్ దక్కున్

    నర విల యార్థ కర్ములకు నైతిక భావ విహీన పూరు షో
    త్కరమనకుం గఠోర తర తర్జన చిత్త విలాస కోటికిన్
    గురు జన ఘోర దూషకులకుం గుటి లాత్మక పాప కార్య త
    త్పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్య పుణ్యముల్

    రిప్లయితొలగించండి
  15. కందం
    అరెరే!లంచముఁగొనుటయె
    దురితంబని చూడకుండ దుర్మార్గముగా
    జరియించెడి దుర్నయ తీ
    *ర్పరులను హింసింపఁబుణ్య ఫలములుఁదక్కున్. *

    రిప్లయితొలగించండి
  16. నరకము నొందుట తథ్యము
    పరులన్ హింసింపఁ, బుణ్యఫలముల్ దక్కున్
    పరనారినిసోదరిగా
    నిరతము భావించి ధర్మ నిరతిని జూపన్

    రిప్లయితొలగించండి
  17. నరకము తథ్యమౌను పరనారుల పొందును గోరువానికిన్,
    నిరతము సజ్జనాళియెడ నిర్దయజూపుచు ధర్మరక్షణా
    పరులకు హింసఁ గూరిచెడి వానికి, దక్కు నగణ్యపుణ్యముల్
    మరువక నెల్లవారియెడ మాన్యతతో దనరారు వానికిన్

    రిప్లయితొలగించండి