8, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4212

9-10-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్”
(లేదా...)
“మలమిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడన్”

26 కామెంట్‌లు:

  1. కందం
    అలజడి సేయక మౌనిగ
    తలపుల దేవుని తదేక దర్శన కాంక్షన్
    గల వాడొకపరి హృదయ క
    మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి

  2. కలతలు తీరుట కొరకై
    యిలవేల్పును కొలువమంచు నిరుబుట్టువుతా
    దెలుపగ భక్తిగ నెఱ్ఱ క
    మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  3. తలచిన గో ర్కెలు దీరగ
    పలువిధముల వేడు కొనుచు పండరి నాథున్
    విలసిత మౌ రీతిగను గ
    మల మిడి పూజించె నొక్క మనుజుడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  4. అల వేంకట పుర మునగల
    లలితమ్మను జూచి మిగుల లాలనఁదోడం
    గలిగిన ముదమున హృదయ క
    మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్”

    రిప్లయితొలగించండి
  5. కందం
    కలుముల రాణీ! నిత్యము
    దలపుల మిమ్ముంచి కొలుచు దాసుడనమ్మా!
    కలతల బాపు మటంచుఁ గ
    మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్

    చంపకమాల
    కలుముల రాణి! మాత! మది కామితమెంచి కరాగ్రవాసినీ!
    దలపుల గోవెలన్ గొలుచు దాసుడుగన్ శ్రమియించు భక్తుఁడన్
    గలతల బాపుచున్ గరుణ గావఁగ రమ్మని చెంత పుష్ప కో
    మలమిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడన్

    రిప్లయితొలగించండి
  6. కందము
    ఇలవేల్పు నాంజనేయుని
    జలముల నభిషిక్తుఁజేసి జలజంబులు,మ
    ల్లెలొసఁగి,నైవేద్యము,త
    మలమిడి పూజించె నొక్క మనుజుఁడు భక్తిన్.

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. చంపకమాల
      జలమభిషేకముల్ సలిపి సారెకు,బిల్వదళాలు భక్తితో
      విలసిత లింగమూర్తికిడి, వేదములంబఠియించ సద్ద్విజుల్
      వలసిన పిండివంటలను వండి,నివేదనఁజేసి వేడ్క,త
      మ్మలమిడి పూజఁజేసెనొక మానవుఁడంకిత భావమేర్పడన్.

      తొలగించండి
  8. చం.

    లలిత కళల్ ప్రసాదమగు లాలనగా భువనేశ్వరీ దృశన్
    చలితము మానసంబు సురసన్నిధి తన్మయ భావమొందగన్
    కలితపు మొగ్గలన్ వెదుక గాంచె, కదంబము దృశ్యమౌట, కు
    *ట్మలమిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడన్.*

    రిప్లయితొలగించండి
  9. మలగును నిలలో నన్నియు
    కొలిచెద వాడని సుమముల గోమలుననుచున్
    తెలియగు బ్రేమను హృదయ క
    మల మిడి పూజించె నొక్క మనుజుడు భక్తిన్

    రిప్లయితొలగించండి

  10. కలతలు తీర్చువాడొకడె కల్మష కంఠుడటంచు భక్తితో
    కొలువగ నెంచి భక్తుడొక కోవెల కేగుచు లింగరూపునిన్
    పలువిద సౌమనస్యములు పండ్లనొసంగుచు ధూప దీప త
    మ్మల మిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడన్.

    (తమ్మలము.....తాంబూలము)

    రిప్లయితొలగించండి
  11. అలవాటుగ నేగె గుడికి
    పలువురి వెనువెంట, గాని ఫల్యము మరువన్
    తలన గల కొలను నుండి క
    మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  12. కలువల రాణి, శారదను గావగ రమ్మని కోరి పుష్ప కో
    మలమిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడం
    గలియుగ దేవ తంచుఁ గడు గారవ మొప్పఁగఁ బ్రార్ధనాదులన్
    విలసిత వైభవంబునను వేల్పులు మెచ్చఁగ జేసె నామెకున్

    రిప్లయితొలగించండి
  13. పలురకములైన పండ్లును
    కలశము నందు తొలకాడు గంగాజలమున్
    తులసీమాలను మరియు త
    మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  14. అలమేలు మంగపతి పద
    ముల మది నెరనమ్మి మోక్షమును పొందగనిం
    పలరగ ఘనమగు హృదయక
    మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  15. కలతలుబాపుమటంచును
    కులదేవతకర్చనములుకూరిమితోడన్
    పలు రకములకైసేసి క
    మలమిడి పూజించె నొక్కమనుజుడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  16. అలరుచుఁ జక్కని స్తోత్ర
    మ్ములు పాడుచు రాగ మొప్పఁ బుణ్యాత్ముం డా
    ఫలములు పుష్పమ్ములు కో
    మల మిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్

    సలలిత భక్తి సంయుతము స్వామి పటమ్మును నిల్పి సన్నిధిం
    దలఁచుచు నామ మంత్రములు తమ్ముల మింపుగ నారగింపులున్
    జలనిధి శుద్ధ తోయమును జందన మింకను బూలగుత్తి ని
    ర్మల మిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకిత భావ మేర్పడన్

    రిప్లయితొలగించండి
  17. మరొక పూరణ
    డా బల్లూరి

    కలుము లరాణి తీర్చుమికకాంక్ష లటంచును భక్తితోనటన్
    దలపుననెంచు చున్ విడక తాతలవంచు చువేడు చున్ వడిన్
    కొలువగవచ్చె కోవెలకు కూరిమి తోడను మ్రొక్కిపుష్పకో
    మలమిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడన్”

    రిప్లయితొలగించండి
  18. కలిమియు లేనివాడు గడు కష్టమొనర్చియు
    జీవనంబు భూ
    తలమున గడ్పుపేదయతి ధార్మికుడున్
    త్రిపురాంతకున్ సదా
    విలసతి భక్తిభావమున వేడెడువాడు
    మహోన్నతుండు కో
    మల మిడి పూజజేసెనొక మానవుడంకిత భావమేర్పడన్

    రిప్లయితొలగించండి
  19. ఇలలోచంపిన పశువుల
    " మలమిడి పూజించె నొక్క మనుజుడు భక్తిన్"
    తలలో తట్టగ చేసెను
    పలువిధములసేవ వరుస పార్వతి పతికిన్

    (భక్తకన్నప్ప)

    రిప్లయితొలగించండి
  20. పలువిధములనుతియించుచు
    కలిబాధలుబాపుమంచు కమలదళాక్షున్
    కొలుచుచువీడక నెర్రక
    మలమిడి పూజించె నొక్కమనుజుడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  21. జలములుబోసి లింగమును శాస్త్రము జెప్పినరీతి యర్చనల్
    ఫలములతోడ మంత్రములు పాలును నెయ్యి నిపత్రి బెట్టియున్
    కొలనుననున్న తామరలు కోరిక మీరగకోసి ప్రేమగా
    “మలమిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడన్”

    రిప్లయితొలగించండి
  22. చలిమలచూలి నందనుని సాధుజనావను నేకదంతునిన్
    సొలుపుగ జేరి భాద్రపద శుద్ధ చతుర్ధిని నిర్మలాత్ముఁడై
    పలువిధ పుష్పముల్, గరిక పత్తిరి, బిల్వము చూత పత్రమా
    మలమిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడన్

    రిప్లయితొలగించండి