30, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4235

31-10-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్”
(లేదా...)
“హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్”

19 కామెంట్‌లు:

  1. హింసలు లేకను బుడమిన
    హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్
    హింసలు సెలరేగిన బ్రతి
    హింసలు మఱి జరుగు చుండు హేయపు రీతిన్

    రిప్లయితొలగించండి

  2. హంసా! వినుమిది జనులు ప్ర
    శంసింతురని వచియింత్రు సజ్జనులెపుడున్
    హింసను వీడుమటంచు న
    హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    హింసింపఁగనీవొక్కని
    హింసింపగ జూచునిన్ను నిదికొనసాగున్
    ధ్వంసము జేయదు శాంతి న
    హింసావాదమ్మె, ప్రజకు హితముం గూర్చున్

    శార్దూలవిక్రీడితము
    కంసున్ బోలిన రాక్షసాధములదౌ కాఠిన్యమున్ బాపు నా
    శంసన్ గోప కిశోరుఁడెంచఁదగు, సద్ధర్మమ్ము నీ ధాత్రిపై
    ధ్వంసంబౌ గతి కౌరవుల్ జెలఁగ నిర్ద్వంద్వమ్ముగన్ గూల్చఁగన్
    హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్

    రిప్లయితొలగించండి
  4. ధ్వంసము సేయుట మానియు
    కంసుని సంస్కృతి ని వదలి కమ్మని హృదితో
    సంసారసేమ మున క
    హింసా వాదమ్మె ప్రజకు హితమ్మున్ గూర్చున్

    రిప్లయితొలగించండి
  5. కందము
    ధ్వంసమగు దేశమంతయు
    హింసావాదమ్ము ప్రబల హేయంబది,వి
    ద్వాంసులు మెచ్చరు,సత్యా
    హింసావాదమ్ము ప్రజకు హితముంగూర్చున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      హింసామార్గమునే చరింప నరకంబేయౌ సమస్తంబహో!
      ధ్వంసంబౌ,నభివృధ్ధి కుంటువడు నిర్వ్యాపారమైపోవు,వి
      ద్వాంసుల్ మెచ్చరు దీనిఁగావున సదా వర్ధిల్ల శాంతి క్షమా
      హింసావాదము మేలుఁగూర్చుఁబ్రజకున్ హేలావిలాసమ్ముగన్.

      తొలగించండి
  6. ధ్వంసరచనల్ సలుపు వి
    ధ్వంసపరులనిలయమాయె ధరణీతలమే
    సంసరణముగానలరు న
    హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్

    రిప్లయితొలగించండి
  7. హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్
    హంసా! వింటివె చేదు వాక్యమునహా హాసమ్ము నొందంగనౌ
    హింసం జేయుట శ్రేయమే చెపుమ?యేహింసైనఁజేయంగ నా
    శంసిం చంగను నేర్తురేయిలనునో చాముండ భక్తాగ్రణీ!

    రిప్లయితొలగించండి

  8. ధ్వంసంబెందుకు జేయబూనెదరు శాంతంబేల వర్జింతురే
    హింసామార్గము పట్టినట్టి తులువల్ హీనాత్ము లేమయ్యరే
    హంసా! నా వచనంబు లోకహితమౌ యాలించినన్ మేలు ని
    ర్హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  9. హంసుడు బ్రియపడు నెలలో
    మాంసము చవిగొనుటపయిన మచ్చరమొందన్
    హింస నొనర్చెడివాని య
    హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్

    రిప్లయితొలగించండి
  10. శా.

    ధ్వంసంబున్ సమకట్టి సంహననముల్ ధ్వాంతమ్ము స్థాపించుచున్
    *హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్*
    కంసాఖ్యున్ వెనుకొన్న మ్లేచ్ఛులు సదా గ్రాసమ్ము శుక్తమ్ముగా
    సంసారమ్మున తిండి ముఖ్యము గతిన్ సందేహమే లేదుగా !

    రిప్లయితొలగించండి
  11. హింసకు ప్రతిహింసవలన
    ధ్వంసంబగుటిరుఁగెలఁకుల తప్పదు మహిలో
    హింసావాదము కన్నన
    హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్

    రిప్లయితొలగించండి
  12. హింసావాదము లోకకంటకముగా హేయంపు కార్యంబుగా
    ధ్వంసంబొందగఁ జేయు నభ్యుదయమున్ ధ్వాంతంబగున్ విశ్వమే
    హింసావాదమువీడి సర్వులొకటై యిచ్ఛన్ దువాళించ ని
    ర్హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలా విలాసమ్ముగన్

    రిప్లయితొలగించండి
  13. హింస యనఁ దగదు పురుషో
    త్తంసులఁ గాపాడు నట్టి తఱి నెంచఁగ వి
    ధ్వంసమున లేదు దోషము
    హింసా వాదమ్మె ప్రజకు హితముం గూర్చున్

    కంసారాతిని నుంచి నిత్యము మదిం గామాది షడ్వైరులే
    సంసేవింప లయమ్ములై మనమునన్ శాంతమ్ము సేకూరఁగా
    సంసారార్ణవ ముత్తరింప ధరలోఁ జక్కంగ సత్యవ్ర తా
    హింసా వాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలా విలాసమ్ముగన్

    రిప్లయితొలగించండి
  14. కందం
    హింసవలనన్ కలుగు వి
    ధ్వంసము గడచిన చరిత్ర తరచి దృశించన్
    సంసార శుభము కోర, య
    హింసా వాదమ్మె ప్రజకు హితముం గూర్చున్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.

    హింసయె జరిగిన భువిపై
    ధ్వంసంబగు నాస్తి జనుల ప్రాణములడగున్
    హింసించకు మెవ్వరిని య
    హింసా వాదమ్మె ప్రజకు హితముంగూర్చున్.

    రిప్లయితొలగించండి
  16. హింసావృత్తిగలట్టి దేశము మహా హేయంబు
    గానుండు వి
    ధ్వంసామార్గము వీడి యెల్లజనులున్ దాక్షిణ్యులైయున్నచో
    సంసారంబున నెల్ల మానవులకున్ సౌఖ్యం
    బుచేకూర్చు ని
    ర్హింసావాదమె మేలుగూర్చు బ్రజకున్
    హేలా విలాసంబుగన్

    రిప్లయితొలగించండి
  17. హింసను చేయక సతతమ
    హింసావాదమ్మె ప్రజకు హితముంగూర్చున్
    హింసించకనితరులనిల
    కంసహరునిసేవచేయకలుగును శుభముల్

    మరొక పూరణ

    హింసా ప్రవృత్తి హెచ్చగ
    ధ్వంసంబయ్యెను బ్రతుకులు ధరలో నిపుడున్
    కంసహరావడి దెలుపమ
    హింసావాదమ్మె ప్రజకు హితముంగూర్చున్

    రిప్లయితొలగించండి