26, అక్టోబర్ 2022, బుధవారం

సమస్య - 4231

27-10-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్”
(లేదా...)
“పిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా”

26 కామెంట్‌లు:

  1. కందం
    చెల్లదనిన నర'సింహము'
    నల్లరిని దొరికి సుతునకు నాలి తెలియునన్
    దల్లటఁ బరుగులు వెట్టెన్
    బిల్లినిఁ గని 'సింహమ'కట భీతిలి పాఱెన్!

    ఉత్పలమాల
    చెల్లవటన్న భార్య నర' సింహ' పు టల్లరి చేష్టలెల్లఁ దా
    నొల్లక చాటుమాటుగ కుయుక్తులు వన్నియు పేకలాడుచున్
    బిల్లడు సూడఁ జిక్కి పరువెత్తెను భార్యకుఁ జెప్పునంచహో!
    పిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను 'సింహమ'క్కటా!

    రిప్లయితొలగించండి
  2. ఇల్లటపల్లుని కోర్కెకు
    పిల్లనిడిన మామయె కడు బెగ్గల మొందన్
    ఎల్లరనిరి యీరీతిగ
    “పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్”

    రిప్లయితొలగించండి
  3. చల్లా రామయ శాస్త్రులె
    యల్లన పేకాట దాను నాడుచు నుండన్
    బిల్లడు వచ్చుట కతమున
    పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్

    రిప్లయితొలగించండి
  4. ఎల్లలు లేని విధమ్మున
    చెల్లును దన మాట యనుచు జెలగుచు నుండన్
    మెల్లగ పోటీ కన్ఫడ
    పిల్లిని గని సింహ మకట భీతిలి పాఱె న్

    రిప్లయితొలగించండి
  5. 'బల్లినిగని విషసర్పము
    పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్'
    కల్లలతో పిట్టలదొర
    సల్లాపమ్ములొనరించి సరదా పంచెన్

    రిప్లయితొలగించండి
  6. ఉ.

    గొల్లలు గోవులన్ తరలు గొప్పగు యత్నము నీరసించగన్
    చెల్లెలి కోర్కె నుత్తరుడు చేవగ బల్కెను డంబమిత్తరిన్
    *పిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా*
    ఝల్లుమనంగ నుల్లములు శత్రుల గోగ్రహణంబు వార్తయౌ.

    రిప్లయితొలగించండి

  7. అల్లదిగో రమ! గను జా
    బిల్లిని దాల్చి భృగుడు తొలి వేల్పు వెనుకొనన్
    బల్లిదుడై పరువు గొనెనె
    పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్.


    అల్లదివో రమా కనుడటంచు మధుద్విషుడే వచించె, జా
    బిల్లిని దాల్చినట్టి యహి భృత్తు వరమ్మునొసంగి గాముకున్
    బల్లిదుడైన శంకరుడు భైరవమందుచు నోడగిల్లెనే
    పిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా.



    *(భస్మాసురుడు వెంబడించగా భీతితో శివుడు పరుగెత్తు విషయాన్ని విష్ణువు లక్ష్మికి వివరిస్తున్నట్టుగా నూహించిన పద్యము)*

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    దిగులుఁజెందె నెలుక" పిల్లినిఁగని;సింహ
    మకట!భీతిలి పాఱెన్"మహాటవిఁగని
    శరభమృగమును, పులిఁగని పరుగులిడెను
    ధేనువుల్,దుప్పులున్, లేళ్ళు దిక్కులేక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      మెల్లగ కన్నమున్ విడిచి మేతకు వచ్చిన మూషికంబహో!
      పిల్లిని గాంచినంతటనె భీతిలి పాఱెను;సింహమక్కటా!
      యల్లన బోనులోఁబడి మహాటవిఁజిక్కెను దిక్కుమాలియున్
      భిల్లుని చేతికిన్,పులుల వెన్కను పర్విడె వేటకుక్కలున్ .

      తొలగించండి
    2. కందం
      అల్లన శిఖండి రాగా
      విల్లంబులువిడిచి పెట్ట భీష్ముండనిలో
      నెల్లరు వచించి రిట్టులు
      పిల్లినిఁగని సింహమకట!భీతిలి పాఱెన్.

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. మెల్లగ జేరి యో ఖలుడు మేలొన రింతునటంచు బల్కగా,
    బల్లిదు డైన నాయకుడు భద్రము నెంచుచు నెన్నికందునన్
    యుల్లము లోన మోహరుచి నొందక కాదనె, గోడ మీది యా
    పిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా!

    రిప్లయితొలగించండి
  10. ఎల్లరికాతఁడు సింగం
    బల్లుని గనినంత నాత డాత్రమునొందున్
    తల్లడముల పాల్జేసెడు
    పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్

    రిప్లయితొలగించండి
  11. 'అల్లదె రామశాస్త్రులట యాడుచు పేకను సంతసంబుతో
    మెల్లగ రాకతో తనయ మీరుచు హద్దుల నాట మానుచున్
    జల్లగ నాతఁడే యపుఁడు చప్పుడు లేకను నొక్కసారిగన్
    బిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా !

    రిప్లయితొలగించండి
  12. కందం
    అల్లన సైంధవు డొకపరి
    బల్లిద భీముని చెనకుచు బవరము జేయన్
    ఉల్లసము గని దలంచిరి
    పిల్లిని గని సింహ మకట భీతిలి పాఱెన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.
    పాండవ కౌరవుల యుద్ధమున పద్మవ్యూహంలో భీమనెదిరించన సైంధవుని సందర్భం.

    రిప్లయితొలగించండి
  13. కం:తల్లిని వదలెను సింహపు
    పిల్ల, ఎదుట బడెను పెద్ద పిల్లి మొదటగా
    పిల్ల యగుట నజ్ఞత చే
    పిల్లిని గని సింహ మకట భీతిలి పారెన్
    (అది సింహమే ఐనా చిన్న పిల్ల కనుక క్రొత్తగా కనిపించిన పిల్లిని చూసి భయ పడింది.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:తెల్ల దొరల్ వినోదమును దెచ్చెడు సర్కసు జూడ చండుడై
    చెళ్లున చెర్నకోల గొని చీటి మాటికి గొట్టు నంచు దా
    నుల్లము నందు దల్చి తన యుగ్రత వీడుచు రామ చంద్ర రావ్
    పిల్లిని గాంచినంతటనె భీతిలి పారెను సింహ మక్కటా
    (ఆ సర్కస్ రింగ్ మాస్టర్ పేరు పిల్లి రామచంద్ర రావ్.తెల్లవాళ్లు ఇంటి పేరు చివర్లో పెడతారు కనుక అతని పేరు రామచంద్ర రావ్ పిల్లి.అతను సర్కస్ లో రింగ్ మాస్టర్.రామచంద్ర రావ్ పిల్లిని చూసి సింహం పారిపోయింది.)

    రిప్లయితొలగించండి
  15. ఎల్ల జనాళిలోన నతఁడేనుగుదాయగ పేరుపొందె వా
    నల్లుడు దుండగీడు తన యాలిని యారడి పెట్టు నిచ్చలున్
    పిల్లనొసంగి మామ కడు బేలగ మారెను వాని ముందునా
    పిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా

    రిప్లయితొలగించండి
  16. [
    ఉల్లమునభయపడె నెలుక
    పిల్లిని గని,సింహమకట భీతిలిపారెన్
    ఝల్లన గుండెలు వలతో
    మెల్లగనరుదెంచువాని మేటిగ గనుచున్

    రిప్లయితొలగించండి
  17. జల్లన గుండియ జాఱఁగ
    మెల్లగ మార్జాల మడలి మృగ రాజము చిం
    తిల్లి కడు దుశ్శకున మని
    పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్

    తల్లడిలంగఁ జేయ సమదమ్మున నల్వురు వీరు లైనఁ జిం
    తిల్లిరి పాండు రాట్సుతులు దీనులునై యనిఁ గుంభ సంభవుం
    డల్లిన వ్యూహ మందుఁ బతి కల్లుఁడు సైంధవుఁ డోడి రక్కటా
    పిల్లినిఁ గాంచి నంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా

    రిప్లయితొలగించండి
  18. కల్ల యొకింత లేదు బల గర్వితుఁడై చరియించె నాజిఁ తాఁ
    తల్లడిలంగ జేసె పటు ధైర్య బలోద్ధతు భీమసేనునిన్
    ప్రల్లదనంపు సైంధవుఁడు రంజిలె నాదినమందు వీరుఁడై
    పిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా

    రిప్లయితొలగించండి